బలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''బలం''' అనే తెలుగు మాటని ఫోర్స్‌ (force) అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము.
'''బలం''' అనే తెలుగు మాటని ఫోర్స్‌ (force) అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము.

ఒక వస్తువులో [[త్వరణము]] ను కలిగించే ప్రభావమును '''బలము''' అంటారు. ఈ వస్తువు యోక్క వాస్తవ త్వరణమును దానిపై పని చేసే బల [[సదిశ]] ల మొత్తానికి సమానముగా పేర్కొంటారు.బలమును [[న్యూటన్]] లలో కొలుస్తారు. బలము వస్తు స్వరూపములో మార్పునకు కారణమవుతుంది. ఈ బలము [[బ్రమణబ్రామకము(టార్క్)]], [[వత్తిడి]] రూపములలో కూడా ఉంటుంది.

{{Infobox Scientist
{{Infobox Scientist
|name = Sir Isaac Newton
|name = Sir Isaac Newton

08:53, 28 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

బలం అనే తెలుగు మాటని ఫోర్స్‌ (force) అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము.

ఒక వస్తువులో త్వరణము ను కలిగించే ప్రభావమును బలము అంటారు. ఈ వస్తువు యోక్క వాస్తవ త్వరణమును దానిపై పని చేసే బల సదిశ ల మొత్తానికి సమానముగా పేర్కొంటారు.బలమును న్యూటన్ లలో కొలుస్తారు. బలము వస్తు స్వరూపములో మార్పునకు కారణమవుతుంది. ఈ బలము బ్రమణబ్రామకము(టార్క్), వత్తిడి రూపములలో కూడా ఉంటుంది.

Sir Isaac Newton
Godfrey Kneller's 1689 portrait of Isaac Newton aged 46
జననం(1643-01-04)1643 జనవరి 4
[OS: 25 December 1642][1]
Woolsthorpe-by-Colsterworth
Lincolnshire, England
మరణం1727 మార్చి 31(1727-03-31) (వయసు 84)
[OS: 20 March 1726][1]
Kensington, London, England
నివాసంEngland
జాతీయతEnglish
రంగములుPhysics, mathematics, astronomy,
natural philosophy, alchemy,
theology
వృత్తిసంస్థలుUniversity of Cambridge
Royal Society
చదువుకున్న సంస్థలుTrinity College, Cambridge
విద్యా సలహాదారులుIsaac Barrow
Benjamin Pulleyn[2][3]
ముఖ్యమైన విద్యార్థులుRoger Cotes
William Whiston
John Wickins[4]
Humphrey Newton[4]
ప్రసిద్ధిNewtonian mechanics
Universal gravitation
Calculus
Optics
ప్రభావితులుNicolas Fatio de Duillier
John Keill
సంతకం
గమనికలు
His mother was Hannah Ayscough. His half-niece was Catherine Barton.

నూటన్‌ చలన విధాన సూత్రాలు

వస్తువుల చలన తత్వాలు అర్ధం చేసుకోవాలనే తపన 16 వ శతాబ్దంలో గెలిలియో తో మొదలయిందనవచ్చు. ఈ విచారణలు 17 వ శతాబ్దంలో నూటన్‌ అసమాన ప్రతిభ వల్ల సఫలం అయినాయి. నాటి నుండి నేటి వరకూ వస్తువుల గమనానికి సంబంధించిన విషయాలన్నిటిలోనూ నూటన్‌ వక్కాణించినది వేదవాక్కులా నిలచిపోయింది. గెలిలియో, కెప్లర్‌ మొదలైన వారి అనుభవాన్నంతా కాసి, వడబోసి తన గణిత మేధా శక్తితో రంగరించి వస్తువులు మూడు సూత్రాలని అనుసరిస్తూ చలిస్తాయని నూటన్‌ ఉటంకించేడు. నాటి నుండి నేటి వరకూ ఈ మూడు సూత్రాలనీ అధిగమించి చలించిన వస్తువేదీ కనపడ లేదు. అందుకనే వీటిని నూటన్‌ చలన విధాన సూత్రములు (Newton's Laws of Motion) అని అంటారు.

  • నూటన్‌ మొదటి సూత్రం: బాహ్య బలం ప్రభావం లేనంత వరకూ ప్రతి వస్తువూ తన సహజమయిన స్థితిలో ఉంటుంది. (In the absence of the influence of external forces, every object contibues to be in its natural state of motion.)
  • నూటన్‌ రెండవ సూత్రం: F అనే బాహ్య బలం m అనే ద్రవ్యరాసి గల వస్తువు మీద ప్రభావం కలిగి ఉన్నంత సేపూ ఆ వస్తువు ఆ బాహ్య బలపు దిశలో త్వరణం (acceleration) చెందుతుంది. (As long as an object of mass m is under the influence of an external force F, it undergoes an acceleration in the direction of the force such that F = ma.) పరిమాణాత్మకంగా ఈ సూత్రాన్ని F = ma అన్న సమీకరణంగా రాయవచ్చు. ఈ సమీకరణంలో F అనేది బాహ్య బలం, a అనేది త్వరణం, m అనేది పదార్ధం యొక్క గురుత్వం లేదా ద్రవ్యరాసి.
  • నూటన్‌ మూడవ సూత్రం: ప్రతి చర్యకూ సరి సమానంగా, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. (For every action there is an equal and opposite reaction.)

ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు సూత్రాలనీ ఆధారంగా తీసుకుని 'సనాతన భౌతిక శాస్త్రం' (classical physics) అనే ఉన్నతమయిన మేడని కట్టవచ్చు. బంతులు, బళ్ళు, రైళ్ళు, రాకెట్లు...ఇవన్నీ నూటన్‌ చలన సూత్రాలకి దాసోహం అంటూ ప్రవర్తిస్తాయి. అతి చిన్న ప్రమాం గల ఆణుగర్బం లోనూ, అత్యంత (అంటే కాంతి వేగంతో సమతుల్యమయిన) వేగాలు ఉన్నప్పుడు మాత్రం నూటన్‌ సూత్రాలని సవరించాలి.

బలం, శక్తి

నూటన్‌ సూత్రాలలో 'బలం' అన్న భావానికే అగ్ర తాంబూలం. శక్తి ది ద్వితీయ స్థానమే. దీనికి కారణం నూటన్‌ కాలంలో శక్తి గురించి పరిపూర్ణమైన అవగాహన లేదు. నూటన్‌ తరువాత లగ్రాంజ్‌ (Lagrange), హేమిల్టన్‌ (Hamilton) అనే శాస్త్రజ్ఞులు 'శక్తి' కి పెద్ద పీట వేసి చలన శాస్త్రాన్ని మరొక దృక్పధంలో అధ్యయనం చేసేరు. ఏ కోణంలో పఠించినా గమ్యం ఒకటే. నూటనిక (Newtonian) పద్ధతులు సులభమయిన భౌతిక వ్యవస్థలను అధ్యయనం చెయ్యటానికి అనుకూలంగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో శక్తి ప్రాధాన్యతతో కూడిన లగ్రాంజ్‌-హేమిల్టన్‌ (Lagrangian and Hamiltonian) పద్ధతులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటివి.

గురుత్వాకర్షణ

బాగా ముగ్గిన పండు చెట్టుని వదలి భూమి మీదకి పడుతోందంటే ఆ పండుని ఏదో అదృశ్యమయిన బలం కిందికి లాగుతున్నాదనే భావన కలగక మానదు. పైనుండి కిందకి పడే వాటన్నిటికి ఉమ్మడిగా కిందను ఉన్నది భూమే కనుక భూమి ఆ వసువుని ఆకర్షింఛటం వల్ల ఆ వస్తువు కిందకి పడుతున్నాదని సిద్ధాంతీకరించవచ్చు. పరిశీలనా దక్షుడయిన నూటన్‌ ఏమన్నాడంటే "చెట్టునున్న పండునే కాదు, ఆకాశంలో ఉన్న చంద్రుడిని కూడ భూమి ఆకర్షిస్తున్నాది" అన్నాడు. అంతే కాదు "విశ్వంలో ఉన్న ప్రతి వస్తువూ ప్రతి ఇతర వస్తువునీ ఆకర్షిస్తున్నాది" అన్నాడు. "ఈ ఆకర్షణ ప్రభావం వల్లనే గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి" అని కూడ అన్నాడు. ఇదే నూటన్‌ ప్రవచించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం.

గురుత్వాకర్షణలో ఒక భాగమే భూమ్యాకర్షణ. భూమ్యాకర్షణ లక్షణం ఏమిటంటే తన చేరువలో 'పై నుండి కిందకి' పడే ప్రతి వస్తువులోనూ ఒకే 'సమ త్వరణం' (uniform acceleration) కలిగించటం. దీనిని g అనే ఇంగ్లీషు అక్షరంతో సూచించం సంప్రదాయం. దీని విలువ సుమారుగా 980 సెంటీమీటర్లు/సెకండు2. ఈ సమ త్వరణం సదిశ రాశి (vector). దీని దిశ ఎల్లప్పుడూ భూమి కేంద్రం వైపే చూపుతూ ఉంటుంది.

వనరులు

  • కందుల సీతారామశాస్త్రి, భౌతిక ప్రపంచం (తెలుగు భాషా పత్రికలో ప్రచురితమైన వ్యాసాల పునర్ముద్రణ), శారదా ప్రచురణలు, 104-105 కందులవారి ఇల్లు, 48-8-19 ద్వారకానగర్, విశాఖపట్నం - 530 016
  • కవనశర్మ, సైన్సు నడచిన బాట (రచన (మాస పత్రిక) లో ప్రచురితమైన వ్యాసాల పునర్ముద్రణ), వాహినీ బుక్‌ ట్రస్ట్, 1.9.286/3 విద్యానగర్‌, హైదరాబాదు - 500
  • తెలుగు అకాడమీ వారు ప్రచురించిన ఏడవ తరగతి పాఠ్య పుస్తకం
  1. 1.0 1.1 During Newton's lifetime, two calendars were in use in Europe: the Julian or 'Old Style' in Britain and parts of Eastern Europe, and the Gregorian or 'New Style' elsewhere. At Newton's birth, Gregorian dates were ten days ahead of Julian dates: thus Newton was born on Christmas Day, 25 December 1642 by the Julian calendar, but on 4 January 1643 by the Gregorian. Moreover, the English new year began on 25 March (the anniversary of the Incarnation) and not on 1 January (until the general adoption of the Gregorian calendar in the UK in 1752). Unless otherwise noted, the remainder of the dates in this article follow the Julian Calendar.
  2. Dictionary of Scientific Biography, Newton, Isaac, n.4
  3. Gjersten, Derek (1986). The Newton Handbook. London: Routledge & Kegan Paul.
  4. 4.0 4.1 Cambridge
"https://te.wikipedia.org/w/index.php?title=బలం&oldid=599994" నుండి వెలికితీశారు