స్వాతి కిరణం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
57 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చిత్రకథ విశేషాలు
(చిత్రకథ విశేషాలు)
: గీత రచయిత - , గానం - [[బాలు]]
* ''ఓం గురు (శ్లోకం)''
== చిత్రకథ - విశేషాలు ==
 
==బయటి లింకులు==
* [http://www.raaga.com/channels/telugu/movie/A0000059.html రాగా.కాంలో స్వాతి కిరణం పాటలు వినండి.]
ప్రతిభ ఒకరి స్వంతం కాదు.. ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని ప్రోత్సహించాలి..దానికి పదును పెట్టాలి..కొత్తతరానికి పాత తరం దారి చూపాలి..దారి ఇవ్వాలి.. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం లో గొప్పతనం ఉంది.. కానీ శిష్యుల ఉన్నతిని కోరని గురువులు, తమని మించి పోతారనే భావనతో శిష్యుల భవిష్యత్తును సమాధి చేస్తారు.. శిష్యుల ప్రజ్ఞను తమ ప్రగతికి సోపానం గా మార్చుకునే గురువులూ ఉన్నారు.. సంగీత సామ్రాట్ అనంత రామశర్మ ఈ కోవకు చెందిన వాడు.. ..ఏకలవ్యుని బొటన వ్రేలుని గురుదక్షిణ కోరిన ద్రోణుడికి ప్రతి రూపం అతడు...అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు గంగాధరం..అతని తల్లి దండ్రులు ఒక చిన్న హొటల్ నడుపుకుంటూ ఉంటారు.. పక్షితీర్ధం మామ్మ గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు గంగాధరం.. స్ధానిక దేవాలయంలో ఉత్సవాలకు వచ్చిన అనంత రామశర్మకు ఆధిత్యం ఇచ్చే అవకాశం వస్తుంది పక్షితీర్ధం మామ్మగారికి.. గంగాధరం ప్రతిభ గమనించిన పక్షితీర్ధం మామ్మగారు గంగాధారాన్ని అనంత రామశర్మ కి శిష్యునిగా చేద్దామను కుంటుంది.. కానీ బాల చాపల్యంతో, దేవాలయంలో అనంత రామాశర్మగారు పురుష సూక్తాన్ని చదివిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష సూక్తాన్ని ఆకతాయి తనంతో పాడతాడు.. ఆగ్రహిస్తాడు అనంత రామశర్మ..గణపతి సచ్చినాంద స్వాముల వారు వారి ఆశ్రమంలో ఉన్న సరస్వతీ స్తోత్రాలను స్వర పరిచే అవకాశం అనంత రామశర్మకు దక్క్తుతుంది..ఇంతలో కాలేజి లో జరిగే ఆడిషన్ కి గంగాధరాన్ని తీసుకు వస్తారు పక్షితీర్ధం మామ్మగారు.. ఆ సందర్భంగా అనంత రామశర్మ ఇంటికి వచ్చిన గంగాధరం, అనంత రామశర్మ స్వర పరచిన పాట వింటాడు.. కాలేజి లో ఆడషన్ లో మరో స్వరం తో అదే పాట వినిపిస్తాడు..అనంత రామశర్మ గంగాధరం దరఖాస్తుని తిరస్కరిస్తాడు..అనంత రామశర్మ నిస్సంతు.. అతని భార్య గంగాధరాన్ని తమ వద్ద ఉంచుకుందామంటుంది.. గంగాధరం ప్రతిభకు లోకమంతా నీరాజనం పట్టినా అనంత రామశర్మ గంగాధరానికి ఇంకా శిక్షణ కావాలంటూ ఉంటాడు.. అనంత రామశర్మ వలన కాని స్వర రచన ను గంగాధరం ప్రయత్నిస్తాడు..ఆ స్వరరచన ఆమోదయోగ్యంగా లేదంటునే ఆ స్వరాలను భద్రపరచుకుంటాడు.. తనని అధిగమిస్తాడనే అభద్రతా భావంతో రగిలి పోతున్నాడని పక్షితీర్ధం మామ్మగారి మేనల్లుడు గ్రహిస్తాడు.. అనంత రామశర్మ అసూయతో గంగాధరం మరణానికి కారణభూతమవుతాడు..ఈ సంఘటన తో అనంత రామశర్మ భార్యకు మతి భ్రమిస్తుంది.. అనంత రామశర్మ దేశాలు పట్టి తిరుగుతూ ఉంటే పిల్లలను పట్టుకు పోయేవాడని భ్రమించిన పల్లె వాసులు అతణ్ని పోలీస్ స్టేషన్లో అప్పజెబుతారు..అక్కడ పక్షితీర్ధం మామ్మ గారి మేనల్లుడు సబ్ ఇన్సపెక్టర్.. అతడు అనంత రామశర్మను పోలుస్తాడు.. పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అనంత రామశర్మకు స్వస్తత చేకూర్చుతారు.. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం సంగీత అకాడమీ స్థాపిస్తుంది.. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ.. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక.. దానితో సినిమా ముగుస్తుంది..
గంగాధరం మరణాన్ని ప్రేక్షకులు జీర్ణించు కోలేక పోయేరు.. యాంటీ సెంటిమైటైంది..గణపతి సచ్చిదానంద స్వామి వారి పాత్రతో అనంత రామశర్మ పాత్రలో పరివర్తన కలిగించి గంగాధరాన్ని పాత్ర ను బ్రతికిస్తే జనం ఎలా ఆదరించి ఉండే వారో.. చిత్రం విజయ వంతం కాలేదు..
కె.వి.మహదేవన్ స్వర రచన మహోన్నతం.. ఆనతి నీయరా పాటకు వాణీ జయరాంకు జాతీయ స్ధాయిలో ఉత్తమ గాయనిగా ఎన్నికైంది.. కానీ మరిన్ని అవార్డులు రావలసిన సినిమా.. ముఖ్యంగా ఈ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు దక్కక పోడం నిరాశ పరిచే విషయమే..
ఇంత గొప్ప చిత్రానికికళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకులు, కథా రచయిత.. ఆయన కీర్తికిరీటంలో ఈ సినిమా కలికితురాయి..
 
 
 
==బయటి లింకులు==
* [http://www.raaga.com/channels/telugu/movie/A0000059.html రాగా.కాంలో స్వాతి కిరణం పాటలు వినండి.]
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/607842" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ