గుమ్మడి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 174: | పంక్తి 174: | ||
|- |
|- |
||
| |
| |
||
| ''[[ఎత్తుకు పై ఎత్తు]]'' |
| ''[[ఎత్తుకు పైఎత్తు (1958 సినిమా)|ఎత్తుకు పై ఎత్తు]]'' |
||
| గోవిందయ్య |
| గోవిందయ్య |
||
| |
| |
06:43, 29 మే 2011 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గుమ్మడి వెంకటేశ్వరరావు | |
దస్త్రం:Gummadi.jpg | |
జననం | రావికంపాడు, గుంటూరు జిల్లా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం | 1927 జూలై 9
మరణం | 2010 జనవరి 26 హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ | (వయసు 82)
ఇతర పేర్లు | గుమ్మడి |
క్రియాశీలక సంవత్సరాలు | 1950 నుండి 1990ల వరకు |
తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.జూలై 9, 1927[1] మ.జనవరి 26, 2010 [2]) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
బాల్యము మరియు విద్యాభ్యాసం
గుమ్మడి స్వగ్రామము గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. 1944లో ఎస్.ఎస్.సి ఉత్తీర్ణుడై కాలేజీలో చేరాడు. తల్లితండ్రులు చదువు చాలించి ఇంటిదగ్గర పొలం పనులు చూసుకోమని ఒత్తిడి చేసినా, వాళ్లని ఒప్పించి కొల్లూరు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. ఈ దశలోనే ఈయన కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. పాఠశాలలో తెలుగు పంతులు జాస్తి శ్రీరాములు చౌదరి ఈయన్ను ఎంతగానో ప్రభావితము చేశాడు.
గుమ్మడి సినీప్రవేశం అదృష్టదీపుడు సినిమాతో (కథానాయకుడిగా) జరిగింది. ఎన్.టి.ఆర్ సొంత సినిమా తోడుదొంగలు లో ఎన్.టి.ఆర్ తో సమానమైన పాత్ర పోషించారు. చిన్నవయసులోనే కారెక్టర్ నటునిగా మారారు. నిజానికి రామారావు, నాగేశ్వరరావుల కన్నా గుమ్మడి వయసులో చిన్న ఐనా అనేక చిత్రాలలో ఆ ఇరువురి నటులకు తండ్రిగా, మామగా నటించారు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్నిరకాల పాత్రలూ ధరించారు. పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించారు. అత్యంత విరుద్ధమైన వసిష్ట, విశ్వామిత్ర పాత్రలు రెంటిని గుమ్మడి ధరించి ప్రసంసలు అందుకున్నారు. దశరధునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు,భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలు ధరించారు. మహామంత్రి తిమ్మరుసు చిత్రం లో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలు గా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన.అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది.(తెనాలి రామకృష్ణ, వీరాభిమన్యు, కర్ణ(డబ్బింగు) మొదలైనవి మిగతావి. సాంఘిక చిత్రాలలో సాత్విక పాత్రలతోపాటు ప్రతినాయకునిగా కూడా నటించారు (నమ్మినబంటు, లక్షాధికారి). 'చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు' పేరు తో జీవనస్మృతుల్ని అక్షరీకరించారు. తొలి ముద్రణ ప్రతులన్నీ కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు.
గుమ్మడి జనవరి 26, 2010న మరణించారు.
నటించిన చిత్రాలు
గుమ్మడి నటించిన కొన్ని చిత్రాల వివరాలు. దీనిని దయచేసి విస్తరించండి
చిత్రలహరి
-
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకుంటూ
-
గుమ్మడి నటించిన మొదటి, చివరి చిత్రాలు
-
గుమ్మడి నటించిన కొన్ని చిత్రాలు
-
అప్పటి రాష్ట్రపతి రాధాకృష్ణన్ నుండి జాతీయ పురస్కారం అందుకుంటూ
-
మాయాబజార్లో గుమ్మడి
మూలాలు
- ↑ http://www.cinegoer.com/gummadi1.htm
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 27-01-2010