Coordinates: 29°45′46″N 95°22′59″W / 29.76278°N 95.38306°W / 29.76278; -95.38306

హ్యూస్టన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: pnb:ہسٹن
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ne:ह्युस्टन
పంక్తి 271: పంక్తి 271:
[[ms:Houston]]
[[ms:Houston]]
[[nah:Houston, Texas]]
[[nah:Houston, Texas]]
[[ne:ह्युस्टन]]
[[nl:Houston]]
[[nl:Houston]]
[[nn:Houston]]
[[nn:Houston]]

20:36, 18 జూలై 2011 నాటి కూర్పు

City of Houston
Official seal of City of Houston
Seal
ముద్దు పేరు: Space City
Location in the state of Texas
Location in the state of Texas
Location in the state of Texas
అక్షాంశరేఖాంశాలు: 29°45′46″N 95°22′59″W / 29.76278°N 95.38306°W / 29.76278; -95.38306
Country United States of America
State Texas
Counties Harris
Fort Bend
Montgomery
Incorporated June 5, 1837
ప్రభుత్వం
 - Mayor Bill White
వైశాల్యము
 - నగరం 601.7 sq mi (1,558 km²)
 - భూమి 579.4 sq mi (1,501 km²)
 - నీరు 22.3 sq mi (57.7 km²)
ఎత్తు 43 ft (13 m)
జనాభా (2007)[1][2]
 - నగరం 2,208,180 (4th)
 - సాంద్రత 3,372/sq mi (1,429/km2)
 - పట్టణ 3,822,509
 - మెట్రో 5,628,101 (6th Largest)
 - Demonym Houstonian
కాలాంశం CST (UTC-6)
 - Summer (DST) CDT (UTC-5)
Area code(s) 713, 281, 832
FIPS code 48-35000[3]
GNIS feature ID 1380948[4]
వెబ్‌సైటు: houstontx.gov

హ్యూస్టన్(ఆంగ్లం: Houston) అమెరికాలో పెద్ద నగరాలలో నాల్గవది అంతేకాక టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం. 2000ల జనాభా లెక్కల ప్రకారం 600 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 22 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. హ్యూస్టన్ నగరం హర్రీస్ కౌటీ యొక్క నిర్వహణా కేంద్రం. గ్రేటర్ హ్యూస్టన్‌గా పిలవబడే ఈ నగరం 56 లక్షల జనాభాతో అమెరికాలోనే అతి పెద్ద మహానగరమైన హ్యూస్టన్-షుగర్ లాండ్-బేటౌన్ కు లకు లకు హ్యూస్టన్ నగరం వ్యాపార కేంద్రం.
హ్యూస్టన్ నగరం 1836 ఆగస్ట్ 30వ తారీఖున ఆగస్టస్ చాప్మెన్ అలెన్ మరియు జాన్ కిర్బ్య్ అలెన్‌ సోదరులచే స్థాపించ బడింది. 1837 జూన్ 5 నుండి గుర్తింపు పొంది రిపబ్లికన్ ఆఫ్ టెక్సాస్ ప్రెసిడెంట్ జ్ఞాపకార్ధం హ్యూస్టన్ పేరుతో వ్యవహరించబడసాగింది. శామ్ హ్యూస్టన్ జనరల్‌గా ఉన్న కాలంలో ఈ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో బాటిల్ ఆఫ్ శాన్ జాసిన్టో యుద్దానికి నాయకత్వం వహించం విశేషం. హార్బర్, రైల్ పట్టాల కర్మాగారంతో 1901లో ఆయిల్ నిలువలు కనిపెట్టడం నగరజనాభా క్రమాభివృద్ధికి దోహదమైంది. ఆరోగ్య సంబంధిత పరిశోధనలకు, పరిశ్రమలకు అంతర్జాతీయ కేంద్రమైన టెక్సాస్ మెడికల్ సెంటర్ , మిషన్ కంట్రోల్ సెంటర్ ఉన్న ప్రాంతాలలో స్థాపించబడిన నాసాకు చెందిన స్పేస్ సెంటర్ ఈ నగరంలోనే మొట్టమొదటిగా ప్రారంభించబడ్డాయి.
హ్యూస్టన్ నగరం ఆర్ధికరంగం ఇక్కడ అధికంగా స్థాపించబడిన విద్యుత్, వస్తుతయారీ, ఏరోనాటిక్స్, రవాణా మరియు ఆరోగ్య సంబంధిత వస్తు తయారీ కర్మాగారాలపై ఆధారపడి ఉంది. వాణిజ్య పరంగా ఇది గమ్మావరల్డ్ సిటీలలో ఒకటిగా గుర్తించబడింది. ఆయిల్ సంబంధిత వస్తు తయారీలో ఈ నగరం అగ్ర స్థానంలో ఉంది. ఈ నగరంలోని పోర్ట్ ఆఫ్ హ్యూస్టన్ హార్బర్ అమెరికాలో అంతర్జాతీయ జలరవాణాలో మొదటి స్థానంలో ఉంది. అంతర్జాతీయ దేశాలనుండి వచ్చి ఇక్కడ అధికంగా స్థిరపడిన ప్రజల కారణంగా విభిన్న సంస్కృతుల నిలయంగా ఈ నగరం మారింది. ఈ నగరం అనేక సాంస్కృతిక సంస్థలకు ప్రదర్శనలకు పుట్టినిల్లు. హ్యూస్టన్ మ్యూజియమ్ డిస్ట్రిక్‌కు సంవత్సరంలో 70 లక్షల సందర్శకులు విచ్చేయడం విశేషం.

చరిత్ర

శామ్యూల్ హ్యూస్టన్ చిత్రం
1873లో హ్యూస్టన్ నగరం

1836లో అగస్టస్ చాప్మెన్ అలెన్ మరియు జాన్ అలెన్ సోదరులచే రియల్ ఎస్టేట్(గృహ నిర్మాణం)సంస్థ వ్యాపార నిమిత్తం బఫెల్లో బేయూ సమీపంలో6,442 ఎకరాల భూమి కొనుగోలు చేయబడటం ఈ నగర నిర్మాణానికి పునాది వేసింది.
అలెన్ సోదరులు ఈ నగరానికి బాటిల్ ఆఫ్ జాన్ శాన్ జాసింటో యుద్ధానికి నాయకత్వం వహించిన టెక్సాన్‌ల ప్రముఖ జనరల్ మరియు తరవాతి కాలంలో 1836 టెక్సాస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన శామ్ హ్యూస్టన్ జ్ఞాపకార్ధం హ్యూస్టన్‌గా నామకరణం చేసారు.1837 లో ఈ నగరానికి పురపాలక వ్యవస్థను మంజూరు చేయబడి మొదటి మేయర్‌గా జేమ్స్ ఎస్.హోల్‌మన్ అయ్యాడు.అదే సంవత్సరం హ్యూస్టన్ హర్రిస్ బర్గ్ కౌంటీ(ప్రస్థుతం హర్రిస్ కౌంటీ) సీటైంది.అంతేకాక రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్‌కు తాత్కాలిక ముఖ్యపట్టణం అయింది.1840 లో చాంబరాఫ్ కామర్స్‌ను స్థాపించి జలమార్గ వాణిజ్యం మరియు రవాణా అబివృద్ధికోసం బఫ్ఫెల్లో బేయూ రేవు నిర్మాణం పూర్తిచేసారు.
1860 నాటికంతా హ్యూస్టన్ రైలు మార్గాలు మరియు వ్యాపారకేంద్రంగా పత్తి ఎగుమతుల కారణంగా అభివృద్ధిని సాధించింది.రైలు మార్గాలు టెక్సాసునుండి హ్యూస్టన్ వరకూ పొడిగించబడ్డాయి.అమెరికన్ సివిల్ వార్ కాలంలో హ్యూస్టన్ జనరల్ బ్యాంక్‌హెడ్ నాయకత్వంలో జరిగిన ది బాటిల్ ఆఫ్ గాల్వ్‌స్టన్ యుద్దానికి నిర్వాహ కేంద్రంగా ఉంది.యుద్ధానంతరం ఇక్కడి వ్యాపార అవసరాల నిమిత్తం నగరం రేవులవైపు విస్తరించడం ఆరంభమైంది. ఈ కారణంగా నగరం డౌన్ టౌన్ మరియు గాల్వ్‌స్టన్ రేవుల మద్య ప్రాంతం వ్యాపారకేంద్రంగా అభివృద్ధి చెందింది.1890 నాటికంతా హ్యూస్టన్ టెక్సాస్‌కు ప్రముఖ రైల్ కేంద్రంగా మారింది.
1990 లో గాల్వ్‌స్టన్ హరికెన్ తుఫానుకు గురి కావడంతో హ్యూస్టన్ నగరానికి రేవు నిర్మాణం అవసరం ఏర్పడింది.తరవాతి సంవత్సరం బ్యూమోంట్ సమీపంలో స్పిండిల్ టాప్ ఆయిల్ ఫీల్డ్ ' వద్ద చమురు నిలవలు కనుగొనబడటం టెక్సాస్ చమురు వ్యాపారాన్ని అభివృద్ధిపధం వైపు నడిపించింది.1902 లో హ్యూస్టన్ షిప్(ఓడ)కాలువ అభివృద్ధి పధకానికి ప్రెసిడెంట్ దియోడర్ రూజ్‌వెల్ట్ చే 10లక్షల డాలర్ల నిధి మంజూరైంది.1910 నాటికి జనాభా 78,800 చేరుకొనడంతో ఒక్ దశాబ్ధకాలంలో జనసంఖ్య రెండింతలైంది.నగర జనాభాలో మూడింట ఒకభాగం ప్రజలు ఆఫ్రికన్ అమెరికన్లు.వారి సంఖ్య 23,929 వీరంతా అధికంగా వ్యాపార వాణిజ్య రంగాలలో స్థిరపడిన వారే.1914 ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ చే హ్యూస్టన్ నగర రేవు ప్రారంభోత్సవం జరగడం హ్యూస్టన్ నగరాన్ని టెక్సాస్ నగరంలోనే అధిక జనసంఖ్య కలిగిన నగరంగా చేసింది అలాగే హరీస్ అధిక జనసంఖ్య కలిగిన కౌంటీ అయింది.
రెండవ ప్రపంచ యుద్ధం నగర జలరవాణాను,రవాణా అయ్యే సరుకుల మోతాదుపై చెడు ప్రభావం చూపించినా యుద్ధం నగరానికి ఆర్ధిక ప్రయోజనం కలిగించింది. యుద్ధావసరాల కారణంగా పెరోలియ రసాయన మరియు చమురుశుద్ధి కర్మాగారాల పరిశ్రమలు షిప్ కెనాల్(రవాణా కాలువ)తీరాలలో నిర్మించబడ్డాయి.యుద్ధకాలంలో పెట్రోలియమ్ మరియు రబ్బర్ ఉత్పత్తులకు అధిక అవసరం ఏర్పడటం ఇందుకు కారణం.మొదటి ప్రపంచయుద్ధ కాలంలో నిర్మించ బడిన ఎలింగ్టన్ ఫీల్డ్ తిరిగి ప్రాధాన్యత సంతరించుకుని అధిక సామర్ధ్యంతో బాంబార్డియర్స్ మరియు నావికాదణానికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది.1945 లో ఎమ్.డి ఆన్డర్‌సన్ సేవా సంస్థచే టెక్సాస్ మెడికల్ సెంటర్ రూపుదిద్దుకుంది.యుద్ధానంతరం హ్యూస్టన్ నగర ఆర్ధికరంగంలో రేవు మరియు జలరవాణా ప్రముఖ పాత్ర వహించాయి.1948 లో అభివృద్ధి చెందిన నగర పరిసర ప్రాంతాలను నగరంలో విలీనం చెయడంతో నగరమూ నగరభూభాగమూ విస్తరించింది.

చాలెంజర్ స్పేస్ చెంటర్ మీద ప్రయాణిస్తున్న స్పేస్ షట్టిల్

1950లో ఎయిర్కండిషనర్ల(శితలీకరణ యంత్రాలు) అందుబాటులోకి రావడంతో హ్యూస్టన్ నగరంలోని అనేక పరిశ్రమలు తిరిగి ప్రారంభించబడటం నగరం అత్యంత శీఘ్రగతిలో ఆర్ధిక పురోగతిని సాధించింది.విద్యుత్‌ఉత్పత్తిలో ప్రత్యేక అభివృద్ధిని సాధించి విద్యుత్ రంగంలో నగరం కీలకపాత్ర వహిస్తూ ముందుకు సాగింది.రెండవ ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధావసరాలకు ఓడనిర్మాణం విశేష అభివృద్ధి సాధించడం నగరాభివృద్ధికి కొంత కారణం అయింది.1961 లో నాసావారి మ్యాన్‌డ్ స్పేస్ క్రాఫ్ట్ సెంటర్ (తరువాతి కాలంలో ఇది 1973 నుండి లిండన్ బీ జాన్సన్ స్పేస్ సెంటర్‌గా నామాంతరం చెందింది) స్థాపనతో నగరంలో ఎయిరో స్పేస్ పరిశ్రమకు శ్రీకారం చుట్టింది.1965 లో ప్రపంచలోని మొట్టమొదటి ఇండోర్ గేమ్ స్టేడియమ్ ఆస్ట్రోడోమ్ నిర్మాణం హ్యూస్టన్ నగర ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి.ఆస్ట్రోడోమ్ స్తేడియమ్ ఎనిమిదవ వింతగా ప్రాచుర్యం పొందింది.1970 లో రస్ట్‌బెల్ట్ నుండి వచ్చిచేరిన ప్రజలతో హ్యూస్టన్ నగర జనసంఖ్యలో పెనుమార్పులు కనపడసాగాయి.కొత్త నివాసితులు చమురు రంగంలో రూపొందిన ఉద్యోగాలతో ఉపాధి పొందడానికి వచ్చిచేరారు.1980 వరకూ సాగిన జనాభివృద్ధి ఆతరవాత చమురు ధరలు పడిపోవడంతో కొంత ఆగింది.1986 లో స్పేస్ షట్టిల్ చాలెంజర్ ప్రయోగించిన కొంతసేపటిలోనే కాలిపోవడంతో స్పేస్(అంతరిక్షం) పరిశ్రమ కొంత వనుకడుగు వేసింది.

Houston నావకాలువ

1980 నగర ఆర్ధికాభివృద్ధి కొంత కాలంపాటు తగ్గుముఖం పట్టింది.1990 నుండి హ్యూస్టన్ నగరం అనఆర్ధికరంగ తిరోగతిని అధిగమించడానికి కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది.ముందుగా పెట్రోలియ ఉత్పత్తులమీద ఆధారపడటం కొంత తగ్గించి ఎయిరో స్పేస్ మరియు ఆరోగ్య సంరక్షక వస్తువుల ఉత్పత్తి వైపు దృష్టి సారించింది.1997 లో హ్యూస్టన్ ఆఫ్రికన్ అమెరికన్ అయిన లీ పి బ్రౌన్ నును మేయరుగా ఎన్నుకుంది.

దస్త్రం:RitaHoustonEvacuation.jpg
నగరాన్ని ఖాళీ చేస్తున్న హ్యూస్టన్ వాసులు

2001 లో సంభవించిన ట్రాపికల్ స్ట్రోమ్ అలిసన్ తుఫాను కారణంగా హ్యూస్టన్ నగరం 37 అంగుళాల నీటి వరదను చవిచూసింది.ఇది 20 మంది ప్రాణాలను బలికొనడమే కాక నగరానికి కొన్ని బిలియన్‌ డాలర్ల నష్టాన్ని కలిగించి అత్యంత విషాదాన్ని సృష్టించిన వరదగా నమోదైంది.హ్యూస్టన్ ఆధారిత విద్యుత్ పరిశ్రమ ఎన్‌రాన్ భాగస్వామ్యలోపాల కారణంగా భారీ పతనం మరింత సంచలనానికి కారణం అయింది.
2005 లో న్యూఆర్లిన్స్‌లో సంభవించిన హరికేన్ కాతరినా కారణంగా అక్కడి నుండి వచ్చి చేరిన 1,50,000 మంది ప్రజలకు హ్యూస్టన్ నగరం ఆశ్రయం కల్పించింది.షుమారు ఒక నెల తరవాత హ్యూస్టన్ నగరంలో సంభవించిన హరికెన్ రీటా కారణంగా 25 లక్షల మంది నగరాన్ని వదిలి గల్ఫ్ కోస్ట్ చేరడం విశేషం. ఇది కల్పించిన నష్టం స్వల్పమే అయినా ఈ సంభవం భారీగా నగరవాసులను శరణార్ధులుగా చేసి అమెరికా చరిత్రలో స్థానం సంపాదించింది.

భౌగోళికం

హ్యూస్టన్ నగర వైశాల్యము 601.7 చదరపు మైళ్ళు.ఇందులో 579.4 చదరపు మైళ్ళు భూభాగము,22.3 చదరపు మైళ్ళు జలభాగము.అనేకంగా హ్యూస్టన్ నగరం సముద్రంలో చొచ్చుకు వచ్చిన గల్ఫ్ భూభాగం లో అధిక భాగం ఉంటుంది.ఈ కారణంగా నగరంలో అధిక భాగం సుందరమైన పసరిక,వన్యప్రాంతాలతో రమ్యంగా ఉంటుంది.నగరమంతా అక్కడక్కడ తడినేలలు,గరిక భూములు,కాలువలు వృక్షాలు ఉంటాయి.నగరం అధికంగా వన్యభూములలో నిర్మించబడింది.ఈ కారణంగా ఇక్కడ లోతట్టు ప్రాంతాలులో తరచుగా వరద లు సంభవిస్తుంటాయి.డౌన్‌టౌన్ ఎత్తు సముద్రమట్టానికి 50 అడుగులు.నగరంలో నైరుతీ భూభాగం ఎత్తు 125 అడుగులు.ఇది నగరంలో అధిక ఎత్తైన భూభాగం.నగరం మొదట భూఅంతర్భాగజలవనరుల మీద ఆధారపడినాపెరుగుతున్న అవసరాల కారణంగా హ్యూస్టన్ లేక్ మరియు లేక్ కాన్‌‌కోర్ లు నగప ప్రజలకు నీటి వసతులు తీరుస్తుంది.
నగరం గుండా నాలుగు ప్రధాన కాలువలు ప్రవహిస్తుంటాయి.వీటిని ఇక్కడి వారు బేయూ గా పిలుస్తుంటారు.డౌన్‌టౌన్ మీదుగా ప్రవహించే బఫెల్లో బేయూ మరియు హ్యూస్టన్ షిప్ కెనాల్,పరిసర ప్రాంతాలలో ఉన్న హైట్స్ నుండి డౌన్ టౌన్ వైపు ప్రవహించే వైట్ ఓక్ బేయూ ,టెక్సాస్ మెడికల్ సెంటర్ ప్రక్కగా ప్రవహించే బ్రీస్ బేయూ మరియు హ్యూస్టన్ దక్షిణ ప్రాంతంనుండి డౌన్‌టౌన్ వరకూ ప్రవహిస్తున్న సిమ్స్ బేయూ నగర సౌందర్యాన్ని ఇనుమడింప చేసే జలవనరులు.షిప్ కెనాల్ గాల్వ్‌స్టన్ ద్వారా ప్రవహిస్తూ మెక్సికో గల్ఫ్‌ను చేరుకుంటుంది.

వాతావరణం

సాదారణంగా సముద్రతీరాలలో ఉండే తడితోకూడిన గాలులు ఇక్కడి వాతావరణాన్ని కొంత ఆహ్లాదపరుస్తుంటుంది.గల్ఫ్ కారణంగా తరచు తుఫానులు,టోర్నాడోలనబడే రాక్షస సుడిగాలులు సంభవిస్తూటాయి.దక్షిణప్రాంతంలో మెక్సికన్‌ ఎడారుల నుండి వచ్చే వేడిగాలులు గల్ఫ్ నుండి వచ్చే తడిగాలులు సమ్మిశ్రితమౌతుంటాయి.హిమపాతం అరుదుగా సంభవిస్తుంటుంది.చలి మితంగా ఉంటుంది.చలికాలంలో సాదారణంగా 63 నుండి 43 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత ఉంటుంది.ఎండా కాలం 90 నుండి 99 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత సంభవం.తుఫానుల కారణంగా వర్షపాతం అధికం ఈ కారణంగా వరదలు సంభవిస్తుంటాయి.
నగర వాతావరణం లో ఓజోన్ శాతం అధికం. అధిక కలుషిత ప్రాంతాలలో ఇది 6వ స్థానంలో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ లంగ్ అసోసియేషన్ సూచించింది.ఇక్కడ అధికంగా ఉన్న పరిశ్రమలు షిప్ కెనాల్ ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

నగరఉపస్థితి

హ్యూస్టన్ నగరానికి 1837 లో నగరపాలిత హోదా లభించింది.ఇది వార్డ్ ప్రతినిధుల సహాయంతో నిర్వహించబడుతుంది.ఇది ప్రస్తుతం 9 హ్యూస్టన్ సిటీ కౌన్‌సిల్ డిస్ట్రిక్‌ లుగా విభజించబడింది.హ్యూస్టన్ నగరం సాదారణంగా నగరలోపలి మరియు వెలుపలి తరగతులుగా వ్యవహరిస్తారు.నగర లోపలి భాగాన్ని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్‌ దాని పరివేష్టితమై ఉంటుంది.ఇక్కడి నివాసితులు చాలాభాగం రెండవ ప్రపంచ యుద్ధానికి ముందునుండి నివసిస్తున్న వాళ్ళు.లూప్ ప్రాంతంలో సరికొత్తగా అధిక జనసాంద్రత కలిగిన నివాస గృహాల అభివృద్ధి జరిగింది.ఈ ప్రాంతం ఇంటర్ స్టేట్ లూప్ 610 లోపలి భాగంలో ఉంటుంది.

ప్రభుత్వమూ రాజకీయాలు

హ్యూస్టన్ నగరం మేయర్ పాలన కింద నడుస్తూంటుంది.ప్రజలు ఓటింగ్ ద్వారా మేయర్,కంట్రోలర్ మరియు 14 సిటీ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకుంటారు.మేయర్‌చే చీఫ్ అడినిస్ట్రేటర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అఫీషియల్ రిప్రెజెటేటివ్(అధికార ప్రతినిధి)గా భాద్యతలు చేపట్ట బడతాయి.మేయర్ అధికార పరిధిలోనగర నిర్వహణ మరియు చట్టమూ న్యాయమూ క్రబద్దీకరణ వ్యవహారాలు ఉంటాయి.1991 చట్ట సవరణను అనుసరించి మేయర్ ప్దవీ కాలం రెండు సంవత్సరాలు.అధికపరిమితిగా మూడు పర్యాయాలు మాత్రమే పోటీ చేయవచ్చు.

జనసంఖ్య

హ్యూస్టన్ కళాత్మక కారు పందాలు

హ్యూస్టన్ నగరం క్రమంగా అంతర్జాతీయ నగరంగా రూపొందింది.హ్యూస్టన్ నగరంలో షుమారు 90 రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు.హిస్పానికన్లు మరియు మెక్సికన్ల జనాభా అమెరికాలోనే హ్యూస్టన్ నగరం మూడవస్థానంలో ఉంది.ఉపాధి నిమిత్తం నగరానికి చేకున్న జన ప్రవాహం కారణంగా నగరంలో యువత అధికంగా ఉన్నారు.వీరిలో కొంత భాగం టెక్సాస్ నుండి వచ్చిన నిర్వాసితులే.హ్యూస్టన్ నగరంలో షుమారు 4 లక్షల మంది అక్రమ నివాసితులు ఉన్నట్లు అంచనా. అమెరికాలో అత్యధికంగా దక్షిణతూర్పు దేశాల ప్రజలు ముఖ్యంగా ఇండియన్లు మరియు పాకిస్థానీయులు నివసిస్థున్న నగరాలలో హ్యూస్టన్ నగరం ఒకటి.
2000 సంవత్సరములో ఈ నగర జనసంఖ్య 19,53,631.జనసాంద్రత చదరపు మైలుకు 3,371.7.వీరిలో 49.27% ప్రజలు శ్వేతజాతీయులు, 25.31% ప్రజలు నల్లవాళ్ళు,5.31% ఆసియన్లు,0.44% అమెరికన్ ఇండియన్లు,0.06% పసిఫిక్ ఐలాడర్లు,16.46% ఇతరులు మరియు 3.15% మిశ్రమ జాతీయులు.ఆసియా దేశాలనుండి వలస వచ్చినవారు అధికసంఖ్యలో హ్యూస్టన్ నగరంలో నివసిస్తున్నటు అంచనా.హ్యూస్టన్ నగరంలో రెండు చైనాటౌన్లు ఉండటం అందుకు తార్కాణం.వియత్నామీలకు ఇక్కడ ప్రత్యేక వీధులున్నాయి.

నగరసంస్కృతి

అంతర్జాతీయ పౌరుల ఆగమనం త్వరిత గతిన అభివృద్ధి చెందుతున్న అమెరికా నగరాలలో ఇదీ ఒకటి.ఈ కారణంగా అమెరికా వెలుపలి దేశాలలో జన్మించి ఇక్కడ నివసిస్తున్న వారి సంఖ్య 11 లక్షలు.ఇది నగర జనాభాలో 21.4%.నగరంలోని మూడింట రెండువంతుల భాగంలో దక్షిణ సరిహద్దు ప్రాంతమైన మెక్సికో నుండి ఇక్కడకు వచ్చి నివసిస్తున్న వారు ఉన్నారు. అన్యదేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో నడుపబడుతున్న సలహాసంప్రదింపుల కార్యాలయాలున్న నగరాలలో ఇది మూడవది.ఇక్కడ 82 దేశాల కార్యాలయాలు ఉన్నాయి.
హ్యూస్టన్ నగరంలో నాసాకు లిండన్ బి.జాన్‌సన్ స్పేస్ సెంటర్ ఉన్న కారణంగా 1967 లో స్పేస్ సిటీగా అభిమాన నామం సంపాదించుకుంది.ఇది కాక దీనికి బేయూ సిటీ,మగ్నోలియా సిటీ,క్లచ్ సిటీ మరియూ హెచ్.టౌన్‌గా మారుపేర్లతో ఇక్కడి స్థానికులు అభిమానంగా పిలుచుకుంటారు.

కళా ప్రదర్శనశాలలు

డౌన్ టౌన్ దియేటర్ డిస్ట్రిక్‌లో ఉన్న వర్తమ్ సెంటర్

హ్యూస్టన్ నగరంలో కళాప్రదర్శనలు చురుకుగా సాగుతుంటాయి.డౌన్ టౌన్‌లో ఉన్న దియేటర్ డిస్ట్రిక్‌ 9 కళాప్రదర్శనా సంస్థలకు పుట్టినిల్లు.దీనిలో 6 కలాప్రదర్శనాశాలలు ఉన్నాయి.డౌన్ టౌన్లో చోటుచేసుకున్న ప్రదర్శనాశాలలో‌ ఉన్న ఆసనాల(సీట్లు) సంఖ్యా పరంగా ఇది అమెరికా లో రెండవ స్థానంలో ఉంది.శాశ్వతతంగా కళలను వృత్తి గా తీసుకున్న సంస్థలు అధికంగా ఉన్న నగరాలలో హ్యూస్టన్ ఒకటి. ఒపేరా,బాలే,సంగీతము మరియు దియేటర్ లాటి దాదాపు అన్ని కళారంగాలలో పాలుపంచుకునే కళాకారులకు ఇది నిలయం. ఫోల్క్ ఆర్టిస్టులకు,ఆర్ట్ గ్రూపులకు మరియు చిన్న సంస్థలకు ఇది పుట్టిల్లు.ఊరూరా ప్రదర్శనలు ఇచ్చే వీధి ప్రదర్శనలు,కన్‌సర్ట్స్ మరియు వస్తుప్రదర్శనల ఇతర అనేక రకాల ప్రదర్శనలు ఇచ్చే కళాకారులను హ్యూస్టన్ విశేషంగా ఆకర్షిస్తంది.అమెరికా లో ఉత్తమ ప్రదర్శనలలో ఒకటిగా పరిగణించబడే బేయూ సిటీ ఆర్ట్ ఫెస్టివల్ హ్యూస్టన్ నగరంలో జరుపుతుంటారు.
ది మ్యూజియమ్ డిస్ట్రిక్‌లో ప్రఖ్యాత సాంస్కృతిక కార్యక్రమాలు ,వస్తు ప్రదర్శనలు తరచూ జరుగుతుంటాయి.వీటిని సంవత్సరంలో సందర్శించే వారి సంఖ్య 70 లక్షలు.ఓక్ నదీ తీరంలో 14 ఏకరాల విస్తీర్ణంలో ఉన్నబేయూ బెండ్ లో ఉన్న మ్యూజియమ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో ఉన్న అలంకరణకు ఉపయోగించే కళాఖండాలు,తైలవర్ణ చిత్రాలు మరియు గృహోపకరణ సామాను అమెరికాలో ఉన్న ఉత్తమ కళా వస్తు సేకరణగా గుర్తింపు పొందింది.రాక్ ,బ్లూస్ ,కంట్రీ ,హిప్ హాప్ మరియు తెజానో సంగీత కార్యక్రమాలు నగరంలో తరచూ నిర్వహిస్తుంటారు.ప్రఖ్యాత సంగీత కాళాకారులు అధికంగా లేకపోవడం కొత విచారకరం.తరచుగా ఇక్కడి కళాకారులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినివసించడం ఇందుకు కారణం.ఈ నియమానికి అతీతంగా హ్యూస్టన్ హిప్ హాప్ ఇక్కడ వేళ్ళూని ఉంది.

సంఘటనలు

ఫిబ్రవరి ఆఖరి నుండి మార్చ్ ఆరంభం వరకూ 20 రోజులు జరిగే హ్యూస్టన్ లైవ్ స్టాక్ షో అండ్ రోడియో నగరంలో జరిగే దీర్గకాలిక మరియు బృహత్తర ప్రదర్శనలలో ఒకటి.జూన్ ఆఖరులో రాత్రి సమయంలో జరిగే హ్యూస్టన్ ప్రైడ్ పేరేడ్ ప్రతి సంవత్సరమూ జరిగే ఆకర్షణీయమైన పెద్ద సంబరాలలో ఒకటి.ఇతర వార్షిక ఉత్సవాలలో హ్యూస్టన్ గ్రీక్ ఫెస్టివల్ ,ఆర్ట్ కార్ ఫెస్టివల్ ,ది హ్యూస్టన్ ఆటో షో మరియు హ్యూస్టన్ ఇంటర్‌నేషనల్ ఫెస్టివల్ .

పర్యాటకరంగము

అధికారులచే అధికంగా పర్యటించే స్పేస్‌సెంటర్ హ్యూస్టన్ తరవాతికాలంలో ఇది లిండన్ బీ జాన్సన్ స్పేస్ సెంటర్‌ గా నామాంతరం చెందిం.ఇక్కడ చంద్రశిలలు,నాసా చరిత్ర,అంతరిక్షనౌకలు వాటి విశేషాలు మరియు అనేక విషయాలను వీక్షించే తెలుసుకుని ఆనందించడం అపురూప అనుభవం.డౌన్‌టౌన్లో ఉన్న దియేటర్ డిస్ట్రిక్ 17 బ్లాకులను కలిగి కళాభిమానులకు కనువిందు కలిగిస్తుంది.ఇక్కడ హోటళ్ళు,చలనచిత్ర ప్రదర్శనలు,ఉద్యానవనాలు మరియు ప్లాజాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి.బేయూ ప్యాలెస్ అనేక అంశాలతో పూర్తి స్థాయి సేవలందించే హోటల్స్,బార్లు,సంగీత కచేరీలు,బిలియర్డ్స్ మరియు కళాత్మక చిత్రాలు లాంటి వినోదాలకు కేంద్రము.వరిజాన్ వైర్లెస్ దియేటర్ వేదికలపై కన్సర్ట్స్(జానపద సంగీతం)ప్రదర్శనలు,రంగస్థల నాటకాలు,హాస్య కార్యక్రమాలు ప్రదర్శనలు ఒక ప్రత్యేక ఆకర్షణ.అంజలికా ఫిల్మ్ సెంటర్ అధునాతన దేశీ మరియు విదేసీ కళాత్మక చిత్రాలు,మరియు ప్రత్యేక లఘు చిత్రాలు ప్రదర్శిస్తుంటారు.
హ్యూస్టన్ నగరం హర్మన్ పార్క్‌తో చేర్చి 337 ఉద్యానవనాలకు నిలయం.హర్మన్ పార్క్‌లో హ్యూస్టన్ జూ మరియు హ్యూస్టన్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ సైన్స్ ఉన్నాయి.శ్యామ్ హ్యూస్టన్ పార్క్ పర్యాటకులకు వసతిగృహాలు , 1823 మరియు 1905 మద్య నిర్మించిన పురాతన గృహాలు ఉన్నాయి.టెర్రీ హర్షీ పార్క్,లేక్ హ్యూస్టన్ పార్క్,మెమోరియల్ పార్క్,ట్రాంక్విలిటీ పార్క్ లాంటివి ప్రధాన ఉద్యానవనాలలో కొన్ని.హ్యూస్టన్ నగరంలో 56,405 (228 చదరపు ఎకరాలు)ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాలు మరియు పచ్చటి వృక్షాలు నిండి ఉన్నాయి.ఇవి కాక 19,600(79 చదరపు ఎకరాలు) విస్తీర్ణంలో మరిన్ని పచ్చటి ప్రదేశాలు ఉన్నాయి.హ్యూస్టన్ అర్బోర్టమ్ అండ్ నేచుర్ సెంటర్ తోచేరి ఇవీన్నీ హ్యూస్టన్ నగరపాలనా వ్యవస్థ నిర్వహణలో ఉన్నాయి.హ్యూస్టన్ సివిక్ సెంటర్ స్థానంలో జార్జ్ ఆర్ బ్రౌన్ కాన్‌వెన్షన్ సెంటర్ నిర్మించబడింది.దేశంలో పెద్ద కళా ప్రదర్శనశాలలో జెస్సె హెచ్ జోన్స్ హాల్ ఫర్ ది పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ ఒకటి.

చూడవలసిన ప్రదేశాలు

  1. స్పేస్‌సెంటర్ హ్యూస్టన్.
  2. దియేటర్ డిస్ట్రిక్.
  3. బేయూ ప్లేస్
  4. వరిజాన్ వైర్లెస్ దియేటర్.
  5. హర్మన్ పార్క్.
  6. హ్యూస్టన్ జూ.
  7. హ్యూస్టన్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ సైన్స్.
  8. టెర్రీ హర్షీ పార్క్.
  9. మెమోరియల్ పార్క్.
  10. ట్రాంక్విలిటీ పార్క్.
  11. సెస్క్విసెన్టెనరీ పార్క్.
  12. డిస్కవరీ గ్రీన్.
  13. శ్యామ్ హ్యూస్టన్ పార్క్.
  14. హ్యూస్టన్ అర్బోర్టమ్ అండ్ నేచుర్ సెంటర్.
  15. జార్జ్ ఆర్ బ్రౌన్ కాన్‌వెన్షన్ సెంటర్.
  16. జెస్సె హెచ్ జోన్స్ హాల్ ఫర్ ది పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్.
  17. హ్యూస్టన్ సింఫోనీ ఆర్కెస్ట్రా.
  18. శ్యామ్ హ్యూస్టన్ కొలిస్యూమ్.
  19. ది గలేరియా.
  20. స్ప్లాష్ టౌన్.
  21. శ్యామ్ హ్యూస్టన్ రేస్ పార్క్.
  22. శ్యాన్ జెసింటో బాటిల్ గ్రౌండ్.

ఆర్ధికరంగము

హ్యూస్టన్ నగరం విద్యుత్ ప్రత్యేకంగా సహజవాయువు మరియు చమురు పరిశ్రమలకు అంతర్జాతీయ పేరు గడించిన నగరం.అలాగే బయోమెడికల్ మరియు బయోమెడికల్ మరియు ఎయిరో నాటికల్ పరిశోధా రంగాలలో హ్యూస్టన్ నగరానికి ప్రాముఖ్యత అధికం.నౌకారవాణాకు అనువైన కాలువ కూడా హ్యూస్టన్ నగర అర్ధిక వనరులలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.ఈ కారణంగా ఈ నగరం అంతర్జాతీయంగా వర్గీకరించబడిన గామాసిటీ అనే వర్గానికి చెందిన నగరాలలో హ్యూస్టన్ నగరం ఒకటి.
గ్రేటర్ హ్యూస్టన్ చమురు కర్మాగారాలకు సంబంధించిన పరికరాలు తయారుచేయడంలో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.హ్యూస్టన్ నగరం చమురు రసాయనాల కేంద్రంగా మారడానికి కారణం నౌకారవాణాకు అనుకూలమైన మానవ నిర్మిత కాలువ ది పోర్ట్ ఆఫ్ హ్యూస్టన్ ప్రధానకారణం.ఈ రేవు అంతర్జాతీయంగా రవాణాలో 10వ స్థానంలోనూ,అమెరికా లో మొదటి స్థానంలో ఉండటం హ్యూస్టన్ నగర ప్రత్యేకత.అనేక ప్రాంతాలలో చమురు మరియు సహజవాయువుల ధరలు ఆర్ధిక రంగంపై దుష్ప్రభావం చూపిస్తున్న తరుణంలో హ్యూస్టన్ నగర చమురు తయారీ పరిశ్రమల కారణంగా పలువురు జీవనోపాధి పొందడం ఇక్కడి ప్రత్యేకతలలో ఒకటి.
హ్యూస్టన్ నగర చక్కెర ఉత్పత్తుల మొత్తం 2006 లో 325.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు.ఇది ఆస్ట్రియా,పోలెండ్ లేక సౌదీ అరేబియా ఉత్పత్తులకంటే స్వల్పంగా ఎక్కువే.ఇతర దేశాలతో పోల్చినప్పుడు హ్యూస్టన్ నగర ఉత్పత్తులను అమెరికా కాక 21 దేశాలు మాత్రమే అధిగమిస్థాయి.చమురు నిల్వలు ఉత్పత్తులు నగర ఆర్ధిక వనరులలో 11%.ఇది 1985లో 21%గా ఉండేది. చమురు రంగం వెనుకంజ ఇతరరంగాల అభివృద్ధికి దారితీసింది.
హ్యూస్టన్ నగరం అమెరికా లో అధిక జనసాంద్రత కలిగిన 10 నగరాలలో ఉపాధుల అభివృద్ధిలో రెండవ స్థానంలోనూ,ఉపాధుల సంఖ్యలో నాల్గవ స్థానంలోనూ ఉంది.నగరంలోని నిరుద్యోగుల సంఖ్య 2008 లో 3.8%.8 సంవత్సరాల కాలంలో ఇది అతి తక్కువ శాతంగా నమోదైంది.ఉపాధికల్పనలో 2.8%అభివృద్ధిని సాధిచడం ఇందుకు ప్రధాన కారణం.
2006 లో వ్యాపారానికి వృత్తిజీవితంలో కొనసాగడానికి అనువైన నగరంగా హ్యూస్టన్ అమెరికా లో మొదటి స్థానంలో ఉంది.40 అంతర్జాతీయ వాణిజ్య మరియు వ్యాపార కార్యాలయాలు నగరంలో నిర్వహించబడుతున్నాయి.23 అంతర్జాతీయ యాక్టివ్ చాంబర్స్ నగరంలో పనిచేస్తున్నాయి.10 దేశాలచే నిర్వహించబడుతున్న20 ఆర్ధిక సంస్థలు అంతర్జాతీయ సంస్థలకు ఆర్ధిక సహకారాన్నందిస్తూ సేవచేస్తున్నాయి.
2008 లోహ్యూస్టన్ నగరం ఆర్ధిక రంగం,ఉద్యోగావకాశాలు,జీవన పరిమాణం మరియు అందుబాటులో ఉన్న ధరలు కారణంగా ఉత్తమ నగరంగా ప్రధమ స్థానంలో ఉండటం విశేషం.ఫోర్‌బ్స్ ' ఆధారంగా పత్రిక జరిగిన 15 సంవత్సరాలనుండి నగరం సాంకేతికరంగంలోనూ పరిశోధనా రంగంలోనూ సాధించిన ప్రగతిలో నగరం నాల్గవ స్థానంలో ఉన్నట్లు అంచనా.అదే సమయంలో ఫార్చ్యూన్ 500 కంపెనీల ప్రధాన కార్యాలయాలున్న నగరాలలో రెండవస్థానంలోనూ, పట్టబద్రులు సంఖ్యలో ప్రధమస్థానంలో ఉన్నట్లు ఫోర్‌బ్స్ పత్రిక పేర్కొంది.

నేరము

హ్యూస్టన్ పోలీసువ్యవస్థ ఆధ్వర్యంలో నేరమూచట్టమూ ఉంటుంది.2005లో 2,50,000 జనసంక్యలోహ్యూస్టన్ నగర నేరాల సంఖ్య అమెరికాలో 11వ స్థానంలో ఉంది.ఖూనీల సంఖ్య అమెరికా నగరాల మద్య 3వ స్థానంలో ఉన్నా ఇది కొంత సమాచార మాద్యమాలలో వివాదాస్పదమౌతూ ఉంటుంది.గృహాంతర హత్యల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నట్లు విలేఖరులు ఆక్షేపిస్తున్నారు.ఖచ్చితంగా లెక్కిష్తే ఇది రెండవ స్థానంలో ఉన్నట్లు వారి ఊహ.
హింసాత్మక సంఘటనలు 2004 మరియు 2005 ల మద్య 2% తగ్గినా అదే సమయం గృహాంతరహత్యలు 23.5% పెరగడం గమనార్హం.2005 లో కతరినా హరికేన్ అనంతరం న్యూఆర్లిన్స్ నుండి శరణార్ధుల జనప్రవాహం వచ్చి చేరిన తరవాత హత్యల శాతం గణనీయంగా 70% పెరిగి శిఖరాగ్రానికి చేరింది. 2004 లో 272 హత్యలు నమోదుకాగా2005 లో 336 హత్యలు నమోదైయ్యాయి.10,000 హ్యూస్టన్ వాసులకు 2005 లో 16.33 హత్యలు నమోదుకాగా 2006 నాటికి 17.24 హత్యలు నమోదైయ్యాయి.2006 నాటికి హత్యల సంఖ్య 379కి చేరింది.1996 లో హ్యూస్టన్ నగరంలో 380 ముఠాలు వాటిలో ఉన్న సభ్యులు 8000 వారిలో 2,500 మంది యూదులు.

నిర్మాణరంగము

టెక్సాస్‌లోని జెపి మొర్గాన్ చేస్ టవర్

హ్యూస్టన్ నగర ఆకాశహర్మ్యాలు అమెరికాలో 4వ స్థానంలో ఉన్నాయి.అంతృజాతీయ స్థాయిలో ఎత్తైన భవనాలున్న 10 నగరాలలో హ్యూస్టన్ నగరం ఒకటి.అమెరికా లో ఎత్తైన భవనాలున్న నగరాలలో హ్యూస్టన్ నగరం మూడవది.హ్యూస్టన్ నగరం డౌన్ టౌన్‌ ఏడు మైళ్ళ(11 కిలోమీటర్లు)దూరానికి భూమ్యాంతర మార్గాలు మరియు ఆకాశహర్మ్యాల శ్రేణులు కలిగి ఉంది.ఈ కారణంగా పాదాచారులు అధిక వర్షాలు మరియు అత్యధిక ఉష్ణోగ్రత నుండి కొంత రక్షణ కలుగుతూ ఉంటుంది.
1960 లో హ్యూస్టన్ నగర డౌన్‌టౌన్ మద్యంతర ఎత్తులో ఉన్న కార్యాలయ సముదాయాలు ఉండగా అప్పటి నుండి బృహత్తర ఆకాశహ్ర్మ్యాల స్థాయికి ఎదిగి అమెరికాలో ఉన్న అత్యధి ఆకాశ హర్మ్యాల నగరంగరాలలో ప్రత్యేకస్థాయికి చేరింది.నిర్మాణసంస్థల నిరంతర కృషిలో 1970 సంవత్సరమంతా ఆకాశహర్మ్యాల నిర్మాణం జరిగింది.హ్యూస్టన్ నగర నిర్మాణసంస్థ హైన్స్ వ్యవస్థాపకులైన గెరాల్డ్ డి హైన్స్‌చే నిర్మించబడిన జెపి మొర్గాన్ చేస్ టవర్ (టెక్సాస్ కామర్స్ టవర్)టెక్సాస్‌లో అత్యధిక ఎత్తైన భనం.ఇది 1982 లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది.ఇది అమెరికాలో ఎత్తైన భవనాలలో 10 వస్థానంలోనూ అంతర్జాతీయంగా 30వ స్థానంలోనూ ఉంది.ఈ భనంలో 75 అంతస్థులు ఉన్నాయి, ఎత్తు 1002 అడుగుల (305 మీటర్లు).1983 లో 71 అంతస్థులు కలిగి 992 అడుగుల(302 మీటర్లు) ఎత్తైన వెల్స్ ఫార్గో బ్యాంక్ ప్లాజా నిర్మాణం జరిగింది.ఇది హ్యూస్టన్ మరియు టెక్సాస్ లలో రెండవ ఎత్తైన స్థానం సంపాదించుకుంది.ఇది అమెరికాలో 13వస్థానంలోనూ అంతర్జాతీయంగా 36వ స్థానంలోనూ ఉంది.2006 నాటికి 4,30,00,000 చదరపు అడుగుల(40,00,000 మీటర్లు) కార్యాలయ భవనాలు హ్యూస్టన్ నగరంలో ఉన్నట్లు అంచనా.

పత్రికలు

నగరంలో ది హియర్‌ట్స్ కార్పొరేషన్‌కు స్వంతమైన హ్యూస్టన్ క్రోనికల్ అధికస్థాయిలో ప్రజల మన్ననలందికుని సేవలందిస్తున్న ఏకైక వార్తాపత్రిక. ఈ పత్రిక ప్రధాన పోటీదారు హ్యూస్టన్ పోస్ట్ వార్తాపత్రిక హ్యూస్టన్ నగరంలో మేయర్ గా పనిచేసిన బిల్‌హాబీచే నడపబడి 1995 లో తనప్రచురణను నిలిపి వేసంది.3,00,000 ప్రతులతో నడపబడుతున్న ఉచిత వారపత్రిక హ్యూస్టన్ ప్రెస్ తరవాతి స్థానంలో ఉంది.

స్థానీయులకు అందుబాటులో ఉన్న మరో వార్తాసంస్థ హ్యూస్టన్ కమ్యూనిటీ న్యూస్ పేపర్స్.ఇది 33 వారపత్రికలను 2 దినపత్రికలను నడుపుతూ స్థానిక ప్రజలకు సేవలందిస్తంది.అల్ప సంఖ్యలలో ఉన్న చిన్న కమ్యూనిటీలకు చెందిన ప్రజలు దీనిద్వారా లబ్ధి పొందుతున్నారు.

అరోగ్య సంరక్షణ సంస్థలు

హ్యూస్టన్ నగరంలో ప్రపంచ ప్రసిద్ధ టెక్సాస్ మెడికల్ సెంటర్ స్థాపించబడింది.ఇది వైద్య పరిశోధనలు ఆరోగ్య పరిరక్షణ సంస్థలకు ప్రధాన కేంద్రం.ఇక్కడ పనిచేస్తున్న 45 సభ్య సంస్థలు ఆదాయం ఎదురు చూడకుండా సేవలందించేవే.ఇవి రోగనివారణ,రోగ ఉపశమనం,పరిశోధన,వైద్య విద్య కాక ప్రాంతీయ దేశీయ మరియూ అంతర్జాతీయ మానవ సుఖజీవితానికి కావలసిన సేవలందిస్తున్నాయి.ఇక్కడ 13 ప్రఖ్యాత వైద్యశాలలు,వైద్య శిక్షణా సంస్థలు,వైద్య కళాశాలలు,నర్స్ శిక్షణా పాఠశాల లు మరియు దంత వైద్య శిక్షణా ఉన్నాయి.ఔషధ తయారీ,ప్రజారోగ్యం మరియు వైద్య సంబంధిత వృత్తులన్నింటా ఇక్కడ శిక్షణ లభిస్తుంది.టెక్సాస్ మెడికల్ సెంటర్‌లో జరిగినన్ని హృదయ శస్త్ర చికిత్సలు ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదు.ఇక్కడ ఉన్న వైద్య సంస్థలు అమెరికాలో ప్రధమ శ్రేణిని సాధించాయి కేన్సర్ చికిత్సలోనూ ప్రత్యేక స్థానాన్ని పొందడం విశేషం.

విద్యా రంగం

హ్యూస్టన్ నగరంలో 55 కంటే అధికం కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలూ,విద్యాసంస్థలు పరిశోధనలను ఇతర అభివృద్ధి పనులను ప్రోత్సహిస్తూ విద్యారంగంలో సేవలందిస్తున్నాయి.టెక్సాస్‌లోనే పరిశోధనలను నిర్వహించడంలో మూడవ స్థానంలో ఉన్న ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయం యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో 40 కంటే అధికంగా పరిశోధనా కేంద్రాలు మరియు విద్యాసంస్థలు ఉన్నాయి.ఇక్కడ 130 దేశాలనుండి వచ్చి ఇక్కడ విద్యనభ్యసిస్తున్న 36,000 మంది విద్యార్ధులు ఉన్నారు.దేశంలో వివిధ విభాగాలతో విద్యనందిస్తున్న విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. హ్యూస్టన్ నగరంలో స్థాపించ బడిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో రైస్ యూనివర్శిటీ కూడా ఒకటి. రైస్ యూనివర్శిటీ ఉన్నతప్రమాణాలతో బోధన మరియు పరిశోధనలను నిర్వహించడంలో అమెరికాలోనే 17వ స్థానంలో ఉన్నవిశ్వవిద్యాలయంగా యు.ఎస్ న్యూస్ ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍అండ్ వరల్డ్ రిపోర్ట్ చే గుర్తించబడింది.నగరంలో ఉన్నత ప్రమాణంలో విద్యనందించే మరియొక విద్యాసంస్థ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్-క్లియర్ లేక్

హ్యూస్టన్ నగరంలో యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్-డౌన్‌టౌన్ మరియు టెక్సాస్ సదరన్ యూనివర్శిటీ వీటితో ప్రైవేట్ సంస్థలచే నిరహింపబడుతున్న యు.ఎస్ న్యూస్ ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍అండ్ వరల్డ్ రిపోర్ట్ చే 2008లో అమెరికాస్ బెస్ట్ కాలేజీ గా గుర్తింపబడిన యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ థామస్ మరియు హ్యూస్టన్ బాప్టిస్ట్ యూనివర్శిటీ లు ఉన్నాయి.అమెరికాలోనే పెద్ద కమ్యూనిటీ కాలేజీల్లో ఒకటిగా దేశంలో నాల్గవ కమ్యూనిటీ కాలేజీగా గుర్తింపు పొందిన హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజ్ సిస్టమ్ నగరంలో అత్యధికులకు విద్యనందిస్తూ సేవచేస్తుంది.
హ్యూస్టన్ నగరంలో ఉన్న రెండు స్కూల్స్‌లో ఒకటియూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్ రెండవది తర్‌గుడ్ మార్షల్ స్కూల్ ఆఫ్ లా .టెక్సాస్‌లో ఉన్న నాలుగు లా స్కూల్స్‌లో రెండు హ్యూస్టన్‌లోనే ఉన్నాయి.2007లో యు.ఎస్ న్యూస్ ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍అండ్ వరల్డ్ రిపోర్ట్ చే అమెరికాలోని 100 ఉత్తమ లా స్కూల్స్‌లో యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్ 60వ స్థానంలో ఉన్నట్లు గుర్తింపు పొందింది.1923లో ప్రైవేట్ సంస్థచే స్థాపించబడిన నగరంలోని పురాతన లా స్కూలైన సౌత్ టెక్సాస్ కాలేజ్ ఆఫ్ లా ప్రయోగాత్మక న్యాయశాస్త్ర కార్యక్రమాలు చేపట్టడంలో ప్రధమ స్థానంలో ఉంది.నగరంలో 17 స్కూల్ డిస్ట్రిక్‌ లు సేవలందిస్తున్నాయి.హ్యూస్టన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ అమెరికాలో 7వస్థానంలో ఉన్న పెద్ద స్కూల్ డిస్ట్రిక్.ఆరోగ్య సంరక్షణకు సంబందించిన వృత్తులకు ప్రత్యేక శిక్షణనందిస్తున్న 112 విభాగాలు ఉన్నాయి.ప్రభుత్వ స్కూల్ డిస్ట్రిక్‌లో చేరని అనేక సేవాసంస్థల నిధులతో నడుస్తున్న ప్రాధమిక పాఠశాలలు నగరంలో సేవలందిస్తున్నాయి.కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కొంత భాగంసేవాసంస్థల నిధులతో నడుస్తున్నాయి.
టెక్సాస్ ప్రైవేట్ స్కూల్ అక్రెడిషన్ చే గుర్తింపు పొందిన 300 ప్రవేట్ స్కూల్స్ నగరంలో ఉన్నాయి.హ్యూస్టన్ ఏరియా ఇండిపెండెంట్ స్కూల్స్ పలు మతాలకు చెందిన వారికి మతాతీతమైన విద్యలను అందిస్తున్నాయి.

గ్రంధాలయాలు

హ్యూస్టన్ నగరం ప్రభుత్వ గ్రంధాలయం పేరు హ్యూస్టన్ పబ్లిక్ లైబ్రెరీ .నగరంలో గ్రంధాలయ వ్యవస్థ 1854 లో హ్యూస్టన్ లైసెమ్ చే స్థాపించబడింది.తరువాతి కాలంలో ఆండ్ర్యూ కార్నెగీ చే అభివృద్ధి చేయబడి ప్రజోపయోగం కొరకు ఈ గ్రంధాలయం హ్యూస్టన్ అండ్ కార్నెగీ పేరుతో 1904లో దానంగా ప్రభుత్వాదీనం చేయబడింది.1926లో గ్రంధాలయానికి నూతన భవనం నిర్మించి దానికి స్థాపకులను గౌరవిస్తూ నామకరణం చేసారు.రెండు ప్రాంతీయ గ్రంధాలయాలతో చేర్చి నగరంలో 36 గ్రంధాలయాలు సేవలందిస్తున్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

డౌన్ టౌన్ సమీపంలో ఉన్న ఇంటర్ స్టేట్ 10 మరియు ఇంటర్‌ స్టేట్45

హ్యూస్టన్ నగరంలో 10 రహదారుల మొత్తం నిడివి 575.5 మైళ్ళు.నగరాంతర్భాగంలో ఉన్న ఇన్టర్ స్టేట్ 610 డౌన్‌టౌన్‌ మరియు పరిసర ప్రాంతాలను కలుపుతూ ఉంటుంది.దీని వ్యాసము షుమారు 10-మైళ్ళు.హ్యూస్టన్ నరాన్ని చుట్టి నగరాన్ని కలుపుతూ ఉన్న బెల్ట్ 8 వ్యాసము 25-మైళ్ళు.

హ్యూస్టన్ ప్రయాణ సౌకర్యాలను నాలుగు ప్రభుత్వరంగ సంస్థల భాగస్వామ్యంతో ట్రాన్ స్టార్ సంస్థ బాద్యత వహిస్తుంది.అత్యవసర సమయాలలో కావలసిన సేవలను ఇవి అందిస్తుంటాయి.అమెరికా లో ఇటువంటి సేవలందిస్తున్న హ్యూస్టన్ ట్రాన్ స్టార్ సంస్థలలో మొదటిది.టెక్సాస్ డిపార్ట్ మెంటాఫ్ ట్రాన్స్‌పోర్టేషన్,హరీస్ కౌన్టీ,మెట్రోపాలిటన్ అధారిటీ ఆఫ్ హరీస్ కౌన్టీ మరియు టెక్సాస్ మొదలైన ప్రభుత్వరంగ సంస్థలను ఒకటిగా చేసి సేవలందిస్థున్న సంస్థలలోనూ మొదటిది.మెట్రోపాలిటన్ అధారిటీ ఆఫ్ హరీస్ కౌన్టీ,టెక్సాస్ లేక మెట్రో బసులు,లైట్ ట్రైన్ మరియు లిఫ్ట్ వాన్లను నడుపుతూ సేవలందిస్తుంది.కానీ ఇవి నగర పరిసరాలంతటికీ సేవలందించడంలో ఇంకా సఫలం కాలేదు.

హ్యూస్టన్ నగరంలో విమానప్రయాణీకులకు సేవలందించడానికి రెండు విమానాశ్రయాలు ఉన్నాయి.వీటి ద్వారా 2007 లో 5.2 కోట్ల మంది ప్రయాణించినట్లు అంచనా.దీనిలో జార్జ్ బుష్ ఇంటర్‌కాటినెంటల్ ఎయిర్‌పోర్ట్ పెద్దది.ఇది అమెరికా లో ప్రయాణీకుల సంఖ్యలో 7వ స్థానంలోనూ అంతర్జాతీయంగా 9వ స్థానంలోనూ ఉంది.బుష్ ఇన్టర్ కాంటినెంటల్ 182 గమ్యాలకు మద్యలో ఆగకుండానేరుగా చేరే సర్వీసులను అందిస్తూ అమెరికాలో 3వ స్థానంలో ఉంది.2006 లోయునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంటాఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ జార్జ్ బుష్ ఇంటర్‌కాటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌ని అమెరికాలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి 10 విమానాశ్రయాలలో ఒకటిగా పేర్కొంది.కాటినెంటల్ ఎయిర్ లైన్స్ ప్రధానకార్యాలయం ఇక్కడ ఉంది.జార్జ్ బుష్ ఇంటర్‌కాటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌ ఎయిర్ లైన్స్ యొక్క ముఖ్య కేంద్రము. ఆ సంస్థకు చెందిన విమానాలు ఇక్కడ నుండి ప్రతిరోజూ 700 బయలుదేరటము విశేషం.జార్జ్ బుష్ ఇంటర్‌కాటినెంటల్ ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ విమాన ప్రయాణీకు కస్టమ్స్ పరిసోధనలను సమర్ధవంతంగా జరపడంలో మార్గదర్శిగా 2007లో ప్రధమ శ్రేణిలో ఉన్నట్లు గుర్తించారు.ది హ్యూస్టన్ ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ జార్జ్ బుష్ ఇంటర్‌కాటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

హ్యూస్టన్‌ నగరంలోరెండవ స్థానంలో ఉన్న విమానాశ్రయము విలియమ్ పి.హాబీ ఎయిర్ పోర్ట్ (1967 వరకూ ఇది హ్యూస్టన్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్‌ గా పిలవబడింది).ఇక్కడ నుండి చిన్న మరియు మద్యతరహా విమానాలను నడుపుతుంటారు.సౌత్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ మరియు జెట్ బ్లూ ఎయిర్ వేస్ హ్యూస్టన్ నగరంలో ఇక్కడ నుండి మాత్రం నడుపుతుంటారు.హ్యూస్టన్ నగరంలో ఉన్న 1940 ఎయిర్ టెర్మినల్ మ్యూజియమ్ నగర వాయుసేన చరిత్రా విశేషాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.ఇది హాబీ ఎయిర్ పోర్ట్‌ కు ఆగ్నేయంలో ఓల్డ్ టెర్మినల్ బిల్డింగులో ఉంది.
ఇవి కాక వాయుసేనకు స్వంతమైన ఎలింటన్ ఫీల్డ్ విమానాశ్రయంలో వాయుసేన,నాసా మరియు ఇతర ప్రభుత్వ కార్య కలాపాలకు, ఉపయోగిస్తుంటారు.

  1. "US Census Bureau Population Finder: Houston city, TX". factfinder.census.gov. Retrieved 2006-02-22.
  2. "Population Estimates for the 25 Largest U.S. Cities based on July 1, 2006 Population Estimates" (PDF). www.census.gov. Retrieved 2007-06-28.
  3. "American FactFinder". United States Census Bureau. Retrieved 2008-01-31.
  4. "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. Retrieved 2008-01-31.