వికీపీడియా:వికీ సంప్రదాయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి {{Wikipedia policies and guidelines}}
చి యంత్రము కలుపుతున్నది: map-bms, als, jv, be, ko, he, bar, ms, id, ml, bn, ja, vi, ia, sk, yi, ru, hy, sr, tr, fy, th, ca, fi, uk, sl, cs, bg, fa, ka, hr, da మార్పులు చేస్తున్నద
పంక్తి 68: పంక్తి 68:
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|వికీ సాంప్రదాయం]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|వికీ సాంప్రదాయం]]
[[వర్గం:వికీపీడియా వివాద పరిష్కారం|వికీ సాంప్రదాయం]]
[[వర్గం:వికీపీడియా వివాద పరిష్కారం|వికీ సాంప్రదాయం]]
[[ml:വിക്കിപീഡിയ:നിയമസംഹിത]]
[[als:Wikipedia:Wikiquette]]
[[ar:ويكيبيديا:قواعد النقاش]]
[[ar:ويكيبيديا:قواعد النقاش]]
[[bar:Wikipedia:Wikiquette]]
[[be:Вікіпедыя:Этыкет]]
[[bg:Уикипедия:Уикиетикет]]
[[bn:উইকিপিডিয়া:শিষ্টাচার]]
[[ca:Viquipèdia:Viquietiqueta]]
[[cs:Wikipedie:Wikietiketa]]
[[da:Wikipedia:Wikikette]]
[[de:Wikipedia:Wikiquette]]
[[de:Wikipedia:Wikiquette]]
[[es:Wikipedia:Wikiqueta]]
[[es:Wikipedia:Etiqueta]]
[[eo:Vikipedio:Vikietiko]]
[[eo:Vikipedio:Etiko de Vikipedio]]
[[fa:ویکی‌پدیا:آداب معاشرت]]
[[fi:Wikipedia:Etiketti]]
[[fr:Wikipédia:Règles de savoir-vivre]]
[[fr:Wikipédia:Règles de savoir-vivre]]
[[fy:Wikipedy:Wikikette]]
[[he:ויקיפדיה:כללי התנהגות בין חברי הקהילה]]
[[hr:Wikipedija:Wikibonton]]
[[hu:Wikipédia:Wikikett]]
[[hu:Wikipédia:Wikikett]]
[[hy:Վիքիփեդիա:Վարվելակարգ]]
[[ia:Wikipedia:Etiquetta]]
[[id:Wikipedia:Etikawiki]]
[[it:Wikipedia:Wikiquette]] [[ja:Wikipedia:ウィキペチケット]]
[[it:Wikipedia:Wikiquette]] [[ja:Wikipedia:ウィキペチケット]]
[[en:Wikipedia:Etiquette]]
[[ka:Wikipedia:ვიკიპედიის ეტიკეტი]]
[[ja:Wikipedia:エチケット]]
[[jv:Wikipedia:Etikawiki]]
[[ka:ვიკიპედია:ეტიკეტი]]
[[ko:위키백과:토론에서 지켜야 할 점]]
[[map-bms:Wikipedia:Etikawiki]]
[[ms:Wikipedia:Etika]]
[[nl:Wikipedia:Wikiquette]]
[[nl:Wikipedia:Wikiquette]]
[[pl:Wikipedia:Wikietykieta]]
[[pl:Wikipedia:Wikietykieta]]
[[pt:Wikipedia:Normas de conduta]]
[[pt:Wikipedia:Normas de conduta]]
[[ro:Wikipedia:Wikiquette]]
[[ro:Wikipedia:Wikiquette]]
[[ru:Википедия:Этикет]]
[[sk:Wikipédia:Wikietiketa]]
[[sl:Wikipedija:Etiketa]]
[[sr:Википедија:Викибонтон]]
[[sv:Wikipedia:Etikett]]
[[sv:Wikipedia:Etikett]]
[[th:วิกิพีเดีย:มารยาทในวิกิพีเดีย]]
[[zh:Wikipedia:维基百科礼仪]]
[[tr:Vikipedi:Görgü kuralları]]
[[uk:Вікіпедія:Етикет]]
[[vi:Wikipedia:Quy tắc ứng xử trên Wikipedia]]
[[yi:װיקיפּעדיע:עטיקעט]]
[[zh:Wikipedia:礼仪]]

15:46, 3 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

అడ్డదారి:
WP:WQT

వికీపీడియా సంపాదకులు అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు చెందినవారు. ప్రతి ఒక్కరికీ విభిన్న ఆలోచనా ధోరణులు, భిన్న అభిప్రాయాలు, దృష్టికోణాలు ఉండవచ్చు. ఇతర సంపాదకులను, సభ్యులను గౌరవించడము, ఆదరించడం, కలసికట్టుగా సమన్వయముగా తెలుగులో ఇలాంటి మహోన్నత విజ్ఞాన సర్వస్వము రూపొందించుటకు ఒక కీలకాంశము.

ఈ పేజీలో కొన్ని వికీ మర్యాద యొక్క కీలకాంశాలు ఇవ్వబడినవి. వికీ మర్యాద (వికీపీడియాలో పనిచేసేటప్పుడు ఇతరులతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు, సలహాలు) ఇంకా మౌలిక నిర్దేశాల కొరకు విధానాలు, మార్గదర్శకాలు పేజీ చూడండి.

మర్యాదకు మూలసూత్రాలు

  • అవతలివారిని విశ్వసించండి. స్వేచ్ఛగా దిద్దుబాటు చెయ్యడమనే సూత్రంపై ఆధారపడి వికీపీడియా పనిచేస్తూంది. ఎవరైనా ఇక్కడకు వచ్చి తమతమ విజ్ఞానాన్ని పంచవచ్చు.
  • ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలనుకుంటారో, మీరు వారితో అలాగే వ్యవహరించండి.
  • దయచేసి మర్యాదగా ఉండండి!
    • ప్రజలు మిమ్మల్ని చూడలేరు, మీ మూడ్ ఎలా ఉందో వారికి తెలియదు. కఠినమైన, పరుషమైన పదజాలం దురుసుగా అనిపిస్తాయి. మీరు ఎంచుకునే పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండండి — ఇతరులు అర్థం చేసుకునేది, మీరు చెప్పదలచుకున్నది కాకపోవచ్చు.
  • చర్చాపేజీల్లో సంతకం చెయ్యండి (వ్యాసాల్లో కాదు!).
  • ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి.
  • విషయంపై వాదించండి, వ్యక్తులపై కాదు.
  • ప్రశ్నల నుండి తప్పుకోకండి.
    • ఇతర సభ్యులు మీ దిద్దుబాటుతో అంగీకరించకపోతే, అది సరైనదని ఎందుకు అనుకుంటున్నారో సకారణంగా వివరించండి.
  • అవతలివారు చెప్పేది సరి అని అనిపిస్తే ఒప్పేసుకోండి; మీ వ్యతిరేకత మీ అభిరుచి ప్రకారమే అయితే అదే విషయాన్ని ఒప్పేసుకోండి.
    • మీరు చెప్పని విషయాలపై ప్రజలు చర్చించుకునేలా చెయ్యకండి.
  • మర్యాదగా ఉండండి.
  • చర్చ మంచి వేడిగా ఉన్నపుడు, అవతలి వారు మీరు ఆశించినంత మర్యాదగా ప్రవర్తించనపుడు, మీరు వారి కంటే ఎక్కువ మర్యాదగా ఉండండి. తక్కువ మర్యాదగా కాదు.
    • ఆ విధంగా ఘర్షణను సృష్టించిన పాపం మీకు చుట్టుకోదు. ఓ దెబ్బ తిన్నాక కూడా ఎదురుదాడి చెయ్యకుండా సంయమనంగా వ్యవహరించినట్లు. చూసేవాళ్ళంతా దీన్ని హర్షిస్తారు. (కనీసం హర్షించాలి).
    • అయితే, వారు మాట్లాడే విధానం మీకు నచ్చలేదని స్పష్టంగా చెప్పండి. లేకపోతే మీరు మరీ తోలుమందం కాబోలని మరింత రెచ్చిపోగలరు వాళ్ళు. మీకు తెలియకుండానే వాళ్ళను ప్రోత్సహించినట్టవుతుంది.
  • మీది తప్పైనపుడు మన్నించమని అడిగేందుకు వెనకాడకండి.
    • "అయ్యో అలా అనకుండా ఉండాల్సింది" అని తరువాత అనుకునే సందర్భాలు చర్చల్లో వస్తాయి. అలా అనిపించినపుడు అదేమాట చెప్పెయ్యండి.
  • మన్నించండి, మరచిపోండి.
  • మీకు ఆప్తమైన విషయాలను గమనింపులో పెట్టుకుని వాటి పట్ల పక్షపాతంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండండి.
  • అభినందాల్సినపుడు అభినందించండి. ప్రతివారూ మెప్పుదలను కోరుకుంటారు. సభ్యుని చర్చాపేజీలో మీ మెప్పుదలను రాయండి.
  • మీరు సృష్టించిన వివాదాలు ముగిసాక, వాటిని తీసెయ్యండి.
  • వాదనలో పాల్గొన్న వారిలో మీరూ ఉంటే, కొన్నాళ్ళు తప్పుకోండి. మీరు మధ్యవర్తిత్వం చేస్తుంటే, తప్పుకొమ్మని వివాదగ్రస్తులకు చెప్పండి.
    • ఓ వారం తరువాత తిరిగి రండి. మధ్యవర్తి కావాలని మీకు అనిపిస్తే, అప్పటికింకా ఎవ్వరూ రంగంలో లేకపోతే, ఎవరో ఒకరిని అడగండి.
    • వివాదాస్పద వ్యాసం నుండి తప్పుకుని మరో వ్యాసంపై పనిచెయ్యండి. వికీపీడియాలో 94,275 వ్యాసాలున్నాయి!
  • ఏది వికీపీడియా కాదో గుర్తుకు తెచ్చుకోండి.
  • సాధ్యమైనంత వరకు పేజీని వెనక్కు తిప్పడాలు, తొలగింపులకు దూరంగా ఉండండి. 3RR నియమాన్ని మరువకండి.

చర్చాపేజీల్లో దుశ్చర్యను నివారించడం ఎలా?

తమ పని పట్ల, తమ దృక్కోణం పట్ల చాలామంది గర్వంగా ఉంటారు. దిద్దుబాట్లు జరిగినపుడు అహాలు దెబ్బతినే అవకాశం ఉంది. కానీ చర్చాపేజీలు ప్రతీకారం తీర్చుకునే వేదికలు కావు. దెబ్బతిన్న అహాలను సమాధాన పరచేందుకు చక్కటి స్థలాలవి. వ్యాసాల విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాల నిర్మూలనా స్థలం ఈ చర్చపేజీలు.

మదిలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు

  • వికీపీడియా వ్యాసాలు అన్ని దృక్కోణాలను చూపించాలి. వివిధ దృక్కోణాల్లో ఏది సరైనది అనే విషయాన్ని చర్చించేందుకు చర్చాపేజీ వేదిక కాదు. ఆ పనికోసం Usenet, బ్లాగు ల వంటి అనేక ఇతర వేదికలున్నాయి. వ్యాసంలోని ఖచ్చితత్వం, తటస్థత మొదలైన విషయాల గురించి మాత్రమే చర్చాపేజీల్లో చర్చించాలి.
  • మీతో ఎవరైనా విభేదిస్తే, దానర్థం (1) మీరంటే వారికిష్టం లేనట్లో, (2) వారు మిమ్మల్ని మూర్ఖుడిగా భావిస్తున్నట్లో, (3) వారు మూర్ఖులైనట్లో, (4) ఆ వ్యక్తి దుష్టుడనో, మరోటో కాదు. వ్యాసాలపై ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాలను వ్యాసం వరకే పరిమితం చెయ్యండి.
  • వికీపీడియా మిమ్మల్ని చొరవగా దిద్దుబాట్లు చెయ్యమంటోంది. చర్చ మొదలుపెట్టే ముందు ఓ ప్రశ్న వేసుకోండి: దీన్ని చర్చించాల్సిన అవసరం ఉందా? ఓ దిద్దుబాటు సారాంశాన్ని రాసి, అవతలి వారి స్పందన కోసం ఎదురు చూడొచ్చా?
  • వ్యాసం పేజీలో చర్చించాల్సిన అవసరం లేనపుడు, ఈమెయిల్లోనో, మీ చర్చాపేజీ లోనో చర్చించవచ్చు.

మర్యాద పూర్వక చర్చపై మరిన్ని చిట్కాలు

  • మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పండి. మరీ ముఖ్యంగా చర్చలో గత వ్యాఖ్యకు సమాధాన మిచ్చేటపుడు
    • గత వ్యాఖ్యను ఉదహరిస్తే మంచిది. మీరా వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకున్నారో రాస్తే మరింత మంచిది. అవతలి వారి అభిప్రాయం తప్పని రాసేటపుడు మీరు వారిని సరిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చని ముందే రాయండి.
  • సభ్యులకు గానీ, వారి దిద్దుబాట్లకు గానీ పేర్లు పెట్టకండి. వారిపై వ్యక్తిగత దాడులు చెయ్యకండి.
    • "పిచ్చి రాతలు", "తప్పుడు రాతలు" వంటి మాటలు రాయకండి. అటువంటి మాటలు అవతలి వారిని బాధిస్తాయి. చర్చ సాఫీగా జరగదు.

మరిన్ని సలహాలు

  • ఇతరులను స్వాగతించండి (పాతవారిని కూడా; వారు మీకు నచ్చకున్నా సరే)
  • స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పండి
  • రెండో చెంప చూపించండి (దిద్దుబాటు యుద్ధాల్లో పాల్గొనకండి)
  • అభినందించండి, ముఖ్యంగా మీకు తెలియనివారిని (ఎక్కువ మంది అభినందనను కోరుకుంటారు)
  • క్షమించండి.