సాల్‌సీడ్ నూనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 95: పంక్తి 95:
|}
|}


===సాల్‌కొవ్వు,డి్‌ఆయిల్డ్‌కేకు ఉత్పత్తి వివరాలు===
===సాల్‌కొవ్వు,డిఆయిల్డ్ కేకు ఉత్పత్తి వివరాలు===


[SEA 38th annual report,2008-2009 ఆధారం]
[SEA 38th annual report,2008-2009 ఆధారం]

12:01, 8 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

సాల్ (Sal) చెట్టు గింజలలోని శాకనూనె/కొవ్వు(vegetable oil/fat) ఆహరయోగ్యం (Edible). గింజలలోని తైలం45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-350C వద్ద గడ్దకట్టును. అందుచే దీనిని సాల్‌ ఫ్యాట్‌ లేదా సాల్‌ బట్టరు అందురు. సాల్ చెట్టు యొక్క వృక్షశాస్రనామం: షోరియ రొబస్టా(Shorea Robusta).యిది డిప్‌టెరొ కార్పెసియె (Diptero carpaceae) కుటుంబానికి చెందినది. ఉత్తర భారతదేశంలో,మరియు హిందిలో సాల్‌, సాల్వా, రాల్, సాఖు, షాల్ అని పిలుస్తారు సంస్కృతంలో 'అశ్వకర్ణ' అని, తెలుగులో సాలువ, సాల్వ అని పిలుస్తారు. సాల్వ వృక్షం బౌద్ధులకు ఎంతో పవిత్రమైనది. బుద్ధుని జననం, మరణం సాల్వ వృక్షం క్రింద జరిగిందని వారి విశ్వాసం.

వునికి,వ్యాప్తి.

ఆసియా దీని జన్మస్దానం. మయన్మారు, బంగ్లాదేశ్‌, నేపాల్‌ మరియు ఇండియాలో వ్యాపించి వున్నవి. ఇండియాలో అస్సాం, బెంగాల్‌, ఒడిస్సా, జార్ఖండ్‌, హర్యానా, మరియు తూర్పు హిమాలయ పాదప్రాంతాలలో వ్యాపించి వున్నది. మధ్యభారతం లోని వింధ్య, సాత్పురా అరణ్యలోయ ప్రాంతాలలో (మధ్య మరియు ఉత్తర ప్రదేశ్), యమున నది తీర ప్రాంతంలలో, తూర్పు కనుమలలో వున్నవి. ఇండియాలో దాదాపు 1.15 లక్షల చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో విస్తరించి వున్నవి. మధ్యప్రదేశ్‌లో 37,700, జార్ఖండ్‌లో 33,500, ఒడిస్సాలో 28,750, ఉత్తరప్రదేశ్‌లో 5,800, బెంగాల్‌లో 5,250, మరియు అస్సాంలో 2,700 ల చదరపుకిలోమీటర్ల మేర సాల్వ వృక్షాలున్నాయి (ఆధారం:SEA news circular,june'99). అయితే ఈ మధ్యకాలంలో కలపకై ఈ చెట్లను అక్రమంగా నరకడం వలన, ఆదేస్ధాయిలో మొక్కలను నాటక పొవడంవలన వీటి విస్తీర్ణం కొంతమేర తగ్గినది.

చెట్టు

సాల్వవృక్షం 30-35 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. బలమైన కాండం, శాఖలు కలిగి వుండును. పెరిగిన చెట్టు కాండం వ్యాసం 1.5-2.0 మీ, వుండును. పెరుగుచున్న చెట్టుబెరడు గోధుమ వఋనంలోవుండి, నిలువుగా చీలికలుండి,4-5సెం,మీ. మందముండును. ఆకులు (పత్రాలు) 15-20 సెం,మీ, వుండును. ఆకులు అండాకారంగా వుండి, ఆకుతొడిమ వద్ద కొద్దిగా వెడల్పుగా వుండును. వర్షపాతం అధికంగా వున్న ప్రాంతాలలొ సతతహరితంగా, లేని ప్రాంతాలలో ఆకురాల్చును. ఆకులను పూర్తిగా రాల్చదు (మోడుగా మారదు). ఫిభ్రవరి-ఏప్రిల్‌ నెలలలో ఆకురాల్చును. ఏప్రిల్‌-మే నెల మొదటి వారంలో చిగుర్చును. చిగిర్చిన వెంటనే పూలు ఏర్పడం మొదలై, జులై నెల చివరికల్ల పళ్లు పక్వానికి వచ్చును. పూలు తెల్లగా వుండును. పండిన కాయ 1-1.5 సెం.మీ. వుండును. లోపలి పిక్క ముదురు గోధుమరంగులో (కాఫీ గింజ రంగులో) వుండును. కాయలో గింజశాతం 47% వుండును. గింజలో 13-14% వరకు సాల్‌ కొవ్వు (sal fat/butter) వుండును. ఒక ఎకరం వీస్తీర్ణంలో వున్న చెట్ల నుండి ఎడాదికి 400 కీజిల వరకు నూనెగింజలను సేకరించె వీలున్నది. కాని ఆ స్ధాయిలో సేకరణ జరగడం లేదు. ఆధిక మొత్తంలో విత్తన సేకరణకై చేసిన ప్రణాళికలు, అంచనాలకై పరిమితమై, అచరణలో వెనుకబడి వున్నారు. ప్రస్తుతం వున్న విస్తీర్ణాన్ని, ఎకరానికి వచ్చు దిగుబడిని లెక్కించిన దాదాపు 5.5 మిలియను టన్నుల నూనె గింజల సేకరణ జరగాలి. సేకరణ అనుకున్నట్లుగా జరిగినచో, గింజలలోని కొవ్వుశాతం 13%గా లెక్కించిన 7.15 లక్షల టన్నుల సాల్‌ కొవ్వు ఉత్పత్తి కావాలి. కాని 1-1.25లక్షల టన్నుల గింజలను మాత్రమే సేకరించగల్గుతున్నారు. అందువలన ఎడాదికి 10-13 వేల టన్నుల సాల్‌ కొవ్వును ఉత్పత్తి చేయగల్గుచున్నారు.

నూనె/కొవ్వు

పాడవ్వని, జాగ్రత్తగా నిల్వవుంచిన గింజల నుండి తీసిన కొవ్వులో ఫ్రీఫ్యాటీ ఆమ్లాల శాతం తక్కువగా (3-5%) వుండి, రిపైన్‌ చెయ్యుటకు అనుకూలంగా వుండును. ఎక్కువ ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం వున్న కొవ్వును స్టియరిక్‌ ఆసిడ్‌, సబ్బులు చెయ్యుటకు వినియోగించెదరు. కొవ్వు పచ్చని ఛాయ వున్నగొధుమరంగులో వుండును. ఒక రకమైన ప్రత్యేక వాసన కల్గివుండును. సాల్‌కొవ్వులోని కొవ్వుఆమ్లాలు, వాటి శాతం ఇంచుమించు కొకొబట్టరు (cocoa butter) లోని కొవ్వు ఆమ్లాలను పోలి వుండటం వలన, దానితో కలిపి లేదా కొకో బట్టరులు ప్రత్నామ్నయంగా చాకొలెట్‌ తయారిలో వుపయోగిస్తారు. సాల్‌ కొవ్వులోని ఒలిక్‌ ఆసిడ్‌,మరియు స్టియరిక్‌ ఆసిడ్‌ శాతం, కొకో బట్టరులోని, ఆ ఆమ్లాల శాతంతో ఇంచిమించు సరిపోతున్నది. సాల్‌ కొవ్వు ధ్రవీభవన ఉష్ణత 35-370C.కొకో బట్టరు ధ్రవీభవన ఉష్ణత 33-350C. వీటి ధ్రవీభవన ఉష్ణత ఎక్కువ వుండటం వలన వేడి వాతవరణంలో కుడా (35-370C) చాకొలెట్‌లు మెత్తబడిపోకుండగా, గట్టిగా వుండును. అందుచే సాల్‌ కొవ్వును కొకో బట్టరులో 20-40% వరకు కలిపెదరు. అయితే కొన్నిరకాల సాల్‌కొవ్వులలో1-1.5% వరకు ఎపొక్సి స్టియరిక్‌ ఆసిడులు వుండు అవకాశం వుంది. అలాంటి కొవ్వులలో వాటి ధ్రవీభవన ఉష్ణత కొద్దిగా తక్కువగా వుండును.

సాల్ కొవ్వుయొక్క ఫ్యాటిఆమ్లాల,భౌతిక లక్షణాలపట్టిక

భౌతిక లక్షణాలు మితి
ఐయోడిన్ విలువ 38-43
సపనిఫికెసను విలువ 185-195
అన్‌సఫొనిపియబుల్ పధార్దం 1.2 గరిష్టం
ద్రవీభవన ఉష్ణత 35-370C
ఫ్యాటి ఆమ్లాలు శాతం
పామిటిక్‌ఆసిడ్ 4.5-5
స్టియరిక్‌ఆసిడ్ 44-45
ఒలిక్‌ఆసిడ్ 42-44
లినొలిక్‌ఆసిడ్ 0.1-0.2
అరచిడిక్ ఆసిడ్ 1.0

సాల్‌కొవ్వు మరియు కొకోబట్టరులకున్న సామీప్యం

భౌతిక లక్షణాలు సాల్ కొవ్వు కొకోబట్టరు
ఐయోడిన్‌విలువ 38-43 33-38
సపొనిఫికెసన్‌విలువ 185-195 185-195
అన్‌సపొనిఫియబుల్‌పధార్ధం 1.2% 1.2%
ద్రవీభవన ఉష్ణొగ్రత 35-370C 33-350C
ఫ్యాటి ఆమ్లాలు%
పామెటిక్‌ఆసిడ్ 4-5 25.2
స్టియరిక్‌ఆసిడ్ 44-45 35-40
ఒలిక్‌ఆసిడ్ 42-44 35-40
లినొలిక్‌ఆసిడ్ 0.1-0.2 2.5-3.0
అరచిడిక్ ఆసిడ్ 1.0 6.3

గింజలనుండి నూనె/కొవ్వును సంగ్రహించు విధానం

సాలువ గింజలలో కొవ్వు/నూనె శాతం 12-14% మాత్రమే వున్నది. అందుచే వీటినుండి నూనె/కొవ్వును కేవలం 'సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్ (Solvent extraction plant) ద్వారానే తీయుటకు సాధ్యం. సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ ప్లాంట్‌ ద్వారా గింజలలోని కొవ్వును 99% వరకు పొందే వీలున్నది. నూనె/కొవ్వు తీసిన డి్‌ఆయిల్డ్‌కేకులో ప్రోటిన్‌ శాతం, మిగతా అయిల్‌ కేకులతో సరిపొల్చిన చాలా తక్కువగా 8-9% మాత్రమే (నూనె తీసిన తవుడులో14-16% వరకు ప్రొటిన్‌ వుండును). మిగతా నూనె కేకులలో ప్రొటిన్ (మాంసకృత్తులు) 30-45% వరకు వుండును. అందుచే అతి తక్కువ మోతాదులో పాలడైరి పశు, మరియు కోళ్లదాణాలో వినియోగిస్తారు. పిండిపధార్ధంను 50-70% కలిగివున్నది. సేంద్రియ ఎరువుగా వాడవచ్చును.

డి్‌ఆయిల్డ్‌కేకు పోషక విలువలు

పోషక పధార్ధం విలువలమితి%
ప్రోటిను 8-9%
పీచుపధార్ధం 4.5-5.0%
పిండిపధార్ధం 55-70%
లైసిన్ 0.42%
మెథియొనిన్ 0.11%
థ్రియొనిన్ 0.42%
మెటబాలిజబుల్‌ఎనర్జి 1483-1803Kcal/Kg

సాల్‌కొవ్వు,డిఆయిల్డ్ కేకు ఉత్పత్తి వివరాలు

[SEA 38th annual report,2008-2009 ఆధారం]

1998-99నుండి2008-09 వరకు (10సం.లు)

మొత్తం పాసెస్‌చేసిన సాల్‌విత్తనాలు :3,34,940 టన్నులు

మొత్తం ఉత్పత్తి అయిన కొవ్వు/నూనె :44,877 టన్నులు,

అందులో

అహరయోగ్యం(edible)........ :30,310టన్నులు.

పారిశ్రామిక వినియోగం(non edible) :14,567టన్నులు.

ఉపయోగాలు

  • చాక్‌లెట్‌ తయారిలో, వనస్పతి తయారిలో సాల్ కొవ్వును వాడెదరు.
  • ఫ్యాటి ఆసిడ్ల తయారిలోకూడా వాడెదరు. కొవ్వును అంశికరన (fractionation) చేసి స్టియరిన్్‌ను తయారుచేయుదరు.
  • డి్‌ఆయిల్డ్‌ కేకును దాణాగా వినియోగిస్తారు.
  • సాల్‌ చెట్టు నుండి కలపను తీసి దూలలు, కిటికి, గుమ్మాల ఫ్రేములు తయారుచేయుదురు. టేకు, దేవదారు తరువాత అంతగా దృడమైనది సాలువ కలప. వాహనాల బాడిలు, బీములు, బళ్ల చక్రాలు తయారుచేయుదురు.
  • పెరుగుచున్న చెట్టు కాండంకు గాటు పెట్టి, రెసిన్ (స్రవం) ను సంగ్రహించెదరు. ఈ రెసిన్‌ ధుపంగా, విరేచనాల నిరోధిగా పనిచేయును. చర్మ వ్యాదుల నివారణ లేపనాలలో రెసిన్ ను వాడెదరు.
  • సాలువ చెట్టు ఆకుల నుండి ఉత్తర భారతంలో చిన్న దొనెలు (కప్పుల వంటివి) డిస్పొజబుల్ పళ్లెలు, చిన్నబుట్టలు చేయుదురు.
  • ఆయుర్వేదంలో సాలువ గింజల పోడిని, ఆకుల చుర్ణంను ఉపయోగిస్తారు