ఆముదము నూనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ==ఆముదపునూనె== ఆముదపు గింజలనుండి తీయునూనె ఖాద్యతైలంకాదు.కాని ప...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఆముదపు నూనె''' ఆముదపు గింజల నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు.కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విసృతంగా కలదు. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియె కుటుంబానికి చెందినది.
==ఆముదపునూనె==
ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్దానం. అముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.

ఆముదపు గింజలనుండి తీయునూనె ఖాద్యతైలంకాదు.కాని పారీశ్రామికరంగంలో దీని వాడకం విసృతంగా కలదు.శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్(Ricinus communis),యుపెర్బెసియె కుటుంబానికి చెందినది.
ఆముదపు మొక్కలనుకేవలం నూనెగింజల ఉత్పత్తికై సాగుచేయుదురు.తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదంమొక్క ఆవిర్భవ స్దానం.అముదపుమొక్క ఏపుగా,ఎత్తుగా పెరగడం వలన ఆముదపుచెట్టు అనికూడా అంటారు.


===ఆముదపుమొక్క===
===ఆముదపుమొక్క===
పంక్తి 86: పంక్తి 84:


|}
|}

[[వర్గం:నూనెలు]]

14:09, 8 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

ఆముదపు నూనె ఆముదపు గింజల నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు.కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విసృతంగా కలదు. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియె కుటుంబానికి చెందినది. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్దానం. అముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.

ఆముదపుమొక్క

ఎక్కువగా ఏక వార్షికంగానే సాగు చేయుదురు.మొక్క2-5 మీ.ఎత్తుపరుగును.కొమ్మలు కలిగి వుండును.మొక్కపెరిగినతరువాత మొక్క కాండంలోపలి భాగం గుల్లగా మారును.హస్తాకారంగా చీలికలున్నఆకులు5-10 అంగుళా లుండును.ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 12.5 లక్షలటన్నుల విత్తానాలు,5.5లక్షలటన్నుల ఆముదంనూనె ఉత్పత్తీగువున్నది.

'ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు:

ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్‌లాండ్‌.ఆముదపుపంట వుత్పత్తిలో ఇండియాది అగ్రస్దానంలో వున్నది.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0లక్షలటన్నులు(3లక్షలన్నుల నూనె).ఆ తురువాతస్దానం చీనా మరియు బ్రెజిల్‌లది.ఇండియాలో ఆముదపు పంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్‌,ఆంద్రప్రదేశ్‌,రాజస్దాన్, కర్నాటక,ఒడిస్సా,తమిళనాడు మరియు మహరాష్ట్రలు.ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్‌,వరంగల్‌, మెదక్‌,నల్గొండ,మహబూబ్‌నగర్‌,గుంటూరు,ప్రకాశం,మరియు రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులో వున్నది.హెక్టరుకు సగటు దిగుబడి విదేశాల పంట దిగుబడికన్న చాలా తక్కువ వున్నది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా,ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడి శాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదంను వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.

కాయ(pod): కాయగోళాకారంగా వుండి,పైనక్రిందనిక్కబడివుండును.నిలువుగా మూడు గదులుగా విభజింపబడివుండి,ప్రతిగదిలోఒక విత్తనం ఎర్పడును.కాయమీదమృదువైన ముళ్ళవంటివి వుండును.కాయలోని విత్తనాలు(seeds) సాగిన అండాకారంగా వుండును.పైన పెలుసుగా వుండెగొధుమవర్ణపు పెంకు(hull)వుండును.పెంకుచారలను కల్గివుండును.పెంకులోపల మెత్తటి గింక/పిక్క(kernel)వుండును,పిక్కరెండు బద్దలను కల్గివుండును.ఈ పిక్కలోనే నూనె వుండును.విత్తనం10-10.5మి .మి. పొడవు,6-7మి.మీవెడల్పు,4.5-5.0మి.మీ.మందం వుండును.

ఆముదపువిత్తనంలోని సమ్మేళన పదార్థాల పట్టిక

పోషక పదార్థములు శాతం
తేమ 6-6.5%
విత్తనంలో గింజ% 64-75%
నూనె% 45-55%
ప్రోటిన్% 17-25%
పేచుపదార్థము% 18-26%
కాల్చినఎర్పడుబూడిద 2-3%


నూనెనుసంగ్రహించుట

విత్తనంలనుండి నూనెను 'ఎక్సుపెల్లరు'లనబడునూనెతీయుయంత్రాలద్వారా తీయుదురు.40-50 సంవత్సరంలక్రితం,ఆముదంను కేశనూనెగా వాడుటకై 'వంటాముదం'పేరుతో నూనెను ప్రత్యేకంగా చేసెవారు.ఆముదంగింజలకు కొద్దిగానీరును కలిపి మెత్తగా దంచి,ఇకపెద్దపాత్రలోవేసి,తగినంతగా నీరుచేసిబాగా వేడిచేయుదురు,వేడికి నీటిపైభాగంలో ఆముదంచేరును.ఆలాపైకితేరిన నూనెను వేరేపాత్రలో వేసి,తేర్చెవారు.విత్తనంపై పెంకును తొలగించిలేదా,విత్తానాన్ని యదావిధిగా యంత్రాలలో ఆడించి నూనెను తీయుదురు.కేకులో వుండిపోయిన నూనెను సాల్వెంట్‌ప్లాంట్‌ ద్వారా తీయుదురు.

నూనె

ఆముదపునూనె లేతపసుపు రంగులో వుండును.ఒకరకమైన ప్రత్యేకమైన వాసన వుండి,'ఆముదపువాసన'అనే జననానుడి వచ్చినది.ఆముదంలో వున్నకొవ్వుఆమ్లాలలో 75-85% వరకు రిసినొలిక్‌కొవ్వు ఆమ్లమున్నది.ఈ కొవ్వు ఆమ్లం ఒలిక్‌ఆసిడ్‌వలె ఎకద్విబంధంను 9-వకార్బను వద్దకల్గివుండి,18కార్బనులను కల్గివున్నప్పటికి,12-వకార్బను వద్ద అదనంగా ఒక హైడ్రొక్షిల్(OH)ను కలిగివుండటం వలన దానిభౌతిక,రసాయనిక ధర్మాలలో వత్యాసం వచ్చినది.రిసినొలిక్‌ఆసిడ్‌జీవవిషగుణం(toxic)మనుషులమీదచూపించును.తక్కువమోతాదులో రిసినొలిక్‌ఆసిడ్‌ను ఆహారంగా తీసుకున్న జీర్ణవ్యవస్ద మీద ప్రతికూల ప్రభావంచూపించి,విరోచనాలు కల్గును.ఎక్కువ ప్రామాణంలోతీసుకున్నదేహంలో నిర్జలీకరణ్ జరిగి సృహతప్పె ప్రమాదముంది.విరేచనాలకై పిల్లలకు ఆముదంను త్రాగించడం ప్రమాదకరం.శాకతైలంలలో ఎక్కువ సాంద్రత,స్నిగ్థత వున్ననూనె ఆముదం.అముదంను పలుపారీశ్రామిక ఉత్పత్తులలో విరివిగా వుపయోగిస్తున్నారు.

ఆముదం భౌతిక,రసాయనిక గుణాలపట్టిక

సాంద్రత.20/250C 0.957-0.962
వక్రీభవనగుణకంnD 1.476-1.479
ఐయోడిను విలువ 82-88
సపోనిఫికెసను విలువ 175-187
హైడ్రొక్షిల్‌విలువ 160-168
స్నిగ్థత.250C 6.3-8.8 St
అన్‌సపొనిఫియబుల్‌మేటరు 0.3-0.
వెలుగు(flash) ఉష్ణోగ్రత 229.40C
స్వీయదహన ఉష్ణొగ్రత 448.90C

ఆముదంలోని కొవ్వుఆమ్లాలశాతం

ఫ్యాటి ఆమ్లం శాతం%
రిసినొలిక్‌ఆశిడ్ 80-90
ఒలిక్‌ఆసిడ్ 2-6
లినొలిక్‌ఆసిడ్ 1-5
లినొలెనిక్‌ఆసిడ్ 0.5-1.0
స్టియరిక్‌ఆసిడ్ 0.5-1.0
పామిటిక్‌ఆసిడ్ 0.5-1.0
డై హైడ్రొక్షి స్టియరిక్‌ఆసిడ్ 0.3-0.5