వికీపీడియా:వివాద పరిష్కారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: am:ውክፔዲያ:Resolving disputes
చి యంత్రము కలుపుతున్నది: he:ויקיפדיה:מנגנונים ליישוב מחלוקת
పంక్తి 54: పంక్తి 54:
[[fr:Wikipédia:Résolution de conflit]]
[[fr:Wikipédia:Résolution de conflit]]
[[gl:Wikipedia:Votacións/Como resolver disputas]]
[[gl:Wikipedia:Votacións/Como resolver disputas]]
[[he:ויקיפדיה:מנגנונים ליישוב מחלוקת]]
[[hr:Wikipedija:Rješavanje prijepora]]
[[hr:Wikipedija:Rješavanje prijepora]]
[[hu:Wikipédia:Vitarendezés]]
[[hu:Wikipédia:Vitarendezés]]

09:42, 24 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

వికీపీడియా ఓ సముదాయం. ఈ విజ్ఞాన సర్వస్వం రాయడంలో అందరూ కలిసి పనిచెయ్యాలి. వ్యాసాల్లో ఏకకాలంలో ఒకరి కంటే ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు. అంచేత, వ్యాసం ఎలా రాయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చు. అలాంటపుడు సంధి పాటించి, విషయం పరిష్కారమయ్యేంతవరకు దిద్దుబాట్లు ఆపండి. దిద్దుబాటు యుద్ధాల్లోకి దిగకండి; దీని వలన సమస్య పరిష్కారం కాదు సరిగదా, వికీపీడియా మెరుగుదలకు లేశమాత్రమూ ఉపయోగపడదు. దాని బదులు, కింద చూపిన మార్గాల్లో సమస్య పరిష్కారానికి కృషి చెయ్యండి.

గమనిక: ఇక్కడ వివరించిన పద్ధతులు రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారాల కోసం రూపొందించబడ్డాయి. దుశ్చర్య, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలను పదేపదే అతిక్రమించిన సందర్భాల్లో సభ్యుని నిరోధించడం లేదా నిషేధించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. చాలా సందర్భాల్లో వ్యక్తుల దుష్ప్రవర్తనను కింద చూపిన మార్గాల ద్వారా పరిష్కరించవచ్చు. దుష్ప్రవర్తనను ఎత్తిచూపేవారు వివాదంలో భాగంగా ఉండనవసరం లేదు.

వివాదం రాకుండా చూడండి

వివాద పరిష్కారానికి ఉత్తమ మార్గం, అసలు వివాదం తలెత్తకుండా చూడడమే. ఇతరులను, వారి అభిప్రాయాలను గౌరవించండి. అంటే, ముఖ్యంగా వివాదంలో ఉన్న పేజీలో మార్పుచేర్పులను వెనక్కు తీసుకెళ్ళకండి. ఏదైనా దిద్దుబాటు పక్షపాతంగానో, అనుచితంగానో ఉందని మీకు అనిపిస్తే, దాన్ని మెరుగు పరచండి; వెనక్కి తీసుకుపోవద్దు. ఇతర సభ్యులు అభ్యంతరం చెబుతారనుకున్న దిద్దుబాట్లకు సముచితమైన దిద్దుబాటు సారాంశాన్ని రాయండి. వెంటవెంటనే మూడు కంటే ఎక్కువ సార్లు వెనక్కి తీసుకుపోరాదనే నియమాన్ని పాటించండి. దీన్నే 3RR నియమం అనిఅంటారు. అనుచితమైన ప్రవర్తనను గమనించినపుడు మీరూ అదే పద్ధతిలో స్పందించకండి.

3RR నియమం: 24 గంటల్లో ఒకే పేజీలో మూడు కంటే ఎక్కువ సార్లు దిద్దుబాట్లను వెనక్కి తీసుకుపోరాదు. వెనక్కి తీసుకుపోవడమంటే, ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్లను రద్దు చెయ్యడం. ప్రతీ సారీ రద్దు చేసినది వ్యాసంలోని అదే భాగం కానక్కరలేదు.

మరిన్ని వివరాల కోసం చూడండి: వికీపీడియా:3RR నియమం

మొదటి చర్య: వివాదంలోని ఇతర పార్టీలతో మాట్లాడండి

పరిష్కార మార్గంలో మొదటి ప్రయత్నంగా, వివాదాస్పద విషయం గురించి ఏదైనా చర్చాపేజీ లో చర్చించండి. అవతలి పార్టీ యొక్క చర్చాపేజీలోగానీ, వివాదాస్పదమైన వ్యాసపు చర్చాపేజీలో గానీ చర్చించవచ్చు. వ్యాసం పేజీలో మాత్రం వివాదాన్ని కొనసాగించకండి. చర్చలో ప్రశాంతంగా ఉండండి, వ్యక్తిగత నిందలు చెయ్యకండి. అవతలి వ్యక్తి ఆలోచనలను కూడా పరిగణించి ఓ అంగీకారానికి రండి. అవతలి వ్యక్తి కూడా నిజాయితీగా ఉన్నారని భావించండి; తద్విరుద్ధంగా బలమైన ఋజువులుంటే తప్ప.

ఏదో చర్చించామన్న పేరు కోసమన్నట్లు చర్చించకండి. నిబద్ధతతో చెయ్యని చర్చ, వివాద పరిష్కారం కోసం కాక, వివాదాన్ని ఇంకా పెంచేందుకు చేసినట్లుగా కనిపిస్తుంది. అలా చేస్తే, వివాదం తరువాతి స్థాయికి వెళ్ళినపుడు పరిష్కర్తలు మీ వాదన పట్ల అంత సానుభూతితో ఉండకపోవచ్చు. నిజాయితీతో కూడిన చర్చ, వెంటనే ఫలితాన్ని ఇవ్వకున్నా, పరిష్కారం కనుగొనడం పట్ల మీ నిబద్ధతను తెలియజేస్తుంది. ఇది వికీపీడియా విధానానికి అనుగుణమైనది.

తదుపరి చర్యలు

చర్చలు విఫలమైన పక్షంలో కింది నాలు గు పద్ధతులను వాడి వివాద పరిష్కారానికి ప్రయత్నించాలి. ఏ పద్ధతిని పాటిస్తారు, ఏ వరుసలో పాటిస్తారు అనేది వివాదంలో ఇరుక్కున్న పక్షాల ఇష్టం.

మూడో పక్షంతో చర్చించండి

  • వికీపీడియా విస్తృతాభిప్రాయాన్ని నెలకొల్పడం ద్వారా పనిచేస్తుంది. విస్తృతాభిప్రాయాన్ని రూపొందించేందుకు మరింత మంది ప్రేక్షకులు రంగంలోకి రావాలి.

వివాదం ఏదైనా వ్యాసం విషయంలో నైతే, ఇప్పటికే మీరు సంధికి అంగీకరించి ఉండకపోతే ఇప్పుడు అంగీకరించాలి. దాని వలన వ్యాసంలో దిద్దుబాట్లు ఆగిపోయి, పరిష్కర్తలకు విషయాన్ని పరిశీలించడానికి వీలు కలుగుతుంది. దిద్దుబాటు యుద్ధం కొనసాగుతూనే ఉంటే ఆ వ్యాసం పేజీని సంరక్షించమని అడగండి.

వికీపీడియా:సంరక్షణ విధానం చూడండి.

సర్వే చెయ్యండి

  • విస్తృతాభిప్రాయం కష్టసాధ్యమైనపుడు, లేదా కొందరు సభ్యులు దాన్ని పట్టించుకోనపుడు, బహిరంగ సర్వే జరపండి. సర్వే మార్గదర్శకాల కొరకు ఇంగ్లీషు వికీలోని en:Wikipedia:Survey guidelines పేజీ చూడండి. (సర్వే సరిగ్గా జరక్కపోతే కొన్ని పార్టీలు దాని ఫలితాలను తోసిరాజనవచ్చు.) వివాదంలోని అన్ని కోణాలను సర్వే ప్రతిబింబించాలి. సర్వే ప్రశ్నలు తయారయ్యాక, సర్వేను వికీపీడియా:ప్రస్తుత సర్వేలు పేజీలో పెట్టండి. సరిపడినంత మంది జనం ఉంటే మూజువాణీ సర్వే లాంటిది పెట్టొచ్చు. కానీ సర్వేకు బాగా ప్రచారం కల్పిస్తే సర్వేలో మరింత మంది పాల్గొంటారు. దాని వలన సర్వే ఫలితానికి మరింత విలువ చేకూరుతుంది.

మధ్యవర్తిత్వం

  • వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం కావాలని అడగండి. వివాద పరిష్కారం కోసం మూడో వ్యక్తి స్వచ్ఛందంగా పాల్గొనడమే మధ్యవర్తిత్వం. మధ్యవర్తి అన్ని పక్షాలతో మాట్లాడి సామరస్యక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. మధ్యవర్తి కోసం అడిగే ముందు పైన చూపిన మార్గాల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించామని చూపాలి.

సలహాదారు కోసం అడగండి

  • సలహాదారు సాయం ఎప్పుడైనా తీసుకోవచ్చు. వివాదం ముదిరిన తరుణంలో సభ్య సలహాదారు సాయం తీసుకునే విషయం గట్టిగా ఆలోచించండి. సలహాదార్లు ఒక పక్షానికే సలహాలిస్తారు.వివాదపు ఏ స్థాయిలోనైనా సలహాదారు సాయం తీసుకోవచ్చు.

చివరి అంకం: పంచాయితీ

వివాద పరిష్కారానికి అన్ని ప్రయత్నాలూ అయిపోతే, ఇక మిగిలింది పంచాయితీయే. అన్ని ప్రయత్నాలూ చేసానని నిరూపించేందుకు సిద్ధంగా ఉండండి. మధ్యవర్తిత్వానికి పంచాయితీకి ఉన్న ప్రధానమైన తేడా.. పంచాయితీ మధ్యవర్తిత్వం లాగా ఆన్ని పక్షాలు ఒక అంగీకారానికి వచ్చేందుకు కృషి చెయ్యదు; వివాదాన్ని పరిశీలించి, ఒక నిర్ణయాన్ని ఇచ్చేస్తుంది. అన్ని పక్షాలూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. వివాదంలో తీవ్ర దుష్ప్రవర్తన కూడా ఉంటే, పంచాయితీలో చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరిన్ని వివరాలకు ఇంగ్లీషు వికీపీడియాలోని పంచాయితీ విధానం (ఈ లింకు ఎన్వికీకి పోతుంది) చూడండి.