కిక్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
production_company = [[ఆర్ ఆర్ మూవీ మేకర్స్]]|
production_company = [[ఆర్ ఆర్ మూవీ మేకర్స్]]|
producer = వెంకట్|
producer = వెంకట్|
starring = [[రవితేజ]],
[[ఇలియానా]],
[[శాయాజీ షిండే]],
[[ప్రభ]],
[[బ్రహ్మానందం]],
[[వేణుమాధవ్]],
[[ఆలీ]],
[[కోట శ్రీనివాసరావు]],
[[బెనర్జీ]],
[[దువ్వాసి మోహన్]]|
starring = [[రవితేజ]],
[[ఇలియానా]],
[[జయప్రకాశ్ రెడ్డి]]
[[శాయాజీ షిండే]],
[[ప్రభ]],
[[బ్రహ్మానందం]],
[[వేణుమాధవ్]],
[[ఆలీ]],
[[కోట శ్రీనివాసరావు]],
[[బెనర్జీ]],
[[దువ్వాసి మోహన్]]|
music = యస్.యస్ థామన్|
music = యస్.యస్ థామన్|
lyrics = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]|
lyrics = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]|

06:59, 28 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

కిక్
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేందర్ రెడ్డి
నిర్మాణం వెంకట్
కథ వక్కంతం వంశీ
చిత్రానువాదం సురేందర్ రెడ్డి
తారాగణం రవితేజ,
ఇలియానా,
జయప్రకాశ్ రెడ్డి
శాయాజీ షిండే,
ప్రభ,
బ్రహ్మానందం,
వేణుమాధవ్,
ఆలీ,
కోట శ్రీనివాసరావు,
బెనర్జీ,
దువ్వాసి మోహన్
సంగీతం యస్.యస్ థామన్
నృత్యాలు రాజు సుందరం, కళ్యాణ్, కృష్ణారెడ్డి
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు అబ్బూరి రవి
ఛాయాగ్రహణం రసూల్ ఎల్లోర్
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ ఆర్ ఆర్ మూవీ మేకర్స్
భాష తెలుగు

కిక్ రవితేజ కథానాయకుడిగా 2009 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇలియానా ఇందులో కథానాయిక.

కథ

మలేషియా బ్యాక్‌డ్రాప్ లో కథ మొదలవుతుంది. నైనా (ఇలియానా) ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన కళ్యాణ్ కృష్ణ (శ్యామ్-తొలిపరిచయం) పెళ్ళి చూపుల పేరుతో కలుస్తుంది. వారిద్దరికీ ఇంచుమించు సంబంధం కుదురుతుంది. ఇద్దరూ పరిచయం చేసుకునేటప్పుడు అతని పేరులోని కళ్యాణ్ అనే పదాన్ని విని అతనికి తన గతాన్ని గురించి తెలియ జేస్తుంది. ఆమెకు పరిచయమైన కళ్యాణ్ గురించి చెబుతుంది. కళ్యాణ్ (రవితేజ) బాగా చదువుకున్న కుర్రాడు. తెలివైన వాడు. ఏ ఒక్క ఉద్యోగంలోనూ కొద్ది రోజులు కూడా పనిచేయడు. చేసే ప్రతి పనిలోనూ కిక్ ఉండాలని కోరుకుంటుంటాడు.

నిజానికి కళ్యాణ్ ఒక దొంగ. అయితే అతను ఎందుకు దొంగగా మారాడనే దాని వెనుక ఒక ఉదాత్తమైన సంఘటన ఉంటుంది. ఒక చిన్న పాపకు ప్రాణాంతకమైన జబ్బు చేయడంతో ఆ పాప తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రయత్నించి ఆమెకు ఆపరేషన్ చేయించలేక, పాప చావును చూడలేమంటూ ఉత్తరం రాసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ సంఘటన కళ్ళారా చూసిన రవితేజ చలించిపోయి ఆ పాపను బ్రతికించడానికి తనకున్న ఆస్థులను తెగనమ్మి ఆపరేషన్ చేయిస్తాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆమె కళ్ళలో ఆనందం చూసి ఆమెలాంటి మరెందరో పిల్లలకు వైద్యం చేయించడానికి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ దొంగతనాలు మాత్రం అన్యాయాలు, అక్రమాలు చేసి కోట్లు గడించిన ప్రముఖుల ఇళ్ళలోనే చేస్తుంటాడు.