పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
36 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
ఉపప్లావ్యము నుండి అర్జునుడు శ్రీ కృష్ణుని సాయం కోరడానికి ద్వారకకు బయలుదేరతాడు. కాస్త ముందుగా దుర్యోధనుడు హస్తినా పురం నుండి శ్రీ కృష్ణుని సాయం కోరి వస్తాడు. శ్రీ కృష్ణుడు పగటి నిద్ర నటిస్తాడు. శ్రీ కృష్ణుని తల వైపు ఒక ఆసనము, కాళ్ల దగ్గర ఒక ఆసనము ఉంటాయి. ముందుగా వచ్చిన దుర్యోధనుడు తలపైపు ఉన్న ఆసనం పైన కూర్చోగా, అర్జునుడు శ్రీ కృష్ణుని కాళ్ల దగ్గర నిలుచుంటాడు. శ్రీకృష్ణడు నిద్ర లేచి అర్జునుని ముందు చూసి, పిమ్మట దుర్యోధనుని చూస్తాడు. దుర్యోధనుడు కౌరవులకు పాండవులకు యుధ్దము రానున్నదని శ్రీకృష్ణుని సాయము కోరి వచ్చామని తెలియ చేస్తాడు.. శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి తానొక్కడు ఒక వైపూ, మిగిలిన సైన్యమంతా ఒక వైవు అనీ, తాను యుద్దము చే.యనని, తోచిన సాయం చేస్తానంటాడు. ముందుగా అర్జునుని చూసాడు కాబట్టి ముందు అర్జునుడు కోరుకోవాలని అంటాడు. దుర్యోధనుడు, శ్రీ కృష్ణుడు తన సైన్యాన్నంతా అర్జునునికి ఇవ్వడానికి ఈ ఎత్తు ఎత్తాడని అనుకుంటాడు. అర్జునుడు సైన్యాన్ని కోరుకుంటాడేమోనని భయపడతాడు. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుడు మాత్రం తమతో ఉంటే చాలని కోరుకుంటాడు. దుర్యోధనుడు పరిశేష న్యాయముద్వారా మిగిలిన సేనని తాను తీసుకుంటానని ఆనందిస్తూ వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు, అర్జునుని పరీక్షించడానికి "ఎంత పని చేసావు బావా - సేన అంతా దుర్యోధనుడు తీసుకున్నాడనగా అర్జునుడు "నీవు యుధ్దము చేయవద్దు. నా రధము మీద ఉండమ"ని కోరగా శ్రీకృష్ణుడు "విజయ సారధి, పార్ధ సారధి పేర్లతో నేను నీ రధము మీద ఉంటాన"ని అభయ మిస్తాడు.
 
==== ద్వితీయాంకం (ఉపప్లావ్యము సీను) ====
 
శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా హస్తినపురానికి బయలు దేరుతూ పాండవుల అభిప్రాయాల్ని తెలుసుకునే క్రమంలో ముందు ధర్మరాజు నుద్దేశించి అతని మనసులో మాట చెప్పమని అది తనకు మించిన పనైనా చేస్తానంటాడు. ధర్మరాజు సంధి కోరగా ద్రౌపది, ధర్మరాజు వైఖరిని ఈసడిస్తుంది. భీముడు ఇంతకూ సంధి ఏమని అడిగితే ద్రౌపది ఐదూళ్లు ఇచ్చిన చాలని అంటుంది. మంత్రానికి కట్టుబడ్డ పాముకి మల్లే ఉండిపోయానని అనుకుంటూ ఇంతలోనే సంధి కుదిరినా కౌరవులను మట్టుపెడతానని భీముడునగా ద్రౌపది భీముని వాక్శూరుడని నిందిస్తుంది. ధర్మరాజు వారిద్దరినీ శాంతింప చేస్తాడు. సంధి మాట ఎటులైనా శతృరాజుల బలాన్ని చూడవచ్చని,అందుకైనా హస్తినకు వెళ్లాలని శ్రీకృష్ణుడు అనగా భీముడు ధర్మరాజు సంధి కోరమనగా శ్రీ కృష్ణుని వైఖరి మరో విధంగా ఉందంటే ఇవి భీముని మాటలేనా అని భీముడు యుధ్దానికి బెదురుతున్నాడంటే శ్రీకృష్ణుని నిందిస్తాడు భీముడు. తమ్ములు భీముని శాంతింప చేయబోతే ఖేదపడి గదతో మోదుకోపోతే ధర్మజుడు అడ్డుకొని ఇదంతా తనవలనే్ అని ఖిన్నుడవుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు నోదార్చి వచ్చు సంగరంలో భీముడే ప్రధాన పాత్ర వహించాలని బాల్యం నుండి అనేక విధాలుగా బాధించిన వారితో సంధికి ఎలా ఒడంబడుతున్నావని ఆశ్చర్యపడి అడిగితే అన్న గారి మాటమీద ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ద్రిగమింగి, అరణ్యవాసం చేసి అజ్ఞాత వాసంలో దాస్యం చేసిన విధంగా సంధికి ఒడంబడుతున్నానని చెబుతాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకొనగా ద్రౌపది తన పరాభవాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆమె మనసు తనకు తెలుసని యుద్ధము తప్పదని ,ద్రౌపది ప్రతిన నెరవేరుతుందని తెలుపుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడు ఏది తలచితే అది అవుతుందని, ఇద్దరూ కావలసిన వారేనని అతని ఇష్టప్రకారం జరుగనిమ్మని అంటాడు. .
1,147

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/653942" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ