జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పుట్టిన తేదీ మార్పు - జయదేవ్ గారి పంపిన మెయిలు ప్రకారం
పంక్తి 8: పంక్తి 8:
| caption = '''జయదేవ్'''
| caption = '''జయదేవ్'''
| birth_name = సజ్జా జయదేవ్ బాబు
| birth_name = సజ్జా జయదేవ్ బాబు
| birth_date = [[అక్టోబరు 9]], [[1940]]
| birth_date = [[సెప్టెంబరు 13]], [[1940]]
| birth_place = [[కడప]] జిల్లా, [[కడప]]
| birth_place = [[కడప]] జిల్లా, [[కడప]]
| native_place = [[కడప]]
| native_place = [[కడప]]

20:49, 20 అక్టోబరు 2011 నాటి కూర్పు

సజ్జా జయదేవ్ బాబు
జయదేవ్
జననంసజ్జా జయదేవ్ బాబు
సెప్టెంబరు 13, 1940
కడప జిల్లా, కడప
నివాస ప్రాంతంమద్రాసు (చెన్నై)
ఇతర పేర్లుజయదేవ్
వృత్తిఆచార్యుడు, వ్యంగ్య చిత్రకారుడు
ఉద్యోగంసర్ త్యాగరాయ కాలేజీ
పదవి పేరుఆచార్యుడు
భార్య / భర్తరాజలక్ష్మి
పిల్లలుశ్రీమతులు శారద, పద్మజ, కాంచన, ప్రసూన
తండ్రిసజ్జా ముత్యాలు
తల్లిసజ్జా నవనీతమ్మ
సంతకం
వెబ్‌సైటు
http://www.jayadevcartoon.com
జయదేవ్ కార్టూన్ల సంపుటి

జయదేవ్ (Jayadev) ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 అక్టోబర్ 9న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు. ఈయన తన బాల్యం లో ఎక్కువ భాగం మదరాసు లోని పాత చాకలి పేటలో గడిపాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీ లో 1997 వరకు బోధించాడు.

ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో 1959లో మొదలు పెట్టి, తెలుగులో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించాడు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా యువ దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. 2002 వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి.

కార్టూనిస్ట్ అయిన విధం

జయదేవ్ చిన్నతనంలో చదువు మొదలు పెట్టినప్పుడు పడిన పునాది చేతి వ్రాత గుడ్రంగా వ్రాసేవాడు. 6వ 7వ తరగతులు చదువుతున్నప్పుడు డ్రాయింగ్ మాష్టారి దగ్గర పెన్సిల్ తో బొమ్మలు గీయటం నేర్చుకున్నాడు. 9వ తరగతిలో తరగతి పత్రిక (Class Magazine)కు ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ (Wordsworth) పద్యానికి బొమ్మ గీసి మెప్పు సంపాయించాడు. 1957లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, బయాలజీ ప్రొఫెసర్ వ్రాయబోతున్న పుస్తకానికి బొమ్మలు వేయటంకోసం, పెన్సిల్ తో కాకుండా, ఇండియన్ ఇంక్ తో, బ్రిస్టల్ బోర్డు పేపరు మీద, సన్నటి క్రోక్విల్ పాళీతో బొమ్మలు వెయ్యటం నేర్చుకున్నాడు. 1959లో మొదటి కార్టూన్ ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది.

జయదేవ్ మొదటి కార్టూన్

జయదేవ్ మొదటి కార్టూన్ను ఆంధ్ర పత్రిక 1959లో ప్రచురించింది. కాని ఆ మొదటి కార్టూన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చివరికి, వేసిన జయదేవ్ దగ్గరకూడ లేదట. కాని వారు చెప్పిన ప్రకారం, ఆ మొదటి కార్టూన్ నిశ్శబ్ద వ్యంగ్యచిత్రమే. అందులో రెండు బొమ్మలు. మొదటి బొమ్మలో దొంగను తరుముతున్న పోలీస్. రెండో బొమ్మలో పోలీస్ దొంగ జుట్టుపట్టుకునేప్పటికి, ఆ దొంగ పెట్టుకున్న పెట్టుడు జుట్టు(విగ్) పోలీస్ చేతిలోకి ఊడొచ్చి, వాడు పారిపోవటం! తన మొదటి కార్టూన్ తనదగ్గరే లేదని బాధపడుతుంటారు జయదేవ్.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు

రాజకీయనాయకులు రోడ్‌షోల పేరిట జరుపుతున్న హడావిడి చూసి, వికీపీడియాకోసం ప్రత్యేకంగా వేసిన వ్యంగ్య చిత్రం

బాపు తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకడు. (బాబు-కొలను వెంకట దుర్గా ప్రసాద్ మరొకరు). చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. ఇతడు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్.


నేపాళం, భూపాళం, (తాగుబోతు) బ్రహ్మం, మిస్టర్ నో, బాబాయ్-అబ్బాయ్ వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించారు జయదేవ్.

మైలు రాళ్ళు

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలో మొదటి బహుమతి
  • 1991: ఊర్కహోన్డె ఛార్టర్, న్నొకి-హైస్ట్, బెల్జియం-గౌరవ ప్రస్తావన (Honourable Mention)
  • 1992: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి (Work of Special Merit Prize)
  • 1993: భారత ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ అవగాహన పోటీలో ప్రధమ బహుమతి (First Prize, Care for the Enivironment Cartoon Contest, Government of India)
  • 1994: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి (Work of Special Merit Prize)
  • 1995: అంతర్జాతీయ సందేశాత్మక కార్టూన్ ఫెస్టా, 1994, మియాగవ, జపాన్- కంపెనీ సౌజన్య బహుమతి (Company Sponsored Award)
  • 1996: 25వ అంతర్జాతీయ కార్టూన్ ఫెస్టివల్ లో జూరీ సభ్యునిగా నియామకం (Nominated as Member of International Jury for the 25th International Cartoon Festival)
  • 1997-2000: వ్యవస్థాపక ప్రిన్సిపాల్, హార్ట్ ఏనిమేషన్ ఎకాడమీ,హైదరాబాదు. పూర్తి పాఠ్యాంశ నిర్ణయం అమెరికన్ నిపుణులతో కలసి
  • 2002: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఎకాడమీ మరియు రాజకీయ వ్యంగ చిత్రకారుల ఫోరం వారి సన్మానం


ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు జయదేవ్ సూచనలు

  • ఐడియాలు మెదడులో ఫ్లాష్ ఔతాయి. కార్టూనిస్ట్ ఆవిధంగా ఫ్లాష్ ఐన ఐడియాలను ఒక పాకెట్ నోట్ బుక్ లో, నోట్ చేసి పెట్టుకోవాలి.[1]
  • మన కార్టూన్ ఐడియాలు మన దేశవాతావరణఅనికి అనుగుణంగా ఉండాలి.
  • నోట్ బుక్కూ పెన్సిలూ రెడీగా పెట్టుకోవాలి.
  • రఫ్ గా బొమ్మ వేసి, ఐడియాకు సరిపడా వ్యాఖ్య రాసేయాలి.
  • కార్టూన్లు గీయడానికి ఉపక్రమించే ముందు, ఈ పాకెట్ నోట్ బుక్ చాలా ఉపయోగపడుతుంది.
  • కార్టూన్ అనుకున్నప్పుడు సీన్ ను చిత్రించడమే కాకుండా క్యారక్టర్స్ కు సంబంధించిన ఎక్సప్రెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.
  • మాట్లాడే క్యారక్టరు నోరు తెరిచి ఉండాలి. ఆవతలి క్యారక్టర్ ఎక్సప్రెషన్ ను సూచించేలా ఉండాలి.
  • క్యారక్టర్స్ చిత్రీకరణ అయ్యాక బాక్ గ్రౌండును క్రియేట్ చేయాలి. బాక్ గ్రౌండ్ లొకేషన్ ను సూచించాలి.
  • ముఖ్యమైన అంశాలుంటే చాలు. అనవసరమైన డీటైల్సుతో బాక్ గ్రౌండు, క్యారక్టర్లను డామినేట్ చేయకుండా జాగ్రత్తపడాలి.
  • కార్టూన్ గీశాక ముందస్తుగా ఇంట్లో వాళ్ళకీ, స్నేహితులకి చూపించాలి. వాళ్ళి మెచ్చుకుంటే తప్పకుండా పత్రికల ఎడిటర్లు ఆ కార్టూన్ కు పాస్ మార్కులిచ్చినట్లే.
  • ఓపిక అలవరుచుకోండి. అలోచించండి. హాయిగా సరదాగా నోరువిప్పి మాట్లాడండి. ఇతరుల మాటలను వినండి. అబ్జర్వ్ చేయండి.......కార్టూన్లు గీయండి.

కార్టూన్లతో సంఘ సేవ

పొగతాగటం అనారోగ్య హేతువు అని చక్కగా చెపుతున్న నిశ్శబ్ద వ్యంగ్య చిత్రం

పొగ తాగటం వల్ల వచ్చే దుష్పరిణామాలు, నలుగురూ ఉన్నచోట ధూమపానం వల్ల జరెగే అసౌకర్యం, ఇతరులకు అనారోగ్య హేతువు కావటం వంటి విషయాలమీద అవగాహన 1970లలోనే వచ్చింది. కాని, పబ్లిక్ ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించటానికి అప్పటినుండి, మూడు దశాభ్దాల పైన పట్టింది. 1960-1970 దశకాలలో మధ్యాహ్నం సమయంలో వేసే మ్యాటినీ ఆటలకు (అప్పట్లో ఎ.సి. హాళ్ళు లేవు, మొదటి ఆటకు బయట వెలుగు ఉండదు కనుక తలుపులు మొత్తం తీసేవారు)సినిమాకు వెళ్ళితే, పొగ మేఘాల మధ్య చూడవలసి వచ్చేది. పొగరాయుళ్ళు అంతగా తమ అలవాటును యధేచ్ఛగా అన్ని చోట్లా కొనసాగించేవారు. ఇది గమనించి బాధపడిన జయదేవ్, తన కార్టూన్లను మాధ్యమంగా వాడుకుంటూ, ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను ప్రజలకు హాస్యంతో జతపరిచి చెప్పసాగారు. అంతేకాక, తాను స్వతహాగా ఆచార్యుడవటం వల్ల, తాను పాఠం మొదలు పెట్టటానికి ముందు విద్యార్ధులకు పొగ తాగవద్దని హితవు పలికేవారు. వీరి మాటలు సరైన సమయంలో, సరైన విధంగా ఆ విద్యార్ధుల మనస్సులమీద పనిచేసి అనేకమందిని ఆ చెడ్డ అలవాటు బారిన పడకుండా చేసింది. వీరు వేసిన కార్టూన్ (పక్కన కనబడుతున్న కార్టూన్) సకల ప్రజాదరణ పొందటమే కాకుండా, భారత కాన్సర్ సొసైటీ(Cancer Society of India)వారు, తమ ధూమపాన వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో కూడ వాడుకుంటున్నారట. భారత ట్రేడ్ ఫైర్ అథారిటీ(Trade Fair Authority of India) వారు జయదేవ్‌ను ఢీల్లికి ఆహ్వానించి సత్కరించారు.

ప్రముఖుల అభిప్రాయాలు

  • బాబు -ప్రముఖ కార్టూనిస్ట్ - కార్టూను గీతలు హడావిడిగా కాక, శ్రద్ధగా గీసినట్టుండి, అందంగా కనిపిస్తాయి. రాత అచ్చు అక్షరాల్లా ఉంటాయి. సంభాషణరహిత కార్టూన్లు వెయ్యటంలో దిట్ట. హాస్యం అతని కార్టూన్ గమ్యం. సైన్సు విషయాలమీద తెలుగులో కార్టూన్లు వెయ్యగల ఏకైక కార్టూనిస్ట్. మెగతా కార్టూనిస్టులకు ప్రొత్సాహం ఇచ్చే విషయంలో చాలా చొరవ చూపుతారు.
  • వంశీ-ప్రముఖ సినీ దర్శకుడు-అందరూ ఒక కోణంలో అలోచించగలిగితే, జయదేవ్ పలు కోణాల్లో అలోచించగల సామర్ధ్యం తన స్వంతం చేసుకున్న వ్యక్తి........అన్ని కార్టూనులూ చూసి అనందించాను. కొన్ని కడుపుబ్బ నవ్విస్తే మరికొన్ని చాలా అలోచింపజేశాయి. ఒక కార్టూనిస్టు ఏ విధంగా ఆలోచించాలో, ఎలా అలోచింపజేయాలో జయదేవ్ తన కార్టూన్ల ద్వారా విపులీకరించారు.
  • శివలెంక రాధాకృష్ణ ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు. శ్రీయుతులు జయదేవ్, బాబు గారల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి.
  • రామకృష్ణ - ప్రముఖ కార్టూనిస్ట్-"జయదేవ్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆ శైలే, క్రింద సంతకం చూడనవసరం లేకుండానే తేలికగా పట్టించేస్తుంది......విషయం ఎన్నుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. నిశ్శబ్ద వ్యంగ్య చిత్ర నేర్పరి. "ట్యూబ్‌లైటు" కార్టూన్లలో మరింత పరిశీలిస్తేకాని బుర్రలో లైటు వెలగని గొప్ప కార్టూన్లు వేశారాయన. చిన్న కార్టూన్లలోనే ఆయన చేసే బహు విశాలమైన సన్నివేశ చిత్రీకరణ అద్భుతం....."

జయదేవ్ వ్యంగ్య చిత్ర మాలిక


మూలాలు

  1. జయదేవ్ కార్టూన్లు సంపుటి, ప్రచురణ మీడియా హౌస్ పబ్లికేషన్స్ 2002 సంవత్సరం-"జోకు ఐడియాను కార్టూన్గా డెవలప్ చేయడం ఎలా"జయదేవ్ గారు ఇచ్చిన సూచనలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జయదేవ్&oldid=657509" నుండి వెలికితీశారు