దాసరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 56: పంక్తి 56:


==చిత్రసమాహారం==
==చిత్రసమాహారం==
{{col-begin}}
{{col-2}}
===1970 దశాబ్దం===
===1970 దశాబ్దం===
# [[తాత మనవడు]] (1972) (మొదటి సినిమా)
# [[తాత మనవడు]] (1972) (మొదటి సినిమా)
పంక్తి 164: పంక్తి 166:
# Naa Mogudu Nanke Sontham (1989)
# Naa Mogudu Nanke Sontham (1989)
# Two Town Rowdy (1989)
# Two Town Rowdy (1989)
{{col-2}}
===1990 దశాబ్దం===
===1990 దశాబ్దం===
# Mama Alludu (1990)
# Mama Alludu (1990)
పంక్తి 200: పంక్తి 203:
# [[Young India]] 2010
# [[Young India]] 2010
# [[పరమ వీరచక్ర]] 2011
# [[పరమ వీరచక్ర]] 2011
{{col-2}}
{{col-end}}


==బయటి లింకులు==
==బయటి లింకులు==

17:20, 22 అక్టోబరు 2011 నాటి కూర్పు

దాసరి నారాయణరావు
దస్త్రం:Dasari Narayanarao cu.jpg
జననంమే 4, 1947
పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్,ఇండియాIndia
ఇతర పేర్లుదాసరి,దర్శక రత్న
ప్రసిద్ధిసినిమాలు, రాజకీయం
రాజకీయ పార్టీకాంగ్రేసు పార్టీ
మతంహిందూమతం
భార్య / భర్తదాసరి పద్మ
పిల్లలుప్రభు,అరుణ్ కుమార్

డా. దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకుడు, సినిమా దర్శకుడు,రచయిత మరియు సినీ నిర్మాత.1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయిత గా చిత్ర దర్శకుడి గా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.

దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.

మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

బాల్యం

దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం.ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారు మొత్తం ఆరుగురు సంతానం.ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి మూడో వాడు.

వారి నాన్న తరం వరకూ మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి ఆరో తరగతికొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి.

ఆరో తరగతిలో ఉత్తమవిద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించాడు.


రాజకీయాలలో

హైదరాబాదునందు కేంద్ర మంత్రిగా దాసరి తెలుగు ఫాంట్స్ విడుదల సందర్భముగా ప్రసంగిస్తున్న దృశ్యం

రాజీవ్ గాంధీ పాలనాకాలములో, దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీ కి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్య సభ కు ఎన్నిక అయ్యారు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.ఇప్పుదు ఛిరన్ జీవి కి సత్రువు.

అవార్డులు

  • 1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు.
  • స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రం గా బంగారు నంది బహుమతిని పొందారు.
  • 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు.
  • 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు.
  • 1986లో తెలుగు సంస్కృతి మరియు తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిధ్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు.
  • ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు.
  • జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందారు.
  • పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు.
  • ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.

చిత్రసమాహారం

బయటి లింకులు

మూలాలు