బోయింగ్ 747: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: my:ဘိုးအင်း ၇၄၇
చి United_747old.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fastily. కారణం: (No permission since 18 October 2011).
పంక్తి 81: పంక్తి 81:


=== 747-100 ===
=== 747-100 ===

[[దస్త్రం:United 747old.jpg|right|thumb|మొదట్లో తయారు చేయ బడ్డ 747-100. పై అంతస్తుకు మూడు కిటికీలు గమనించండి]]
మొదట్లో 747-100కి పై అంతస్తులో ఆరు కిటికీలు మాత్రమే ఉండేవి (ఒక్కో ప్రక్కన మూడు). కాని ఎయిర్‌లైన్ కంపెనీలు పై అంతస్తుని వ్యాపార తరగతి, మరియు మొదటి తరగతి ప్రయాణికుల కోసం వాడడంతో, బోయింగ్ 10 కిటికీలు అమర్చడం మొదలు పెట్టింది. ఇంతకు ముందే తయారు చేసిన (మూడు కిటికీలు ఉన్న) విమానాలకు అదనపు కిటికీలు బోయింగ్ అమర్చింది.<ref>[http://www.aircraftspotting.net/aircraft/boeing_747.html "Boeing 747"], ''Aircraft Spotting''. Retrieved: [[7 December]] [[2007]].</ref>
మొదట్లో 747-100కి పై అంతస్తులో ఆరు కిటికీలు మాత్రమే ఉండేవి (ఒక్కో ప్రక్కన మూడు). కాని ఎయిర్‌లైన్ కంపెనీలు పై అంతస్తుని వ్యాపార తరగతి, మరియు మొదటి తరగతి ప్రయాణికుల కోసం వాడడంతో, బోయింగ్ 10 కిటికీలు అమర్చడం మొదలు పెట్టింది. ఇంతకు ముందే తయారు చేసిన (మూడు కిటికీలు ఉన్న) విమానాలకు అదనపు కిటికీలు బోయింగ్ అమర్చింది.<ref>[http://www.aircraftspotting.net/aircraft/boeing_747.html "Boeing 747"], ''Aircraft Spotting''. Retrieved: [[7 December]] [[2007]].</ref>



01:06, 26 అక్టోబరు 2011 నాటి కూర్పు

బోయింగ్ 747
రెండు ఎయిర్ ఫ్రాన్స్ 747 విమానాలు
రకం వెడల్పు-ఎక్కువగల (wide-body) జెట్ విమానము
దేశం అమెరికా
తయారిదారు బోయింగ్
మొట్ట మొదటి ప్రయాణము 9 ఫిబ్రవరి1969[1]
విడుదల 1970. పాన్ అమెరికన్ వాయుమార్గాలతో (airlines) [1]
ప్రస్తుతం వాడుకలో ఉన్నది
ఎక్కువగా వాడే వారు బ్రిటీష్ ఎయిర్‌వేస్
జపాన్ ఎయిర్‌లైన్స్
క్యాతే పసిఫిక్
కొరియన్ ఎయిర్
తయారుచేసిన తేదీలు 1969 – ప్రస్తుతం
తయారుచేనినవి మార్చి 2008 నాటికి 1,399
ధర 747-100 అమెరికన్ డాలర్లు 24 మిలియన్ (1967)
747-200 $39 మిలియన్ (1976)
747-300 $83 మిలియన్ (1982)
747-400 $228-260 మిలియన్ (2007)[2]
747-8 $285.5-300 మిలియన్ (2007)[2][3]
ఇతర మోడెల్లు బోయింగ్ 747SP
బోయింగ్ VC-25
బోయింగ్ 747-400
బోయింగ్ 747-8
బోయింగ్ 747 LCF

ద జంబో జెట్[4][5] గా పిలువబడే బోయింగ్ 747 (Boeing 747) బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఒక వెడల్పు-ఎక్కువగల (wide-body) విమానం. ఇది ప్రపంచంలోనే అతి త్వరగా కనుక్కోగలిగే విమానము. ఇది 1950లలో వాడుకలో ఉన్న, బోయింగ్ 707 కంటే రెండున్నర రెట్లు పెద్దది.[6] ఈ విమానము ఎంత పెద్దదంటే, దీని రెక్కల పొడవు మొట్టమొదటి సారి రైట్ సోదరులు ఎగిరిన దూరంకన్నా ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణీకుల రికార్డును 37 సంవత్సరాలు నిలబెట్టుకుంది.

747కి నాలుగు ఇంజన్లు, రెండు అంతస్తులు (double deck) ఉంటాయి. ఇది ప్రయాణికుల వెర్షన్, కార్గో వెర్షన్, మరియు ఇతర వెర్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతము వాడుకలో ఉన్న ఆధునిక మోడల్ 747-400 అత్యంత వేగమైన విమానాలలో ఒకటి. ఇది శబ్ద వేగానికి 0.85రెట్లు (గంటకు 913 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించగలదు. 747-400 ఎక్కడా ఆగకుండా 13,450 కిలోమీటర్లు ప్రయాణించగలదు.[7] 747-400లో 416 లేదా 524 మంది కూర్చోవచ్చు (డిజైనును బట్టి).

ప్రస్తుతానికి 1,399 747 విమానాలను బోయింగ్ కంపెనీ అమ్మింది. ఇప్పటికి ఇంకా 122 ఆర్డర్లు ఉన్నాయి.[8] 747లో అత్యాధునిక మాడల్ 747-8 2009లో విడులవుతంది.[9]

చరిత్ర

ప్రాజెక్టు ప్రారంభం

రూపకల్పన దశలో ఉన్న 747 కాక్‌పిట్

747 ప్రాజెక్టు విమాన సంస్థలు చాలా డిమాండ్ ఎదురుకుంటున్న 1960లలో మొదలయ్యింది. బోయింగ్ కంపెనీ విమానాలను ఎక్కువగా కొనే పాన్-అమెరికన్ ఎయిర్‌లైన్స్ (పాన్ ఆమ్) బోయింగ్‌ని అప్పటికి వాడుకలో ఉన్న విమానాలకన్నా రెండింతలు పెద్దదైన విమానము తయారు చేయమని వొత్తిడి చేసింది.[10] 1965లో జో సట్టర్ ని 737 ప్రాజెక్టు నుండి కొత్త 747 (అప్పటికే పేరు నిర్ణయించేశారు) ప్రాజెక్టుకు తరలించింది బోయింగ్. సట్టర్ పాన్ ఆమ్ మరియు ఇతర ఎయిర్‌లైన్లతో విపులంగా చర్చించి వారికి ఎలాంటి విమానము కావాలో కనుక్కున్నాడు. ఏప్రిల్ 1966లో పాన్ ఆమ్ పాతిక 747-100లను ఆర్డర్ చేసింది. విమానము యొక్క రూపకల్పన దశల నుండే పాన్ ఆమ్ బోయింగుతో కలిసి పని చేసింది కాబట్టి 747 డిజైన్ను తమకు నచ్చినట్టు మార్చుకోగలిగింది. పౌర వైమానిక చరిత్రలో మరే ఇతర ఎయిర్‌లైను పాన్ ఆమ్ లాగా విమానాన్ని డిజైన్ చేయించుకోలేదు.[11]

కర్మాగారము

బోయింగ్ ఎవెరెట్ట్ కర్మాగారము

747 వంటి పెద్ద విమానాన్ని నిర్మించడానికి బోయింగ్‌కి ఉన్న కర్మాగారములు సరిపోలేదు. కాబట్టి ఒక కొత్త కర్మాగారము కట్టడానికి నిర్ణయించింది బోయింగ్. దాదాపు 50 నగరాలు పరిశీలించి[12] చివరికి వాషింగ్‌టన్ రాష్ట్రంలోని ఎవరెట్ట్ నగరానికి దగ్గర[13] కర్మాగారము కట్టడానికి 780 ఎకరాల స్థలాన్ని జూన్ 1966లో బోయింగ్ కొన్నది.[14] రెండు సంవత్సరాలలో కట్టడం పూర్తయ్యింది. ఇది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన కట్టడము.[13]

విమాన నిర్మాణము మరియు విడుదల ముందు పరీక్షలు

747ని పూర్తిగా నిర్మించడానికి ముందే అన్నిభాగాల మీదా క్షుణ్ణంగా పరీక్షలు జరిగాయి. ఇందులో ఒక ముఖ్యమైన పరీక్ష, విమానములోని 560 మంది ప్రయాణికులు 90 క్షణములలో అత్యవసర మార్గాల ద్వారా బయటి రావటం. మొదటిసారి ఈ పరీక్ష జరిపినప్పుడు, రెండున్నర నిమిషాలు పట్టింది. ఆ ప్రయత్నములో కొంత మంది గాయపడ్డారు కూడాను. తరువాత జరిగిన ప్రయోగ ప్రయత్నాలలో 90 క్షణాల లక్ష్యము చేరుకున్నా, ఎక్కువ మంది గాయపడ్డారు. బోయింగ్ 747 రెండు అంతస్తులు ఉన్న మొట్టమొదటి విమానము కనుక పై అంతస్తులో ఉన్న వారు అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని నిష్క్రమించేందుకు ఎక్కువ సమయం పట్టేది.[15]

రోల్ అవుట్ ఉత్సవములో 747 కోనుగోలుకు ఆర్డరు పెట్టిన 26 ఎయిర్‌లైన్ల ఫ్లైట్ అటెండెంట్లు.

సెప్టెంబర్ 30, 1968 నాడు జరిగిన రోల్ అవుట్ ఉత్సవములో 747 ని ప్రపంచానికి పరిచయంచేసింది బోయింగ్. ఆ ఫంక్షన్‌కి 747లను ఆర్డరు చేసిన 26 ఎయిర్‌లైన్ల వారు వచ్చారు.[16] తరువాతి నెలలలో మొట్టమొదటి ప్రయాణానికి సన్నాహాలు విస్తృతంగా జరిగాయి. ఇది 9 ఫిబ్రవరి, 1969 నాడు జరిగింది. పైలట్లు జాక్ వాడెల్ల్ మరియు బ్రయన్ వైగెల్. విమాన ఇంజనీరు జెస్ వాలిక్.[17][18] కొన్ని చిన్న కష్టాలు వచ్చినా, 747 చాలా బాగా ఎగరగలదని పైలెట్లు చెప్పారు.

747 ఇంజన్

ప్రాట్ & విట్నీ తయారు చేసిన JT9D ఇంజెన్లలో లోపాల వలన 747 డెలివర్ చేయటం కొన్ని నెలలు ఆలస్యమయ్యింది. [19] ఈ కాలంలో సుమారు ఇరవై 747లు ఎవెరెట్ట్ కర్మాగారములో ఇంజన్ల కోసము నిలిచిపోయాయి. ఇన్ని కష్టాలు ఉన్నా బోయింగ్ 1969లో ని ప్యారిస్ విమాన వేడుకకి 747ని తీసుకెళ్ళింది. అక్కడ మెట్టమెదటి సారి 747 ప్రజలకు ప్రదర్శింపబడింది. 747 ప్రాజెక్టు, మరియు ఎవెరెట్ట్ కర్మాగారాము కట్టడానికి బోయింగ్ పెద్ద మొత్తములో బ్యాంకులనుండి రుణాలు తీసుకొన్నది. మొదటి 747 డెలివర్ చేయటానికి నెలలు ముందు బోయింగ్ అనేకమార్లు బ్యాంకులను మరిన్ని రుణాల కోసం అభ్యర్ధించింది. వారు గనక కాదని ఉంటే బోయింగ్ ఇప్పటికి ఉండేది కాదేమో.[20][21] కానీ దీర్ఘకాలములో 747 వల్ల బోయింగ్‌కి మంచి లాభాలు వచ్చాయి. చాలా సంవత్సరాల వరకు అతి పెద్ద పౌర విమానాలలో బోయింగ్ గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది.[22]

వాడుకలోకి 747

747-100 మరియు 747-200 మొడల్లలో పై అంతస్తుకి మెట్లు

జనవరి 15, 1970 నాడు అమెరికా ప్రథమ మహిళ ప్యాట్ నిక్సన్ పాన్ ఆమ్ 747ను వాషింగ్టన్‌లో విడుదల చేశారు. 22 జనవరి 1970 నాడు 747 పాన్ ఆమ్ యొక్క న్యూయార్క్-లండన్ మార్గంలో వాడుకలోకి వచ్చింది.[23] జనవరి 21 సాయంత్రానికి ఫ్లైట్ ప్లాను చేసినప్పటికి ఇంజను అతిగా వేడెక్కడం వలన ఆ విమానము సమయానికి పనికిరాకుండా పోయింది. ఇంకొక 747 రావడానికి 6 గంటలు పైగా పట్టింది.[24] అప్పటికి తేది 22 జనవరి.

747 చాలా సులభంగా వాడుకలోకి వచ్చింది. మొదట్లో, అంత పెద్ద విమానము అప్పటికి ఉన్న విమానాశ్రయాలలో పట్టదేమోనని భయాలు ఉండేవి.[25] కానీ అలాంటి భయాలన్నీ త్వరగానే తొలగిపోయాయి. చిన్న అవాంతరాలేర్పడినా బోయింగ్ వాటిని వెనువెంటనే పరిష్కరించగలిగింది.[26] దీనితో పాన్ ఆమ్, తరువాత 747 కొన్న ఇతర ఎయిర్‌లైన్లు కూడా 747లను ఉపయోగించటం ప్రారంభించారు.[27][28] మొదట్లో అమ్ముడుపోయిన 747లలో సగందాకా విమానాలు 747 యొక్క దీర్ఘ ప్రయాణపు సామర్ధ్యం కోసం కొన్నవని బోయింగ్ అంచనా.[29] కాని 747ని లాభసాటిగా నడపటానికి విమానం నిండా ప్రయాణీకులు ఉండాలి. కాబట్టి విమానంతో ప్రయాణీకులు తగ్గేకొద్ది ఎయిర్‌లైన్లకు ఖర్చులు పెరిగిపోయేవి. ఉదాహరణకు, 70శాతం నిండి ఉన్న 747ను నడపటానికి పూర్తిగా నిండి ఉన్న 747 నడపటానికి కావలిసినంతలో 95శాతం ఖర్చవుతుంది.[30]

1973లో అమెరికాలో, చమురు ధర పెరగడంతో, చాలా ఎయిర్‌లైన్లు 747ని నడపడం నిలిపేసాయి.[31] అమెరికన్ ఎయిర్‌లైన్స్ 747లను సరుకు (కార్గో) రవాణాకు వాడటం మొదలుపెట్టింది. 1983లో పాన్ ఆమ్ 747లకు బదులుగా ఇతర చిన్న విమానాలను మార్పిడి చేసుకుంది.[32] డెల్టా ఎయిర్‌లైన్స్ తమ విమానదళంలోని అన్ని 747లను తిరిగి బోయింగ్‌కు అమ్మేసింది.[33]

తరువాతి మార్పులు

747-300 మరియు దాని తరువాత వచ్చిన విమానాలలో బోయింగ్ పై అంతస్తు వెడల్పు పెంచింది
నాలుగు అతి పెద్ద విమానాల పరిమాణాలు. హ్యూస్ H-4 హెర్క్యులెస్, యాంటనోవ్ An-225, ఎయిర్‌బస్ A380 మరియు 747-8

747-100 తరువాత బోయింగ్ 747-100B మరియు 747-100SR మోడల్లు విడుదల చేసింది.[34] -100B, -100 కంటే ఎక్కువ take off weight కలదు. -100SRలో -100 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చోవచ్చును. 1971లో 747-200 విడులయింది. -200 విమానంలో -100 కంటే శక్తివంతమైన ఇంజన్లు మరియు మరింత ఎక్కువ టేకాఫ్ బరువు ఎత్తగల సామర్ధ్యము ఉండెను. ఈ విమానంలో ప్రయాణికుల, కార్గో మరియు ఇతర వెర్షన్లు ఉత్పత్తి చేయబడ్డాయి. మరింత దూరం ప్రయాణించగల 747SP ని బోయింగ్ 1975లో ఉత్పత్తి చేసింది. 747SP, 747కన్నా చిన్నది కానీ 747 కంటే మరింత దూరం ప్రయాణించగలదు.[35]

747లో ప్రయాణికుల సంఖ్యను పెంచడానికి చేసిన పరిశోధనల ఫలితంగా 1980లో బోయింగ్ 747-300ను విడుదల చేసింది. ఈ విమానము తయారీ 1983లో మొదలయ్యింది. దీనిలో పై అంతస్తు వెడల్పు పెంచడం (stretched upper deck), విమాన వేగం పెంచడం, ప్రయాణికుల సంఖ్య పెంచడం వంటి మార్పులు చేసింది బోయింగ్. మూడు వెర్షన్‌లు (ప్రయాణికుల వెర్షన్, స్వల్ప దూరపు ప్రయాణాల వెర్షన్, ప్రయాణికులు మరియు కార్గో వెర్షన్) తయారు చేయబడ్డాయి.[34]

1985లో మరింత దూరం ప్రయాణించే సామర్థ్యము గల 747-400 రూపకల్పన మొదలయ్యింది.[36] ఈ మోడల్లో బోయింగ్ గాజు కాక్‌పిట్‌ను ప్రవేశ పెట్టింది. దీనివల్ల విమానము నడపడానికి అవసరమయ్యే మనుషులను ముగ్గురి నుండి ఇద్దరికి తగ్గించగలిగింది.[37] విమానయాన సంస్థలు ఇతర అధునిక పరికరాలను అమర్చమని కోరడంతో ఈ మోడల్ రూపకల్పనకు మరింత ధనము, సమయము అవసరమయ్యాయి. చివరకు 1989లో నిర్మాణము పూర్తయ్యింది.[38]

747-400 తరువాత బోయింగ్ ఇతర మార్పులు చేయదలచింది. 1996లో, బోయింగ్ 747-500X మరియు 747-600X డిజైన్లు విడుదల చేసింది.[39] వీటి రూపకల్పన చేయడానికి 500 కోట్ల (5 బిలియన్) డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.[39] కానీ విమానయాన సంస్థల నుండి సానుకూల స్పందన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది.[40] దీని తరువాత, 2000లో, బోయింగ్, 747X అనే మరో మోడల్‌ డిజైన్లు విడుదల చేసింది. దీనికి కూడ సానుకూల స్పందన లేకపోవడంతో, 2001లో, బోయింగ్ సోనిక్ క్రూజర్ మీద దృష్టి సారించింది.[41] ఇతర కారణాల వలన సోనిక్ క్రూజర్ ప్రాజెక్టు నిలిపివేయబడడంతో బోయింగ్ 787 పరిశోధన మొదలు పెట్టింది.[42] 747X కోసం కనుగొన్న కొన్ని కొత్త అంశాలను 747-400ER మోడలులో పొందుపరచింది.[43] ఈ మోడల్‌కు కూడ స్పందన లేకపోవడంతో నిలిపివేయబడింది. ఇలా ప్రతిపాదించిన చాలా నమూనాలు విఫలం కావడంతో కొంతమంది పరిశ్రమ పరిశీలకులు బోయింగ్ నుండి వెలువడుతున్న కొత్త విమాన నిర్మాణ ప్రతిపాదనలను అనుమానాస్పదంగా చూడటం ప్రారంభించారు.[44]

కానీ 2004 మొదట్లో, బోయింగ్ 747 అడ్వాన్స్డ్ అనే విమాన నమూనా విడుదల చేసింది. ఇది 747Xకు దగ్గరగా ఉంది. దీనికి పరిశ్రమవర్గాల నుండి మంచి స్పందన లభించింది. నవంబర్ 14, 2005 నాడు, బోయింగ్ 747 అడ్వాన్స్‌డ్ ను 747-8 పేరు క్రింద విడుదల చేస్తుందని ప్రకటించింది.[45]

2007లో, ఎయిర్‌బస్ A380 విడుదలయ్యే వరకు పౌర వైమానిక చరిత్రలో 747 నే అతి పెద్ద విమానము.[46] 1991లో, 1087 మంది ప్రయాణికులు ఒక్క 747 విమానములో ఎక్కి రికార్డు సృష్టించారు.[47] యాంటనోవ్ An-225 వాడుకలోకి వచ్చే వరకు, 747 అత్యంత బరువైన విమానము. ఐతే, ఇప్పటి వరకు రెండే రెండు An-225 విమానాలు నిర్మించబడ్డాయి. 2007 నాటికి ఒక్కటి మాత్రమే వాడుకలో ఉన్నది. రెక్కల పొడువు ప్రకారము చూస్తే, హ్యూస్ H-4 హెర్క్యులెస్ విమానము అతి పెద్దది. కానీ ఇది ఒక్కసారి మాత్రమే ఆకాశంలోకి ఎగిరింది.[48]

కొన్ని 747 విమానాలు ఇతర ప్రత్యేక అవసరాల కోసం మార్పుచేర్పులు చేయబడ్డాయి. ఇందులో ఒక 747-100 జనరల్ ఎలక్ట్రిక్ వారు తమ ఇంజన్లను పరీక్షించడానికి వాడుతున్నారు.[49][50] ఎవర్‌గ్రీన్ ఇంటర్నేషల్ అనే కంపెనీ, ఒక విమానాన్ని, అగ్నిమాపక దళంలో భాగంగా వాడుకొంటోంది.[49]

డిజైను

747లో ఆసనాల అమరిక
"ముక్కు" పైకి లేవనెత్తి సరుకు ఎక్కిస్తున్న దృశ్యం
747 ల్యాండింగ్ గేర్, చక్రాలు

747 ఒక పెద్ద, వెడల్పు-ఎక్కువ గల (wide-body) విమానము. దీనికి రెక్కల క్రింద, నాలుగు ఇంజెన్లు అమర్చబడ్డాయి. 747 శబ్ద వేగానికి 0.84 నుండి 0.88 రెట్ల వేగంతో ప్రయాణించగలదు (మొడలు బట్టి).[51] క్రింద అంతస్తులో, మధ్య తరగతిలో (economy class) 3-4-3 దిసైన్‌తో, 366కు పైగా ప్రయాణికులు ప్రయాణించ వచ్చు. 3-4-3 అంటే మొదట మూడు సీట్లు, తరువాత నడుచుటకు కొంచం స్థలం, నాలుగు సీట్లు, నడుచుటకు కొంచం స్థలం, మళ్ళీ మూడు సీట్లు. అదే వ్యాపార తరగతి (business class) ఐతే 2-3-2 డిసైను ఉంటుంది. మొదటి తరగతి (first class) ఐతే 2-2 ఉంటుంది. పై అంతస్తులో 3-3 డిసైను ఉంటుంది. మొదటి తరగతి ఐతే 2-2 ఉంటుంది (కుడి వైపున ఉన్న బొమ్మ చూడండి).[52]

747లోని కాక్‌పిట్, పై అంతస్తుకు సమాన పొడవులో ఉంటుంది. దీని వల్ల సరకు రవాణా (కార్గో) వెర్షన్లలో "ముక్కు"ను పైకి లేవనెత్తి, సరుకు లోపల పెట్టవచ్చును.[51] అవసరమైతే, కాక్‌పిట్ వెనకాల ఉన్న పై అంతస్తులో ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.

747 టేకాఫ్ సమయమునందు అత్యధిక బరువు (maximum takeoff weight) 3,33,400 కిలోల (-100కు) నుండి 4,39,985 కిలోల (-8కు) వరకు ఉంటుంది. 747-8I ఆగకుండా 14,815 కిలోమీటర్లు ప్రయాణించ గలదు. మొదట్లో వచ్చిన 747-100 మొడలు 9,800 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించ గలిగేది (ఆగకుండా).[53][54]

747కు నాలుగు ప్రధాన ల్యాండింగ్ గేర్లు ఉన్నాయి. 747 సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి రెండు గేర్లు చాలు. కాబట్టి రెండు ల్యాండింగ్ గేర్లు పనిచేయక పోయినా, 747 సురక్షితంగా ల్యాండ్ కాగలదు. ఒక్కో దానికి నాలుగు చక్రాలు ఉన్నాయి. మొత్తం 16 చక్రాలు ఉండటం వల్ల, ఒక టైరుకి రంధ్రం పడినా, ప్రమాదమేమీ ఉండదు. మొదట్లో తయారు చేయబడ్డ 747లకు ఇంకొక అదనపు ఇంజను అమర్చడానికి స్థలం ఉండేది. ఇది ఇంజనుని ఒక చోట నుంచి ఇంకో చోటకు తరలించడానికి వాడేవారు.

మోడల్లు

747లో ప్రప్రధమ మోడలు, 747-100, 1966లో విడుదల అయ్యింది. రెండు సంవత్సరాల తరువాత, 1988లో 747-200 విడుదల అయ్యింది. తరువాత మోడలు, 747-300, 1980లో వచ్చింది. 747-400 రావడానికి ఇంకో ఐదు సంవత్సరాలు పట్టింది. ఇదే ఇప్పుడు అత్యాధునిక మోడల్. 2005లో 747-8 ప్రకటించబడింది. ప్రతి మోడలులో వేరు వేరు వెర్షన్లు ఉత్పత్తి చేయబడ్డాయి.

747-100

మొదట్లో 747-100కి పై అంతస్తులో ఆరు కిటికీలు మాత్రమే ఉండేవి (ఒక్కో ప్రక్కన మూడు). కాని ఎయిర్‌లైన్ కంపెనీలు పై అంతస్తుని వ్యాపార తరగతి, మరియు మొదటి తరగతి ప్రయాణికుల కోసం వాడడంతో, బోయింగ్ 10 కిటికీలు అమర్చడం మొదలు పెట్టింది. ఇంతకు ముందే తయారు చేసిన (మూడు కిటికీలు ఉన్న) విమానాలకు అదనపు కిటికీలు బోయింగ్ అమర్చింది.[55]

తరువాత వచ్చిన 747-100B మరింత పఠిష్టమైన డిసైన్ కలిగి ఉంది. దీని వల్ల ఇది టేకాఫ్ సమయమునందు 747-100 కంటే ఎక్కువ బరువు (3,40,000 కిలోలు) మోయగలదు. -100B ఇరాన్ ఎయిర్ మరియు సౌదియా (ఇప్పుడు సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్) మాత్రమే కొన్నాయి.[56] రోల్స్ రాయిస్ మరియు జనరల్ ఎలెక్ట్రిక్ -100B కొరకు ప్రత్యేక ఇంజన్లు తయారు చేసాయి. సౌదియా మాత్రం రోల్స్ రాయిస్ ఇంజన్ కొన్నది.[57]

-100లో సరకు రవాణా కొరకు ప్రత్యేక వెర్షను బోయింగ్ ఉత్పత్తి చేయలేదు. కాని ప్రస్తుతం కొన్ని -100లు సరకు రవాణా కొరకు ఉపయోగించబడుతున్నాయి.[58] అన్ని వెర్షన్లు (747SP కూడా) కలిపి మొత్తం 250 747-100 బోయింగ్ ఆమ్మింది. చిట్టచివరి -100 1986లో వాడుకలోకి వచ్చింది.[59] ఇందులో 167 747-100లు, 45 SPలు, 29 SRలు and 9 100Bలు ఉన్నాయి.[60]

747-100SR

నాసా షటుల్ క్యారియర్. ఇది ఒక 747-100SR

747-100 Short Range జపాన్ ఎయిర్‌లైన్స్ విన్నపము మేరకు బోయింగ్ రూపొందించింది. ఇది -100 కంటే తక్కువ దూరం ప్రయాణించగలదు, కాని ఎక్కువ ప్రయాణికులు ప్రయాణించవచ్చు (మొదట్లో వచ్చిన విమానాలలో 498 ప్రయాణికులు, తరువాతి వెర్షన్లలో 550 ప్రయాణికులు).[34]-100SR మొట్ట మొదటి సారి, 7 ఆక్టోబర్, 1973 నాడు జపాన్ ఎయిర్‌లైన్స్ వాడింది.[14] తక్కువ దూరం ప్రయాణించగలదు కాబట్టి ఎక్కువ సార్లు టేకాఫ్ మరియు ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందు కోసం బోయింగ్ రెక్కలను, ల్యాండింగ్ గేర్లను ధృడపరిచింది. SR లో -100 కంటే 20శాతం తక్కువ ఇంధనం ఉంటుంది.[61] తరువాత వచ్చిన -100B, -300లలో కూడా SR వెర్షన్లు బోయింగ్ ఉత్పత్తి చేసింది. ఇవి జపాన్‌లో ఎక్కువగా వాడారు.[62]

జపాన్ ఎయిర్‌లైన్స్ కోసం, ప్రత్యేకంగా, రెండు -100SRలకు, పై అంతస్తు వెడల్పు పెంచి (stretched upper deck) ఉత్పత్తి చేసింది బోయింగ్. పై అంతస్తు వెడల్పు పెంచడంతో ఇంకా ఎక్కువ ప్రయాణికులు ప్రయాణించవచ్చు.[63][64]

ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ఏ.ఎన్.ఏ.) SRలను జపాన్ domestic రూట్లలో ఉపయోగించింది. కాని 10 మార్చి, 2006 నాటికి SRలను వాడటం నిలిపేసింది.[65] జపాన్ ఎయిర్‌లైన్స్ కూడా జపాన్ domestic రూట్లలో ఉపయోగించింది. ఈ ఎయిర్‌లైన్స్ 2006 మూడవ పాతిక (third quarter) లో SRలను వాడటం నిలిపేసింది.

747SP

747SP. ఇతర విమానాల కంటే పొడవు తక్కువ ఉంది గమనించండి.

747 Special Performance -100 కంటే 48అడుగులు 4అంగుళాలు పొడవు తక్కువ. పొడవు తగ్గించడానికి రెక్కల ముందూ, వెనక కొంత భాగం తీసేసారు. మిగితా 747లతో పోలిస్తే -8 మరియు SPలకు మాత్రమే పొడవు వేరే ఉంది (SP పొడవు తక్కువ, -8 పొడవు ఎక్కువ).








మూలాలు

  1. 1.0 1.1 Rumerman, Judy. "The బోయింగ్ 747", U.S. Centennial of Flight Commission. తీసిన తేది: 30 ఏప్రిల్ 2006.
  2. 2.0 2.1 బోయింగ్ వాణిజ్య వాయుమార్గాల వెల, బోయింగ్ కంపెనీ. తీసిన తేది: 26 జూన్ 2007.
  3. కార్ప్, ఎరోన్. "బోయింగ్ boosts aircraft prices 5.5% on rising cost of labor, materials", వాయు రవాణా ప్రపంచం, 26 జూన్ 2007. తీసిన తేది: 17 డిసెంబర్ 2007.
  4. "Woman to build house out of 747", BBC News, 20 ఏప్రిల్ 2006. తీసిన తేది: 11 డిసెంబర్ 2007.
  5. Creating Worlds: Adventures Aviation (review) Amazon.com. తీసిన తేది: 11 డిసెంబర్ 2007.
  6. Branson, Richard. "Pilot of the Jet Age", Time, 7 డిసెంబర్ 1998. తీసిన తేది: 13 డిసెంబర్ 2007.
  7. "Technical Characteristics – Boeing 747-400", బోయింగ్ కంపెనీ. తీసిన తేది: 29 ఏప్రిల్ 2006.
  8. 747 Model Orders and Deliveries data, బోయింగ్ కంపెనీ. తీసిన తేది: 8 జనవరి 2008.
  9. Orders and Deliveries, బోయింగ్ కంపెనీ. తీసిన తేది: 25 నవంబర్ 2006.
  10. "Innovators: Juan Trippe", PBS. తీసిన తేది 17 డిసెంబర్ 2007
  11. Irving 1994, p. 359.
  12. (ఆంగ్లము) పాస్కల్, గ్లెన్ ఆర్. "Everett and Renton react differently to Boeing", పుజెట్ సౌండ్ బిజినెస్ జర్నల్, సెప్టెంబర్ 26, 2003. తీసిన తేది: 17 డిసెంబర్ 2007.
  13. 13.0 13.1 (ఆంగ్లము) "Major Production Facilities - Everett, Washington", బోయింగ్ కంపెనీ. తీసిన తేది: 28 ఏప్రిల్ 2007.
  14. 14.0 14.1 (ఆంగ్లము) "747 Milestones", బోయింగ్ కంపెనీ. తీసిన తేది 17 డిసెంబర్ 2007 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "B747_milest" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  15. Irving 1994, p. 383.
  16. "All but off the Ground", Time, 4 ఆక్టోబర్ 1968. తీసిన తేది: 17 డిసెంబర్ 2007.
  17. "The Giant Takes Off", Time. తీసిన తేది: 13 డిసెంబర్ 2007.
  18. "Boeing 747, the "Queen of the Skies," and "Celebrates 35th Anniversary", బోయింగ్ కంపెనీ, 9 ఫిబ్రవరి 2004. తీసిన తేది: 17 డిసెంబర్ 2007.
  19. Irving 1994, p. 441-446.
  20. Irving 1994, p. 437–438.
  21. Noland, David. "Passenger Planes: Boeing 747", "Info please." (Pearson Education). తీసిన తేది: 30 ఏప్రిల్ 2006.
  22. "First A380 Flight on 25-26 ఆక్టోబర్", Singapore Airlines, 16 ఆగష్టు 2007. తీసిన తేది: 17 డిసెంబర్ 2007.
  23. Norris 1997, p. 48.
  24. "Jumbo and the Gremlins", Time, 2 February 1970. తీసిన తేది: 20 December 2007.
  25. "Breaking the Ground Barrier", Time, 8 September 1967. తీసిన తేది: 19 December 2007.
  26. "Jumbo Beats the Gremlins", Time, 13 July 1970. తీసిన తేది: 20 December 2007.
  27. "Ready or Not, Here Comes Jumbo", Time, 19 January 1970. తీసిన తేది: 19 December 2007.
  28. "Orders and Deliveries search page", బోయింగ్ కంపెనీ. తీసిన తేది 10 March 2008.
  29. Smith, Bruce A. "Boeing Shuns Very Large Jets While Aiming for Longer Range." Aviation Week and Space Technology, 1 January 2001, p. 28–29. See also 747X vs A380 "How to Reduce Congestion"(PDF), Department of Aerospace and Ocean Engineering, Virginia Tech. తీసిన తేది: 10 December 2007.
  30. "Airline reporting on fuel consumption", Miljominsteriet (Danish Environmental Protection Agency). తీసిన తేది: 13 December 2007.
  31. "Planes for Rough Weather", Time, 3 August 1970. తీసిన తేది: 20 December 2007.
  32. "American Airlines History", American Airlines. తీసిన తేది: 22 December 2007.
  33. "Delta Boeing 747-100 1/200 Scale", Airspotters. తీసిన తేది: 19 December 2007.
  34. 34.0 34.1 34.2 "Boeing 747 Classics", బోయింగ్ కంపెనీ. తీసిన తేది: 15 December 2007.
  35. "Boeing 747SP", Airliners.net. తీసిన తేది: 23 November 2007.
  36. Lawrence and Thornton 2005, p. 54.
  37. Salpukas, Agis. "J.A.L. Orders 15 More of Boeing's 747-400's", Time, 1 July 1988. తీసిన తేది: 17 December 2007.
  38. About the 747 Family, Boeing, తీసిన తేది 12 June, 2006.
  39. 39.0 39.1 "Boeing Outlines the "Value" of Its 747 Plans", బోయింగ్ కంపెనీ, 2 September 1996. తీసిన తేది: 17 December 2007.
  40. "BA warms to A3XX plan", Flight International, 19 March 1997. తీసిన తేది: 17 December 2007.
  41. "Boeing Shelves 747X to Focus on Faster Jet", People's Daily, 30 March 2001. తీసిన తేది: 17 December 2007.
  42. Taylor, Alex III. "Boeing's Amazing Sonic Cruiser ...", Fortune, 9 December 2002. తీసిన తేది: 17 December 2007.
  43. "Boeing Launches New, Longer-Range 747-400", బోయింగ్ కంపెనీ, 28 November 2000. తీసిన తేది 17 December 2007.
  44. Holmes, Stanley. "Boeing's Reborn 747", Business Week. 16 November 2005.
  45. "Boeing Launches New 747-8 Family", బోయింగ్ కంపెనీ, 14 November 2005. తీసిన తేది: 17 December 2007.
  46. "A380 superjumbo lands in Sydney", BBC News. తీసిన తేది: 10 December 2007.
  47. "El Al History page", El Al Airlines. తీసిన తేది: 18 October 2007.
  48. "Ask Us - Largest Plane in the World", Aerospaceweb.org, 11 November 2005. తీసిన తేది: 29 April 2006.
  49. 49.0 49.1 "Goleta Air and Space Museum - Boeing Jetliner Prototypes and Testbeds", Smithsonian. తీసిన తేది: 12 December 2007.
  50. "GE-Aviation: GE90-115B Prepares For Flight Aboard GE's 747 Flying Testbed", General Electric. తీసిన తేది: 12 December 2007.
  51. 51.0 51.1 Sutter 2006, p. 93.
  52. "Boeing 747-400 Airport Planning report, section 2.0, Boeing, December 2002 (PDF)", The Boeing Company. Retrieved: 13 December 2007.
  53. Boeing 747-100/200/300 "Technical Specifications", The Boeing Company. Retrieved: 13 December 2007.
  54. "Boeing 747-8 Technical Specifications", The Boeing Company. Retrieved: 13 December 2007.
  55. "Boeing 747", Aircraft Spotting. Retrieved: 7 December 2007.
  56. "Saudia Orders 4 Boeing 747's", New York Times. Retrieved: 12 December 2007.
  57. Norris 1997, p. 53.
  58. "FAA Regulatory and Guidance Library" (PDF), FAA. Retrieved: 12 December 2007. See reference to Supplementary Type Certificates for freighter conversion.
  59. Fast Facts: 747, The Boeing Company. Retrieved 16 December 2007
  60. "Boeing Commercial Airplanes - 747 Classics Technical Specs", The Boeing Company. Retrieved: 12 December 2007.
  61. Itabashi, M (1995-12). "Pre-fatigued 2219-T87 and 6061-T6 aluminium alloys". Structural Failure: Technical, Legal and Insurance Aspects. Taylor & Francis. pp. p. 155. Retrieved 2008-06-04. {{cite web}}: |pages= has extra text (help); Check date values in: |date= (help); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  62. Bowers 1989, p. 516–517.
  63. "Boeing 747-146B/SR/SUD aircraft", Airliners.net.
  64. "JAL Aircraft Collection", Japan Airlines. Retrieved: 15 December 2007.
  65. "Truth of NANJING must be known", Japan Corporate News Network. Retrieved: 15 December 2007.


  • Bowers, Peter M. Boeing aircraft since 1916. London: Putnam Aeronautical Books, 1989. ISBN 0-85177-804-6.
  • Irving, Clive. Wide Body: The Making of the Boeing 747. Philadelphia: Coronet, 1994. ISBN 0-340-59983-9.
  • Kane, Robert M. Air Transportation. Dubuque, IA: Kendall Hunt Publishing Company, 2003. ISBN 0-7575-3180-6.
  • Lawrence, Philip K. and David Weldon Thornton. Deep Stall: The Turbulent Story of Boeing Commercial Airplanes. Burlington, VT: Ashgate Publishing Co., 2005, ISBN 0-7546-4626-2.
  • Norris, Guy and Mark Wagner. Boeing 747. St. Paul, Minnesota: MBI Publishing Co., 1997. ISBN 0-7603-0280-4.
  • Shaw, Robbie. Boeing 747 (Osprey Civil Aircraft series). London: Osprey, 1994. ISBN 1-85532-420-2.
  • Sutter, Joe. 747: Creating the World's First Jumbo Jet and Other Adventures from a Life in Aviation. Washington, DC: Smithsonian Books, 2006. ISBN 978-0-06-088241-9.
  • Wilson, Stewart. Airliners of the World. Fyshwick, Australia: Aerospace Publications Pty Ltd., 1999. ISBN 1-875671-44-7.

బయటి లింకులు

మూస:Link FA మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=బోయింగ్_747&oldid=659605" నుండి వెలికితీశారు