హిందుస్థానీ సంగీతము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: mr:हिंदुस्तानी शास्त्रीय संगीत
పంక్తి 66: పంక్తి 66:
[[it:Musica indostana]]
[[it:Musica indostana]]
[[ja:ヒンドゥースターニー音楽]]
[[ja:ヒンドゥースターニー音楽]]
[[mr:हिंदुस्तानी शास्त्रीय संगीत]]
[[nl:Hindoestaanse muziek]]
[[nl:Hindoestaanse muziek]]
[[pl:Muzyka hindustańska]]
[[pl:Muzyka hindustańska]]

05:28, 16 నవంబరు 2011 నాటి కూర్పు

భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాలలో ఒకటి, 13-14 శతాబ్దములలోని సాంస్కృతిక పరిస్థితులచే అమితముగా ప్రభావితమైనది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతపు మూలములు మానవ చరిత్రలోనే అత్యంత ప్రాచీన శాస్త్రములైన వేదముల సంప్రదాయములోనివి. ఇందువలన హిందుస్థానీ సంగీతము యొక్క మూలములు మానవ చరిత్రలోని అత్యంత పురాతనమైన సంగీత సంప్రదాయములలోనివని భావించవచ్చును.


నాలుగు వేదములలో ఒకటైన సామవేదము దీనికి సంబంధించిన సంపూర్ణ సాహిత్యమును వివరిస్తుంది. హిందుస్థానీ సంగీతము ధ్యానము రూపములో కూడా కలదు, కానీ ఇది కొందరు అదృష్టవంతులకు మాత్రమే అందుబాటులో కలదు.


హిందుస్థానీ సంగీతము రాగము లు మరియు తాళము లపై ఆధారపడి, మానవ శరీరంలోని వివిధ "చక్రముల"ను ప్రభావితం చేయగలిగి కుండలిని శక్తి దిశగా తీసుకు వెళ్తున్నది. వేదముల యొక్క పద్ధతులు ముఖ్యముగా భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక వికాసములకు తోడ్పడి ఈ చక్రముల ఉత్తేజపరుచుటతో అనుసంధానమై ఉన్నది.


భారతీయ శాస్త్రీయ సంగీతము మానవ సమాజముచే సృష్టించబడిన సంగీత పద్ధతులన్నింటిలో అత్యంత క్లిష్టమైనది మరియు సంపూర్ణమైనది. పాశ్చాత్య సంగీతములోని ఎనిమిది మూల స్వరములు డొ రె మి ఫ సొ ల టి డొ, స రి గ మ ప ద ని స లకు సమానము.


స్వరముల ఆధారముగా పాడే పద్ధతి వేదముల కాలము నాటికే ప్రసిద్ధమైనది. సామ వేదములోని పవిత్ర స్తోత్రములను పాడేవారు కానీ, వల్లె వేసేవారు కాదు. ఇది ఎన్నో శతాబ్దముల నుండి అభివృద్ధి చెంది భారత దేశాన (ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో పాటు) స్థిరపడినది. దక్షిణ భారతము నందు ప్రముఖమైన కర్ణాటక సంగీతము వలె గాక, హిందుస్థానీ సంగీతము ప్రాచీన హైందవ సంస్కృతి, వేదాల తత్వములు, పురాతన శబ్ద వాయిద్యములతో పాటు మొఘల్ సామ్రాజ్యం మొఘల్ పరిపాలనా సమయమునందు పర్షియా దేశపు సంగీత విధానముల కలయిక కలదు.


దక్షిణ ఆసియాకు ఆవల హిందుస్థానీ సంగీతము భారతీయ సంగీతముగా పరిగణించబడటము పరిపాటి. భరత ఖండమునకు ఆవల ఇది అత్యంత ప్రీతిపాత్రమైన సంగీత పద్ధతి అని భావించవచ్చు.


కర్ణాటక సంగీతము మాదిరిగా, హిందుస్తానీ సంగీతము ఆరోహణ, అవరోహణములతో కూడిన రాగముల యొక్క స్వభావములతో క్రమబద్ధీకరించబడినవి. రాగమునందు ఆరోహణ అవరోహణల యందున్న క్రమములో ఒకే స్వరములు ఉండవలెనన్న నిబంధన లేదు. రాగ స్వభావమునకు వాది మరియు సంవాదిలతో కూడిన ఒక ప్రత్యేకమైన అమరికను పకడ్ అంటారు. వీటితో పాటు ప్రతి రాగమునకు అంబిత్, మీండ్యను నిబంధనలు మరికొన్ని ప్రత్యేక లక్షణములు కలవు.


ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభమున, హిందుస్థానీ సంగీతమును ప్రస్తుత థాట్ పద్ధతిన క్రమబద్ధీకరణ చేసిన వారు పండిట్. విష్ణు నారాయణ్ భాత్కండే (1860-1936) గారు. అంతకు ముందు రాగములను రాగ (మగ), రాగిణి (ఆడ) మరియు పుత్ర (శిశు) క్రమమున ఏర్పరచి ఉండేవి.


కళాకారులు, ముఖ్యముగా కచేరి చేయువారు (కృతులను రచించువారు కాదు) జనామోదాన్ని పొందిన తరువాత వారి పేర్లకు హిందువులయితే పండిట్ అని ముస్లిములయితే ఉస్తాదులని కలిపి గౌరవిస్తారు.

చరిత్ర

సంగీతం హిందూ సంస్కృతిలో ఒక ప్రధాన భాగం అయిపోయింది. వైష్ణవ సాంప్రదాయములో సంగీతానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది, సంగీతాన్ని ఆధారంగా చేసుకొని ఎందరో భగవతారాధన చేసి తరించారు. క్రీస్తు పూర్వం 1800 ప్రాంతములోనిదిగా భావించబడుతున్న చందోగ్య ఉపనిషత్తులో ఆనాడు స్వరముల ఆధారముగా వేద మంత్రాలను పాడే విధానం గురించిన విజ్ఞానాన్ని భద్రపరిచారు. అలా గానం చేసే వారిని సమనులు లేదా సామవేదులు అని పిలిచేవారు. వీరు శంకు, వీణ, వేణువు వంటి వాయిద్యాలను ఉపయోగించేవారు. రాగము అను పదము క్రీ.పూ 200 ప్రాంతమున భరతముని చే రచింపబడినదని భావించబడుతున్న నాట్య శాస్త్రములో కనిపిస్తున్నది. ఆ తరువాతి కాలంలో ప్రాచుర్యం పొంది, పురాణాల కాలంలో అనేక విధములైన కళలలో కనిపిస్తున్నది. నారదునిచే రచింపబడిన సంగీత మకరందమను శాస్త్రములో (క్రీపూ 1100) హిందుస్తానీ సంగీతమును పోలిన పద్ధతి కనిపిస్తున్నది. నారదుడు రాగములకు పేర్లు పెట్టి వర్గీకరణ చేసి ఒక విధానాన్ని రచించాడు. 12వ శతాబ్దమున జయదేవుడు అష్టపది అను సాంప్రదాయమున పాడెనని తెలుస్తున్నది.


ఆ తరువాత భారతీయులతో కలిసిపోయిన మొఘల్ సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా జలాలుద్దీన్ అక్బర్ కాలంలో సంగీత నృత్య కళలకు ఆదరణ దొరికింది, అదే కాలానికి చెందినవాడు ప్రముఖ సంగీతకారుడు తాన్ సేన్. అతని రాగాలు (సమయానికి అనుగుణంగా విభజింపబడి) ఎంతో శక్తివంతమైనవిగా చెప్పుకోబడతాయి. అతనొక ఉదయం రాత్రి సమయానికి చెందిన రాగమును పాడుట వలన, నగరమంతా మేఘమయమై చీకటి ఆవరించిందని చెప్పుకుంటారు.


20వ శతాబ్దములో మహారాజుల, నవాబుల బలము క్షీణించింది, దాంతోపాటే వారి పోషణ కూడా. ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) ఏర్పడిన తరువాత కొంత మంది కళాకారులను ఆదుకున్నది. 1902లో ఫ్రెడ్ గైస్‌బర్గ్ అనే ఆయన రికార్డు చేయడంతో మొట్టమొదటగా గౌహర్ జాన్ అనే కళాకారిణి వెలుగులోకి వచ్చింది.

సంబంధిత లింకులు

బయటి లింకులు