"త్రినాథ వ్రతకల్పము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
; త్రినాధులు బ్రాహ్మణుని అనుగ్రహించుట :
త్రిమూర్తుల వద్ద శలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళు చుండగా త్రోవలో ఆవును, దూడను చూసి సంతోషించి " త్రినాదులవారు నాయందు దయ ఉంచి ఆవును ,పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను" అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది, కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు . చేయ వలసిన కార్యక్రమముల నందరికీ విశదముగా తెలియ పరచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెనె మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్దతిని అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాధ పూజ చేసినారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకార్లు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు .
 
; రాజు త్రినాధులను తూలనాడి మేళాను నిషేదించుట :
వారిని చూచి రాజు " మీరందరూ యెందుకు వచ్చినారు ? అని అడుగగా " అయ్యా మాఫిర్యాదుమా ఫిర్యాదు మీరు వినవలయును మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు బిక్ష మెత్తుకుని జీవించెడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాధ మేళాను ఆచరించినాడు .త్రినాదులు యే దేవతలో ? వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి . ఊరిలో నున్నఊరిలోనున్న రైతులు యావన్మంది త్రినాధ మేళా చేసినారు గ్రుడ్డివారు , కుంటివారు, అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమంది నారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు.మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఏలాగున జరుగుతాయి .!" అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు. "త్రినాదులు అనే దేవతలు యేమి దేవతలు ? వారిని మీరు యెందుకు పూజించు చున్నారు. ? నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదువందలఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది . అటుల కాని యెడల శూలం వేయబడునని రాజు గారు ప్రజలందరికి తాఖీదు ఇచ్చి పంపినారు.
 
; త్రినాధులు రాజుపై కోపించుట - యువరాజు మరణము :
ఈ సంగతి త్రినాధుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించి నారు . దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించు చున్నది .ప్రజలందరూ రాజు వద్దకు పరుగెత్తినారు .రాజు దైవ కృప , తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చు చున్నాడు. తల్లి , బంధువులు మొదలగు వారంతా దుఃఖించు చున్నారు. దహనము చేయుటకై స్వర్ణ భద్రాస్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవము నుంచినారు.
 
; త్రినాధుల దయతో యువరాజు బ్రతుకుట :
త్రినాదులకు దయ కలిగినది "రాజ కుమారుని బ్రతికించి వెతుమా ! మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును ." అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్మశానమునకుశ్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూసి "మీరందరూ ఈ నదీ తీరమునకు యెందుల కొచ్చినారు ? ఏల విచారముగా కూర్చున్నారు . ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని యున్నాడు ? ఇతని శరీరములో చల్లదనము కలదే ? అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు . "మీతో ఏమి చెప్పగలం రాజ కుమారుడురాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషము చేసెనో కాని ఈతడు చనిపోయినాడు. " అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాధుల వారికి రాజు అపరాధము చేసినందు న ఈ చావు కలిగినది . ఇప్పుడు మీరందరూ త్రినాధులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు . మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతక గలడనిబ్రతకగలడని చెప్పి త్రినాధ మూర్తులు అదృశ్యులైనారు. .అందరూ వారి మాటలను విని త్రినాధ స్వాముల పేరు ఆ రాజ తనయుని చెవిలో చెప్పినారు. ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు . అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరును సంతోషము ను పొందినారు . అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటినుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి .
 
; వర్తకుడు త్రినాధుల మేళా చేయుటకు మ్రొక్కుకొనుట :
అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ వూరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకు వెళ్ళు చుండెను . ఆ ఓడను నడిపించుకొని స్వర్ణస్వర్ణభద్రా భద్రానదినది తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి జనులారా ! త్రినాధుల పేర్లు యేమి పేర్లు ? మీరేల స్మరించు చున్నారు ? వినడానికి శ్రద్దగా ఉన్నవి . అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా ! వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాధ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజు గారు మన్నించ నందున అపరాదుడైనాడు . ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుట చే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని యున్నాము. ఇది చూచి ప్రభువులకు దయకలిగినది వచ్చి వీనిని బ్రతికించి నారు . అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము .వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని ,షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు లేక్కడుందురో ? చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను .నా ఓడలు ఓడలు ఒడ్డున అడ్డుకొని యున్నవి నేను ఈ ఒడపై వెళ్లి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను . నాకు వ్యాపారంలో నష్టము రాక పోయినట్లయిన ప్రభువులవారికి ఐదు మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపొయినాడు. పైదేశము వెళ్లి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు.
 
; మేళా చేయక పోవుటచే ఓడ మునుగుట :
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/667365" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ