వాడుకరి చర్చ:Vu3ktb: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెత్త తొలగింపు
అనవసరపు ఉదహరింపు తొలగింపు
పంక్తి 83: పంక్తి 83:


=వైజా సత్యగారికి శివ సమాధానం=
=వైజా సత్యగారికి శివ సమాధానం=
సత్యా గారూ, ఇక్కడ జరిగిన ఒక వ్యక్తి చేసిన దురదృష్ట వ్యాఖ్యలవల్ల వికీలో వ్రాయటం మానేశాను. ఇక వ్రాయటమనేది జరుగక పోవఛ్ఛు. చాలా కాలం తరువాత ఇక్కడకు వచ్చాను మీ వ్యాఖ్య ఛూసి ఆశ్ఛర్య పొయాను. ఒక పక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ కు నేను విషయాన్ని విన్నవించినప్పుడు ఘనత వహించిన ఆయన గారు చేసిన వ్యాఖ్య చూడండి:
సత్యా గారూ, ఇక్కడ జరిగిన ఒక వ్యక్తి చేసిన దురదృష్ట వ్యాఖ్యలవల్ల వికీలో వ్రాయటం మానేశాను. ఇక వ్రాయటమనేది జరుగక పోవఛ్ఛు. చాలా కాలం తరువాత ఇక్కడకు వచ్చాను మీ వ్యాఖ్య ఛూసి ఆశ్ఛర్య పొయాను. ఒక పక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ కు నేను విషయాన్ని విన్నవించినప్పుడు ఘనత వహించిన ఆయన గారు చేసిన "ఛెత్త" వ్యాఖ్య చూడగలరు

''''"సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా"''''


తాను ఎంతమందిని "నువ్వు" అన్నాడో కూడ లెక్కపెట్టుకునే మనిషిని ఏమనాలి?
తాను ఎంతమందిని "నువ్వు" అన్నాడో కూడ లెక్కపెట్టుకునే మనిషిని ఏమనాలి?

21:11, 31 డిసెంబరు 2011 నాటి కూర్పు

తెలుగు పతకం

తెలుగు మెడల్
విభిన్న అంశాలపై తెవికీ విస్తృతిని, వాసిని పెంచి విజ్ఞానసర్వస్వానికి విశేష కృషిచేస్తున్న శివరామప్రసాదు గారికి తెవికీ సభ్యులందరి తరఫున తెలుగు పతకాన్ని సమర్పించుకుంటున్నాను --వైజాసత్య
శివ కృతజ్ఞతలు

సత్య గారూ! నమస్తే. నాకు సభ్యుల తరఫున మీరు ఇచ్చిన 'తెలుగు పతకం' అనందంతో తలమునకలవుతూ వినమ్రంగా స్వీకరించాను. నేను వ్రాసిన, వ్రాస్తున్న వ్యాసాలకు ఇది ఒక ఊహించని ఆదరణ, ఒక అద్భుతమైన ప్రోత్సాహపూర్వమైన ప్రేరణ. ధన్యవాదములు.--SIVA 05:07, 3 నవంబర్ 2008 (UTC) --S I V A 07:47, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]


కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. :)
శివగారూ! అభినందనలు, రెండు తెలుగు మెడల్స్ అందుకున్నందుకు. మీరు మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చాక చురుకుగా వ్యాస రచన చేసి మళ్ళీ తెలుగు మెడల్ సాధిస్తారని ఆశిస్తున్నాను. δευ దేవా 10:56, 4 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వివరణల అవసరం

వైజా సత్యగారూ నమస్తే. చాలా కాలం తరువాత మళ్ళీ ఇంటినుండి వికీలో వ్రాయగలుగుతున్నాను. నేను వికీలోకి వచ్చిన తరువాత మీరు మరియు కాసుబాబుగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మీరిచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను అనేక వ్యాసాలు, దిద్దుబాట్లు చెయ్యగలిగాను, చెయ్యటానికి ఉత్సాహం వచ్చింది. కాని, ఈ మధ్య జరిగిన (అతి చిన్న విషయం మీద)జరిగిన సంఘటన(ఎంత కాదని మర్చిపోదామన్నా) చాలా చీకాకు పరుస్తున్నది, మళ్ళీ వ్రాయటానికి మనస్కరించటంలేదు. అందువలన దయచేసి, నాకు కొన్ని వివరణలు ఇవ్వగలరా.

  1. ఈ వారం బొమ్మగా ఒక బొమ్మను పెట్టటానికి ఎన్ని రోజులు, గంటలు,నిమిషాలు, సెకండ్లు వేచి చూడాలి లేదా వ్యవధి ఉండి తీరాలి. అలాంటి నియమం గనుక ఉంటే ఆ నియమం ఆ పుటలోనే ఎందుకు పొందుపరచలేదు. ఆపైన ఈ పని నిర్వాహకులే చెయ్యనక్కర్లేదు, సభ్యులెవరైనా చొరవగా చెయ్యచ్చు అని ఎందుకు వ్రాశారు.
  2. వెరొకరి చర్చా పుటలో మరొక సభ్యుడు వ్యాఖ్య వ్రాసేప్పుడు, ఇక్కడే వ్రాయాలని (కిందనే) అని నియమేమన్నా ఉన్నదా? ఉంటే ఆ నియమం ఎక్కడ వ్రాసి ఉన్నది?
  3. నేను పైన ఉదహరించిన వాటిగురించి లిఖిత నియమాలు లేక పోతే,ఎవరైనా సభ్యుడుగాని, నిర్వాహకుడుగాని లేని నియమాన్ని ఉదహరిస్తే సామాన్య సభ్యుని పరిస్థితి ఏమిటి.
  4. ఏదైనా విషయం గురించి ఇతర సభ్యులు వ్రాయదలచుకొన్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన చర్చా పుటలో కాకుండా, నేరుగా ఆ సభ్యుని చర్చా పుటలో వ్రాయవచ్చునా లేక నిర్వాహకులకు అటువంటి ప్రత్యేక అధికారాలు ఏమన్న ఉన్నాయా. ఉంటే, వికీ నియమాలలో ఎక్కడ ఉన్నాయి.
  5. విషయానికి సంబంధించిన చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్య, నాకు సంబంధించిన చర్చా పుటలో వ్రాస్తే, ఆ వ్యాఖ్య నా చర్చా పుటలో నేను అనవసరం అని బావిస్తే ఆ మాటే వ్రాసి నేను తొలగించకూడదా
  6. చిన్న అభిప్రాయ భేదం వస్తే నిర్వాహకుడైనవారు(ఆ సభ్యునితో ఏమాత్రం చనువు లేని), సభ్యుని వెంటనే "నువ్వు" "నీవు" అని సంభొదించవచ్చునా(మనం వ్యాసాలలో ఎంత గొప్పవారి గురించైనా అతను అని వ్రాయటానికి ఈ విషయం ఒకే గాటన కట్టలేమని నా మనవి), ఒక చిన్న విషయానికి "సభ్యత" వంటి మాటలు వ్రాయవచ్చా.

నేను ఈ వివరణలు అడగటానికి కారణం, భవిష్యత్తులో నేను గాని, ఇతర నాలాంటి సామాన్య సభ్యులెవరైనా గాని, ధాష్టీకానికి, పిడివాదానికి గురికాకుండా ఉండాలని మాత్రమే.

ఈ విషయాలకు మీరు గాని, కాసుబాబుగారుగాని (వారి చర్చా పుటలో కూడ ఈ వ్యాఖ్యని కాపీ చేస్తున్నాను) నాకు వివరించగలరు. ఈ వ్యాఖ్యలు నేను వ్రాయటానికి పురికొల్పిన సంఘటనకు కారణమైన వారు దయచేసి కలుగ చేసుకొనవద్దు--S I V A 03:05, 26 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో చాలా నియమాలు అభివృద్ధి క్రమబద్దీకరించడానికి అభివృద్ధి చెందుతున్న కొద్ది ఏర్పరచుకొన్నవే. మీకో చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక ఊళ్లో ఒక కాలిబాట ఉందనుకోండి అందులో ఎవరిష్టం వచ్చినట్టు వస్తూ వెళుతూ ఉంటారు. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లు, రైట్ అఫ్ వేలు, ఏడమవైపునే నడవటాలు ఇవన్నీ ఉండవు. కానీ ఆ కాలిబాటలో రద్దీ ఎక్కువై అది అభివృద్ధి చెందే కొద్ది కాస్త ఆ విషయం ఆలోచన చేసిన వ్యక్తి వచ్చి బాటలో నడిచేవాళ్లందరూ ఎడమవైపున నడుస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అంటాడు. చాలామంది ఏదో ఒక పద్ధతి బాగానే ఉంది అనుకుని ఆయన చెప్పింది పాటించడం మెదలెడతారు. అదే కాలక్రమంలో మరింత ధృడమై ఒక నియమం అవుతుంది. అలా ఏర్పడే తొలి దశలోనే కొందరు ఎడమ వైపు ఎందుకు నడవాలి కుడివైపున నడిస్తే ఏం పోయింది అని ప్రశించవచ్చు. నష్టమేం లేదు అలాగే నిక్షేపంగా నడవవచ్చు. అలా నియమాలు ఏర్పడే ముందస్తుగా కొంత ఇబ్బంది ఎదురౌతుంది దానికి అనుగుణంగానే కాస్త ఇలా చేస్తే బాగుంటుందేమో ఎవరో ఒకరు ముందుకొచ్చి ప్రతిపాదిస్తారు.
ఇక అసలు విషయానికొస్తే బొమ్మ చేర్చిన ఎన్ని ఘడియలు, విఘడియలకు అది ఈ వారం బొమ్మగా పెట్టగలమో ఇప్పటివరకు తెలుగు వికీలో నియమమేమి లేదు. ఇక్కడ చిన్న ఇబ్బంది ఎదురైంది కాబట్టి ఇప్పుడే మనం కలిసి ఒక నియమం సృష్టిద్దాం. ఒక బొమ్మను ఈ వారం బొమ్మగా పెట్టే ముందు దాన్ని ఈ వారం బొమ్మ పరిగణన అన్న మూస తగిలించి దిన్నీ మొదటి పేజీలో పెట్టాలనుకుంటున్నాం అని తెలియజేయటం కొన్నాళ్ళుగా నడిస్తున్న సంప్రదాయామే. అది కొత్తేమీ కాదు. అలా చేయటం వలన అది ప్రదర్శించడానికి ఇతర సభ్యులకేమైనా అభ్యంతరాలు కానీ ఇతర చర్చలు కానీ చేయటానికి కొంత సమయం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ వారం బొమ్మ పరిగణన మూస అంటించిన తర్వాత కనీసం ఒక నెల రోజులైనా ఆగి దాన్ని మొదటి పేజీలో ప్రదర్శిస్తే బాగుంటుంది. మీరు ప్రదర్శించాలనుకున్న బొమ్మకు ఎవరూ అభ్యంతరపెడతారని కాదు, ఒక పద్ధతి కోసమని అంతే. మీకు ఇతర సూచనలు, ఇతర పద్ధతులు కానీ తొచితే అలాగే చేద్దాం.
ఎవరైనా ఒక పద్ధతిని ప్రతిపాదిస్తే కాలిబాట విషయంలో జరిగినట్టు మొదట ఆ పద్ధతినే ఎందుకు పాటించాలి అని కొంతమందికి అనిపించవచ్చు. అది సహజం. ఎడమవైపే వెళ్ళాలని ప్రతిపాదించిన వ్యక్తిని అలానే ఎందుకు చేయాలో అడిగి తెలుసుకోవచ్చు. అది నచ్చకపోతే ప్రత్యామ్నాయ పద్ధతిని మీరూ ప్రతిపాదించవచ్చు. నియయాలు చేయటానికి నిర్వాహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. చాలా మందికి సభ్యులకు ఏది సబబుగా అనిపిస్తే అదే నియమమౌతుంది. ఉదాహరణకు నాతో పాటు కొందరు నిర్వాహకులు, సభ్యులకు తెవికీ వ్యాసాల్లో ఏకవచనమే ఉపయోగిస్తే బాగుంటుందని అనిపించింది. దాన్ని రచ్చబండలో చర్చించాం. ఆ నియమానికి మద్దతుగా కొన్ని విషయాలను సేకరించి నేను ఒక నియమపు పేజీ వ్రాశాను. రాజశేఖర్ గారితో పాటు కొందరు సభ్యులకు ఆ నియమాన్ని పాటించడం సబబుగా అనిపించలేదు. అందుకే ఆయన వ్రాసేవి ఆయన బహువచనంలోనూ, నేను వ్రాసేవి ఏకవచనంలోనూ ఉంటాయి. చివరకు ఏ పద్ధతి ఎక్కువమంది సభ్యులు పాటిస్తే అదే నెగ్గుతుంది. ఇలాంటి పద్ధతుల్లో తేడా ఉన్నా అందరం కలిసి పనిచేయటానికి ఏనాడూ అడ్డురాలేదు. అయితే మీరు ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రతిపాదిస్తే దాన్ని గల కారణాలు వివరిస్తే చాలా మంది సభ్యులు ఆ పద్ధతి ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
క్రిందనే వ్రాయాలని నియమేమీ లేదు. అదో ఆనవాయితీ మాత్రమే. కొత్త సందేశం వచ్చిందనగానే వెతుక్కోకుండా క్రిందనే ఉంటుందనే ఒక సౌకర్యం. ఆంగ్ల వికీలో నియమంగా ఉందో లేదో కానీ మర్యాదపూర్వకంగా పాటిస్తుంటారు. మీరు పైనే ఎందుకు వ్రాయాలో అని వివరించండి అది బాగుందనుకుంటే అలాగే వ్రాద్దాం ( కాలిబాట ఉదాహారణ లాగా కుడో, ఎడమో ఏదో ఒకటి పద్ధతుంటే బాగుంటుంది). చంద్రకాంతరావు ఇప్పటివరకు ఉపయోగంలో ఉన్న పద్ధతి చెప్పారంతే. నిజానికి వికీలో ఖచ్చితంగా అమలుపరచే నియమాలు ఐదే ఉన్నాయి. మిగిలినవి మార్గదర్శకాలు మాత్రమే.
ఒక వ్యాసం గురించి చర్చను సాధారణంగా ఆ వ్యాసం చర్చా పేజీలోనూ, వెంటనే దానికి సంబంధించిన సభ్యులు కూడా చూడాలనుకుంటే ఆ సభ్యుల చర్చా పేజీల్లోనూ వ్రాస్తారు. ఇది కూడా ఒక పద్ధతి మాత్రమే.
చర్చా పేజీలలో విషయం ఆ సభ్యుని చెందుతుందా, వికీకి చెందుతుందా అన్ని విషయం ఆంగ్ల వికీలో సుదీర్ఘమైన తాత్విక చింతన జరిగింది. దాని పర్యవసానంగా సభ్యుల చర్చాపేజీలను వారు తొలగించమని అడిగినా పూర్తిగా తొలగించకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెవికీలో దీని గురించి చర్చించలేదు కానీ, చర్చా పేజీలను తొలగించడం అంతమంచి పద్ధతి కాదు. దానికి అనేక హేతువులున్నాయి. అవి తర్వాత వ్రాస్తాను. మీరు పైన వ్రాసిన పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అవలంబిగలరనుకుంటే ఇది మొదటిది కావాలని నా కోరిక.
నువ్వు, మీరు అన్నదాని గురించి నేను చర్చించలేను. అది మీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. రాయలసీమలోనూ, తెలంగాణలోనూ నువ్వు అనటం పెద్ద అగౌరవసూచకంగా భావించరు అని మాత్రం చెప్పగలను. వికీ చాలా ప్రత్యక్ష మాధ్యమం కాబట్టి అవతలి వ్యక్తికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి వదిలెయ్యండి. ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగానో, ఫోన్లోనో అయితే రెండు నిమిషాల్లో అనుకున్నదనుకున్నట్టు వివరంచగలిగి ఉండేవాడిని అయితే ఒక పేజీ మొత్తం టకటకలాడించినా మీకు సరైన అర్ధంలో స్ఫురిస్తుందో లేదో తెలియదు. చంద్రకాంతరావు గారు ఇప్పటిదాకా ఉన్న పద్ధతులను వివరించే ప్రయత్నం చేశారనుకుంటాను. అది ఆ స్పిరిట్ తోనే తీసుకొని వదిలెయ్యండి.
చివరిమాటగా వికీలో పట్టూ విడుపూ రెండూ ఉంటాయి. అందరూ ఎవరి పద్ధతిని వారు వెళితే ఇది హైదరాబాదు రోడ్డవుతుంది. కానీ మార్గదర్శకాలు చేయటానికి, వాటిని ప్రభావితం చేయటానికి ప్రతి సభ్యునికి అధికారం ఉంది. నిర్వహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. వికీ పద్ధతులలో అనుభవమున్న వాళ్ళు కొత్తవాళ్లకు మార్గదర్శకం చేస్తూ ఉండటం సాధారణమే దానికి నిర్వాహకుడే కానక్కర్లేదు.

వైజాసత్య 04:25, 26 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

లైట్ తీసుకోండి.

శివా! విషయాన్ని దాటవేస్తున్నందుకు చిరాకుపడవద్దు. ఇది చాలా స్వల్ప విషయం అని మీరే అన్నారు గదా! మీరు ప్రస్తావించినవి ప్రధానంగా దృక్కోణపు వైవిధ్యాలు అని భావిస్తాను. అవి నిర్వాహక నిర్ణయాలు అనుకోవద్దు. వివాదాన్ని అభిప్రాయ భేదాలుగా పరిగణించి లైట్‌ తీసుకోండి. తప్పొప్పులు తేల్చడం నిరుపయోగం. మిమ్ములను నొప్పించే వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను. విషయాన్ని పక్క దారి పట్టించడమే నా వుద్దేశం. ఆడుతూ పాడుతూ చేసే పనిలో ఉన్న మజా టెన్షన్‌తో చేస్తే రాదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:43, 26 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిర్యాదు

సత్యాగారూ, నమస్తే. కాసుబాబుగారి చర్చాపుటలో ఈ క్రింది ఫిర్యాదు వ్రాశాను. దయచేసి, మీరు ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ లో పాలు పంచుకోమని మనవి.--S I V A 18:11, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ, మీరు వ్రాసిన "లైట్‌గా తీసుకోండి" అన్న వ్యాఖ్య బాగానే ఉన్నది. ఈ మాట మీరు నాలాంటి సామాన్య సభ్యునికి చెపుతున్నారు. కానీ నేను విషయాన్ని మూడవ వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళి వివరణలు కోరుతుండగా(ఆ వివరణలో భాగంగా ఆ వివరణలు అడగవలసిన అవసరం కలిగించిన వ్యక్తి దయచేసి కలుగ చేసుకోవద్దని వ్రాసినప్పటికీ), నిర్వాహకుడైన ఈ వ్యక్తి తన సంయమనం కోల్పోయి ఇటువంటి (ఈ క్రింద కాపీ చేశాను)వ్యాఖ్యలు చెయ్యటం భావ్యమేనా. నిర్వాహకుడైన వారికి ఓర్పు, పరిణితి మరియు ముఖ్యంగా సంయమనం ముఖ్యం. వీరి వ్యాఖ్యలలో తెలిసిపోతొంది నన్ను కావాలని "నువ్వు" అని సంభోదించినట్టుగా. చంద్రకాతరావుగారి వ్యాఖ్యల కాపి ఈ కింద ఇవ్వబడినది ఏమిటీ దాష్టీకం, పిడివాదం సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా. -- C.Chandra Kanth Rao-చర్చ 20:47, 26 ఏప్రిల్ 2009 (UTC)

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Vu3ktb" నుండి వెలికితీశారు


ఇంతవరకు జరిగిన సంఘటనలు

  • నేను ఒక మంచి బొమ్మను(ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన కార్టూన్ పాత్ర సామాన్యవ్యక్తి విగ్రహం) వికీలోకి ఎక్కించి, నలుగురికీ బాగా తెలియాలన్న సంకల్పంతో, వెంటనే ఈ వారపు బొమ్మ మూస తగిలించి, అప్పటికే ఉన్న బొమ్మల వరసలో చివరగా ఉంచాను. నేనేమి ఉన్న వరుస చెదర్చలేదు, ఈ బొమ్మకు ప్రాధాన్యమిచ్చి ఇతర బొమ్మలను వెనుకకు తొయ్యలేదు. ఒక నిర్వాహకుల వారు, ఈ బొమ్మ ఏమిటి? బొమ్మ ప్రాశస్త్యమేమిటి? అన్న విషయాలను అసలు పరిగణలోకి తీసుకోకుండా ఈ వారపు బొమ్మ పుటలో లేని నియమాలను ఉట్టంగిస్తూ బొమ్మ ను ఈ వారపు బొమ్మల వరుసలోనుండి తొలగించారు. ఆపైన ఆ బొమ్మ చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్యను నా చర్చా పుటలో వ్రాశారు. అటువంటి వ్యాఖ్య నా చర్చా పేజీలో ఉండటం అనవసరం అని తోచి, అదే మాట వ్రాసి తొలగించాను.
  • దీనికి ఈ నిర్వాహకులవారు మళ్ళీ నా చర్చా పుటలో "ఇది సభ్యత కాదు" అన్న హెడ్డింగు పెట్టి ఎమేమో వ్రాసి తన అక్కస్సును వెళ్ళగక్కారు. ఇంత చిన్న విషయానిమి సభ్యత వంటి మాటలు వ్రాసి ఆవతలి వారిని క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయటం భావ్యం కాదని తలచి, నేను ఆ నిర్వాహకుని పుటలో హెడ్‌మాస్టర్ లాగ ప్రవర్తించవద్దని, సభ్యులను నిరుత్సాహపరచవద్దని నా వ్యాఖ్యలు వ్రాశాను. దానికి వారుకూడ తన చర్యలను సమర్ధించుకుంటూ తాను వ్రాయగలిగినది వ్రాశారు. నేనుకూడ సామరస్యపూర్వకంగ స్పందిస్తూ విషయాన్ని ముగించాను.
  • ఈలోగా దేవాగారు, ఈ నిర్వాహకులవారి చర్చాపుటలో సహనం పాటించమని వారిని కోరుతూ రెండు వ్యాక్యాలువ్రాస్తే, దానికి వీరు దాదాపు పేజీడు వ్యాఖ్యవ్రాసి అందులో చాలా ఇండైరెక్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇది చూసిన నాకు అనిపించింది, అసలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, నియమాలు ఏమిటి తెలుసుకుందామని.
  • కాబట్టి మన వికీ రూల్స్ ప్రకారం మూడవ వ్యక్తులను (వైజా సత్య గారిని, కాసుబాబుగారిని)వివరణ కావాలని అడిగాను. ఈ నిర్వాహకుడి తొందరపాటుతనం ఇంతకుముందే తెలుసు కనుక, నేను వివరణలు అడగటానికి పురికొల్పిన సంఘటనలకు కారణమైన వారు దయచేసి కలుగచేసుకొనవద్దు అనికూడ చివరలో వ్రాశాను(వారి పేరును ఎక్కడా కూడ వ్రాయలేదు).
  • వైజా సత్యగారు ఎంతో పెద్దమనిషి తరహాలో నాకు కొంత సంయమనపరచటానికి చల్లటి మాటలతో నా చర్చా పేజీలో వ్యాఖ్య వ్రాశారు. కాసుబాబుగారు, లైట్ తీసుకోండి అన్నారు. నేను సత్యా గారు వ్రాసిన పాయింట్లకు నా పక్కనుండి కొన్ని సూచనలు (వారు వారి వ్యాఖ్యలో కోరిన ప్రకారం)వ్రాద్దామనుకున్నాను.
  • ఈలోగా, ఈ నిర్వాహకులవారు తన తోటి నిర్వాహకులైన సత్యాగారు, కాసు బాబుగారు వ్రాసిన వ్యాఖ్యలు లెక్క చెయ్యకుండా(వీరి వ్యాఖ్యలకిందే ఈ నిర్వాహకులవారు వ్రాశారు) ఎక్కడలేని తామసాన్ని ప్రదర్శిస్తూ, నన్ను ఏకవచన ప్రయోగం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారు(పైన కాపీ చేసినవి). ఇప్పటికి కూడ నేను నా సభ్యతను కోల్పోకుండా వారిని గౌరవంగానే సంభోదిస్తున్నాను.

నిర్వాహకుడైనటువంటివారికి తామసం పనికిరాదు. ఓర్పు అవసరం అసహనం పనికిరాదు. విషయం విలువ పట్టించుకోకుండా ఎక్కడా వ్రాతలో కనపడని నియమాలు బోధించటానికి ప్రయత్నించటం,తాను చెప్పినదే వేదమన్నట్టుగా వ్యవహరించటం, దురుసైన భాష, పిడివాదం కాక మరేమవుతుంది. సామాన్య సభ్యులమీద కోప తాపాలు చూపటం, అనుచిత భాష వాడటం, తటాలున (at the drop of a hat, with least provocation)ఆవతలి వ్యక్తిని ఏకవచన ప్రయోగం చెయ్యటం, సభ్యత అంటూ వారి కారెక్టర్ గురించి వ్యాఖ్యలు చెయ్యటం ధాష్టీకం కాక ఏమిటి. వికీ అంటే ఈ నిర్వాహకుల వారు తమ సొంత జాగీర్దారు అనుకుంటున్నారా. మాట్టాడితే నేను గమనిస్తున్నాను, నేను గమనిస్తున్నాను అని వ్యాఖ్యలు. సామాన్య సభ్యులు కూడ గమనిస్తూనే ఉంటారు వారు చేస్తున్న పనులు, చేస్తున్న వ్యాఖ్యలు. వారు వ్రాసిన ప్రతి మాటలోను తాను నిర్వాహకుడినన్న అహంకారం తొణికిసలాడుతూ ఉంటుంది. నేను వికీలో చేరినది మొదలు కాసుబాబు, వైజాసత్య, రాజశేఖర్ గార్లు తదితర నిర్వాహకులు ఎంతో చక్కగా తోటి సభ్యులను ప్రోత్సహిస్తూ, అవసరమైన చోట సున్నితంగా చక్కటి ఆహ్లాదకరమైన భాషలో వారిని సరిచేస్తూ చెప్తూంటారు. వారెక్కడ, ఈ నిర్వాహకులవారెక్కడ

నేను కూడ ఘాటుగా స్పందించగలను, కానీ నేనుకూడ నా సంయమనాన్ని కోల్పోతే సరికాదు అన్న విషయాన్ని తెలిసినవాడినై,ఈ విషయంలో నేను వివరణలుగా కోరిన విషయాలను, మరియు నేను పైన ఉదహరించిన విషయాలను నా ఫిర్యాదుగా తీసుకుని, పైన కాపీ చేయబడిన చంద్రకాతరావుగారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారి మీద తగిన చర్య తీసుకొనమని కోరుతున్నాను. ఇదే విషయం వైజా సత్యగారి చర్చా పుటలో కూడ వ్రాస్తున్నాను. ఈ dispute resolution ప్రక్రియ జరుగుతుండగా, శ్రీ చంద్రకాంతరావుగారిని ఈ విషయం మీద ఎక్కడా కూడ వ్యాఖ్యలు చెయ్యకుండా (డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా తప్పితే) కట్టడి చెయ్యమని మనవి, భరించలేకుండా ఉన్నాను వారి అనుచిత వ్యాఖ్యల భాష.

నాకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి నన్ను వికేలోకి ఆకర్షించింది. అమరావతి కథలు, చందమామ వ్యాసం విస్తరణ, ఇల్లాలి ముచ్చట్లు, చలం వ్యాసం విస్తరణ, కార్టూనిస్టుల మీద వ్యాస పరంపర వ్రాశాను, ఇప్పటివరకు రెండు పతకాలను సంపాయించుకున్నాను. అటువంటి వికీ లో నేను ఇటువంటి ఫిర్యాదు వ్రాయవలసి రావటం దురదృష్టకరం.--S I V A 17:58, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కలగజేసుకుంటున్నందుకు క్షమించండి

శివగారూ! మీరు ఏమీ అనుకోనంటే చిన్న మనవి చేస్తాను. మీకు నా మాటలు నచ్చకపోవచ్చు, కానీ ఒక సాధారణ వికీ సభ్యుడిగా (నేనేమీ నిర్వాహకుడిని కాదు, అయినా చొరవ తీసుకుంటున్నాను), తెలుగు వికీ వీరాభిమానిగా మిమ్మల్ని ఫిర్యాదు వెనక్కి తీసుకోమని కోరుతున్నాను. నేను ఒకే ఒక్క విషయం చెప్పదలచుకున్నాను, ఏకవచనం తెలంగాణాలో సర్వసాధారణం, పెద్దవారిని కూడా నువ్వు అని సంభోదిస్తారు. కొంచెం ఆవేశంలో ఉన్నప్పుడు మాటలు తడబడవచ్చు, కానీ ఉద్దేశ్యం అది కాకపోవచ్చు. ఇది ఒక విన్నపం మాత్రమే! మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. ముందుగా కృతజ్ఞతలతో! δευ దేవా 17:42, 30 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పునఃస్వాగతం

శివగారూ! నా విన్నపాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు.δευ దేవా 17:38, 6 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీరూ, చంద్రకాంత్ గారూ మళ్ళీ ఉత్సాహంగా రచనలు చేస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు జరిగిన విషయం మర్చిపోయి మళ్ళీ మీరిరువురూ సహృద్భావంతో రచనలు చేస్తారని ఆశిస్తున్నాను. δευ దేవా 17:42, 6 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శివ నుండి సందేశం

సత్యాగారూ! నమస్తే. చాలాకాలానికి మళ్ళీ వికీలోకి వచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదు మీద ఏమాత్రం స్పందించకపోవటం శోచనీయం.మీ సమాధానంకోసరం ఎదురు చూస్తూనే ఉన్నాను. తరువాత ఒకసారి 20 వారంనికి ఈవారం బొమ్మని చూడండి. బొమ్మ అద్భుతంగా ఉన్నది ఆ బొమ్మ ఈ వారం బొమ్మగా పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఫొటో తీసినవారికి, ఈ వారం బొమ్మగా పెట్టినవారికి నా అభినందనలు . కాని, నాకు ఒక సందేహం. వ్రాసి ఉన్న నియమాలు (బొమ్మ ఏదో ఒక వ్యాసంలో ఉండి తీరాలి)కాక వ్రాసిలేని, ఊహాజనిత నియమాలు, నాకు ఉపదేశించటానికి ప్రయత్నించబడిన నియమం(బొమ్మ కొన్నళ్ళు ఊరగాయలాగ ఊరాలి) కూడ ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటంలో పాటించలేదు. నేను ఈ వ్యాఖ్య చేయటంలో ఉద్దేశ్యం ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటం ఎద్దేవా చెయ్యటం ఎంతమాత్రం కాదు. నియమాలు ఉండాలి కాని వాటికి మినహాయింపులుకూడ ఉండాలి,బొమ్మ విలువని బట్టి. నా వాదన 20 వ వారం బొమ్మ తొ సరైనదని తేలుతున్నది.

ఏది ఏమైనా నిర్వాహకుడైన వారు అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం, దురుసుగా ప్రవర్తించటం తగదు (సామాన్య సభ్యులు చెయ్యచ్చు అని కాదు నా అభిప్రాయం). అందుకనే నా ఫిర్యాదు. మీరు తగిన విధంగా స్పందించగలరు, మళ్ళినేను ఉత్సాహంగా వికీలో వ్యాసాలు వ్రాయటానికి ప్రొత్సాహాన్ని అందించగలరు.--S I V A 12:48, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఫిర్యాదుకు త్వరలోనే స్పందిస్తాను. ఆలస్యానికి క్షమించండి. ఏకబిగిన రెండు పేజీలు వ్రాయటానికి ఉత్సాహము, ఓపిక, సమయం లేకే ఇన్నాళ్ళూ బద్దకించాను. ఈ వారాంతంలోపు వ్రాస్తాను. --వైజాసత్య 13:13, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
సత్యాగారూ!క్షమించటం వంటి పెద్ద మాటల అవసరం లేదండీ. మనం ఇక్కడకు వచ్చి వ్రాయటానికి ప్రయత్నించేది మనదగ్గరున్న సమాచారాన్ని నలుగురితో పంచుకోవటానికి కాని, ముక్కూ మొహం తెలియనివారితో మాటలు పడటానికి కాదుకదా. నా ఉద్దేశ్యంలో, నియమాలు ఏమయినా సరే వ్రాతలో నే ఉండాలి, సంప్రదాయం, ఆచారం లాంటివి అనవసర వివాదాలకు అపార్ధాలకు దారి తీస్తాయి. వ్రాసిన నియమాలను అవసరమైన మినహాయింపులు సమయానుకూలంగా చేస్తూ ఉండాలి. మన రాజ్యాంగమే అందుకు మంచి ఉదాహరణ (అనేక సార్లు మార్చబడిన వ్రాసి ఉన్న రాజ్యాంగం).ఈ వివాద పరిష్కారం మీకే ఒదిలిపెడుతున్నాను.--S I V A 12:08, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శివ గారి ఫిర్యాదుకు నా సమాధానం

ఇది చాలా చిన్న విషయం. చిలికి చిలికి గాలివాన చేశారు. ఇందులో ఇరుపక్షాలకూ బాధ్యత ఉంది అని నేను భావిస్తున్నాను. శివ గారు సగటు మనిషి బొమ్మను అప్లోడు చేసి ఉత్సాహంతో దాన్ని ఈ వారం బొమ్మ మూస తొడిగి వరుసలో ఉంచారు. అది హఠాత్తుగా అక్కడ చేరటం సాంప్రదాయనికి విరుద్ధంగా ఉంది అని చంద్రకాంతరావు గారు దాన్ని తొలగించి, అందుకు కారణాన్ని వివరిస్తూ శివ గారి సభ్యుల పేజీలో వ్యాఖ్యను వ్రాశారు. దాన్ని ఈ దిద్దుబాటు లింకులో చూపినట్టు దాన్ని శివగారు అనవసర వ్యాఖ్యగా దిద్దుబాటు మార్పులో వ్రాసి తొలగించారు. అది శివగారు తొలగించాల్సింది కాదు. అది తొలగించినా అనవసర వ్యాఖ్యగా కొట్టివేయాల్సిన అవసరం అసలు లేదు. ఇంతకు ముందు కూడా నేను ఈ విషయంపై ఆయనకు జవాబిస్తూ వ్రాసినట్టూ, మనల్ని విమర్శించడం, మన వ్రాతల్ని విమర్శించడం చాలా భిన్నమైన విషయాలు. ఎదుటి వ్యక్తి మంచిమనసుతోనే ఏదైనా మార్పు చేశాడని భావించడం వికీ మర్యాదల్లో ఒకటి. అది శివగారికి తెలుసో, తెలియకో ఉల్లంఘించారు. కానీ ఆ తర్వాత చంద్రకాంతరావు గారు "ఇది సభ్యత కాదు" అన్న వ్యాఖ్యలో శివగారిని వ్యక్తిగతంగా విమర్శించారు. ఇక్కడ చంద్రకాంతరావు గారు, శివగారికి తనపై కోపం వచ్చి ఆ వ్యాఖ్యను తొలగించారని అన్వయించి ఏకవచన ప్రయోగం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. ఆ తర్వాత మరోచోట ఏకవచన ప్రయోగం అగౌరపూర్వకం కాదని సమర్ధించుకున్నారు. కానీ అదే వ్యాఖ్యలో కావాలనే ఏకవచన ప్రయోగం ఉపయోగించినట్టు ఆయనే ఒప్పుకున్నారు.[1]. ఇక్కడ మళ్లీ లక్షన్నొక్కసారి మనవి చేసుకునేదేవిటంటే వికీ అప్రత్యక్ష మాధ్యమం. అవతలి వారి అంతరంగాన్ని ఇక్కడ చర్చా పేజీల వ్రాతల్లో చాలామటుకు పట్టలేం కాబట్టి వీలైనంత ఎదుటి వారికి బెనిఫిట్ ఆఫ్ డౌటివ్వాలి. చంద్రకాంతరావు గారికి ఈ విషయం తెలుసనే నేను భావిస్తున్నాను. కానీ దీన్ని విస్మరించడం శోచనీయం. దీన్ని ఇంతటితో శివగారు కూడా ఆపలేదు. ఆయనా చంద్రకాంతరావు గారి మీద పిడివాదం, కొత్త సభ్యుల దాష్టీకం అంటూ వ్యక్తిగత దాడికి దిగారు. ఇంతకంటే వివరణాత్మకంగా ఈ విషయంలో వెళ్ళటం అనవసరం అని అనుకుంటాను. శివగారు, ఈ వ్యాఖ్యలోని ఆరవ పాయింటులో అన్నట్టు ఇది చిన్న అభిప్రాయ భేధమే. ఇద్దరిలో ఏ ఒక్కరైనా సంయమనం పాటిస్తే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. ఈ ఇద్దరూ తమదైనా శైలిలో తెలుగు వికీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసినవారే. మీ ఇరువురి అవసరం తెవికీకి ఉన్నది. ఇద్దరూ పరస్పరం క్షమాపణలు చెప్పుకొని విబేధాల్ని మరచిపోయి అంతర్జాలంలో తెలుగు పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగురవేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనందరం చేరింది ఒక తరతరాలకు నిలిచిపోయే ఒక మహోన్నత కార్యం కోసమని గుర్తుంచుకోవాలి. పెద్దపెద్ద దేశాల్లో చిన్న చిన్న సంగతులు జరుగుతూనే ఉంటాయి లైట్ తీసుకోండి బ్రదర్స్. --వైజాసత్య 05:58, 8 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వైజా సత్యగారికి శివ సమాధానం

సత్యా గారూ, ఇక్కడ జరిగిన ఒక వ్యక్తి చేసిన దురదృష్ట వ్యాఖ్యలవల్ల వికీలో వ్రాయటం మానేశాను. ఇక వ్రాయటమనేది జరుగక పోవఛ్ఛు. చాలా కాలం తరువాత ఇక్కడకు వచ్చాను మీ వ్యాఖ్య ఛూసి ఆశ్ఛర్య పొయాను. ఒక పక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ కు నేను విషయాన్ని విన్నవించినప్పుడు ఘనత వహించిన ఆయన గారు చేసిన "ఛెత్త" వ్యాఖ్య చూడగలరు

తాను ఎంతమందిని "నువ్వు" అన్నాడో కూడ లెక్కపెట్టుకునే మనిషిని ఏమనాలి?

నేను ఒకపక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ కు విషయాన్ని మీకు విన్నవించి ఉండగా అతగాడు పై విధంగా వ్యాఖ్యలు ఛెయ్యటం ఎంతవరకూ వికీ సాంప్రదాయాల ప్రకారమో మీరే నిర్ణయిఛి అతగాడికి తెలియఛెయ్యండి. నాకు మీరు చేసిన డిస్ప్యూట్ రిజల్యూషన్ నచ్చలేదు. నా ఫిర్యాదు అలాగే ఉన్నది. నా ఫిర్యాదును వాపసు తీసుకోను. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు ఛేస్తూ చురుకుగా వ్యాసాలు వ్రాసే వారిని నిరుత్సాహపరచటమే అతగాడి ధ్యేయంగా కనపడుతున్నది. తాను తప్ప ఇతరులెవరూ వ్రాయకూడదనేమో. ఇన్ని ఎక్కడా కనపడని నియమాలు ఛెప్పే మనిషి తనపేరుకు అన్ని రంగులు ఎందుకో, దానికేమీ నియమాలు లేవా??

ఈ వారం బొమ్మ పెట్టటంలో ఉన్న నిబంధనలు ఎక్కడ వ్రాసి ఉన్నాయి, ఇన్నాళ్ళ తరువాత మాత్రమే .బొమ్మను ఈ వారపు బొమ్మగా పెట్టాలి అన్న నియమం ఎక్కడ ఉన్నది చూపించండి. అలాంటి లిఖిత నియమం లేకపోతే నేను పెట్టిన బొమ్మను తీసేయటమే కాకుండా నా చర్చా పేజీకి వచ్చి వ్యాఖ్య చేయటం ఎంతవరకు సమంజసం? నేను ఛురుకుగా లేని సభ్యుణ్ణని ఒకకుంటి సాకు! ఒక అరుదైన బొమ్మను ఈ వారపు బొమ్మగా పెట్టి అందరికీ తెలియఛేద్దామన్న నా ఉత్సాహానికి ప్రతిగా ఇంత అల్లరా పైగా అటువంటి అల్లరి ఒక నిర్వాహకుడి వల్లనా?

ఇంతకు ముందు చెప్పినట్టుగా వికీలోకి వచ్చి నేను వ్రాయటం నాకు తెలిసినది చెప్పటానికే కాని ఇతరుల మీద ధాష్టీకం ఛెయ్యటానికి పిడివాదాలు వినిపించటానికి కాదు. అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడటానికి అంతకంటే కాదు. మొదట్లో కాసుబాబుగారి పరిచయం అవ్వటం వల్ల నేను కొన్ని వ్యాసాలు వ్రాయటం జరిగింది. నేను చేసిన కృషికి రెండు పతకాలు కూడ ఇవ్వబడ్డాయి. మొదట్లోనే ఇలాంటి దురుసైన, మర్యాద తెలియని మనిషి ఎదురుపడితే రెండో రోజే తెలుగు వికీకి రావటం మానేసేవాణ్ణి. ఇలాంటి వాడి వల్ల ఇంకెంతమంది ఝడుసుకుని వెళ్ళిపోయారో/వెళ్ళి పోతున్నారో చూసుకోండి.

మీరు నా ఫిర్యాదును సవ్యంగా పరిష్కరింఛినా లేకపోయినా నేను వికిలో మళ్ళి వఛ్ఛి వ్రాయటం అనేది జరుగదు. ఈ దురుసైన వ్యక్తి వల్ల ఇక్కడ వ్రాయటం అంటే అసహ్యం వేసిపోయింది. ఇప్పుడు వచ్చి ఈ మాత్రం వ్రాయటమే నాకు బాగాలేదు. శలవు.

క్షమాపన

శివరామ ప్రసాదు గారికి, మీకు జరిగిన మనస్తాపానికి క్షమించండి. వికీపీడియా ఏ ఒక్కరిదో కాదు మనందరిదీ. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు మొత్తం సంస్థనే వెలివేయడం సబబనిపించడం లేదు. విజ్ఞత గల మీలాంటి వారు మాకెంతో అవసరం. మన తెలుగువారం గర్వించదగ్గ భాషా సేవ వికీద్వారా జరుగుతున్నది. అందులో మీరందించిన సమాచారం చాలా విలువైనది. కాలం ఇప్పటికీ మీ కోపాన్ని కొంత తగ్గించివుంటుందని, మల్లీ మీరు వికీలో చేరి మాకందరికీ మార్గదర్శకంగా ఉంటారని మనసారా కాంక్షిస్తూ, ప్రార్ధిస్తున్నాను. కొత్త సంవత్సరం పాతకాలంలో జరిగిన చేదు జ్ఞాపకాల్ని మరచి, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుదాము.Rajasekhar1961 12:15, 31 డిసెంబర్ 2011 (UTC)

రాజశేఖర్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. --అర్జున 13:05, 31 డిసెంబర్ 2011 (UTC)

శివ స్పందన

రాజశేఖర్ గారూ మీ సందేశానికి కృతజ్ఞతలు. అర్జున్ గారూ థాంక్యూ.

వికీ సాంప్రదాయమ్ ప్రకారం ఎవరన్నా ఒక సభ్యుడు సవ్యంగా ప్రవర్తింఛనప్పుడు, ఆ సభ్యుని వల్ల మనస్థాపానికి గురైన ఇతర సభ్యులు ఫిర్యాదు ఛేసుకునే సౌకర్యం ఉన్నదని నేను వ్రాసే రోజుల్లో అనుకున్నాను. కాని అడ్మినిస్ట్ట్రేటర్గా ఛెప్పుకునే ఒక వ్యక్తి తప్పు ఛేస్తే ఫిర్యాదులు తీసుకోరని, తీసుకున్నా వాటిమీద ఛర్య ఉండదని తరువాత బాధా పూర్వకంగా తెలుసుకున్నాను. మర్యాద తెలియని ఎడ్మినిస్ట్రేటర్లు ఉండే ఈ వికీ పీడియాలో వ్రాసి మనస్థాపానికి గురవటం నాకు ఇష్టం లేదు. అందుకనే దూరం గా ఉండి, నా బ్లాగులో నేను వ్రాయదలుఛుకున్నవి వ్రాస్తున్నాను. ఇన్నాళ్ళ తరువాత కూడా ఆ వ్యక్తి ఛేసిన దురుసు ప్రవర్తన తలుఛుకుంటే, మొత్తం వికీ అంటేనే అసహ్యం కలిగింఛాడు. ఎంతమాత్రం మర్యాద అన్న మాటకు అర్ధం తెలియని వ్యక్తికి అతనికి తెలియని విషయాన్ని ఛెప్పలేని అసహయ స్థితిలో ఉన్న వికీ మీద జాలి తప్ప నాకు మరేమీ లేదు.

రాజశేఖర్ గారూ, అర్జున్ గారూ మీరు ఛొరవ తీసుకుని నాకు సందేశం ఇఛ్ఛినందుకు ధన్యవాదాలు.