"శంకరంబాడి సుందరాచారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
 
==సాహితీ వ్యాసంగం==
 
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ [[తేటగీతి]] ఆయన ఎంతో ఇష్టపడ్డ [[ఛందస్సు]]. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. "నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం" అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన '''[[మా తెలుగు తల్లికి మల్లె పూదండ|మా తెలుగు తల్లికి..]]''' కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.
 
 
[[మహాత్మా గాంధీ]] హత్య జరిగినపుడు ఆవేదన చెంది, '''బలిదానం''' అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత [[పులికంటి కృష్ణారెడ్డి]] చెప్పాడు.
 
 
'''సుందర రామాయణం''' అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే '''సుందర భారతం''' కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా '''శ్రీనివాస శతకం''' రచించాడు. ఇవే కాక ''జపమాల'', ''బుద్ధగీతి'' అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.
 
 
రవీంద్రుని '''[[గీతాంజలి]]'''ని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ''[[ఏకలవ్యుడు]]'' అనే [[ఖండకావ్యం]], ''కెరటాలు'' అనే గ్రంథం కూడా రచించాడు. ''సుందర సుధా బిందువులు'' అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. ''[[జానపద గీతాలు]]'' వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/696898" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ