కార్తీకమాసం: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము కలుపుతున్నది: de:Kartik |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 88: | పంక్తి 88: | ||
== ఇవి కూడా చూడండి == |
== ఇవి కూడా చూడండి == |
||
* [[కార్తీక దీపం]] |
* [[కార్తీక దీపం]] |
||
* [[కార్తీక సోమవారం]] |
|||
{{తెలుగు నెలలు}} |
{{తెలుగు నెలలు}} |
10:31, 22 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
కార్తీక మాసము తెలుగు సంవత్సరం లో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.
హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రదమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
- న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
- న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు కలవు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.