రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Dr_Keshav_Baliram_Hedgewar_home.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:MBisanz. కారణం: (Per commons:Commons:Deletion requests/Files uploaded by Katyare).
చి Golwalkar_Sangha_pracarak_राष्ट्रीय_स्वयंसेवक_संघ.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:MBisanz. కారణం: (Per [[commons:Commo...
పంక్తి 16: పంక్తి 16:
File:Lion icon painting at राष्ट्रीय स्वयंसेवक संघ karyalay Nagpur Maharashtra.JPG
File:Lion icon painting at राष्ट्रीय स्वयंसेवक संघ karyalay Nagpur Maharashtra.JPG
File:राष्ट्रीय स्वयंसेवक संघ international volunteers.JPG
File:राष्ट्रीय स्वयंसेवक संघ international volunteers.JPG

File:Golwalkar Sangha pracarak राष्ट्रीय स्वयंसेवक संघ.JPG
File:Sangha pracarak राष्ट्रीय स्वयंसेवक संघ.JPG
File:Sangha pracarak राष्ट्रीय स्वयंसेवक संघ.JPG
File:Sangha pracarak स्वयंसेवक संघ.JPG
File:Sangha pracarak स्वयंसेवक संघ.JPG

00:56, 27 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆంగ్లం: Rashtriya Swayamsevak Sangh, హిందీ: राष्ट्रीय स्वयंसेवक संघ)ను సంక్షిప్తంగా ఆర్.యస్.యస్. అంటారు. భారత దేశంలో ఇది ఒక హిందూ జాతీయ వాద సంస్థ. డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్ర లోని నాగపూర్ లో 1925 లో విజయదశమి నాడు మొదలు పెట్టారు,

భారత దేశపు ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం.[1] ఆర్. యస్.యస్. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా భావిస్తుంది.[2] భారతజాతిని మరియు భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి వారిని సేవించటం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించటం తమ ఆశయంగా ఈ సంస్థ ఉద్ఘాటించింది.

ఆర్.యస్.యస్. వాదులు గేరువా పతాకం (కాషాయ జండా)ను తమ పరమ గురువుగా భావిస్తారు. ఈ సంస్థ యొక్క సర్వోన్నతమైన నాయకుడిని సర్ సంఘ్ చాలక్ గా వ్యవహరిస్తారు. 1948 లో మహాత్మా గాంధీ హత్యానంతరం, 1975 ఎమర్జెన్సీ సమయంలో మరియు 1992 బాబ్రీ మసీదు విధ్వసానంతరం ఈ సంస్థ మీద నిషేధం విధించి మరలా తొలగించడం జరిగినది. ఆర్.యస్.యస్. మొదటినుంచి ఒక వివాదాస్పద సంస్థగానే కొనసాగింది. హిందూ ముస్లిం కొట్లాటలలో హిందువులకు ఆత్మరక్షణ కల్పించటం, ముస్లిం వర్గాల దాడులను తిప్పి కొట్టటం ఈ సంస్థ కార్యకలాపాలలో ఒకటి. కొందరు విమర్శకులు దీనినొక ఫాసిస్టు సంస్థ గా అభివర్ణిస్తారు.

ఆర్.యస్.యస్. మరియు దీని అనుభంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్ అని పిలుస్తారు. భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ వీటిలో ముఖ్యమైనవి. ఆర్.యస్.యస్. తోపాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు.

ఈ సంస్థకు 1925 నుండి 1940 వరకు సర్ సంఘ్ చాలక్ గా పనిచేసిన ఈ సంస్థ వ్యవస్థాపకుడు కె.బి.హెడ్గేవార్, ఆయన తరువాత 1940 నుండి 1973 వరకు ఆ పదవిలో పనిచేసిన మాధవ్ సదాశివ్ గోల్వల్కర్ మరియు తదుపరి 1973 నుండి 1993 వరకు ఆ పదవిలో పనిచేసిన మధుకర్ దత్తాత్రేయ దేవరస్ ఈ ముగ్గురూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారత దేశమంతటా విస్తరించటానికి ఎనలేని కృషి చేశారు.

ఈ సంస్థ అనేకానేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఏవైనా విపత్తులు సంభవించినపుడు పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని నిరుపమానమైన సేవలందిస్తుంది.

ఆర్.ఎస్.ఎస్. అధినేతలుగా పనిచేసివారు

  • 1925 నుండి 1940: కేశవ్ బలిరాం హెగ్డేవార్.
  • 1940 నుండి 1973: గురూజీ గోల్వాల్కర్.
  • 1973 నుండి 1994: బాలాసాహెబ్ దేవరస్.
  • 1994 నుండి 2000: రజ్జూ భయ్యా.
  • 2000 నుండి 2009: సుదర్శన్.
  • 2009 నుండి ప్రస్తుతం వరకు: మోహన్ భగవత్.

బయటి లింకులు

మూలాలు

  1. Christophe Jaffrelot, The Hindu nationalist Movement in India, Columbia University Press, 1998
  2. Q & A: Ram Madhav The Hindu - April 14, 2004