బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ga:Gual
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ka:ნახშირი (წიაღისეული)
పంక్తి 76: పంక్తి 76:
[[ja:石炭]]
[[ja:石炭]]
[[jv:Batu bara]]
[[jv:Batu bara]]
[[ka:ნახშირი (წიაღისეული)]]
[[kk:Көмір]]
[[kk:Көмір]]
[[ko:석탄]]
[[ko:석탄]]

01:52, 10 మార్చి 2012 నాటి కూర్పు

బొగ్గు
బొగ్గు రసాయనిక నిర్మాణం.

బొగ్గు (Coal) భూగర్భంలో లభించే ఒక ఇంధనము. ఇది భూమిలో అంతర్గతమైన వృక్ష అవశేషాల రూపాంతరము. ఒక రకమైన రాక్షసి బొగ్గు రాయిలాగా గట్టిగా ఉంటుంది. బొగ్గులో ముఖ్యమైన మూలకం కార్బన్. ప్రపంచ వ్యాప్తంగా విద్యుతుత్పత్తి అత్యధికంగా బొగ్గునుండే జరుగుతుంది. బొగ్గు గనుల నుండి బొగ్గును తవ్వి తీస్తారు. కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా బొగ్గునుండే తయారవుతుంది.

పూర్వ చరిత్ర ప్రారంభంలో బొగ్గు వెలికితీత చిన్న తరహా జరిగినది, ఉపరితలంపై గాని ఉన్న, లేదా బొగ్గు చాలా దగ్గరగా. వెలికితీత కోసం ప్రత్యేక పద్ధతులు ఉరవడి గనులు మరియు బెల్ గుంటలు ఉన్నాయి. అలాగే ఉరవడి గనుల, చిన్న తరహా కొసం షాఫ్ట్ మైనింగ్ ను ఉపయోగించారు. ఒక బెల్ గుంత పట్టింది రూపంలో, కేంద్ర షాఫ్ట్ నుండి బయటికి వెలికితీత లేదా రుమ్ మరియు పిలర్ పద్ధతులు అని అంటారు. ఈ 2 పద్ధతులు అయితే వెనుక ఉపయోగపడే బొగ్గు గణనీయమైన మొత్తంలో మిగిలి

ఉపయోగాలు

  • బొగ్గును వంట కోసం వాడుకోవచ్చును.
  • బొగ్గును ఉపయోగించి నీటి ఆవిరిని తయారు చేసి, రైలు బండిని నడిపిస్తున్నారు.
  • బొగ్గును ఇంధనంగా విద్యుత్తును తయారుచేస్తున్నారు.

చెట్ల నరికివేత-బొగ్గు బట్టీ నిబందనలు

  • సొంత స్థలంలోనే పెద్ద వృక్షాన్ని నరకాలంటే 'నీరు-నేల-చెట్టు' చట్టం ప్రకారం అనుమతి ఉండాలి. మరో మొక్క నాటాకే దాన్ని నరికేందుకు అనుమతి ఉంటుంది.
  • ప్రభుత్వ స్థలాల్లో అడవుల నరికివేత పెద్ద నేరం. అటవీ చట్టాల ప్రకారం అనుమతి లేకుండా నరికితే చెరసాలే.
  • బొగ్గు అమ్మకాలు జరపాలన్నా అడితీల నిర్వాహకులకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి.
  • బొగ్గు తయారీకైతే అనుమతి లేకపోతే నేరమే.
  • ఏ చెట్టు నరికి బొగ్గు తయారు చేస్తున్నారనేది అనుమతి పత్రంలో చూపాలి. అవికాకపోతే మరేమైనా చెట్లు నరికితే చట్టాన్ని ఉల్లంఘించినట్లే.

గోదారమ్మ తెలంగాణకు సిరులు కురిపిస్తున్న కల్పవృక్షం. తన కడుపును చీల్చీ నల్ల బంగారాన్నిస్తూ ప్రతి ఇంటా వెలుగులు నింపుతోంది. గోండ్వానా లోయలో ఒక ముఖ్యమైన లోయ గోదావరి నదీ పరివాహక ప్రాంతం. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే అపారమైన బొగ్గు సంపద బయటపడింది. సుమారు 17 వేల చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేలింది. సింగరేణి బొగ్గు పుట్టు పూర్వోత్తరాలు...

తొలిసారిగా.. డబ్ల్యూ.టీ. బ్లేన్‌ఫోర్డ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1871లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ‘కామ్తి సముదాయం’ కు చెందిన ఇసుక రాతి పొరలను పరీక్షించి బొగ్గు లభించే అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. 1872-88 మధ్య కాలంలో సర్‌విలియం కింగ్ అనే భూ విజ్ఞాన శాస్త్రవేత్త గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే చేసి భూగర్భంలో ఉన్న గోండ్వానా కాలపు రాతి పొరలను గుర్తించారు. ఆ తర్వాత జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గోండ్వానా ప్రాంతంలో దశబ్దాలుగా అన్వేషించి బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1889లో ఖమ్మం జిల్లా ఇల్లెందులోని సింగరేణి గ్రామంలో ప్రప్రథమంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరుతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారత దేశానికి సింగరేణి విద్యుత్ వెలుగులు ప్రసాదిస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.

బొగ్గు రూపాంతరం.. భుకంపాలు, తుఫానుల వల్ల నెలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తరువాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామక్ర మంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను ఫీట్‌గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అరమిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు ఫీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక మీటర్ ఫీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది.

ఈ విధంగా తయారైన ఫీట్ భూమిలోని పీడనం, ఉష్ణోగ్రత వల్ల క్రమంగా లిగ్నైట్‌గా మారుతుంది. ఆ తర్వాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. సుమారు 20 మీటర్ల వృక్ష పదార్థాలు ఆరు మీటర్ల ఫీట్‌గా మారి ఆ తర్వాత మూడు మీటర్ల లిగ్నైట్‌గా రూపాంతరం చెందుతుంది. కొన్నేళ్లతర్వాత లిగ్నైట్ ఒక మీటర్ బొగ్గుగా ఏర్పడుతుంది. ఒక మీటర్ బొగ్గుగా మారడానికి సుమారు 6 వేల నుంచి 9 వేల సంవత్సరాలు పడుతుంది

గోండ్వానా ప్రాంత విస్తీర్ణం .. దేశంలో గోండ్వానా ప్రాంతం 63 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇందులో 15 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం బొగ్గు అన్వేషణకు అనువైన ప్రాంతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలోని గోదావరిలోయ బొగ్గు క్షేత్ర వైశాల్యం 17 వేల చదరపు కిలోమీటర్లుగా గుర్తించి 11 వేల చదరపు కిలోమీటర్లలో బొగ్గు అన్వేషణ జరపడానికి అనువైన ప్రాంతంగా నిర్ధారించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=బొగ్గు&oldid=703551" నుండి వెలికితీశారు