దువ్వెన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ne:काइँयो
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:شانه(آرایشگری)
పంక్తి 34: పంక్తి 34:
[[es:Peine]]
[[es:Peine]]
[[eu:Orrazi]]
[[eu:Orrazi]]
[[fa:شانه]]
[[fa:شانه(آرایشگری)]]
[[fi:Kampa]]
[[fi:Kampa]]
[[fr:Peigne de coiffure]]
[[fr:Peigne de coiffure]]

00:24, 29 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

దువ్వెన.

దువ్వెన (Comb) మనం జుత్తు సరిచేసుకోడానికి వాడే సాధనం. జుట్టులో పేలు మొదలైన వాటిని ఏరివేయటానికి ప్రత్యేకమైన పేల దువ్వెనలు ఉపయోగిస్తారు. దువ్వెనలను మానవచరిత్రలో 5000 సంవత్సరాలనుండే ఉపయోగిస్తున్న దాఖలాలు ఉన్నవి. వివిధ మత గ్రంథాలలో దువ్వెనల గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ వీటికి ప్రత్యేకమైన మతసంబంధ విధి ఏదీ ఉన్నట్టు కనిపించదు.దువ్వెన తొ ఎక్కువగా తల దువ్వుకొవటం ద్వారా వెంట్రుకలు ఊడి బట్టతల గా మారు అవకాశం కలదు.

చరిత్ర

దువ్వెన జటిలమైన యంత్ర పరికరం కాకపోయినప్పటికీ అది ఏమిటో మనిషికి తెలియని రోజులు ఉండేవి. పురాతన ఈజిప్టులోని మనుషులు తమ కేశాలను మందు నీరు, తైలాలు, సుగంధ్ వస్తువులతో జాగ్రత్తగా సంస్కరించుకునేవారు. వారి జుట్టుని ఒక రకమైన ముళ్ళతో ఉన్న పుల్లలతోను, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునేవారు. మొట్టమొదటి దువ్వెనలను ఎముకలు, ఏనుగు దంతాలు మరియు చెక్కతో తయారుచేయబడ్డాయి. వెండి, ఇత్తడి మరియు తగరము కూడా కొన్నిసార్లు దువ్వెనలను తయారుచేయటానికి ఉపయోగించారు. ఆయితే ఆ తర్వాత కాలములో తాబేలు డిప్పలు, జంతువుల కొమ్ముల ఉపయోగం సర్వసాధారణమయ్యింది. వీటిని వేడి చేసినప్పుడు మొత్తబడి మలచడానికి సులువుగా ఉండి చల్లబరచగానే తిరిగి గట్టిపడేవి. 19వ శతాబ్దము ఆరంభము నుండి మధ్యదాకా దువ్వెనల తయారీలో విరివిగా ఉపయోగించారు.[1] తరచూ దువ్వెనలను స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో తయారుచెయ్యటం పరిపాటి. ఆధునిక దువ్వెనలను యాంత్రికంగా ప్లాస్టిక్ లేదా సంబంధిత పాలిమర్లను ఉపయోగించి తయారుచేస్తున్నారు. దీన్నే కంకతిక, ప్రసాధని. అని కూడా వ్యవహరిస్తారు.

జుట్టు దువ్వుకోవడానికి ప్రత్యేకమైన పరికరం బయలుదేరేసరికి అది కేశ సంస్కర్తల సరంజాబులో అదనంగా చేరింది. అది కళకు ఒక ఉపకరణం అయ్యింది. పురాతత్వ శాస్త్రవత్తల పరిశోధనలలో ఇది తేలింది. మధ్య యుగాలలో ఇంగ్లాండ్, స్పెయిన్, రష్యాలలో స్త్రీలు ఇతరుల కంటపడకుండా తమ జుట్టును దాచుకునేవారు. కాని దువ్వెనలను మాత్రం వారు మరుగుపరుచుకోలేదు. ఒక కుటుంబం ఎంత ధనవంతులదో వారి దువ్వెన దానికి సంకేతంగా వెల్లడించేది. ఆ కాలంలో అది కేశాలలో కాకుండా ఒక డబ్బు సంచీలో, వారి ఇంటిలో ప్రముఖ స్థానంలోనో అది వుంచబడేది. ఎముకను కళా నిపుణులు నేర్పుగా కోసి చేసిన దువ్వెనలు ప్రస్తుతం రష్యాలో చిత్రప్రదర్శనశాలలో జాగ్రత్తపరచబడ్డాయి. పువ్వుల దండలు, భూదృశ్యాలు, వారి ప్రశంసకులతోబాటు వెళ్ళై స్త్రీలు, తేనీరు త్రాగేవారి చిత్రాలు దువ్వెనలపై మలచబడేవి.

18వ శతాబ్దం ఐరోపాలో స్త్రీ అలంకరణ సామగ్రిలో దువ్వెన ముఖ్యమైవుండేది. అది కృత్రిమ కేశాలలో, కేశఖండాలలోను గ్రుచ్చబడేది. స్పెయిన్‌లో స్త్రీలు ప్రకాశవంతాలైన వన్నెల శాలువలు, లేసుగుడ్డలు ఎత్తైన తాబేటి చిప్పలతో చేసిన దువ్వెనలు ఉపయోగించేవారు. 20వ శతాబ్దిలో మొదటి 20 ఏళ్లనుండే దువ్వెన ఒక అలంకార సామగ్రిగా గుర్తించబడింది. నాటినుండి స్త్రీలు కేశాలను పొట్టిగా కత్తిరించికోసాగారు.దువ్వెన జుట్టును చక్కగా దువ్వుకునేలాగ వినియోగించబడింది. నేడు జుట్టును చక్కగా దువ్వుకోడానికో, లేదా సరైన స్థితిలో దానిని ఒత్తివుంచడానికో అది వాడుకలో వుంది. దువ్వెన పలచటి పలకగానో, చదునుగానో, లేదా వంకరగానో, కర్రతో, కొమ్ముతో, తాబేటి చిప్పతో, దంతంతో, ఎముకతో, లోహంతోనో లేదా కృత్రిమంగానో పొడుగైన పళ్ళతో కత్తిరించబడి తయారవుతుంది.[2]

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=దువ్వెన&oldid=714873" నుండి వెలికితీశారు