"ఇంద్రధనుస్సు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,820 bytes removed ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ఇంద్ర ధనుస్సు [[దృష్టి విద్యా]] సంబంధమయిన [[వాతావరణ శాస్త్ర]] సంబంధమయిన [[దృగ్విషయం]]. ఈ చర్య వల్ల [[రశ్మి]]([[వెలుగు]]) [[వాతావరణం]] లోని నీటి బిందువులతో [[అంతఃపరావర్తనం]](Total Internal Reflection) చెంది, వర్ణానుసారం విచ్ఛిన్నమయి ఏడు [[రంగు]]లుగా మారుతుంది. అది ఒక అర్ధవృత్తాకారంలో రెండు అంచులూ [[భూమి]]లో ఉన్నట్టు, వృత్తాకారం ఆకాశం వైపుకున్నట్టు గోచరిస్తుంది. సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఇంద్రధనుస్సు, ఎల్లపుడూ సూర్యునికి విపరీత దిశలోనే కనిపిస్తుంది. ఇక రంగుల అమరికను బట్టీ ఇంద్రధనుస్సుని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి - ప్రాథమిక ఇంద్రధనుస్సు; రెండు ద్వితీయ ఇంద్రధనుస్సు. మొదటి ఇంద్రధనుస్సులో వృత్తం పై భాగంలో ఎఱుపు, మరియు లోపలి భాగంలో వంకాయరంగు వర్ణం ఉంటాయి. అదే ద్వితీయ ఇంద్రధనుస్సులో ప్రాథమిక ఇంద్రధనుస్సుతో పాటు అదే వర్ణాలు తిరగవేసి కనిపిస్తాయి. మొదటి రకం ఇంద్ర ధనుస్సు పరిపూర్ణ అంతఃపరావర్తనం ద్వారా జరిగితే, ద్వితీయ ఇంద్రధనుస్సు వాతావరణంలోని నీటి బిందువుల్లో రెండు మార్లు పరావర్తనం అవటం వల్ల తయారవుతుంది.
{{అయోమయం}}
{{POV|14 February 2010}}
 
 
[[ఫైలు:Godsbow.jpg‎|right]]
'''ఇంద్ర ధనుస్సు''' -
తెలుగు భాషలో ఇంద్ర ధనుస్సు అనే పదం హిందూ పురాణాలను బట్టి కలిగింది. దీనిని ఇంగ్లీషు భాషలో '''Rainbow''' అని, తమిళం, మళయాళం భాషలలో '''వానవిల్లు''' అని అంటారు.
 
 
== బైబిలు ప్రకారము ఇంద్ర ధనుస్సు కథ ==
[[ఫైలు:Noah.jpg‎|right]]
Rainbow లేదా [[వానవిల్లు]] అనే పదాలు ఎందుకు కలిగాయి, ఎలా కలిగాయి అనే విషయాలు [[పరిశుధ్ధ బైబిలు గ్రంథము]]లో వివరించబడ్డాయి. నోవహు కాలంలో జలప్రళయం ద్వారా సమస్త జీవరాసులను నాశనం చేసిన తరువాత దేవుడు, నోవహుతో చెప్పిన సంగతులు ఇలా ఉన్నాయి.
 
<blockquote>మరియు దేవుడు నోవహు అతని కుమారులతో "ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటకి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహజలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు-నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవహముగా నీళ్ళు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవుకికిని భూమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్యనిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. మరియు దేవుడు-నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే" అని చెప్పెను." [[పరిశుద్ధ బైబిలు గ్రంథము|ఆదికాండము]] 9: 8-17.</blockquote>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/720479" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ