మైత్రేయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: విద్య కొరకు ఒకరికి రెండవ భార్యయై విద్యావతి ఐన సాధ్వీమణి మైత్...
(తేడా లేదు)

08:02, 20 జూన్ 2012 నాటి కూర్పు

విద్య కొరకు ఒకరికి రెండవ భార్యయై విద్యావతి ఐన సాధ్వీమణి మైత్రేయి.

మైత్రేయి మన పురాణ(వేదకాలపు) ప్రఖ్యాత స్త్రీ.ఈమె జనకమహారాజు సభలో అందరు పండితులను ఓడించిన యాజ్ఞవల్కుని రెండవ భార్య.ఇతని మొదటి భార్య కాత్యాయిని.

మైత్రేయి సకల వేదాలను,స్మృతులను ఔపోశన పట్టిన సాధ్వి.ఆమె కాలంలో మైత్రేయి "బ్రహ్మవాదిని" అను బిరుదు పొందినది.

మైత్రేయి మొదట గార్గి అను మహాయోగిని శిష్యురాలు.కాని యాజ్ఞవల్కుని తో జనకసభలో గార్గి కూడా పరాజితురాలవడం చూసి యాజ్ఞవల్కుని వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకొంది.తను అతని భార్య ఐతే సకల విద్యా జ్ఞానాన్నీ పొందగలనని భావించింది.ఈ విషయమై యాజ్ఞవల్కుని మొదటి భార్య ఐన కాత్యాయినిని సంప్రదించింది.తర్వాత కాత్యాయని అనుమతితో యాజ్ఞవల్కుని పెళ్ళాడి అతని రెండవ భార్య అయింది.

ఋగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=మైత్రేయి&oldid=736844" నుండి వెలికితీశారు