మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ace:Muën
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:آکنه
పంక్తి 43: పంక్తి 43:
[[es:Acné]]
[[es:Acné]]
[[et:Akne]]
[[et:Akne]]
[[fa:رخ‌جوش]]
[[fa:آکنه]]
[[fi:Akne]]
[[fi:Akne]]
[[fo:Akne]]
[[fo:Akne]]

23:30, 1 జూలై 2012 నాటి కూర్పు

నుదురు మీద మొటిమలు.

మొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాదారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.

ముఖముపైన ఉండే నూనె గ్రంధులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా గుద్దును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్ష్మజీవుల (ప్రొపియోనిబాక్టీరియమ్) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.

మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు

  • మానసిక వత్తిడి ఎక్కువైనపుడు
  • ఆడు వారిలో PCOD (Poly Cystic Overian Disease) వున్నపుడు
  • వంశపారంపర్యము (కొంతవరకు)
  • ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువ వుండడం

జాగ్రత్తలు

  • ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి
  • జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి.
  • ప్రతిరోజూ వ్యాయామము చేయాలి
  • మొటిమలు చిదపడము , గోకడము చేయరాదు.
  • గట్టిగా తువ్వాలు తో ముఖము తుడవరాదు.

వైద్యం

శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు. పెద్ద మొటిమలు వున్నవాళ్ళు - 1. క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment) 2. డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి. 3.మచ్చలు పోవడానికి అలొ వెరా తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.

మూలాలు

  • Harison's textbook of Medicine & From my knowledge
"https://te.wikipedia.org/w/index.php?title=మొటిమ&oldid=739923" నుండి వెలికితీశారు