సైనా నెహ్వాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sv:Saina Nehwal
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: simple:Saina Nehwal
పంక్తి 129: పంక్తి 129:
[[pl:Saina Nehwal]]
[[pl:Saina Nehwal]]
[[sa:सैना नेह्वाल्]]
[[sa:सैना नेह्वाल्]]
[[simple:Saina Nehwal]]
[[sv:Saina Nehwal]]
[[sv:Saina Nehwal]]
[[zh:塞娜·内维尔]]
[[zh:塞娜·内维尔]]

02:46, 20 ఆగస్టు 2012 నాటి కూర్పు

దస్త్రం:Saina-nehwal.jpg
సైనా నెహ్వాల్ దిద్దుబాటు

సైనా నెహ్వాల్ (జ. 17 మార్చి, 1990)[1] ప్రముఖ భారత బాడ్మింటన్ క్రీడాకారిణి. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళగా అవతరించింది. ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆమెకు శిక్షకుడిగా ఉన్నాడు. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవతరించినది.[2]

ప్రారంభ జీవితం

సైనా నెహ్వాల్ హర్యానాలోని హిస్సార్ లో మార్చి 17, 1990న జన్మించింది. తలిదండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించినవారే.[3].

క్రీడా జీవితం

2006
2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి 4-స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించుటతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంటులో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం BWF ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది.
2007:
ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింతన్ స్వర్ణాన్ని గెలుచుకుంది.
2008
2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వెళ్ళగలిగింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించినది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది.
2009
ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, BWF ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలగింది.
2010
ఆల్‌ఇంగ్లాండు సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం పొందినది. ఇండియా ఓపెన్, ఇండోనేష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లలో టైటిళ్ళను సాధించింది.
ఒలింపిక్ క్రీడలలో

2008 ఒలింపిక్ క్రీడలలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఇందులోనూ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అవతరించింది.

సాధించిన విజయాలు

ఈవెంట్ సంవత్సరం ఫలితం
చెకొస్లోవేకియా జూనియర్ ఓపెన్ 2003 1 స్వర్ణపతకం
2004 కామన్వెల్త్ యూత్ క్రీడలు 2004 2 రజతపతకం
ఏషియన్ శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2005 1 స్వర్ణపతకం
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింతన్ చాంపియన్‌షిప్ 2006 2 రజతపతకం
2006 కామన్వెల్త్ క్రీడలు 2006 3 కాంస్యపతకం
ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2006 1 స్వర్ణపతకం
ఏషియన్ శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2006 1 స్వర్ణపతకం
జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2007 1 స్వర్ణపతకం
జాతీయ క్రీడలు 2007 1 స్వర్ణపతకం
చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ 2008 1 స్వర్ణపతకం
జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2008 1 స్వర్ణపతకం
2008 కామన్వెల్త్ యూత్ క్రీడలు 2008 1 స్వర్ణపతకం
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2008 1 స్వర్ణపతకం
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింతన్ చాంపియన్‌షిప్ 2008 1 స్వర్ణపతకం
ఇండోనేషియా ఓపెన్ 2009 1 స్వర్ణపతకం
ఆసియా చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ 2010 3 కాంస్యపతకం
ఇండియా ఓపెన్ హ్రాండ్‌ప్రిక్స్ 2010 1 స్వర్ణపతకం
సింగపూర్ ఓపెన్ సూపర్ సీరీస్ 2010 1 స్వర్ణపతకం
2010 కామన్వెల్త్ క్రీడలు 2010 1 స్వర్ణపతకం

మూలాలు

  1. Profile at website of 2006 Commonwealth Games, Melbourne
  2. ఈనాడు దినపత్రిక, తేది 21-06-2010
  3. The Hindu feature article dated 20 Jul 2005