శాన్ డియాగో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: bs:San Diego, Californiabs:San Diego
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: ia:San Diego
పంక్తి 109: పంక్తి 109:
[[hu:San Diego]]
[[hu:San Diego]]
[[hy:Սան Դիեգո]]
[[hy:Սան Դիեգո]]
[[ia:San Diego, California]]
[[ia:San Diego]]
[[id:San Diego, California]]
[[id:San Diego, California]]
[[is:San Diego]]
[[is:San Diego]]

08:57, 20 ఆగస్టు 2012 నాటి కూర్పు

సాన్ డియాగో పట్టణం

శాన్ డియాగో పట్టణానికి ఈ పేరు సెయింట్ డిడాకస్ జ్ఞాపకార్ధం ఆయన మరణానంతరం పెట్టబడింది. ఇది అమెరికాలోని పెద్దనగరాలలో తొమ్మిదవ స్థానంలోనూ కాలిఫోర్నియా రాష్ట్రంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది అమెరికా దేశ పశ్చిమ తీరంలో పసిఫిక్ మహాసముద్ర తీరంలో విస్తరించి ఉంది. అమెరికా జనాభా గణాంకాలను అనుసరించి ఈ నగర జనాభా సంఖ్య 2008 వ సంవత్సరంలో 12,79,329. ఈ సముద్రతీర నగరం ఒక శాన్డియాగో కొఉంటీ నియోజకవర్గం . శాన్ డియాగో, కాల్స్‌బాడ్-శాన్ మార్కోస్ మెట్రో పాలిటన్ ప్రదేశాలకు శాణ్డియాగో వ్యాపార కూడలిగా ప్రసిద్ధి చెందింది. మనీ మాగజిన్ 2006 వ సంవత్సరంలో నివాసయోగ్యమైన అయిదవ ఉత్తమ నగరంగా శాన్డియాగోను పేర్కొంది. ఫోర్బ్స్ కధనాన్ని అనుసరించి అమెరికా దేశంలో శాన్ డియాగో అయిదవ ఐశ్వర్య వంతమైన నగరంగా పేర్కొనబడింది. యుద్ధరంగానికి , పర్యాటకరంగానికి సంబంధించిన బృహత్తర పారిశ్రామిక నగరం శాన్ డియాగో. శాన్ డియాగో ఆర్ధికంగ రంగం వ్యవసాయం, బయో టెక్నాలజీ/బయో సైన్స్ , కంప్యూటర్ సైన్స్, ఎలెక్ట్రానిక్స్ , రక్షణ వ్యవస్థ కు చెందిన వస్తు తయారీ, ఆర్ధిక రంగ మరియు వ్యాపార రంగానికి చెందిన సేవలు, నావల తయారీ మరియు నావల రిపేరు, సాస్ట్ వేర్ అభివృద్ధి, టెలి కమ్యూనికేషన్స్, వైర్‌లెస్ రీసెర్చ్ మరియు పర్యాటక రంగంతో ముడిపడి ఉంటుంది. నగరంలో ఉపస్థితమైన యూనివర్సిటీ ఆఫ్ శాన్ డియాగో యు చ్ ఎస్ డి మెడికల్ సెంటర్‌ను స్థాపించి పరిశోధనలను నిర్వహిస్తుంది.

నగర చరిత్ర

శాన్ డియాగో నగర ప్రదేశం 10,000 సంవత్సరాల క్రితమే క్యుమెయాయ్ ఇండియన్ తెగల నివాసిత ప్రాంతంగా ఉందని అధారలున్నాయి. స్పెయిన్ దేశం తరఫున నౌకాయానం చేస్తున్న పోర్చ్‌గీస్ పూర్వీకంగా కల రోడ్రిక్విజ్ కాబ్రిల్లో ఈ ప్రదేశాన్ని చేరి దీనిపై స్పెయిన్ సామ్రాజ్యం తరఫున 1542లో ఆధిక్యతను ప్రకటించి దీనికి శాన్ మిక్యూ అని నామకరణం చేసాడు. కాలిఫోర్నియాను భౌగోళికంగా చిత్రించడానికి పంపబడిన సబెస్టీన్ విజ్‌కెయినొ 1602లో శాన్ డియాగోకు వచ్చి చేరాడు. ప్రస్తుతం సముద్రతీరాన ఉన్న మిషన్ బే మరియు పాయింట్ లోమా ప్రదేశాలను స్ర్వే చేసిన విజ్‌కెయినొ ఈ ప్రదేశానికి కాథలిక్ సెయింట్ డిడాకస్ జ్ఞాపకార్ధం అతని పేరు పెట్టాడు.స్పెయిన్ దేశస్థుడైన అతడు ప్రజలచే అధికంగా శాడియోగా పిలువ బడటంతో శాన్ డియాగో అనే నామకరణం చేసాడు. 1769లో గాస్పర్ డి పోర్టోలా చే హార్బర్ (రేవు)ప్రిసిడియో ఆఫ్ శాన్‌డియాగోస్థాపించబడింది. అదే సమయంలో ఫాదర్ జూనిపిరో సెర్రా పర్యవేక్షణలో ఫ్రాన్‌సిస్కాన్ చేత మిషిన్ శాన్‌డియాగో డి ఆల్కలా స్థాపించబడింది.

1847లో మార్‌మన్ బెటాలియన్ తమ 2000 మైళ్ళ సుదీర్ఘ ప్రయాణం తరువాత శాన్ డియాగోను తమ గమ్యస్థానంగా చేసుకున్నది. ఆ దళ సభ్యుల చేత పాత పట్టణం (ఓల్డ్‌టౌన్) ప్రస్థుత శాన్ డియాగో మరియు మాన్‌సన్ వీధి మూలన ఒక బ్రిక్ యార్డ్ (ఇటుకల నిర్మాణం)ను నిర్మించారు. ఆ కట్టడంలో నగరానికి మొదటి న్యాయస్థానం తన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్థుత శాన్‌డియాగోలో ఓక భాగమైన శాన్ పాస్‌క్వల్ వ్యాలీలో బాటిల్ ఆఫ్ పాస్‌కన్ వార్ మరియు బాటిల్ ఆఫ్ మెక్సికన్ వార్ దళాల మధ్య పోరు జరిగింది. యుద్ధ పర్యవసానంగా గోల్డ రష్ ఆఫ్ 1948 సమయంలో 1850లో కలిఫోర్నియా అమెరికన్ ప్రజలకు తన ద్వారాలు తెరిచిన సమయంలోఅమెరికన్ ప్రజలు వరదలా శాన్ డియాగోకు తరలి వచ్చారు. ముందుగా కొత్తగా రూపొందించబడిన శాన్‌డియాగో నగరం కౌంటీ నియోజక వర్గంగా గుర్తించబడి తరువాత కాలంలో పురపపాలిత వ్యవస్థగా గుర్తించబడింది.

ప్రస్థుత ఓల్డ్ టౌన్ శాన్‌డియాగో స్టేట్ హిస్టారిక్ పార్క్ సమీప ప్రాంతలో ప్రిసిడియో కొండల కింది భాగంలోఈ నగరం ముందుగా రూపుదిద్దుకుని అభివృద్ధి చెందింది. 1860 ఆఖరులో పూర్వీక ఒప్పందానికి దక్షిణంగా కొన్ని మైళ్ళ దూరంలో కొత్తనగర నిర్మాణానికి అలాంజో హార్టన్ ప్రతిపాదన చేయబడిన ప్రాంతమే ప్రస్థుత డౌన్ టన్ సాన్ డియాగో. శాన్ డియాగో బే రవాణాకు అనుకూలంగా ఉండటంతో వ్యాపార ఆధారిత సమూహాలు ముందుగా న్యూటౌన్ వైపు ఆకర్షించబడ్డారు. ప్రస్థుతం ఆది ఓల్డ్ టౌన్ గా పిలువబడుతూ నగరానికి ప్రభుత్వ కార్యకలాపాలకు కేంద్రంగానూ, ఆర్ధిక కేంద్రంగా బలపడింది. రెండవ ప్రపంచ యుద్ధానికి కొన్ని సంవత్సరాల ముందుగా ఇక్కడ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ నిర్వహించిన ఫ్రీ స్పీచ్ ఫైట్ కార్యక్రమం నగరంలో కొన్ని హింసాత్మక పరిణామాలకు దారి తీసింది. శాన్ డియాగో నగరంలో రెండు వరల్డ్ ఫెయిర్లు,1915 ది పనామా కలిఫోర్నియా ఎక్స్‌పోజిషన్ మరియు 1935లో కలిఫోర్నియా పసిఫిక్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజిషన్నిర్వహించబడ్డాయి. ఈ ఎక్స్‌పోజిషన్ కొరకు నగరంలోని బాల్‌బో పార్క్లో స్పానిష్/బార్‌క్యూ శైలి భవనాలు చాలా నిర్మించబడ్డాయి. ప్రత్యేకంగా 1915లో నిర్మించబడిన ఈ తాత్కాలిక నిర్మాణాలు అనేకం తరువాతి కాలంలో చాలా సంవత్సరాల వరకూ అవి చాలా భాగం శిధిలమయ్యే వరకూ వాడకంలో ఉన్నాయి. చివరకు మిగిలినవి వాటి ప్రాతన శైలి మార్చబడకుండా పునర్నిర్మించబడి పురాతన నిర్మాణ శైలికి అద్దాలుగా ప్రస్థుత కాలం వరకూ నిలిచాయి. పాయింట్ లోమాలో 1901 యు. ఎస్ నావికా దళం నావల్ కోయిలింగ్ స్టేషన్ను స్థాపించి 1920 కాలంలో మరింత విస్తరించబడింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం సైనిక దళం నగర ఆర్ధిక రంగంలో ప్రముఖ పాత్ర పోషించింది. కాని వారిలో అత్యధికులు కోల్డ్ వార్ తరువాత కాలంలో ప్రాంటియ రక్షణ, ఎయిరో స్పేస్ పరిశ్రమలలో భాధ్యతలు స్వీకరించి తమ సేవలు కొనసాగించారు. ఫలితంగా డౌన్ టౌన్ నాయకుల ఆధిక్యం నగర ఆర్ధికరంగంలో చోటు చేసుకుంది. ప్రస్థుతం శాన్ డియాగో నగరం బయో టెక్నాలజీ పరిశ్రలకు కేంద్రంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఈ నగరంలోనే టెలికమ్యూనికేషన్ దిగ్గజం క్వాల్‌కమ్ ప్రధాన కార్యాలయం పని చేస్తుంది.

సెడార్ ఫైర్ అగ్ని ప్రమాదం

శాన్ డియాగోలో సంభవించిన సెడార్ ఫైర్ అగ్ని ప్రమాదం కలిఫోర్నియాలో గత శతాబ్ధి కాలంలో జరిగిన అతి పెద్ద కార్చిచ్చుగా గుర్తించబడింది. ఈ అగ్ని ప్రమాదంలో 280,000 ఎకరాల ఆటవిక ప్రాంతం అగ్నికి ఆహుతి కాగా 15 మంది ప్రాణాలను కబళించి 2,200 గృహాలను తన అగ్ని కీలలకు ఆహుతి చేసింది. ఈ మంటల వలన చెలరేగిన పొగ అనేక మందిని దురిత గతిన వైద్యశాలలకు తరలి వెళ్ళేలా చేసింది. ఈ మంటలు వలన ఆస్త్మా, స్వసకోశ సమస్యలు, కళ్ళ మంటలు, పొగ పీల్చడం వలన కలిగిన అనారోగ్యం, వాతావరణ కాలుష్యం వంటి అవస్థల కారణంగా శాన్ డియాగో కౌంటీ పాఠశాలలు ఒక వారం రోజుల కాలం శలవు ప్రకటించాయి. తరువాతి నాలుగు సంవత్సరాల అనంతరం విచ్ ఫ్రీక్ మరియు హర్రీస్ ఫైర్ లాంటి అనేక అగ్ని ప్రమాదాలు నగరంలో అధిక భాగం నాశనం చేయడమే కాక కొన్ని ప్రాంతాలను, కొన్ని సమాజాలను సమూలంగా నాశనం చేసాయి. ప్రత్యేకంగా రాంచో బెర్నాండో మరియు రాంచో శాంటా ఫే సమాజాలు దెబ్బతిన్నాయి. సదరన్ కలిఫోర్నియా ఫైర్ సెషన్ ఆఫ్ 2007 అగ్ని ప్రమాదం రొమానా ప్రాంతంలో తన ప్రతాపం చూపింది.

భౌగోళికం

గణాంకాలు

2000 జనాభాలెక్కలను అనుసరించి నగర జనాభా 12,23,400. వీరిలో గృహస్థుల సంఖ్య 4,50,691. నగరంలో 2,71,315 కుటుంబాలు నివసిస్తున్నారు. 2008 నాటికి 12,79,329 మంది ఔతారని అప్పుడు అంచనా వేయబడింది. ఒక చదరపు మైలు జన సాంద్రత 3,771.9. మొత్తం 4,51,126 జనాభాలో 30.2% మంది 18 సంవత్సరాల లోపు వారు. 44.6% కుటుంబాలుగా నివసిస్తున్న వివాహితులు. భర్త లేకుండా ఒంటరిగా జీవితం సాగిస్తున్న స్త్రీలు 11.4%. కుటుంబాలు లేకుండా నివసిస్తున్న వారి శాతం 39.8%. ఒంటరిగా జీవిస్తున్న గృహస్థుల శాతం 28%. 65 సంవత్సరాల పైబడి ఒంట్రి జీవితం అనుభవిస్తున్న వారి శాతం 7.4%. వీరిలో కొంత మంది ఒంటరి జీవితం అనుభవిస్తురు. సరాసరి గృహస్థు జనసంఖ్య 2.61. సరాసరి కుటుంబ జన సంఖ్య 3.3.

అమెరికన్ కమ్యూనిటీల అంచనా

2006-2008ల మధ్య అమెరికన్ కమ్యూనిటీ అంచనా అనుసరించి 67.4% ప్రజలు శ్వేతజాతీయులు. వీరిలో హిస్పానిక్ ప్రజలు కాని వారి శాతం 48.2%. ఆఫ్రికన్ అమెరికన్లు, నల్ల జాతీయుల శాతం 6.7%. స్థానికుల శాతం 0.7%. 14.7% ఆషియన్లు. స్థానిక హవాయిన్లు మరియు పసిఫిక్ ద్వీపవాసుల శాతం 0.4%.ఇతర జాతీయుల శాతం 6.5%. మిశ్రమ జాతీయులు 3.6%. హిస్పానిక్ లేక లాటినోస్ ఇతరులు కలిసి జనాభాలో 27.3% ఉన్నారు.

ఇతర అంచనాలు

శాన్ డియాగో అసీసియేషన్ ఆఫ్ గవర్నమెంట్స్ అంచనాలు అనుసరించి 2008 జనవరి 1 తారాఖున శాన్ డియాగో నగర 13,36,865. 2000 నాటి జనసంఖ్య కంటే 9.3% అధికం. జనాభాలో హిస్పానికులు కాని శ్వేతజాతీయుల శాతం 45.3%. హిస్పానికుల శాతం 27.7%. 15.6% ఆసియన్లు/పసిఫిక్ ద్వీపవాసులు. నల్లజాతీయులు 7.1%, 0.4% అమెరికన్ ఇండియన్లు, ఇతర జాతులు 3.9%, హిస్పానికుల వివాహ వయసు సరాసరి 27.5%, నగర సరాసరి వివాహ వయసు 35.1 కాగా హిస్పానికులు కాని శ్వేతజాతీయుల సరాసరి వివాహ వయసు 41.6. 18 సంవత్సరాలకు లోబడిన వారిలో హిస్పానికులు అత్యధికం. హిస్పానికులు కాని శ్వేతజాతీయులలో 63.1% ప్రజలు 55 వయసు పైబడిన వారే.

నేరం

అమెరికాలోని మిగిలిన మహానగరాలతో పోలిస్తే శాన్ డియాగో నగరంలో 1990 నుండి 2000వరకు నేరాల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. 2000 నుండి 2004 నాటికి నేరాల సంఖ్య కొద్దిగా పెరిగింది. తక్కువ నేరాల స్థాయి కలిగిన అమెరికా నగరాల మధ్య శాన్ డియాగో నగర నేరాల సంఖ్య ఆరవ స్థానంలో ఉంది. ఒక వైపు దౌర్జన్య సంబంధిత నేరాలు 12.4% శాతం తగ్గు ముఖం పట్టినా సంపద సంబంధిత నేరాల సంఖ్యలో 1.1% శాతం పెరుగుదల కనిపించింది. అయినా అమెరికా నగరాల మొత్తం సంపద సంబంధిత నేరాల సంఖ్యలో శాన్ డియాగో నగర నేరాల సంఖ్య తక్కువగానే ఉంటుంది.

ఆర్ధిక రంగం

శాన్ డియాగో నగర ఆర్ధిక వనరులలో అతి ముఖ్యమైనవి రక్షణ వ్యవస్త, వస్తుతయారీ రంగం, పర్యాటక రంగం. రక్షణ రంగానికి చెందిన యు.ఎస్ నేవీ పోర్ట్, మేరిన్ కార్ప్‌ మరియు కోస్ట్ గార్డ్ స్తేషన్లు. మేరిన్ కార్ప్ ఎయిర్ స్తేషన్ మిరామర్ మరియు మారిన్ కార్ప్ రిక్రూట్ డిపోట్ లాంటి యుద్ధ శిక్షణా కేంద్రాలు శాన్ డియాగో నగరంలో ఉన్నాయి. నావికాదళానికి ఈ నగరంలో అనేక శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. నావల్ బేస్ పాయింట్ లోమా, నావల్ బేస్ శాన్ డియాగో, బాబ్ విల్సన్ నావల్ హాస్పిటల్ మరియు స్పేస్ అండ్ నావల్ వెల్ఫేర్ సిస్టమ్ సెంటర్ శాన్ డియాగో వీటిలో ముఖ్యమైనవి. శాన్ డియాగో నగర సామీప్యంలో శాన్ డియాగో కౌంటీలో చేరిన ప్రదేశంలో ఉన్న నావల్ ఆమ్‌ఫిబియస్ కొరొనాడో మరియు నావల్ ఎయిర్ స్టేషన్ నార్త్ ఐలాండ్ లచే నడుపబడుతున్న నావల్ ఏక్సిల్లరీ లాండింగ్ ఫెసిలిటీ శాన్ క్లైమేట్ ఐలాండ్, సిల్వర్ స్ట్రాండ్ ట్రైనింగ్ కాంప్లెక్స్ మరియు ఔట్ లైయింగ్ ఫీల్డ్ ఇంపీరియల్ బీచ్ నడుప బడుతున్నాయి. శాన్ డియాగో నగరంలో నావల్ అవియేషన్ ఆరంభించబడినప్పటికీ తరువాత కాలంలో ఫ్లోరిడాకు చెందిన పెన్సకోలా ప్రధమ స్థానానికి చేరుకుంది. శాన్ డియాగో నగరం నావికాదళ నౌకల సంఖ్య ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. శాన్ డియాగో నగరం నావికా దళ బలం అత్యధికంగా కేంద్రీకృతమైన ప్రపంచ నగరాలలో మొదటి స్థానంలో ఉంది. నిమిత్ క్లాస్‌కు సూపర్ కారియర్స్ చెందిన యు.ఎస్ నిమిత్ మరియు యు.ఎస్ రోనాల్డ్ రీగన్ , అయిదు ఆమ్‌ఫిబియస్ అసల్ట్ షిప్స్, అలాగే లాస్ ఏంజెలస్ క్లాస్ ఫాస్ట్ అటాక్ సబ్‌మెరీనులు, ది హాశ్పిటల్ షిప్ యు.ఎస్.ఎన్.ఎస్ మెర్సీ, కారియర్స్ మరియు సబ్‌మెరీన్ టెండర్స్, డిస్ట్రాయర్స్, క్రూసీస్, ఫ్రిగేట్స్ మరియు అనేక చిన్న చిన్న నావలకు ఇది జన్మ స్థానం. యు.ఎస్ నావికాదళ వెసెల్స్ నాల్గింటికి ఈ నగరానికి గౌరవ సూచకంగా యు.ఎస్.ఎస్ శాన్ డియాగో అని నామకరణం చేయాలని నిర్ణయించారు. శాన్ డియాగో నగరంలో స్థాపించబడిన క్వాల్ కమ్ ఇన్‌కార్పొరేటెడ్ పరిశ్రమ ఇక్కడ తమ ప్రధాన కార్యాలయం నడిపిస్తూ వైర్ లెస్ టెక్నాలజీని ఉపాయోగించి సమాచార సాధనాల తయారీలో ముందజలో ఉంది. క్వాల్ కమ్ కర్మాగారం నగరంలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న ఏకైక ప్రైవేట్ ప్రైవ్ట్ యాజమాన్య పరిశ్రమగా పేరుగాంచింది. వెబ్ సెన్స్ అనే సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ శాన్ డియాగోలోని అతి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీగా శాన్ డియాగో బిజినెస్ జనరల్ పత్రిక పేర్కొంది. శాన్ డియాగో పశ్చిమ తీరాన ఉన్న రేవు సబ్ మెరీన్, నౌకా నిర్మాణ పరిశ్రమ అలాగే ప్రపంచంలోని అతి పెద్ద నౌకాదళం కలిగి ఉండడంతో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉండి నగర ఆర్ధికరంగాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. సైనిక దళంగా శాన్ డియాగో ప్రాధాన్యత సంతరించుకున్న తరుణంలో అనేక సైనిక వస్తు తయారీ ఒప్పంద దారులు శాన్ డియాగోను తమ ప్రధాన కేంద్రంగా చేసుకుని పని చేయసాగారు. వారిలో ముఖ్యమైన సంస్థలు జనరల్ ఆటోమిక్స్ మరియు నాస్కో(NASSCO).

పర్యాటక రంగం

శాణ్ డియాగో నగరం అనేక ప్ర్యాటక ఆకర్షణలు కలిగిన ప్రదేశంగా పేరెన్నిక కలిగిన నగరం. అహ్లాదకరమైన నగర వాతావరణం, సుందర సముద్ర తీరాలు, బాల్బొరా పార్క్, బెల్‌మోన్ట్, అమ్యూజ్‌మెంట్ పార్క్, శాన్ డియాగో జూ, శాన్ డియాగీ వైల్డ్ నిమల్ పార్క్, సీ వరల్డ్ లాంటివి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. స్పానిష్ సంస్కృతి ప్రభావం నగరంలో విశేషంగా చోటు చేసుకున్న కారణంగా నగరంలో అనేక చారిత్రక ప్రాధాన్యమున్న ప్రదేశాలు దర్శనమిస్తాయి. కామిక్ కోన్, ది బక్ ఇన్విటేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్, ది శాన్ డియాగో/ డెల్ మార్ ఫెయిర్, శాన్ డియాగో బ్లాక్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు స్ట్రీట్ మ్యూజిక్ ఫెస్టివల్ వాటిలో కొన్ని. 2009 శాణ్ డియాగో కౌంటీ 30 మిలియన్ల అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది. వారిలో సగం మంది నగరంలో ఒక రాత్రి కూడా బస చేసిన వాళ్ళు. సగం మంది పగటి సమయం మాత్రమే ఉండి వెళ్ళిన సందర్శకులు. వారు నగరంలో 8 బిలియన్ డాలర్లు నగరంలో ఖర్చు చేసినట్లు అంచనా. కలిఫోర్నియా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్న శాన్ డియాగో క్రూసీ పరిశ్రమ మాత్రమే కొనుగోలు చేస్తున్న ఆహారం, చమురు(ఆయిల్ లేక పెట్రోల్), నిర్వహణ సేవలకు 2 మిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. 2008లో రేవు 250 మార్లు నౌకలను నడిపినట్లు అంచనా. ఈ నౌకలలో ప్రయాణం చేసిన వారి సంఖ్య 8,00,000. శాన్ డియాగో కాన్‌వెన్‌షన్ సెంటర్ 68 కంటే అధికంగా జరిగిన సమావేశాలకు ఆతిధ్యం మరియు ట్రేడ్ షోస్ ద్వారా 6,00,000 మందిని ఆకర్షించినట్లు అంచనా.

పరిశోధన

శాన్ డియాగో లోని కొన్ని ప్రదేశాలలో బయోటెక్నాలజీ సంబంధిత పరిశోధన సౌకార్యాలున్న ప్రధాన కార్యాలయాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా ఇవి లా జొలా మరియు సొరన్టో వ్యాలీలో అధికం. న్యూరోక్రై బయోసైన్సెస్, న్వెంటా బయోఫార్మాస్యూట్యైకల్స్ వంటి బృహత్‌టెక్నాలజీ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలు శాడియాగోలో నిర్వహిస్తున్నాయి. అలాగే ఒక వైపు బి.డి బయో సైన్సెస్, బయోజెన్ ఐడెక్, ఇంటిగ్రేటెడ్ డి ఎన్ ఎ టెక్నాలజీస్, మెర్క్, పి ఫైజర్, ఎలాన్, జెనిమ్,సిటోవెన్స్,సెల్‌జెనె,మరియు వర్టెక్స్ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాలు లేక పరిశోధనా సౌకర్యాలు అందిస్తున్నాయి. అలాగే లాభాపేక్ష లేని బయోటెక్ మరియు హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా తమ కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయి. వాటిలో సిల్క్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ స్టడీస్,ది స్క్రిప్స్ రీసెర్చ్ ఇస్టిట్యూట్, ది వైర్‌లెస్ హెల్త్ ఇన్‌స్టిట్యుట్ మరియు శాన్‌ఫోర్డ్ బర్న్‌హామ్ ఇన్‌స్టుట్యూట్ ముఖ్యమైనవి. ఇవి కాక శాన్ డియాగోలో 140 ఒప్పంద పరిశోధనా ఆర్గనైజేషన్స్ ప్రాంతీయ హెల్త్ సైన్స్ సంస్థలకు ఒప్పంద తరహా సేవలను అందిస్తున్నాయి. యూనివర్స్టీ ఆఫ్ కలిఫోర్నియా, శాన్ డియాగో మరియు ఇతర పరిశోధనా సంస్థలు ఫ్యూయల్ బయోటెక్నాలజీ అభివృద్ధికి సహకరిస్తున్నాయి. 2004లో మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ శాన్ డియాగో నగరాన్ని అమెరికాలోనే ప్రధమశ్రేణి బయోటెక్ టెక్నాలజీ కంపెనీల సమాహారంగా పేర్కొన్నది. 2009లో షుమారు 1940 పూర్తి సమయ ఉద్యోగులు శాన్ డియాగో/కార్ల్స్‌బాడ్/శాన్ మార్కోస్ ప్రాంతాల్లో పని చేస్తున్నట్లు అంచనా. వారు ఒక సంవత్సరానికి వేతన రూపంలో 48,270 అమెరిక డాలర్లు, వైద్య ఇతర అలవెన్స్ రూపంలో 46,500 డాలర్లు సంపాదిస్తున్నట్లు అంచనా.

నిర్మాణ రంగం

2006 ముందు శాన్‌డియాగో భవన నిర్మాణరంగంలో అద్భుత అభివృద్ధిని సాధించింది. కొన్ని సమయాలలో నవాసగృహాల కొరతను హౌసింగ్ అఫోడబిలిటీ క్రైసిస్గా వర్ణించారు. 1998 మరియు 2007 మధ్య కాలంలో గృహాల ధరలు షుమారు మూడింతలు అయ్యంది. కలిఫోర్నియా అసోసియేషన్ రియల్టర్స్ గణాంకాలను అనుసరించి 2007మే సమయానికి శాన్ డియాగో నగరంలో ఒక గృహం ధర 6,12,370 అమెరికన్ డాలర్లు. కాని వేతన అభివృద్ధి మాత్రం అంత అభివృద్ధి చెంద లేదు. తలసరి ఆదాయానికి అందుబాటులో లేని విధంగా నివాస గృహాలు ధరలు కలిగిన నగరాలలో శాన్ డియాగో అమెరికాలో రెండవ స్థానంలో ఉంది. పర్యవసానంగా శాన్ డియాగో నగరానికి 2004 నుండి వ్యతిరేక వలసల విధాన అనుభవం ఎదురైంది. గుర్తించ తగిన సంఖ్యలో ప్రజలు బజ కలిఫోర్నియా మరియు రివర్‌సైడ్ కౌంటీ లకు తరలి వెళ్ళారు. టిజ్యూనా, టెమెక్యులా మరియు మురీటా ప్రదేశాల నుండి శాన్ డియాగో నగరానికి ఉద్యోగ నిమిత్తం వస్తూపోతుంటారు. 2005 నుండి 2007 శాన్ డియాగో నగర నివాస గృహాల ధర 15% వరకూ తగ్గింది. తగ్గు ముఖం 2008 నాటికి మరింత వేగాన్ని పుంజుకుంది. ఈ తగ్గుదలకు ముఖ్య కారణం నిర్మాణ వ్యవస్థ షేర్ల ధర తగ్గటమే అని ఊహించబడింది. నిర్మాణరంగంలోని ఈ అస్థవ్యస్థ పరిణామాల వలన అనేక మంది తమ తమ ఆస్థులను కోల్పోవలసిన పరిస్తితి ఎదురైంది.

అధిక ఉపాధి కల్పించిన వారి జాబితా

విద్య

శాన్ డియాగో సిటీ స్కూల్స్ అని పిలవబడే శాన్ డియాగో యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ 113 ప్రాధమిక పాఠశాలలు, 23 మిడిల్ స్కూల్స్, 10 ఆల్టర్నేటివ్ స్కూల్స్, 27 మాధ్యమిక పాఠశాలలు, మరియు 25 చార్టర్ స్కూల్స్ మొదలైన వాట్ని సమర్ధవంతగా నిర్వహిస్తూ నగరంలోని అత్యధికులకు విద్యను అందిస్తున్న ఒకే ఒక పెద్ద విధ్యాసంస్థ. కౌంటీ ఉత్తర భాగంలోని పౌల్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ మరియు శాన్ డియాగిటోయూనియన్ హైస్కూల్ డిస్ట్రిక్ నగర సరి హద్దుల నుండి నగరంలో అనేక పాఠశాలలను నిర్వహిస్తూ సేవలందిస్తున్నాయి. అలాగే నగర దక్షిణ భాగంలో ఉంటూ నగరంలో అనేక పాఠశాలల నిర్వహిస్తూ స్వీట్ వాటర్ యూనియన్ హైస్కూల్ డిస్ట్రిక్ తన విసేష సేవలను శాన్ డియాగో నగరవాసులకు అందిస్తుంది.

కళాశాలలు విశ్వవిద్యాలయాలు

అమెరికా జనాభా గణాంకాలను అనుసరించి 25 దానికి పైబడిన వయసున్న శాన్ డియాగో నగర యువకులలో 40.4% ఉన్నత విద్యాభ్యాస డిగ్రీలు పొంది ఉన్నారని పేర్కొన్నది. అత్యధిక విద్యావంతులు కలిగిన అమెరిక నగరాలలో శాన్ డియాగో తొమ్మిదవ స్థానంలో ఉంది. నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు వరుసగా శాన్డియాగో స్టేట్ యూనివర్సిటీ (ఎస్.ఎస్.యు),యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా, శాన్ డియాగో (యు.సి.ఎస్.డి) మరియు శాన్ డియాగో కాలేజ్ డిస్ట్రిక్ అనుబంధ సంస్థలైన శాన్ డియాగో సిటీ కాలేజ్, శాన్ డియాగో మెస కాలేజ్ మరియు శాన్ డియాగో మిరామర్ కాలేజ్ తమ వంతు విద్యా సేవలను అందిస్తున్నాయి. ప్రైవేట్ యాజమాన్య విద్యా సంస్థలు వరుసగా యూనివర్శిటీ ఆఫ్ శాన్ డియాగో, పాయింట్ లోమా నజరనె యూనివర్శిటీ, అలియంట్ ఇంటర్‌నేషనల్ యూనివర్శిటీ, నేషనల్ యూనివర్శిటీ, శాన్ డియాగో క్రిస్టియన్ కాలేజ్, జాన్ పౌల్ ది గ్రేట్ కాధలిక్ యూనివర్శిటీ, కోల్ మాన్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ రెడ్ లాండ్స్ వారి బిజినెస్ స్కూల్స్, డిజైన్ స్కూల్స్ ఆఫ్ శాన్ డియాగో, శాన్ డియాగో ఆవరణలో ఉన్న ఫాషన్ డిజైనింగ్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చెంటైజింగ్, న్యూ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, శాన్ డియాగో ఆవరణలో ఉన్న పసిఫిక్ ఓక్స్ కాలేజ్, చాంపన్ యూనివర్శిటీ, ది ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ , సదరన్ స్టేట్స్ యూనివర్శిటీ మరియు వుడ్‌బరీ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ శాటిలైట్ కాంపస్లు ఉన్నాయి. నగరంలో యు.ఎస్.ఎస్.డి స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనే వైద్య కళాశాల నగరవాసులకు వైద్య విద్యను అందిస్తుంది. నగరంలో ఎ.డి.బి అక్రిడైటెడ్ లా స్కూల్ దాని అనుబంధ విద్యాసంస్థ అయిన కలిఫోర్నియా వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ లా, థామస్ జెఫర్సన్ స్కూల్ ఆఫ్ లా న్యాయ శాస్త్రా బోధన చేస్తున్నాయి. నగరంలో లాభాపేక్ష లేని న్యాయవిద్యాశాల వెస్ట్రన్ సెర్రా లా స్కూల్ నగర వాసులకు విద్యా సేవలందిస్తుంది.

గ్రంధాలయాలు

నగరంలో శాన్ డియాగో పబ్లిక్ లైబ్రెరి తీ చేరి అనేక గ్రంధాలయాలు ఉన్నాయి. శాన్ డియాగో డౌన్ టౌన్‌లో ప్రధాన కార్యాలయంతో నగరమంతా అనేక శాఖలు ఉన్న శాన్ డియాగో మునిసిపల్ లైబ్రెరి నగరవాసులకు సేవలందిస్తుంది. 2006లో నగరం 2.7 మిలియన్ల అమెరిక డాలర్లను గ్రంధాలయ అభివృద్ధికి వెచ్చించింది. అవి కాక మాల్‌కమ్ ఎ లవ్ లైబ్రెరి మరియు జియోసెల్ లైబ్రెరి ఉన్నాయి.

సంస్కృతి

శాన్ డియాగోలోఅనేక ప్రసిద్ధి చెందిన మ్యూజియమ్లు ఉన్నాయి. అవి వరుసగా బల్బో పార్క్‌లో ఉన్న శాన్ డియాగో మ్యుజీమ్ ఆఫ్ ఆర్ట్, శాన్ డియాగో నేషనల్ హిస్టరీ మ్యూజియమ్, మరియు మ్యుజీమ్స్ ఆఫ్ ఫోటో గ్రాఫిక్ ఆర్ట్స్ , లా జొలాలో సముద్రతీర భవనంలో ది మ్యూజియమ్ ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్ శాన్ డియాగో ఉంది దీనికి అనుబంధిత మ్యూజియమ్ శాంటా ఫి డిపోట్ డౌన్‌టౌన్లో ఉంది. ది కొలంబియా డిస్ట్రిక్ డౌన్ టౌన్‌లో శాన్ డియాగో మారీటైమ్ మ్యూజియమ్కు చెందిన చారిత్రక నౌకా ప్రదర్శన శాల ఉంది. ఇక్కడ స్తార్ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధి చెందిన నౌక మరియు యు.ఎస్.ఎస్ మిడ్‌వే సంస్థ విజయాలను వివరించే శాన్ డియాగో ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ మ్యూజియమ్లు ఉన్నాయి. నగరంలో కళారంగంలో గుర్తించ తగిన అభివృద్ధి కొనసాగుతుంది. ప్రత్యేకంగా లిట్టిల్ ఇటలీలో చిన్న చిన్న ప్రదర్శన శాలల ద్వారా సూక్రవార రాత్రి సమయాలలో కళా రూపక్పలన సంబధిత ప్రదర్శనలను నిర్వహించబడుతుంటాయి. నార్త్ పార్క్‌లో రే ఎట్ నైట్వివిధ రకాల చిన్న బడ్జెట్ కళాప్రదర్శనలు ప్రతి మాసం రెండవ శని వారం నిర్వహిస్తుంది. లా జొలా మరియు సమీపంలోని సొలానా బీచ్‌లో అనేక విధాల కళాప్రదర్శనలు జరుగుతుంటాయి. జిన్‌హా లింగ్ దర్శకత్వంలో సిం‌ఫోనీ టవర్స్‌లో ది శాన్ డియాగో సింఫోనీ ప్రదర్శనలు తరచూ జరుగుతుంటాయి. అలాగే సివిక్ సెంటర్ ప్లాజాలో లాన్ కేంప్‌బెల్ దర్శకత్వంలో శాన్ డియాగో ఒపేరా ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఈ ప్రదర్శనలను ఒపేరా అమెరికాచేత అమెరికాలోని 10 అత్యున్నత ఒపేరా ప్రదర్శనలో ఒకటిగా గుర్తింపు పొందింది. బాల్‌బో పార్క్‍లో ఉన్న ఓల్డ్ గ్లోబ్ దియేటర్ సంవత్సరానికి 15 మ్యూజిక్ ఆల్బమ్స్ మరియు నాటకాలను తయారు చేస్తుంది. యు.సి.ఎస్.డి లోని లా జొలా ప్లే హౌస్‌లో క్రిస్టోఫర్ దర్శకత్వంలో ప్రపంచ ప్రఖ్యాత నాటక మరియు సంగీత ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఓల్డ్ గ్లోబ్ ప్లే హఒస్ మరియు లా జొలా ప్లే హౌస్ నిర్మిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ నాటకాలు సంగీత ప్రదర్శనలు అతుత్తమ స్థాయి చెందినవి. ఇవి టోనీ అవార్డ్ పోటీలలో ప్రదర్శించటానికి ప్రతిపాదించడమే వీటి నాణ్యతకు దక్కిన ప్రత్యేక గుర్తింపు. క్రాక్ సెంటర్‌‌లో ఉన్న ది జాన్ క్రాక్ దియేటర్ 600 సీట్ల సామర్ధ్యంతో నృత్య, సంగీత ప్రదర్శనలను నిర్వహిస్తుంది. హార్టన్ ప్లాజాలో ఉన్న లిస్యూమ్ దియేటర్స్ వద్ద ఉన్న శాన్ డియాగో రిపోర్టరీ దియేటర్ అనేక విధములైన సంగీత మరియు నాటకాలను నిర్మిస్తుంది. ఇంకా దియేటరీ తయారీలను వృత్తిపరంగా చేస్తున్న లిరిక్ ఒపేరా శాన్ డియాగో మరియు స్టార్ లైట్ మ్యూజికల్ దియేటర్ మొదలైన నగర వాసుల కళాత్మక ప్రదర్శనలతో మనసును ఆహ్లాద పరుస్తున్నాయి. వందలాది చిత్రాలు మరియు దజన్ల కొద్దీ టి.వి షోలు శాన్ డియాగోలో చిత్రీకరించబడుతున్నాయి.

క్రీడా రంగం

ప్రసార మాద్యమం

రాజకీయ రంగం

మేయర్, అటార్నీ , సిటీ కౌన్సిల్ సభ్యుల స్థానాలు అధికారికంగా విభజింపబడ లేదు. సింగిల్ మెంబర్ డిస్ట్రిక్్‌ల నుండి ఒక్కొక్కరు 8 మంది సభ్యులు కౌన్సిలర్లుగా ఎన్నుకొనబడతారు. నగరం మొత్తం నుండి మేయర్ మరియు సిటీ అటార్నీలు నేరుగా ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకొనబడతారు. మేయర్, సిటీ అటార్నీ మరియు కౌన్సిలర్లు నాలుగు సంవత్సరాలకు ఒక సారి ఎన్నుకోబడతారు. ఎవరైనా ఒక్కొక్క స్థానానికి రెండు సార్లు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధన ఉంది. 2006 నుండి నగర ప్రభుత్వం సిటీ మేనేజర్ నుండి స్ట్రాంగ్ మేయర్ సిస్టమ్ గా రూపాంతరం చెందింది. 2004లో రెండు దఫాలుగా నగరమంతా ఓటింగ్ నిర్వహించి ఈ మార్పును తీసుకు వచ్చారు. కౌన్సిల్ లెజిస్లేటివ్ గానూ మేయర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానూ విధి నిర్వహణ చేస్తుంటారు.

నగర నిర్మాణం

ప్రజావసరాలు

నగరవాసులకు మంచినీటిని శాన్ డియాగో నగర "వాటర్ డిపార్ట్ మెంట్" (నీటిసరఫరా శాఖ) సరఫరా చేస్తుంది. నగరానికి కావలసిన నీరు " మెట్రోపాలిటన్ వాటర్ డిస్ట్రిక్ ఆఫ్ సదరన్ కలిఫోర్నియా " నుండి లభిస్తుది.

గ్యాస్ మరియు ఎలెక్ట్రిక్ అవసరాలు సెప్రా ఎనర్జీ లోని ఒక విభాగమైన" శాన్ డియాగో గ్యాస్ & ఎలెక్ట్రిక్ " నుడి సరఫరా ఔతుంది.

రహదార్లు

నగర వాసులలో 80 శాతం ప్రజలు తమ ప్రయాణావసరాలకు ఆటోమొబైల్స్ మీద ఆధారపడతారు. శాన్ డియాగో నగరంలో అనేక ఫీఘ వేస్ మరియు హై వేస్ నగరవాసుల సౌకర్యార్ధం ఉన్నాయి. టిజుయానా - లాస్ ఏంజలెస్ మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 5, మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 5, ఇంపీరియల్ కౌంటీ- అరిజోనా సన్ కారిడర్ మధ్య ఉన్నఇంటర్ స్టేట్ 8, తూర్పు ప్రాంతంలో ఈశాన్యం దిశగా ఐర్లాండ్ ఎంపైర్ - లాస్ వెగాస్ మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 15 మరియు మెక్సికన్ సరిబద్దులలో చీలి సరెంటో వ్యాలీ వద్ద కలుసుకునే ఇంటర్ స్టేట్ 805 ఉన్నాయి. నగరంలోని రహదారులన్నీ నగరానికి వాయవ్యంలో ఉన్న డౌన్ టౌన్ (నగర కేంద్రం) ప్రాంతానికి అనుసంధానించబడి ఉంటాయి.

ప్రభుత్వ రవాణా రంగం

సైక్లింగ్

విమానయానం

సముద్రయానం