సైమన్ కుజ్‌నెట్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fi:Simon Kuznets
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ko:사이먼 쿠즈네츠
పంక్తి 41: పంక్తి 41:
[[it:Simon Kuznets]]
[[it:Simon Kuznets]]
[[ja:サイモン・クズネッツ]]
[[ja:サイモン・クズネッツ]]
[[ko:사이먼 쿠즈네츠]]
[[la:Simon Smith Kuznets]]
[[la:Simon Smith Kuznets]]
[[lv:Saimons Kuznecs]]
[[lv:Saimons Kuznecs]]

23:32, 12 అక్టోబరు 2012 నాటి కూర్పు

అమెరికా ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్ ఏప్రిల్ 30 , 1901ఉక్రేయిన్ లోని ఖార్కివ్ లో జన్మించాడు. 1922 లో అమెరికాకు వలసవెళ్ళి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి 1971 లో అర్థశాస్త్ర నోబెల్ బహుమతి సాధించాడు. జూలై 8, 1985 లో ఇతడు మరణించాడు.

బాల్యం

పూర్వపు రష్యా రిపబ్లిక్ అయిన బెలారస్ లో ఏప్రిల్ 30, 1901 న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. 1922 లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో 1923 లో డిగ్రీ పొందినాడు. 1924 మరియు 1926 లలో వరుసగా యం.ఏ. మరియు పి.హెచ్.డి.పట్టాలు పొందినాడు.

పరిశోధనలు

1925 నుంచి 1926 వరకు కుజ్‌నెట్స్ ధరల నిర్ణయం పట్ల రీసెర్చి ఫెలో గా పరిశోధనలు కావించాడు. ఈ పరిశోధనల ఫలితంగా 1930 లో Secular Movements in Production and Prices గ్రంథం వెలువడింది.

ఆచార్యుడిగా

1931 నుంచి 1936 కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర మరియు గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా , ఆ తర్వాత 1936 నుంచి 1954 వరకు ప్రొఫెసర్ గా పనిచేసినాడు. 1954 లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై 1960 వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. 1960 నుంచి 1971 లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.

ఆర్థిక పరిశోధనలు

అర్థశాస్త్ర విభాగమైన ఎకనామెట్రిక్స్ లో విప్లవాత్మకమైన మార్పులకు కుజ్‌నెట్స్ కృషి ప్రశంసనీయం. ఇతని పరిశోధనలు జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క కీనిషియన్ విప్లవానినికి కూడా దోహదం చేశాయి. అతని యొక్క ప్రముఖ గ్రంథం National Income and Its Composition, 1919–1938. ఇది 1941 లో ప్రచురించబడింది. ఈ గ్రంథంలో స్థూల జాతీయోత్పత్తి ని చారిత్రక నేపథ్యంలో వర్నించాడు. అతని యొక్క వ్యాపార చక్రాలు మరియు అసమతౌల్యం పరిశోధనలు వృద్ధి అర్థశాస్త్రానికి దోహదంచేశాయి. ఇతను పరిశోధించిన ఒక కాలానికి సంబంధించిన అసమానతలు కుజ్‌నెట్స్ రేఖ గా అభివృద్ధి చెందింది.

బయటి లింకులు