బాటసారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 62: పంక్తి 62:
:బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
:బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
--సముద్రాల ,మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి,బాటసారి,
--సముద్రాల ,మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి,బాటసారి,
4.ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
#4.ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
:నీలాపనిందలే ఈ లోక నైజమా
:నీలాపనిందలే ఈ లోక నైజమా
:న్యాయమే కానగజాలరా
:న్యాయమే కానగజాలరా

15:56, 29 జనవరి 2013 నాటి కూర్పు

బాటసారి
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం పి.ఎస్.రామకృష్ణారావు,
భానుమతి
కథ శరత్ 'బడా దీది' నవల
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
భానుమతి,
షావుకారు జానకి,
దేవిక,
ముదిగొండ లింగమూర్తి,
రామన్న పంతులు
సూర్యకాంతం
జె.వి. రమణమూర్తి
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల,
భానుమతి,
జిక్కి కృష్ణవేణి,
కె.రాణి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


బాటసారి 1961 సంవత్సరంలో విడుదలైన సాంఘిక చిత్రం. దీనిని భరణీ పిక్చర్స్ బానర్ మీద పి.ఎస్.రామకృష్ణారావు దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ చిత్రకథకు శరత్ చంద్ర రచించిన 'బడా దీది' నవల ఆధారం. దీనిని తమిళంలో "కానల్ నీర్" పేరిట నిర్మించారు.

సంక్షిప్త చిత్రకథ

జమిందారు సురేంద్ర (అక్కినేని) కు ఆస్తి వుంది. పుస్తక పరిజ్ఞానం వుంది. పుస్తక పఠనం అతనికి ముఖ్యం. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు. ఒకసారి యింట్లో చిన్న మాట పట్టింపు రాగా యిల్లు వదలి వేరే చోటుకి వెళతాడు. అక్కడ మాధవి (భానుమతి) యింట్లో ఆశ్రయం దొరుకుతుంది. ఆమె చెల్లెలుకు పాఠాలు చెప్పే ఉద్యోగం. ఆ యింట్లో వున్నంతకాలం అతని వింత ప్రవర్తనకు జాలి పడుతుంది మాధవి. ఆమె పట్ల అతనికి గౌరవభావం ఏర్పడుతుంది.

తరువాత సురేంద్ర తన జమిందారీకి వెళ్ళిపోతాడు. పెళ్ళవుతుంది. భార్య (జానకి) కు అహంకారం ఎక్కువ. అక్కడ పనిచేసే గుమస్తా వల్ల మాధవి ఆస్తులకు అన్యాయం జరుగుతుంది. అది తెలుసుకున్న మాధవి సురేంద్రను ప్రశ్నించడానికి వస్తే గుమస్తా కలుసుకోనివ్వడు. ఆమె తిరిగి వెళుతూ త్రోవలో తన పేరిట సురేంద్ర "మాధవీపురం" గ్రామాన్ని కట్టించాడని తెలుసుకొని ఆనందపడుతుంది. సురేంద్ర రికార్డులు తిరగేస్తూ తను అభిమానించిన మాధవికి తన పేరిట అన్యాయం జరిగిందని తెలుసుకొని, తన అనారోగ్యం కూడా లెక్కచేయ్యకుండా గుర్రంమీద వెళ్ళి, ఆమెను కలుసుకొని, క్షమాపణకోరి ఆమె చేతుల్లో తుదిశ్వాస విడుస్తాడు.

నటవర్గం

పాటలు

  1. ఒహో మహరాజా సొగసు నెలరాజా
  2. ఓ బాటసారి నను మరువకోయి, మది నీదె అయినా మనుమా నిజానా - భానుమతి
  3. కనులను దోచి చేతికందని ఎండమావులున్నాయి
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

--సముద్రాల ,మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి,బాటసారి,

  1. 4.ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
నీలాపనిందలే ఈ లోక నైజమా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
పాముల కన్నులతో కనేరా పరుల
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
నా మనసు ,నడత ఎరిగినవారే అపవాదు వేసినా
నమ్మేరా పెరవారు నా మాట
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు

---సముద్రాల,భానుమతి,వేణు,బాటసారి1961

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=బాటసారి&oldid=790664" నుండి వెలికితీశారు