"అభివాదం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
అభివాద మంత్రము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు అభివాదం మంత్రం ద్వారా పరిచయం చేసుకొనేవారు. ఈ మంత్రములో ఋషి ప్రవర, గోత్రం, శాఖ, సూత్రము, వ్యక్తి నామం, కులము వంటివి ఉంటాయి.
 
|| ''చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు
__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత
_________ సగోత్రః , _____ సూత్రః, _____ శాఖాధ్యాయీ
_________శర్మన్ అహం భో అభివాదయే ||!''
 
పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.
 
ఉదాహరణకు క్షత్రియ కులానికి చెందిన ఒక వ్యక్తి ఇలా చెబుతాడు: చతుస్సాగర పర్యంతం, గోబ్రాహ్మణేబ్య శుభం భవతు; అభివాదయే విశ్వామిత్ర, మధుచ్చంద, ధనుంజయ ఇతి త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్రస్య, ఆపస్తంభ సూత్ర, యజు సాఖాద్యాయీ రామకృష్ణ తేజ వర్మా నాం అహంభొ అభివాదయే.
 
[[వర్గం: హిందూ మతము]]
238

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/801736" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ