పండుగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: et:Festival
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: th:เทศกาล
పంక్తి 90: పంక్తి 90:
[[sr:Фестивал]]
[[sr:Фестивал]]
[[sv:Festival]]
[[sv:Festival]]
[[th:เทศกาล]]
[[tr:Festival]]
[[tr:Festival]]
[[uk:Фестиваль]]
[[uk:Фестиваль]]

15:47, 1 మార్చి 2013 నాటి కూర్పు

సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి. కొన్ని ముఖ్యమైన పండుగలు:

హిందువుల పండుగలు

తెలుగు సంస్కృతిలోని అందచందాలు ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. బుడబుక్కలవారు, పగటివేషధారులు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.


మరొక ముఖ్యమైన పండుగ కోకిలలు కల కూజితాలను వెంటబెట్టుకుని, తీపిచేదులు వేప పువ్వు పచ్చడితో వచ్చే తెలుగు సంవత్సరాది. దసరా వస్తే " అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు. . . . . " అని చదువుతూ వీధుల వెంట నడిచే పంతుళ్లు, పిల్లలు, అమ్మవారి ఊరేగింపులు, దేవీ పూజలు, పులి వేషాలు, ప్రభలు. దీపావళికి బారులు తీరిన దీపాలు, బాణసంచా ఢమఢమలు, దివిటీలు వెలిగించి గిరగిర తిప్పుతూ తమ ప్రతాపం చూపించే గ్రామీణ యువకులు, వినాయక చవితికి పత్రి పూజలు, కుడుములు ; శివరాత్రికి సముద్ర స్నానాలు, రథసప్తమికి పాలు పొంగించడం, ఇంకా అట్లతద్దె, ఉండ్రాళ్ళతద్దె, మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు, అన్నట్టు శ్రీరామనవమి కూడా ముఖ్యమైన పండుగే. రామాలయంలేని ఊరు సాధారణంగా ఉండదు. భద్రాచలంలో లక్షలాది భక్తుల సమక్షంలో బ్రహ్మాండంగా సీతారాముల కళ్యాణం జరిగితే, పల్లెటూరి రామాలయంలో ఊరి పెద్దలు చేయిస్తారు చిన్న సైజు సీతారామ కళ్యాణాలు. ముస్లిములు పీర్ల పండుగ వస్తే నిప్పులపై నడవడం ఒక సంప్రదాయం. క్రైస్తవుల పండుగ క్రిస్టమస్ నాడు వారి వేడుకలు. జానపదులకు వారి పండుగలు, జాతరలు, అమ్మవారి కొలుపులు, తిరణాళ్లు వారికీ ఉన్నాయి. ఇవన్నీ తెలుగుదనంలో భాగాలే


తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.

వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.

ఉగాది

ఈ పండగ తోనే తెలుగు సంవత్సరము ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరము చైత్రమాసము లో శుక్లపక్షములో సూర్యోదయ సమయములో పాడ్యమి తిది, ఏరోజు ఉంటుందో ఆ రోజే ఈ 'ఉగాది' పండుగ జరుపుకుంటాము.

ముస్లిముల పండుగలు

ముస్లిములకు సంవత్సరానికి రెండు పండుగ ఈద్ లున్నాయి.

క్రైస్తవుల పండుగలు

క్రైస్తవుల ముఖ్యపండుగలు మూడు:

పాపాలు-నేరాలు

పుణ్యం లేదా అందరి మంచిని కోరి జరుపుకునే పండుగ వేడుకలు జరుపుకునే సందర్భాలలో మనం చాలా తప్పుల్ని, పాపాల్ని కొన్నిసార్లు పాపాల్ని చేస్తున్నాము. వీనిలో జంతు బలి అతి క్రూరమైనది. అన్ని మతాలు జీవహింస మహా పాపం అని పేర్కొంటున్నా ఎంతో మంది జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నా దీనిని ఆపలేకపోతున్నాం.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=పండుగ&oldid=802916" నుండి వెలికితీశారు