కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3418822 (translate me)
పంక్తి 61: పంక్తి 61:


{{రంగారెడ్డి జిల్లా మండలాలు}}
{{రంగారెడ్డి జిల్లా మండలాలు}}

[[en:Kulkacharla]]
[[new:कुल्कचर्ल मण्डल, रंगारेड्डी जिल्ला]]

17:53, 8 మార్చి 2013 నాటి కూర్పు

ఇది కుల్కచర్ల మండలమునకు చెందిన వ్యాసము. కుల్కచర్ల గ్రామ వ్యాసంకై కుల్కచర్ల (గ్రామం) చూడండి

  ?కుల్కచర్ల మండలం
రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్
రంగారెడ్డి జిల్లా పటంలో కుల్కచర్ల మండల స్థానం
రంగారెడ్డి జిల్లా పటంలో కుల్కచర్ల మండల స్థానం
రంగారెడ్డి జిల్లా పటంలో కుల్కచర్ల మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం కుల్కచర్ల
జిల్లా (లు) రంగారెడ్డి
గ్రామాలు 30
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
60,217 (2001 నాటికి)
• 30548
• 29669
• 36.40
• 48.44
• 24.02


కుల్కచర్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన ఈ మండలము పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది. ఈ మండలములో 29 గ్రామపంచాయతీలు కలవు. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో కలవు.

విద్య

మండలంలో92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు కలవు. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నవి.

జనాభా వివరాలు

1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారము 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.

మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నవి.

కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట

వర్షపాతం, నీటిపారుదల

మండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూల మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.

వ్యవసాయం, పంటలు

మండలంలో పండించే ప్రధానపంటలు గోధుమ, వరి, వేరుశనగ మరియు కందులు. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.[1] కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. <ముఖ్య ప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా, గణాంకాల పుస్తకం, 2007-08