గుండు సూది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: cv:Майра йĕппи
చి Bot: Migrating 31 interwiki links, now provided by Wikidata on d:q838312 (translate me)
పంక్తి 24: పంక్తి 24:


[[వర్గం:కార్యాలయ సామాగ్రి]]
[[వర్గం:కార్యాలయ సామాగ్రి]]

[[en:Pin]]
[[af:Speld]]
[[ar:دبوس]]
[[bn:আলপিন]]
[[ca:Agulla de cap]]
[[cs:Špendlík]]
[[cv:Майра йĕппи]]
[[eo:Stifto]]
[[es:Alfiler]]
[[eu:Buru-orratz]]
[[fa:سنجاق]]
[[fi:Nasta]]
[[fr:Épingle]]
[[he:סיכה]]
[[hr:Igla]]
[[io:Pinglo]]
[[it:Spillo]]
[[ko:핀]]
[[li:Sjpang]]
[[nl:Speld]]
[[pl:Szpilka]]
[[pt:Alfinete]]
[[qu:T'ipki]]
[[ru:Булавка]]
[[scn:Spìngula]]
[[simple:Pin]]
[[sv:Knappnål]]
[[uk:Булавка]]
[[wa:Ataetche (costeure)]]
[[war:Alpilir]]
[[zh:大头针]]

22:43, 8 మార్చి 2013 నాటి కూర్పు

కార్క్ బోర్డులో గుండు సూదులు


కాగితాలను, పదార్ధాలను మరియు/లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి గుండు సూదులు ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా ఉక్కుతో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలొ గుచ్చడానికి వీలుగా చేస్తారు. మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండు భాగాన్ని ప్లాస్టిక్ ఉపయోగించి కూడా చేస్తున్నారు.

చరిత్ర

దస్త్రం:గుండు సూది.jpg
గుండు సూది

పూర్వకాలంలో మానవుడు తాను కప్పుకుంటున్న చర్మాలను ఒకటిగా జతచేయడానికి ఒక వస్తువును కనుగొనాల్సి వచ్చింది. అప్పుడు మనిషి వదునైన ముల్లును కనుగొన్నాడు. నిన్న మొన్నటిదాకా జిప్సీలు నూనెలో ఉడికించి గట్టిపడిన ముళ్ళను సూదులుగా వాడుతూ వచ్చారు. ఉత్తర అమెరికాకు చెందిన కొంతమంది రెడ్ ఇండియన్లు తేనె మిడుతల ముళ్ళను జత చేసేందుకు వాడేవారు. ఈజిప్టుకు చెందిన గ్రామీణ స్త్రీలు కూడా ముళ్ళను సూదులుగా వాడేవారు.[1]

గుహల్లో నివసించిన పూర్వీకులకు మన్నిక తక్కువగల ముళ్ళను ఎలా గట్టి పరచాలో తెలియదు. గుహల్లో నివసిస్తున్న ఒకాయనకు చీల్చిన ఎముకలను సూదులుగా వాడవచ్చు అన్న ఆలోచన కలిగింది. ఈ కొత్త పద్ధతి బాగా పాకిపోయింది. మెట్టమొదట ఈ ఎముకల సూదులు చాలా గరుకుగా ఉండేవి. ఈ పిన్నులను వారు చిన్న జంతువుల కాలి ఎముకలతో తయారుచేసుకునేవారు. అప్పుడు అతుకులు పైన కనబడేవి. కాని వీటిని నునుపుగా చేసి మెరుగు పెట్టేవారు. చక్కగా చెక్కబడిన తల భాగంతో భాగంతో నునుపుగా మెరుగుతో ఉండే సూదులను రాతియుగం చివర దశలో కొంతమంది కళాకారులు తయారు చేయగలిగారు.

కంచు కనుగొనబడడంతో కంచుయుగం ప్రారంభమైంది. ఈ కొత్త లోహం నుండి ముందుకంటే మంచి చిన్న సూదులను తయారు చేసుకోవచ్చునన్న సంగతిని వారు కనుగొన్నారు. కాని కొన్ని పెద్ద సైజు సూదులు కూడా తయారు కాబడ్డాయి. గ్రీకు స్త్రీలు ధరించిన జాలువారు వస్త్రాలు ఒకప్పుడు ఈ కంచు సూదులతో జత చేయబడి ఉండేవి. లోహ యుగానికి చెందిన రోమన్లు దంతంతో, కంచుతో చేయబడిన సూదులను వాడేవారు. బంగారు సూదులను కూడా వారు వాడేవారు. వారు తయారు చేసుకున్న కంచు సూదులు చిన్నవిగా నాజూకుగా ఉండేవి. వారు వెండితో చేసిన సూదులను కూడా వాడి ఉంటారు. పెరువియన్స్ గోరీలలో ఈ లోహంతో చేయబడ్డ సన్నని సూదులను కనుగొన్నారు. స్పానియార్డులు దాన్ని కనుగొన్నప్పుడు పెరువియన్స్ కంచు యుగంలో ఉండడం జరిగింది. తీగతో తయారుచేయబడిన మొదటి సూదులు ఇంగ్లాండులో 15వ శతాబ్ధంలో తయారుచేయబడ్డాయి. దీనికి కారణం 1483వ సంవత్సరంలో సూదుల దిగుమతిని నిషేధిస్తూ చట్టం అమలుచేయబడడమే. నిషేదాజ్ఞ అమలులో ఉన్నప్పటికి ఫ్రాన్స్, జర్మనీ దేశాలనుండి తెచ్చిన సూదులే ఎక్కువగా ఇంగ్లాండులో వాడకంలో ఉండేవి.

8వ హెన్రీ భార్య కాథరిన్ హూవర్డ్ కోసం ఇత్తడి సూదులను ఇంగ్లాండుకు మొదటిసారిగా తెప్పించారని చెప్పబడుతోంది. గ్లౌసెస్టర్‌షైర్లో స్ట్రౌడ్ వద్ద 17వ శతాబ్దంలో ఇత్తడి సూదులను తయారుచేసే యంత్రాన్ని జాన్ టిల్స్‌బి నెలకొల్పాడు. అతి త్వరలో బ్రిస్టల్ మరియు బర్మింగ్‌హోం పట్టణాల వద్ద నాణ్యతకు పేరుగాంచిన సూదుల కార్ఖానాలు ప్రారంభింపబడ్డాయి. అమెరికన్ స్థావరాలైన దేశాలకు ఇంగ్లాండు నుండి సూదులు ఎగుమతి చేయబడ్డాయి. విప్లవ కాలం వరకు సూదులను తయారుచేసే ప్రయత్నాలు అక్కడ జరగలేదు. ఇంగ్లాండులో తయారయే సూదులతో సరితూగే సూదులను తయారుచేసే కంపెనీకి బహుమతిని ఇస్తామన్న ప్రకటన 1775లో వెలువడింది. కానీ ఈ బహుమతి ఫలానా కంపెనీ గెలుచుకున్నట్లు మనకు దాఖలాలు లేవు. 1812వ సంవత్సరం దాకా సూదులను తయారుచేసే కంపెనీ అమెరికాలో నెలకొల్పబడలేదు. అప్పట్లో ఈ ప్రయత్నం విజయవంతమైన ప్రయత్నం కాదనుకున్నారు. 1836వ సంవత్సరంలో హూవె కంపెనీ సూదులు తయారీని క్రమబద్ధం చేడంలో విజయాన్ని సాధించింది. ఆ తరువాత అమెరికాలో మిలియన్ల సూదులు తయారుచేయబడ్డాయి.

19వ శతాబ్దం వరకు సూదులు చాలావరకు చేతిలోనే తయారయ్యేవి. 1824వ సంవత్సరంలో అమెరికాకు చెందిన లెముయల్ డబ్ల్యురైట్ సూదులను తయారుచేసే యంత్రాన్ని కనుగొన్నాడు. ఈ సూదులు ఘనమైన తలను పదునైన తోకను ఒకే తీగ సహాయంతో చేయడం జరిగింది. తయ యంత్రానికి అతడు ఒక పేటెంటును ఇంగ్లాండులో సంపాదించాడు దిట్టమైన తలగల గుండు సూదులు మొట్టమొదట ఇంగ్లాండులో తయారు చేయబడ్డాయి. తరువాత కొంతకాలానికి న్యూయార్క్ నగరానికి చెందిన వైద్యుడు డా||జాన్ ఇంగ్లాండ్ హూవె సరైన తలగలిగిన గుండు సూదులను తయారుచేసే యంత్రాన్ని కనుగొన్నాడు హూవె కంపెనీవారు ఈ యంత్రాన్ని వాడారు. కన్నెక్టికట్లోని డెర్బీ వద్ద తమ కంపెనీను నెలకొల్పాడు.

మరికొన్ని సంవత్సరాల తరువాత కాగితాలను గట్టిగా పట్టుకునేందుకు వుపయోగపడే గుండుసూదులను తయారుచేసే యంత్రాన్ని శామ్యూల్ స్లోకం కనుగొన్నాడు. సమయాన్ని పొదుపు చేసే ఈ యంత్రం విజయవంతం కావడంతో మరికొన్ని పరిశోధనల కారణంగా గుండుసూదులు పూర్తిగా యంత్రాలతో చేయబడ్డాయి. గుండుసూదులను ఉక్కు, ఇత్తడి, ఇనుము తీగలతో తయారు చేస్తారు.

అతి చౌకరకం గుండు సూదులను ఇనుము తీగతో తయారుచేస్తున్నారు. మనం సామాన్యంగా వాడే పిన్నులు ఇత్తడితో తయారు చేయబడుతున్నాయి. మేలు రకం పిన్నులను గట్టి ఉక్కు తీగలతో తయారు చేస్తున్నారు.. నల్లటి పిన్నును ఇనుము తీగతో తయారుచేసి బ్లాక్ జపాన్ అనే నల్లటి రంగులో ముంచి ఎండబెడతారు. సాధారణంగా ఉపయోగించే గుండు సూదులకు తగరం పూతను పూస్తారు. ఈ పూత వల్ల గుండు సూదులకు తుప్పు పట్టదు. చాలా సన్నని ఉక్కు గుండు సూదులకు రంగుల గాజు తలలను వారు కరిగించిన గాజుతో తయారు చేస్తారు.

మూలాలు

  • The article is based on Chapter 4 of a book by Henry Petroski, The Evolution of Useful Things, ISBN 0-679-74039-2.