సైకస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: fi:Kruunukävykit
చి Bot: Migrating 29 interwiki links, now provided by Wikidata on d:q161073 (translate me)
పంక్తి 38: పంక్తి 38:


[[వర్గం:వృక్ష శాస్త్రము]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]

[[en:Cycas]]
[[ta:மடுப்பனை]]
[[az:Saqo]]
[[ca:Cicadàcia]]
[[cs:Cykas]]
[[da:Cykas]]
[[de:Sagopalmfarne]]
[[es:Cycadaceae]]
[[fa:سیکاس]]
[[fi:Kruunukävykit]]
[[fr:Cycadaceae]]
[[hsb:Palmowy paproć]]
[[hu:Cikászfélék]]
[[id:Pakis haji]]
[[it:Cycas]]
[[ja:ソテツ科]]
[[ko:소철속]]
[[lt:Cikas]]
[[nl:Cycas]]
[[no:Konglepalmeslekten]]
[[pl:Sagowcowate]]
[[pt:Cicadáceas]]
[[ro:Cycas]]
[[ru:Саговник]]
[[simple:Cycas]]
[[sv:Cycas]]
[[to:Longolongo]]
[[tr:Yalancı sagu palmiyesi]]
[[zh:苏铁属]]

03:48, 9 మార్చి 2013 నాటి కూర్పు

సైకస్
Leaves and male cone of Cycas revoluta
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
సైకడేసి

Persoon
Genus:
సైకస్

జాతులు

See Species Section

సైకస్ (ఆంగ్లం Cycas) ఒక రకమైన వివృతబీజాలు. సైకస్ ప్రజాతిలో ఇంచుమించు 95 జాతుల్ని గుర్తించారు. సైకస్ పేరు కైకస్ గ్రీకు లో 'పామ్ చెట్టు' అని అర్ధం. ఇవి పామే కుటుంబానికి చెందినవి కావు.

విస్తరణ

సైసక్ ప్రజాతి మొక్కలు ప్రపంచంలో ఉష్ణ మండల ప్రాంతాల్లో వన్యంగా కనిపిస్తుంది. ఇవి జలాభావ, ఎడారి పరిస్థితుల్లో పెరుగుతాయి. భారతదేశంలో నాలుగు సైకస్ జాతులు పెరుగుతున్నాయి. అవి దక్షిణ భారతదేశంలో సైకస్ సిర్సినాలిస్ (క్రోజియర్ సైకస్), తూర్పు కనుమల్లో సైకస్ బెడ్డోమి (మద్రాస్ సైకస్), తూర్పు భారతదేశంలో సైకస్ పెక్టినేటా (నేపాల్ సైకస్) మరియు అండమాన్, నికోబార్ దీవుల్లో సైకస్ రంఫై (రంఫియస్ సైకస్). జపాన్ సైకస్ జాతి అయిన సైకస్ రెవల్యూటా (సాగో సైకస్)ను అందంకోసం పెంచుతున్నారు.

ముఖ్య లక్షణాలు

  • సైకస్ మొక్కలు ఎక్కువకాలం జీవించే, సతతహరిత బహువార్షికాలు. ఇవి సుమారు 2-5 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. ఇవి చూడడానికి పామ్ మొక్కల్లాగా ఉంటాయి.
  • వీనిలో శాఖారహిత, స్తంభాకార కాండం. చెక్క వంటి కవచంలా ఏర్పడ్డ దీర్ఘకాలిక పత్రపీఠాలు కాండాన్ని కప్పి ఉంచుతాయి.
  • వేళ్ళు ద్విరూపకాలు, సాధారణ వేరు, ప్రవాశాభ వేరు అను రెండు రకాలుగా ఉంటాయి.
  • కాండం కొనభాగంలో ఒక కిరీటంలాగా ఏర్పడిన పక్షవత్ (arborescent) సంయుక్త పత్రాలు. ఇవి 1-3 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఇవి సాధారణంగా సమపిచ్ఛకాలు. అడ్డంగా విస్తరించిన రాంబాయిడ్ ఆకారంలో నున్న పత్రపీఠం వల్ల ఇవి కాండానికి అతుక్కొని ఉంటాయి. ఒక పొడవైన లావుపాటి రాకిస్ మీద సుమారు 50-100 పత్రకాలు రెండు వరుసలలో ఉంటాయి. ఈ పత్రకాలు వృంతరహితంగా, చర్మిలంగా, బిరుసుగా బల్లెం ఆకారంలో ఉండి, ఒక ప్రస్ఫుటమైన మధ్య ఈనె ఉంటుంది. కొన్ని కింది పత్రకాలు కంటకాలుగా రూపొందవచ్చును.

ప్రత్యుత్పత్తి

సైకస్ సిద్ధబీజదం అబ్బురపు మొగ్గలు లేదా లఘులశునాల వల్ల శాకీయోత్పత్తిని జరుపుతుంది. లఘులశునాలు కాండం పీఠభాగాల్లో అభివృద్ధి చెందుతాయి. వీటిలో దుంపవంటి కాండం, కొన్ని పత్రాలు ఉంటాయి. లఘులశునం నేలపై పడితే అబ్బురపు వేళ్ళను ఏర్పరచుకొని స్వతంత్రమైన మొక్కగా పెరుగుతుంది. సిద్ధబీజదం సుమారు పది సంవత్సరాలపాటు శాకీయ పెరుగుదల తరువాత విత్తనాలవల్ల ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. సైకస్ మొక్కలు భిన్న సిద్ధబీజత ఉన్న ఏకలింగాశయులు. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని సూక్ష్మసిద్ధబీజాలు, స్థూలసిద్ధబీజాలు అనే రెండురకాల సిద్ధబీజాలను వేరువేరు మొక్కలపై ఉత్పత్తి చేస్తాయి.

ప్రపంచంలో సైకస్ విస్తరణ.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=సైకస్&oldid=809916" నుండి వెలికితీశారు