సాత్యకి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: hi:सत्यकि
చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q2381158 (translate me)
పంక్తి 27: పంక్తి 27:
*[http://mahabharata-resources.org/yadu_dynasty_opt_1.pdf Yadu Genealogy]
*[http://mahabharata-resources.org/yadu_dynasty_opt_1.pdf Yadu Genealogy]
*[http://www.gita-society.com/section3/mahabharata.pdf Mahabharata translated by C Rajagopalachari]
*[http://www.gita-society.com/section3/mahabharata.pdf Mahabharata translated by C Rajagopalachari]

[[en:Satyaki]]
[[hi:सत्यकि]]
[[ta:சாத்தியகி]]
[[bn:সাত্যকি]]
[[gu:સાત્યકિ]]
[[id:Satyaki]]
[[jv:Satyaki]]
[[mr:सात्यकी]]
[[ru:Сатьяки]]

08:30, 9 మార్చి 2013 నాటి కూర్పు

కౌరవ సభలో కృష్ణునితో సాత్యకి

సాత్యకికి యుయూధనుడు అను పేరు కూడా కలదు. ఇతను కృష్ణునికి చెందిన వృషణి యాదవ వంశమునకు చెందిన మహా యోధుడు.

సాత్యకి కృష్ణుని భక్తుడు. ఇతను అర్జునునితో కలసి ద్రోణుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను అర్జునుడు మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి సాత్యక. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులతో కలసి కౌరవులపై యుద్దం చేసెను. కృష్ణుడు శాంతి రాయబారమునకు హస్తినాపురంనకు వచ్చునపుడు సాత్యకితో కలసి వచ్చెను.

సాత్యకి మరియు కృతవర్మలు కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడిన యాదవ వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి పాండవుల వైపు, కృతవర్మ కౌరవుల వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి ద్రోణుని విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న భూరిశ్రవునితో యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. భూరిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునునితో జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భూరిశ్రవుడు సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.

భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని అర్జునుని నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని అర్జునుడు ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.

అంతట భూరిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భూరిశ్రవుని తల ఖండింస్తాడు.

కురుక్షేత్ర సంగ్రామంలో సాత్యకి, కృతవర్మ ఇద్దరూ బ్రతికారు. కృతవర్మ కృపాచార్యుడు మరియు అశ్వద్ధామలతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు త్రాగి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని కృతవర్మని, కృతవర్మ నిరాయుధుడైన భూరిశ్రవుని చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, కృతవర్మ, మిగిలిన యాదవ వంశం మొత్తం గాంధారి శాపం మూలంగా నాశనం అయింది.

చూడు

లింకు

"https://te.wikipedia.org/w/index.php?title=సాత్యకి&oldid=811191" నుండి వెలికితీశారు