వ్యభిచారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: qu:Q'itayay
చి Bot: Migrating 82 interwiki links, now provided by Wikidata on d:q36633 (translate me)
పంక్తి 25: పంక్తి 25:


[[వర్గం:వృత్తులు]]
[[వర్గం:వృత్తులు]]

[[en:Prostitution]]
[[hi:वेश्यावृत्ति]]
[[ta:பால்வினைத் தொழில்]]
[[ml:വേശ്യ]]
[[af:Prostitusie]]
[[als:Prostitution]]
[[ang:Hōredōm]]
[[ar:دعارة]]
[[arz:دعاره]]
[[az:Fahişəlik]]
[[bar:Schnoin]]
[[be:Прастытуцыя]]
[[be-x-old:Прастытуцыя]]
[[bg:Проституция]]
[[bo:སྨད་འཚོང་མ།]]
[[br:Gasterezh]]
[[ca:Prostitució]]
[[ckb:لەشفرۆشی]]
[[cs:Prostituce]]
[[cv:Проституци]]
[[cy:Puteindra]]
[[da:Prostitution]]
[[de:Prostitution]]
[[el:Πορνεία]]
[[eo:Prostituo]]
[[es:Prostitución]]
[[et:Prostitutsioon]]
[[eu:Prostituzio]]
[[fa:تن‌فروشی]]
[[fi:Prostituutio]]
[[fr:Prostitution]]
[[fy:Prostitúsje]]
[[gd:Siùrsachd]]
[[gl:Prostitución]]
[[he:זנות]]
[[hr:Prostitucija]]
[[hu:Prostitúció]]
[[hy:Մարմնավաճառություն]]
[[id:Pelacuran]]
[[ie:Prostitution]]
[[io:Prostitucado]]
[[is:Vændi]]
[[it:Prostituzione]]
[[ja:売春]]
[[jv:Prostitusi]]
[[kk:Жезөкшелік]]
[[ko:성매매]]
[[ku:Laşfiroşî]]
[[lmo:Prustitüsiun]]
[[lt:Prostitucija]]
[[lv:Prostitūcija]]
[[ms:Pelacuran]]
[[mzn:مول زنان]]
[[nl:Prostitutie]]
[[no:Prostitusjon]]
[[oc:Prostitucion]]
[[pl:Prostytucja]]
[[pt:Prostituição]]
[[qu:Q'itayay]]
[[ro:Prostituție]]
[[ru:Проституция]]
[[scn:Prostituzzioni]]
[[sh:Prostitucija]]
[[si:ගණිකාව]]
[[simple:Prostitution]]
[[sk:Prostitúcia]]
[[sn:Chipfambi]]
[[sr:Проституција]]
[[sv:Prostitution]]
[[sw:Ukahaba]]
[[th:การค้าประเวณี]]
[[tl:Patutot]]
[[tr:Fahişelik]]
[[tt:Фахишәлек]]
[[uk:Проституція]]
[[vec:Prostitusion]]
[[vi:Mại dâm]]
[[war:Prostitusyon]]
[[wuu:妓女]]
[[yi:זנות]]
[[zh:性交易]]
[[zh-yue:妓]]

11:47, 9 మార్చి 2013 నాటి కూర్పు

Kuniyoshi Utagawa, A street prostitute

వ్యభిచారం లేదా పడుపు వృత్తి (Prostitution) అంటే డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకోవడం. ఇలా జీవించేవారిని వేశ్యలు అంటారు. కొంత మంది స్త్రీలు పేదరికం మరియు ఆకలి వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బలికలని నిర్భందించి ( కిడ్నాప్ చేసి) వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. జెర్మనీ లాంటి కొన్ని దేశాలలో మాత్రమే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యడం జరిగింది. ఇరాన్ వంటి దేశాలలో వ్యభిచారానికి మరణ శిక్ష వేస్తారు. కులట, జారస్త్రీ, వేశ్య, లంజ(ఒకరికన్నా ఎక్కువ పురుషులతో లైంగిక సంబంధము కలది) లేదా వెలయాలు అనగా బ్రతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని అవలంబించే స్త్రీ. చరిత్రలో రాజులు మరియు చక్రవర్తులు తమ భొగవిలాసాల కోసం వేశ్యలను పోషించేవారు.

నిషేధాలు

ఆసియా, ఆఫ్రికా, తూర్పు యూరోప్ లలోని చాలా దేశాలలో వ్యభిచారం నిషిద్ధం. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా వ్యభిచారం నిషిద్ధం. కొన్ని దేశాలలో వ్యభిచారం నిషిద్ధం కాదు కానీ వ్యభిచార గృహాలు (brothels) నడపడం, బ్రోకర్లు (pimps) ద్వారా విటులని తీసుకురావడం మాత్రం నేరం. బ్రోకర్లని ఉపయోగించడం (pimpimg) పై నిషేధం ఉండడం వల్ల అక్కడ వ్యభిచార వృత్తిలోకి దిగేవాళ్ళ సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. ఇండియాలో కూడా బ్రోకర్లని ఉపయోగించడానికి అనుమతి లేకపోవడం వల్ల ఇక్కడ కొన్ని ప్రాంతాలలో మాత్రమే వ్యభిచారం కనిపిస్తుంది. ఇక్కడ వ్యభిచారం చేసేవాళ్ళు ఉండే ప్రాంతాలని రెడ్ లైట్ ఏరియాస్ అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో వాటిని భోగం వీధులు అంటారు.

జాతీయ మహిళా కమిషన్ నివేదిక

దేశంలోని సగానికి సగంపైగా జిల్లాల్లో ఆడపిల్లలు అన్యాయంగా వ్యభిచార కూపాలకు తరలిపోతున్నారు , వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారు అని జాతీయ మహిళా కమిషన్ నివేదిక. కనీసం 378 జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొనిఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ జిల్లాల్లో అమ్మాయిలను వేశ్యావాటికలకు తరలించే సుమారు 1794 ప్రాంతాలను మహిళా కమిషన్ గుర్తించింది. అలాగే, వ్యభిచార వృత్తి సాగించే 1016 ప్రాంతాల వివరాలను కూడా తెలుసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పలుప్రాంతాల నుంచి అమ్మాయిలను తరలించి అంగడిబొమ్మ లుగా చేసే దుష్కృత్యాలు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని దాదాపు అన్నిజిల్లాల్లోనూ ఈ చీకటి కార్యకలాపాలు సాగుతుండగా...తమిళనాడు, ఒరిస్సా, బీహార్‌లలో వేశ్యావాటికలకు తరలిపోతున్న ఆడపిల్లల కథలు ఎనెన్నో...అని జాతీయ మహిళా కమిషన్ నివేదిక పేర్కొంది. మన దేశంలోని మొత్తం మహిళా జనాభాలో 2.4 శాతం మంది వేశ్యావృత్తిలో ఉన్నారు. వీరిలో అత్యధికులు 15-35 ఏళ్ల లోపువారేనని తెలిపింది. ఇందులోనూ మళ్లీ ప్రత్యేకించి చూస్తే... వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టబడిన అమ్మాయిల్లో 43 శాతం మంది ముక్కుపచ్చలారని మైనర్‌ బాలికలేనన్న హృదయవిదారకమైన వాస్తవం మహిళా కమిషన్ అధ్యయనంలో వెలుగుచూసింది. దుర్భర దారిద్య్రం... వారిని చీకటి మాటున వేశ్యావాటికలకు తరలించేస్తున్నాయి.(ఈనాడు 5.10.2009)

పురాణాలు

శ్రీనాథుడు వేశ్యలపై రచించిన ఒక పద్యం:

పురుషుడు గూడువేళ బెడబుద్ధులు, యోగ్యముకాని చేతలున్
సరగున మేని కంపు, చెడు చందపు రూపము, నేహ్యవస్త్రముం
బరగు నిరంతరంబు, నెడబాయని సౌఖ్యము, లేని ప్రేమయున్
విరహపు జూడ్కు, లుమ్మలిక వీసము, జల్లులు వేశ్యభామకున్ !

వ్యభిచారానికి చట్టబద్ధత ?

వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన వృత్తి అని సోలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనపై కోర్టు స్పందిస్తూ.. చట్టప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు, బాధితులకు వైద్యసాయం అందించవచ్చు అని ధర్మాసనం పేర్కొంది.(ఈనాడు10.12.2009)

చూడండి