బొడ్డు గోపాలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: es:B. Gopalam
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3764118 (translate me)
పంక్తి 20: పంక్తి 20:
[[వర్గం:1927 జననాలు]]
[[వర్గం:1927 జననాలు]]
[[వర్గం:2004 మరణాలు]]
[[వర్గం:2004 మరణాలు]]

[[en:B. Gopalam]]
[[es:B. Gopalam]]

14:40, 9 మార్చి 2013 నాటి కూర్పు

బి.గోపాలం లేదా బొడ్డు గోపాలం (1927 - 2004) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు.

వీరు గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామంలో రామదాసు దంపతులకు 1927 జనవరిలో జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలం కి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని విజయవాడలో ప్రముఖ సంగీత విద్వాంసులైన వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చేర్చారు. అక్కడ గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నారు. 1944లో గుంటూరు జిల్లా ప్రజా నాట్య మండలిలో సంబంధము ఏర్పడింది. వేములపల్లి శ్రీకృష్ణ, షేక్ నాజర్, వేపూరి రామకోటి ము న్నగు వారితో తోడు. శ్రీకృష్ణ వ్రాసిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా" పాటకు, పులుపుల శివయ్య గారి "పలనాడు వెలలేని మాగాణిరా" పాటకు స్వరరచన చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలములో హిట్లర్ సైన్యానికి వ్యతిరేకముగా, సోవియట్ సేనలకు విజయము కలగాలని పాటలు వ్రాసి పాడేవాడు. "స్టాలినో నీ ఎర్ర సైన్యం" అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది.

విజయవాడ రేడియో కెంద్రములో ఎంకి-నాయుడు బావ, భక్త రామదాసు వంటివాటితో పాటు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ వారి సంగీత రూపకాలు, గేయాలు పాడాడు. రేడియో గాయని రేణుకతో పరిచయం పెళ్ళికి దారి తీసింది. 1952లో తాతినేని ప్రకాశరావు పిలిపు మేరకు మద్రాసు వెళ్ళి ఘంటసాల వద్ద సహాయకులుగా చేరాడు. పల్లెటూరు, బతుకుతెరువు, పరోపకారం సినిమాలకు పని చేశాడు. తరువాత నలదమయంతి చిత్రానికి సంగీత దర్శకుడుగా చేశాడు. నాగభూషణం గారి రక్తకన్నీరు, కలికాలం, పాపం పండింది, నాటకాల రాయుడు నాటకాలకు సంగీతము సమకూర్చాడు. 1972-84 ప్రాంతములో వెంపటి చినసత్యం తో శ్రీనివాస కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పారిజాతాపహరణం, నృత్య రూపకాలకు నేపధ్య గానం ఇచ్చి దేశ విదేశాలలో పర్యటించాడు.


మంగళగిరి లో చాలాకాలం నివసించి 22.9.2004 న చనిపోయారు.

సంగీతం సమకూర్చిన సినిమాలు

బయటి లింకులు