కర్బూజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: cs:Tykev velkoplodá
చి Bot: Migrating 22 interwiki links, now provided by Wikidata on d:q161180 (translate me)
పంక్తి 32: పంక్తి 32:
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:కుకుర్బిటేసి]]
[[వర్గం:కుకుర్బిటేసి]]

[[en:Cucurbita maxima]]
[[az:İri balqabaq]]
[[ca:Carabassa]]
[[chy:Mo'ôhtáemâhoo'o]]
[[cs:Tykev velkoplodá]]
[[de:Riesen-Kürbis]]
[[es:Cucurbita maxima]]
[[fr:Potiron]]
[[gn:Kurapepẽ]]
[[hsb:Hoberski banjowc]]
[[it:Cucurbita maxima]]
[[lt:Didysis moliūgas]]
[[nl:Reuzenpompoen]]
[[pcd:Paturon]]
[[pl:Dynia olbrzymia]]
[[pt:Cucurbita maxima]]
[[qu:Sapallu]]
[[ru:Тыква гигантская]]
[[sk:Tekvica veľkoplodá]]
[[to:Hina (ʻakau)]]
[[tr:Helvacı kabağı]]
[[zh:笋瓜]]

17:30, 9 మార్చి 2013 నాటి కూర్పు

Buttercup squash
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. maxima
Binomial name
Cucurbita maxima

కర్బూజ దోస జాతికి చెందిన పండు. దీని సాంకేతిక నామం కుకుర్బిట మాక్సిమా.

ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు. దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మృదుగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి.

మస్క్‌ అనే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి మస్క్‌ మెలన్‌ అనే పేరు కూడా వుంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి. కర్బూజాగా ప్రసిద్ధమైన ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో సాగులో ఉండేవి. వీటిలోని ఔషధగుణాలను గురించి క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు వైద్యుడు గాలెన్‌ వివరించాడు. రోమన్లు కూడా సాగు చేసేవారు. ఇవి వాయవ్య భారతంలో జన్మించాయి. అక్కడి నుండి చైనా, పర్షియా ప్రాంతాలకు వ్యాపించాము. కాశ్మీర్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో కూడా అభివృద్ధి చెందాయి. వీటిలో అడవి రకాలు ఎన్నో ఆ ప్రాంతాలలో కనిపించేవి.

లాభాలు

ఈ పండు వేసవిలో మంచి చలువ చేయడమే కాకుండా, క్యాలరీలు లేని తీపిదనాన్ని ప్రసాదిస్తాయి. లేత నారింజ రంగులో వుండే గుజ్జు రుచిగా వుంటుంది. ఈ గింజల్ని కూడా ఎండబెట్టిన తర్వాత ఒలుచుకుని తింటారు. రకరకాల పంటల్లో వాడతారు.

ఆయుర్వేదంలో కూడా ఈ రసాన్ని చాలా రకాల సమస్యల నివారణకు సూచిస్తారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మలబద్దకం, మూత్రనాళ సమస్యలు, ఎసిడిటి, అల్సర్‌ వంటి పరిస్థితుల్లో మా గుజ్జుని తగినంత నీటిలో కలిపి తాగితే మంచి మేలు. మేము శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఆకలి పెంచుతాము. అలసట తగ్గిస్తాయి. అంత త్వరగా జీర్ణం కావు కానీ మంచి శక్తిని ఇస్తాయి. కొంతమంది లైంగిక శక్తి పెరుగుదలకు కూడా సూచిస్తారు. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు శ్రేష్ఠమైనది.

అరగడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కడుపు నిండినట్టు వుంటుంది. క్యాలరీలు రావు. పైగా ఇందులోని పీచు పదార్థాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా వుంటుంది. అందువల్ల రక్తపోటునీ, గుండె పనితనాన్ని మెరుగు పరుస్తాయి. అంతే కాదు, కిడ్నీలలో రాళ్లు రాకుండా నివారిస్తూ, వృద్ధాప్యంలో ఎముకల బలానికి తోడ్పడతాయి. ఇక విటమిన్‌ 'సి' పుష్కలంగా వుంటుంది. విటమిన్‌ 'ఎ' కూడా బాగానే వుంటుంది. దాని వల్ల చర్మం మెరుగుపడుతుంది. ఫోలిక్‌ఆమ్లం వల్ల గర్భిణీ స్త్రీలు లాభపడతారు.

మెలన్ డే

భారతదేశంలో ఇవి అధికంగా పండినా, తుర్కమేనిస్తాన్‌లో మాత్రం విరివిగా పండుతాయి. అక్కడ వీటి గౌరవ సూచకంగా ఒక రోజును మెలన్‌డేగా పాటించబడే ఆరోజు అక్కడ సెలవుదినం కూడా. తుర్కమేనిస్తాన్‌లో పండే కర్బూజాలు వేరెక్కడా లేని విధంగా అద్భుతమైన సువాసన, మధురమైన రుచితో వుంటాయి. వీటిని అక్కడ స్వర్గ ఫలాలని అంటారు. ఏటా ఆగస్ట్‌ మాసంలోని రెండవ ఆదివారాన్ని మెలన్‌డేగా పాటిస్తారు. ఆ అలవాటు 1944 నుండి వస్తోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు సాపర్‌మురత్‌ నియాజోన్‌ తనని తాను తురుష్కుల నాయకుడిగా (తురుష్క్మ్‌న్‌ బాషి) పిలిపించుకునే వాడు. ఆ పేరు మీద ఒక సంకర జాతి కర్బూజాని కూడా రూపొందించారు.

పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు

నీరు; 95.2 గ్రా. ప్రొటీన్: 0.3 గ్రామ్ క్రొవ్వు: 0.2 గ్రామ్ .. పీచు: 0.4 గ్రా. కెరోటిన్ 169 మైక్రో గ్రాం: సి. విటమిన్: 26 మి.గ్రా: కాల్సియం: 32 మి.గ్రా. ఫాఅస్పరస్: 14 మి.గ్రా. ఇనుము: 1.4 మి.గ్రా. సోడియం: 204.8 మి.గ్రా. పొటాసియం: 341 మి.గ్రా. శక్తి: 17 కిలో కాలరీలు.

"https://te.wikipedia.org/w/index.php?title=కర్బూజ&oldid=813517" నుండి వెలికితీశారు