క్షారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: it:Alcalinità
చి Bot: Migrating 40 interwiki links, now provided by Wikidata on d:q485742 (translate me)
పంక్తి 157: పంక్తి 157:
* [[వర్గం:క్షారాలు]]
* [[వర్గం:క్షారాలు]]


[[en:Alkali]]
[[kn:ಕ್ಷಾರ]]
[[ar:قلوي]]
[[be:Шчолачы]]
[[be-x-old:Луг (хімія)]]
[[ca:Àlcali]]
[[cy:Alcali]]
[[de:Alkalien]]
[[eo:Alkalo]]
[[es:Álcali]]
[[et:Leelis]]
[[eu:Alkali]]
[[fa:قلیایی]]
[[fr:Alcali]]
[[he:אלקלי]]
[[hu:Lúg]]
[[ia:Alcali]]
[[io:Alkalio]]
[[it:Alcalinità]]
[[it:Alcalinità]]
[[ja:アルカリ]]
[[ka:ტუტე]]
[[kk:Сілтілер]]
[[ko:알칼리]]
[[la:Alkali]]
[[lt:Šarmas]]
[[lv:Sārmi]]
[[no:Alkali]]
[[nov:Alkali]]
[[pl:Alkalia]]
[[pnb:الکلی]]
[[pt:Álcali]]
[[ru:Щёлочи]]
[[simple:Alkali]]
[[sq:Alkali]]
[[th:อัลคาไล]]
[[tr:Alkali]]
[[uk:Луг (хімія)]]
[[ur:القالی]]
[[uz:Ishqor]]
[[za:Ndaengq]]
[[zh:碱]]

01:04, 10 మార్చి 2013 నాటి కూర్పు

క్షారాలు (Alkali) ఒక విధమైన రసాయన పదార్ధాలు.ఇవి ఆమ్లములతో చర్య పొందుతాయి. రుచికి చేదుగా ఉంటాయి.వీటిని సబ్బు ల తయారీలో ఉపయోగిస్తారు.

ఉదాహరణలు

  • సోడియం హైడ్రాక్సైడ్(Sodium Hydroxide: NaOH)
  • పొటాషియం హైడ్రాక్సైడ్ (Potassium hydroxide: KOH)
  • బెరియం హైడ్రాక్సైడ్ (Barium hydroxide: Ba(OH)2)
  • కాల్షియం హైడ్రాక్సైడ్ (Calcium hydroxide: Ca(OH)2)

లక్షణాలు

  • ఇవి రుచికి చేదుగా ఉంటాయి.
  • ఎరుపు లిట్మస్ కాగితాన్ని క్షారంలో ఉంచినపుడు నీలం రంగులోకి మారుస్తాయి.
  • క్షారాలు మిథైల్ ఆరెంజి సూచికను పసుపు రంగుగా మారుస్తాయి.
  • క్షారాలు ఫీనాప్తలీన్ సూచికను గులాబి రంగు లోకి మారుస్తాయి.

ధర్మాలు

  • క్షారాలను వేడిచేస్తే లోహ ఆక్సైడ్లు, కార్బన్ డయాక్సైడ్ లు గా విడిపోతుంది.
  • క్షారం ఆమ్లం తో చర్య పొంది లవణం, నీరు లనిస్తుంది. దీనిని తటస్థీకరణము అందురు. NaOH + HCl → Nacl + H2O

తయారు చేసే విధానం

లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగినపుదు ఆమ్లాలు తయారవుతాయి.

  • సోడియం ఆక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. Na2O +H2O → 2NaOH
  • మెగ్నీషియం ఆక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. 2MgO +H2O → Mg(OH)2
  • కాల్షియం అక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు కాల్షియం హైడ్రక్సైడ్ ఏర్పడుతుంది. 2CaO +H2O → Ca(OH)2

అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతము

అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం జల ద్రావణంలో H+ అయాన్లను యిచ్చేవి ఆమ్లాలు. OH- అయాన్లను యిచ్చెవి క్షారాలు. ఈ సిద్ధాంతం ప్రకారం HCl ఆమ్లము. అది నీటిలో కరిగినపుడు H+, Cl-అయాన్లుగా విడిపోతుంది. ఈ సిద్ధాంతంప్రకారం NaOH క్షారం అది నీటిలో కరిగినపుడు Na+, OH- అయాన్లుగా విడిపోతుంది. నీటిలో H+ OH- అయాన్లు సమానంగా ఉంటాయి. అందువలన అది తటస్థ ద్రావణం.

అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం- లోపములు

  • కాల్షియం కార్బొనేట్ నీటిలో కరగక పోయినప్పటికీ అది క్షార స్వభావాన్ని కలిగి ఉండును.
  • కాల్షియం ఆక్సైడ్ నందు OH-అయాన్లు లేనప్పటికీ అది క్షార స్వభావాన్ని కలిగి ఉండును.

నీటి అయనీకరణము

స్వచ్చమైన నీటిలో విద్యుత్ ప్రసరించదు. నీటిలో విద్యుత్ ను ప్రసరింపజేస్తే ఒక లీటరు ఘనపరిమాణంలో ఒక కోటి మోల్ అయాన్లలో ఒకటి మాత్రమే అయాన్లుగా విడిపోతుంది. దీనిని నీటి అయనీకరణము అందురు. [H+] అనగా H+ అయాన్ యొక్క గాఢత. [OH- ] అనగా OH- అయాన్ గాఢత అనిర్థం. నీటిలో H+ మరియు OH- లు సమానంగా ఉంటాయి. అందువల్ల వాటి గాఢతలు సమానముగా ఉంటాయి. [H+]= 10-7 మోల్ అయాన్/లీటరు  : [OH- ] =10-7 మోల్ అయాన్/లీటరు

నీటి అయానిక లబ్దము

ఒకమోల్ నీటిలో గల H+ గాఢత మరియు OH- గాఢతల లబ్దాన్ని నీటిఅయానిక లబ్దం అందురు.దీనిని Kw తో సూచిస్తారు. w= [H+] x [OH- ] ఇది ఆమ్ల క్షారాల లో ముఖ్య మైనది. ఎందువలనంటే

  • నీటికి ఆమ్లం కలిపినపుడు H+ అయాన్ల గాఢత పెరుగుతుంది OH- అయాన్ల గాఢత తగ్గుతుంది. అయినా వాటి గాఢతల లబ్దం మారదు.
  • నీటికి క్షారణ్ కలిపినపుడు H+ అయాన్ల గాఢత తగ్గుతుంది OH- అయాన్ల గాఢత పెరుగుతుంది. అయినా వాటి గాఢతల లబ్దం మారదు.
ఆమ్ల,క్షారముల జల ద్రావణంలో H+ అయాన్ల గాఢత మరియు OH- అయాన్ల గాఢత
H+ అయాన్ల గాఢత [H+] 100 10-1 10-2 10-3 10-4 10-5 10-6 10-7 10-8 10-9 10-10 10-11 10-12 10-13 10-14
OH- అయాన్ల గాఢత [OH-] 10-14 10-13 10-12 10-11 10-10 10-9 10-8 10-7 10-6 10-5 10-4 10-3 10-2 10-1 100

H+ అయాన్ గాఢత బట్టి ఆమ్ల,క్షారములను తెలుసుకొనవచ్చును.

  • 100 > [H+] > 10-6 అయితే ఆ ద్రావణం ఆమ్లం అవుతుంది.
  • [H+] = 10-7 అయిన ఆ ద్రావణం తటస్థ ద్రావణం అవుతుంది.
  • 10-8 > [H+] > 10-14 అయితే ఆ ద్రావణం క్షారం అవుతుంది.

PH

దీనిని సోరెన్ సన్ అనె శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ మానమును ఆమ్ల క్షారములు తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.

  • హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమానాన్ని PH అందురు.
  • PH= -log [H+]
H+ అయాన్ల గాఢత మరియు PH విలువలు
H+ అయాన్ల గాఢత [H+] 100 10-1 10-2 10-3 10-4 10-5 10-6 10-7 10-8 10-9 10-10 10-11 10-12 10-13 10-14
PH విలువలు 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14


PH ఆధారంగా ఆమ్ల క్షారములను తెలుసుకోవచ్చు.

  • PH విలువ 0 నుండి 6 వరకు గల ద్రావణాలు ఆమ్లాలు.
  • PH విలువ 7 గల ద్రావణాలు తటస్థ ద్రావణాలు.
  • PH విలువ 7 నుండి 14 గల ద్రావణాలు క్షారాలు.

క్షారముల బలాలు

  • బలమైన క్షారము (strong alkali) :100% అయనీకరణము చెందిన క్షారమును బలమైన ఆమ్లము అందురు. ఉదా: సోడియం హైడ్రాక్సైడ్(NaOH)
  • బలహీన క్షారము (weak alkali) : పాక్షికంగా అయనీకరణము చెందిన క్షారమును బలహీన క్షారము అందురు. ఉదా: అమ్మోనియం హైడ్రాక్సైడ్ (NH4 OH)

తటస్థీకరణము,తటస్థీకరణోష్ణం

ఒక మోల్ ఆమ్లం మరియు ఒక మోల్ క్షారం కలిపినపుడు లవణం, నీరు యేర్పడతాయి. దీనిని తటస్థీకరణము అందురు. తటస్థీకరణము చెందినపుడు వెలువడు ఉష్ణాన్ని తటస్థీకరణోష్ణం అందురు.
బలమైన ఆమ్లము బలమైన క్షారంతో చర్య పొందినపుడు తటస్థీకరణోష్ణం విలువ 13.7 కి.కా/మోల్ ఉండును.
మిగిలిన సందర్భాలలో దీనివిలువ 13.7 కి.కా/మోల్ కన్న తక్కువ ఉండును;

ఇవి చేయండి, తెలుసుకోండి

  1. మాజిక్ ఉత్తరాన్ని తయారు చేయుట: ఫీనాప్తలీన్ ద్రవం ఉపయోగించి ఉత్తరాన్ని తెల్ల కాగితంపై రాయండి. ఆ ఉత్తరాన్ని ఆరబెట్టండి. ఆ కాగితంపై ఏ అక్షరాలు కనిపించవు. ఈ ఉత్తరాన్ని ఒక పాత్రలో గల సబ్బు నీటి ద్రావణంలో ఉంచండి. దాని పై గులాబి రంగు అక్షరాలు కనిపిస్తాయి.
  2. జీర్ణాశయంలో యేర్పడిన ఎసిడిటీ కొరకు: మనం రోజూ సరియైన సమయానికి ఆహారం తినకపోవుట వలన మన జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ ఆమ్లము ఉత్పత్తి పెరిగి ఎసిడిటీ కి కారణమగును. అపుడు ఆమ్లత్వం పోవుటకు క్షారంతో కూడిన మాత్రలను వాడమని డాక్టర్లు చెవుతారు.



ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=క్షారం&oldid=815604" నుండి వెలికితీశారు