"కోట సామ్రాజ్యము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==విశేషాలు==
కోట రాజులు మొదట్లో జైన మతాన్ని ఆచరించినా తర్వాత కాలంలో చాళుక్యుల వలె హిందూ మతాన్ని కూడా ఆచరించారు. శైవ తత్వాన్ని కూడా ప్రోత్సహించారు. వీరికి తూర్పు చాళుక్యులతోను, సూర్యవంశీయులైన కాకతీయులతోను వివాహ సంబంధాలుండేవి. కాకతీయ గణపతి దేవుని రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట బేతరాజు వివాహమాడాడు. మంగళగిరి ఆనంద కవి వ్రాసిన 'విజయనందవిజయనందన విలాసము' లో హరిసీమ కృష్ణుడు చంద్రవంశానికి చెందినవాడని వ్రాయబడినది. క్రీస్తు శకము 1182 ప్రాంతంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయం చేయడానికి కాకతీయ రుద్రదేవరాజు కొంత సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం ధరణికోటను ముట్టడించి జయించింది. కోట దొడ్డభీమరాజు మరణించాడు. ఆనాటి నుండి కోట వంశీయులు కాకతీయులకు సామంతులయ్యారు. 1323 వ సంవత్సరంలో మహమ్మదీయుడైన ఉయిన్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించాడు. ఆ సందర్భంలో కోట వంశం కూడా రాజ్యం కోల్పోయింది. ఈ వంశం వారు చెదిరిపోయి దాట్ల, పాకలపాడు, చింతలపాడు, జంపన వంటి గ్రామాలకు వెళ్ళిపోయారు <ref>[[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] - బుద్ధరాజు వరహాలరాజు, 1970</ref>.
 
కోట సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు:
*కోట రుద్రరాజు
*కోట బేతరాజు - క్రీస్తు శకం 1268
 
==అపోహ==
కోట రాజులు [[కమ్మ]] కులస్తులకు పూర్వీకులని కొంతమంది భావం. కోట అనే పదం గృహనామంగా కమ్మ కులస్తుల్లో ఉండటం వల్ల కూడా ఈ భావం ఉండవచ్చును. ఇందులో వాస్తవం లేదు. కోట వంశము వారిది ధనుంజయ గోత్రం. ఈ గోత్రం కమ్మ కులస్తుల్లో లేదు. గృహనామాలు ఉరి పేరుని బట్టి ఏర్పడతాయి కాబట్టి ఒక కులంలో ఉన్న గృహనామం మరొక కులంలో కూడా ఉండవచ్చు. కమ్మ కులస్తులు సూర్యవంశానికి గాని చంద్రవంశానికి గాని చెందినవారు కాదు.
238

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/818110" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ