వాడుకరి చర్చ:Somu.balla: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎దూరదర్శిన చర్చ: కొత్త విభాగం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48: పంక్తి 48:


[[చర్చ:దూరదర్శిని]] లో స్పందించండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:38, 10 మార్చి 2013 (UTC)
[[చర్చ:దూరదర్శిని]] లో స్పందించండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:38, 10 మార్చి 2013 (UTC)

== హైదరాబాదులో తెవికీ సమావేశం ==

సోమూ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో [[వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం]](ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 05:29, 13 మార్చి 2013 (UTC)

05:29, 13 మార్చి 2013 నాటి కూర్పు

Somu.balla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:09, 5 డిసెంబర్ 2012 (UTC)

ధన్యవాదాలు

తొలగించు మూసలపై ఉన్న ఆసక్తి విస్తరణ మూసలపై ఉంచండి, లేదా వీలయితే విస్తరించడానికి ప్రయత్నించండి. నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ YVSREDDY (చర్చ) 15:40, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవ్వరు, ఎలా, ఎందుకు అనే వ్యాసాలు మీకు అవసరం లేకపోవచ్చు. అనేకమందికి చాలా అవసరమైన వ్యాసాలు. మళ్ళీ మళ్ళీ నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ YVSREDDY (చర్చ) 22:01, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు నేను ప్రారంభించిన వ్యాసాలపై మాత్రమే ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నందుకు ధన్యవాదాలు, పేకముక్కల భవంతి లాగా పేర్చిన నా వ్యాసాలు కూల్చడం ఎవరికయినా సులభమే, వాటిని మళ్ళీ మళ్ళీ నిర్మించి, పటిష్ఠ పరచి శాశ్వతంగా నిలపడమే మీ YVSREDDY (చర్చ) 23:31, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ప్రారంభించిన వ్యాసాలు మొలకల నుంచి మొక్కలగా ఎదిగెందుకు కృషి చేస్తున్నాను. అందువలన చర్చలకు ఎక్కువ సమయం కేటాయించలేను. ఉదాహరణకు జెండా వ్యాసాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న వ్రాయాలనుకున్నాను. చర్చలలో మునిగిపోయి 3 నిమిషాలు ఆలస్యంగా జనవరి 27 న వ్రాశాను. వెన్నెల వ్యాసంలో విస్తరణ మూస ఉంచినందుకు ధన్యవాదాలు. మీ YVSREDDY (చర్చ) 00:12, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావు గారి లాగా నిష్పక్షపాతంగా ఉండి విమర్శలు గుప్పించు వాటిని అందరూ ఆహ్వానిస్తారు, నిండు చంద్రుడిలా ప్రకాశిస్తావు. పక్షపాత ధోరణిలో విమర్శలు గుప్పిస్తే అమావాస్య చంద్రుడిలా (సోము అంటే చంద్రుడు) కళావిహీనమవుతావు. వేమారెడ్డి గారి పద్యాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. పౌర్ణమి చంద్రుడిలా ప్రకాశించాలని కోరుకుంటూ మీ YVSREDDY (చర్చ) 15:03, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పాలగిరి గారు వెన్నెల వ్యాసం చర్చలో సూర్యకాంతి ఎల్లవేళలా చంద్రునిపై పడుతూనే ఉంటుందని చెప్పారు. అటువంటప్పుడు చంద్రుడు ఎలా కళావిహీనడవుతాడు, ఎప్పటి కాడు, ఎల్లవేళలా పౌర్ణమి చంద్రునిలా ప్రకాశిస్తూనే ఉంటాడు. నేను ప్రారంభించిన మొదటి వ్యాసం నా పేరుతో ప్రారంభం కాలేదు, ఇప్పటికి నేను ప్రారంభించిన వ్యాసాల జాబితాలో లేదు, నేను ప్రారంభించిన ఆ వ్యాసాన్ని నేను ఒక్కడినే పూర్తి చేయలేనని నాకు తెలుసు, తెలుగు వికిపీడీయా సభ్యులందరు కలసి సమిష్టిగా విశేషమైన కృషి చేసి పూర్తి చేయవలసిన వ్యాసం కాబట్టి నేను ఆ వ్యాసాన్ని నేను ప్రారంభించిన వ్యాసాల జాబితాలో చేర్చలేదు. ఆ వ్యాసానికి అనుబంధ వ్యాసాలు వికిపీడీయాలో లేనందువలన ఇతర వ్యాసాల ప్రారంభానికి కారణమయ్యింది, ఆ వ్యాసాలకు అనుబంధ వ్యాసాలు అలా అలా విపరీతమయ్యాయి, కాని నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని ప్రాథమిక సమాచారంతో వదలి పెట్టాలనుకోలేదు, అందుకనే నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని భద్రపరచుకుంటూ ఇటీవల నేను ప్రారంభించిన వ్యాసాల జాబితా తయారు చేసి వికీపీడియా విధి విధానాల ప్రకారం ఒక వ్యాసంలో కనీసం ఆరు వరుసలు ఉండాలనే నియమానికి అనుగుణంగా నా వ్యాసాలలో ఆరు వరుసలకు ఎన్ని వరుసలు తక్కువ ఉంటే అన్ని మైనస్ గుర్తులు ఏర్పాటు చేసుకొని వాటిని అభివృద్ధి పరచాలనుకున్నాను. మైనస్ గుర్తులు ఏర్పాటు చేశాను. నాకు సభ్యనామంతో వ్రాయమని సలహా ఇచ్చిన రాజశేఖర్ గారు మైనస్ గుర్తులను తొలగించారు. మైనస్ గుర్తులు చూసి వాటిని నిర్వాహకులు సులభంగా గుర్తించి వాటిని తొలగిస్తారని అలా చేసి ఉండవచ్చని భావించాను, మళ్ళీ మైనస్ గుర్తులు ఏర్పాటు చేయలేదు, నేను ప్రారంభించిన వ్యాసాలలో పై వరుసలో ఉన్న అడ్డుకొలత వ్యాసాన్ని చూసిన రమణ గారు ఆ వ్యాసంపై విమర్శ చేసి కొత్త వ్యాసాన్ని ప్రారంభించారు. ఆ వ్యాసాన్ని నేను ప్రారంభించిన వ్యాసంలో విలీనం చేయమని చంద్రశేఖర్ గారికి విన్నవించాను. వెంటనే రమణ గారు కూడా చంద్రశేఖర్ గారికి నేను ప్రారంభించిన వ్యాసాన్ని ఉంచితేనే మిగతా వ్యాసాలు వ్రాస్తాను అనే విధంగా విన్నవించారు. తదుపరి నేను పదవతరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాన్ని సేకరించి అందులోని విషయాలను వ్రాయడం మొదలు పెట్టాను. అంతలో నేను పోటీగా వ్యాసాలు వ్రాస్తున్నానని భావించిన రమణ గారు వెంట వెంటనే చాలా వ్యాసాలు వ్రాసారు. ఇదంతా గమనించిన పాలగిరి గారు రచ్చబండలో చర్చకు పెట్టారు. రచ్చబండలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, రచ్చబండలో పాలగిరి గారు నా గురించిన వ్రాసిన సమాచారాన్ని నాకు మీరు తెలియజేశారు, మీరు తెలియజేసిన విషయాన్ని మీరు వ్రాసినదిగా భావించి ఆ విషయాన్ని మరికొన్ని ఇతర విషయాలను వెంటనే తొలగించాను. మళ్ళీ మీరు పొగడ్తలు ఉంచుకొని విమర్శలు తీసేశారని సందేశం పంపారు. ఆ తరువాత సమాచారాన్ని మొత్తాన్ని తొలగించి నా పేజీలో చర్చలు జరపవద్దన్నాను, ఎందుకంటే నేను ఎవరిపై విమర్శలు చేయడం ఇష్టం లేక. మీ YVSREDDY (చర్చ) 12:03, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకవాక్య వ్యాసాల గుర్తింపు /తొలగింపు

సోముగారు,

ప్రస్తుతము నేను విక్షీనరిలోని పదాలకు భాషాభాగాలు చేర్చడం,పదాలకు అర్థవివరణ వ్రాయడం,మరియు అవసరమున్నచోట చిత్రాలను చేర్చుటలో నిమగ్నమైవున్నాను.విక్షనరీలోని చాలాపదాల పేజిలు అసంపూర్తిగా వున్నాయి.నేను ఆపనిలో ప్రస్తుతం దృష్టి పెట్టాను.వీలుచూసుకొని ఏకవాక్యవ్యాసాలపై స్పందిస్తాను.అంతవరకు మీరు మీ కృషిని కొనసాగించండి.పాలగిరి (చర్చ) 01:55, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా శుద్ధి

వికీపీడియాను శుద్ధిచేయడం ఒక పెద్ద యజ్నం. మీరు ఎవరు రచించిన వ్యాసాలైనా, చిన్నవాటిని, తప్పులున్న వాటిని చూచి, చర్చ పేజీల్లో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. కొన్నింటిని ఇతర వ్యాసాలతో విలీనం చేయడం లేదా విస్తరించడం చేద్దాము. అన్నింటిని తొలగించడం మంచిది కాదని నా అభిప్రాయం. ఇలాంటి ముఖ్యమైన శుద్ధిచేసే కార్యక్రమానికి కొత్త ఉత్సాహం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. వీలుంటే మీరు కొన్ని ముఖ్యమైన చిన్న వ్యాసాల్ని విస్తరించండి.Rajasekhar1961 (చర్చ) 07:26, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వ్యాసాల్ని విలీనం చేస్తుంటే రెడ్డి గారు మళ్ళీ వాటన్నింటికి కొత్తవ్యాసాల్ని సృష్టిస్తున్నారు. ఇది అంత మంచి పరిణామం కాదు. ఇలా అయితే మనం మనం కొట్టుకోవడం తప్ప అభివృద్ధి సాధ్యం కాదు.Rajasekhar1961 (చర్చ) 06:40, 4 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డిగారి మీద నిషేధం విధించడం బాధాకరంగా ఉన్నది. అయినా చాలా కాలం ఉపేక్షించాను. రచయితలు తక్కువగా ఉన్నప్పుడు ఏవో కొన్ని వ్యాసాలు తయారు అవుతున్నాయి కదా అనే విషయం గురించి ఆలోచించి మాత్రమే. కానీ అతనికి ఇతర సభ్యుల ఆలోచనలని, వికీ నియమాలని పట్టించుకోకుండా చిన్న వ్యాసాల తయారీ లక్ష్యంగా అదుపులేకుండా పోతున్నారు. మీరు చేస్తున్న పని చాలా ముఖ్యమైనది. చిన్న వ్యాసాలు ఎవరు సృష్టించినవి అయినా కూడా తొలగింపు లేదా విలీనం మూసను పెడుతుండండి. వాటిని సమయానుకూలంగా నాకు తోచిక విధంగా పనిచేస్తాను. మన పని ఏ ఒక్క వ్యక్తి మీద కాదు. వికీపీడియాను నిజమైన సమాచార నిధిగా తయరుచేయడమే నని గుర్తుంచుకోండి.Rajasekhar1961 (చర్చ) 03:45, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
దారిమార్పు పేజీలలో తొలగించు మూస ఉంచవద్దు. వికీలో దారిమార్పు పేజీలను పేజీలుగా లెక్కలోకి రావు. అవి తప్పనిసరిగా ఉండాలి. దారిమార్పు చేయబడిన ప్రధాన వ్యాసంలోని సమాచారాన్ని గమనించండి.Rajasekhar1961 (చర్చ) 07:23, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకవాక్య వ్యాసాల నివారణకు కృషి

సోమూ గారూ  ! ఏకవాక్య వ్యాసాల నివారణకు మీరు చేస్తున్న కృషి మెచ్చతగినది. ఎన్నో రోజుల నుండి వేధిస్తున్న సమస్య ఒక దారికి వచ్చింది. సాధారణంగా నా ఓటు సమగ్రమైన విషయ ప్రాధాన్యత కలిగిన వ్యాసాలకే. అయినా అందరూ తెవీకీ లో ప్రవేశించగానే వ్రాయలేరు కనుక విషయ ప్రాధాన్యం ఉన్నవి చిన్నవి కూడా తెవీకికి ఆమోద యోగ్యమైనవని గతంలో జరిగిన చర్చల మూలంగా నిర్ణయించబడింది. రచ్చబండ 7 పేజీ ఆ చర్చల సారాంశం చూడవచ్చు .అనుభవమున్న సభ్యులు సమగ్ర వ్యాసాలు వ్రాయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.ఎవరో వస్తారు ఏదో వ్రాస్తారు అని వ్యాసం మొదలు పెట్టి వదిలివేయడం బాధ్యతా రాహిత్యమే. అయినప్పటికీ తోటి సభ్యులకు ఏ విషయమైనా అనునయంగా చెప్పినప్పుడే సత్ఫలితాలను ఇస్తుంది కనుక నేను ఆ మార్గం అవలంబిస్తాను.మీ నుండి మంచి వ్యాసాలను ఆశిస్తున్నాను. --t.sujatha (చర్చ) 06:10, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం

సోమూ గారూ, నిర్వాహకులు కాకపోయినా తెవికీ నిర్వాహక పనులు చక్కగా చేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. ఈ కృషి ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సమిష్టి కృషి అంటే అందులో చిన్న చిన్న పొరపొచ్చాలు వస్తూనే ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొన్ని ముందుకు సాగాలి. రెడ్డి గారు అన్ని నియమాలు పాటించకపోయిన, సదుద్దేశంతోనే చేస్తున్నట్టు తోచింది. మన ప్రయత్నంగా మనం నియమాలు ఇవి అని నచ్చచెప్పటానికి ప్రయత్నిద్దాం. పట్టూవిడుపూ వుండాలని కూడా ఒక మార్గదర్శకం ఉంది సుమీ :-) --వైజాసత్య (చర్చ) 13:26, 17 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దూరదర్శిన చర్చ

చర్చ:దూరదర్శిని లో స్పందించండి.--అర్జున (చర్చ) 04:38, 10 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

సోమూ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:29, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]