గోదాదేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q465030 (translate me)
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q465030 (translate me)
పంక్తి 22: పంక్తి 22:
[[వర్గం:ఆళ్వారులు]]
[[వర్గం:ఆళ్వారులు]]
[[వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు]]
[[వర్గం:ప్రముఖ వైష్ణవాచార్యులు]]

[[ml:ആണ്ടാൾ]]
[[sa:आण्डाळ्]]

06:37, 14 మార్చి 2013 నాటి కూర్పు

గోదా దేవి
దస్త్రం:Andal.JPG
గోదాదేవి
నామాంతరములుకోదై,
చూడిక్కొడుత్త నాచ్చియార్,
ఆండాళ్,
ఆముక్త మాల్యద
జన్మస్థలం శ్రీరంగం
జన్మ నక్షత్రము నల సంవత్సరం,
కర్కాట మాసము,
పుబ్బా నక్షత్రము,
ఆషాఢ శుద్ధ చతుర్దశి
కాలము క్రీ.శ.776
దైవాంశ లక్ష్మీ
రచనలు తిరుప్పావు,
నాచ్చియార్ తిరుమళి
విశేషములు విష్ణుచిత్తుల పెంపుడు కుమారి,
రంగనాథునికి తను ధారణ చేసిన మాలలు సమర్పించినది

ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.

తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.

గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసం లో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=గోదాదేవి&oldid=819665" నుండి వెలికితీశారు