శ్రీకృష్ణ తులాభారం (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
65 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
చి
వర్గం:పౌరాణిక నాటకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
చి (వర్గం:పౌరాణిక నాటకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
తన మాటను కృష్ణుడు లక్ష్యపెట్టలేదనే కోపంతో ఉన్న సత్యభామ దగ్గరకు నారదుడు వెళ్ళగా ఆమె కృష్ణుని సంపూర్ణ ప్రేమానురాగాలు పొందేందుకు ఏదైన మంత్రమో,తంత్రమో ఉపదేశించమంటుంది. అందుకు 'పుణ్యక వ్రతం / భర్తృ ప్రణయ వ్రతం ' అనేది ఉన్నదనీ,సాధ్వీలలామలందరూ ఆ వ్రతాన్నే ఆచరించి తమ సంసారాల్లో సంపూర్ణ ప్రమానురాగాల్ని పొందారనీ,కానీ వ్రత నియమం ప్రకారం కృష్ణుని ఎవరైనా బ్రహ్మర్షికి గానీ,దేవర్షికి గానీ దానమిచ్చి, వ్రతాంతం లో అతని ఎత్తు ధనమైనా లేక ధనేతరమైనా ఇచ్చి తిరిగి తన భర్తను తీసుకోవచ్చునంటాడు. దీనితో అహంకరించిన సత్యభామ,రోజుకు నలభై బారువుల బంగారాని ప్రసాదించే శమంతకమణి తన వద్ద ఉండగా ఒక్కడేమి ఎంతమంది కృష్ణులనైనా తులతూచగలనని,వ్రతమాచరించి,అందులో భాగంగా కృష్ణుణ్ణి నారద మహర్షికి దానమిస్తుంది.కృష్ణుణ్ణి తులతూచేందుకు 'తులాభారం ' నిర్వహించగా సత్యభామ ఏడువారాల నగలూ,శమంతకమణి ప్రసాదించిన బంగారం ,ఇవేవీ తూచలేకపోతాయి. చతుర్దశ భువనాలను బొజ్జలో దాచుకున్న పరమాత్ముని తూచడం సామాన్యమనుకున్నావా తల్లీ! అని అంగడి వీధిలో కృష్ణుణ్ణి వేలం వేస్తాడు నారదుడు.అయినా అతణ్ణి కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మార్గాంతరాన్ని తెలపమంటుంది సత్యభామ.దీనిని పరిష్కరించగలిగే శక్తి ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణీ దేవికి మాత్ర్మే ఉందని,ఆమెనే శరణు వేడమంటాడు నారదుడు.తన తప్పును తెలుసుకున్న సత్యభామ ప్రాధేయపడడంతో, పరమాత్ముని తూచే శక్తి ఏ ద్రవ్యానికీ లేదని కేవలం భక్తికి మాత్రమే ఆ దేవదేవుడు వశుడౌతాడనీ ఒక తులసీదళంతో పరమాత్ముని తూచి,నారదుని దాస్యం నుండి కృష్ణుని విముక్తుని చేస్తుంది.అతనితో పాటుగా దానంగా వచ్చిన పారిజాత వృక్షాన్ని స్వర్గలోకానికి చేర్చి, భక్తికి సాటిరాగలది ఏదీ లేదని తెలియజేస్తాడు.[[వాడుకరి:Sekharbabupandilla|Sekharbabupandilla]] ([[వాడుకరి చర్చ:Sekharbabupandilla|చర్చ]]) 10:03, 21 మార్చి 2013 (UTC)పందిళ్ళ శేఖర్ బాబు.
 
[[వర్గం:పౌరాణిక నాటకాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/822282" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ