"సుభాషిత త్రిశతి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
నానా దేశములందు నానా భాషల లోనికి ఈ త్రిశతి అనువదింపబడినది. తెలుగునను దీనిని బలువురు పరివర్తించిరి. అందు ముఖ్యులు ముగ్గురు. మహోపాథ్యాయ బిరుదాంకుడుగు ఎలకూచి బాల సరస్వతియు, ఏనుగు లక్ష్మణ కవియు, పుష్పగిరి తిమ్మకవియు, . ఎలకుచి బాలసరస్వతి జటప్రోలు సంస్థానాధీశ్వరుడగు సురభి మల్ల భూపాలునకు కంకితముగా మల్ల భూపాలీయ మను పేర దీని దెనిఁగించెను. "సురభిమల్లా నీతి వాచస్పతీ, సురభిమల్లా మానినీ మన్మథా" అని ప్రతి పద్యము చివరను కృతి పతి సంబోధనము చేర్చుటచే నాతడు చిన్ని శ్లోకమును దెలిగించుటలో సరిపోదగిన వృత్తములో గడపటి చరణమును గోల్పోవలసి వచ్చుట యను నసౌకర్యమునకు బాల్పడెను. కావున నాతని తెలిగింపు కొన్ని పట్తుల లక్ష్మణకవి కృతికి వెన్బడుచున్నది. ప్రశస్త తరముగా నీ త్రిశతిని దెలిగించి లక్ష్మణకవి రామేశ్వరమాహాత్మ్యాదులగు నితర కృతుల గూడ గొన్నింటి రచించినాడు గాని వానిలో కవిత బాలసరస్వతి చంద్రికా పరిణయాది కృతులలోని కవితకు మిక్కినియు దీసిపోవునదిగానే యున్నది. లక్ష్మణ కవి కృతులలో నీ త్రిశతి తెలిగింపే మిక్కిలి ఇంపయినదై సుప్రఖ్యాతమయి యున్నది. పుష్పగిరి తిమ్మ కవియు నీ సుభాషిత త్రిశతిని దెలిగించినాడట.
==భర్తృహరి సుభాషితాల లో వివిధ భాగములు==
===నీతి శతకం===
* మూర్ఖ పద్ధతి
* విద్వత్పద్దతి
* మాన శౌర్య పద్ధతి
* అర్థ పద్ధతి
* దుర్జన పద్ధతి
* సుజన పద్ధతి
* పరోపకార పద్ధతి
* ధైర్య పద్ధతి
* దైవ పద్ధతి
* కర్మ పద్ధతి
===శృంగార శతకం===
 
 
===వైరాగ్య శతకం===
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/824434" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ