అంజూరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 83 interwiki links, now provided by Wikidata on d:q36146 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q36146 (translate me)
పంక్తి 30: పంక్తి 30:


[[వర్గం:మోరేసి]]
[[వర్గం:మోరేసి]]

[[gl:Figueira]]

14:28, 28 మార్చి 2013 నాటి కూర్పు

Ficus carica - Common Fig
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Tribe:
Genus:
Subgenus:
Ficus
Species:
F. carica
Binomial name
Ficus carica

అంజూరంను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది Moraceae కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Ficus carica. అంజూర చెట్టు అందమైన, ఆశక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటె విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు బొప్పాయి చెట్టు ఆకుల ఆకారంలో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలంను అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ పండ్లు పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి. తినదగిన ఈ పండ్ల కోసం సహజసిద్ధంగా పండే ఇరాన్ మరియు Mediterranean తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరంను పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ (Persian) రాజ్యం నుండి వచ్చిన అంజూరంను 5 వేల సంవత్సరంలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడినది.


ఇవి కూడా చూడండి

అత్తి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=అంజూరం&oldid=824532" నుండి వెలికితీశారు