భక్త ప్రహ్లాద (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4900862 (translate me)
పంక్తి 114: పంక్తి 114:


==పోతన భాగవతంలోని పద్యాలు==
==పోతన భాగవతంలోని పద్యాలు==
mandaara makaranda


==మూలాలు==
==మూలాలు==

07:27, 13 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

భక్త ప్రహ్లాద (1967 సినిమా)
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
నిర్మాణం ఏ.వి.మెయ్యప్పన్
చిత్రానువాదం డి.వి.నరసరాజు
తారాగణం బేబి రోజారమణి ,
ఎస్వీ రంగారావు,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ,
రేలంగి,
పద్మనాభం,
హరనాథ్,
ధూళిపాళ,
రమణారెడ్డి,
చిత్తూరు నాగయ్య,
అంజలీదేవి,
జయంతి,
కనకం,
ఎల్.విజయలక్ష్మి,
గీతాంజలి,
వాణిశ్రీ,
నిర్మల,
శాంత,
విజయలలిత,
మినాదేవి,
మంజుల,
సునీత,
సుశీల
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం మాధవపెద్ది సత్యం,
పిఠాపురం నాగేశ్వరరావు,
పి.సుశీల,
ఎస్.జానకి,
సూలమంగళం రాజలక్ష్మి,
ఎల్.ఆర్.ఈశ్వరి
నృత్యాలు వెంపటి సత్యం
గీతరచన సముద్రాల,
దాశరథి,
కొసరాజు,
ఆరుద్ర,
పాలగుమ్మి పద్మరాజు,
సముద్రాల జూనియర్
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం విన్సెంట్
కళ ఎ.కె.శేఖర్
కూర్పు ఆర్.విఠల్
నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఈ చిత్రము విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని కధకు సంభందించినది.

భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక సన్నివేశము
భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక సన్నివేశము
భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక సన్నివేశము
భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక సన్నివేశము
భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక సన్నివేశము

వైకుంఠము వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు తపోదనులైన సనకసనందులను లోనికి వెళ్ళనీయక అడ్డుకొని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి మూడు జన్మలు నావిరోదులుగా పుట్టి నా చేతిలో మరణించి తిరిగి నావద్దకు వస్తారని చెపుతాడు.

కధాగమనం

హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని- బయటా, లోపలా కాని- మనిషి వలన కాని, జంతువువలన కాని, ఏ ఆయుధముల వలన కాని మరణం లేకుండా వరం పొందుతాడు.

హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్నపుడు ఇంద్రుడు ఆమె భార్యను అపహరించి తీసుకొని పొతున్నపుడు నారదుడు అడ్డుకొని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకొని వెళతాడు. అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానభోద చేయుచున్నపుడు ఆమె కడుపున కల ప్రహ్లాదుడు వింటుంటాడు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారద ముని ఆశ్రమమునుండి తీసుకెళ్ళి, సమస్త లోకాలనూ జయించి దేవతలను బానిసలుగా చేసుకొంటాడు.

ప్రహ్లాదుడు పెరిగుతూ హరిభక్తిని కూడా పెంచుకొంటుంటాడు. తండ్రికి అది ఇష్టముండదు. హరి మనకు శత్రువు అతడిని ద్వేషించమని చెప్తాడు. అయినా హరినామ స్మరణ చేస్తూ తన తోటి వారిని కూడ హరి భక్తులుగా మార్చుతుంటాడు.నేక విదాలుగా చెప్పి చెప్పి విసిగిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని పోయిన వారు అతడిని అనేక విదాలుగా చంపుటకు ప్రయత్నించిననూ ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. హిరణ్య కశిపుని వద్దకు వచ్చి వారు మహరాజా! పాములతో కరిపించితిమి, కొండలపై నుండి తోయించితిమి, ఏనుగులతో తొక్కించితిమి, మంటలలో వేయించితిమి, సముద్రములో పడవేసితిమి అయిననూ ప్రహ్లాదునికేయు అవ్వలేదని చెపుతారు. హిరణ్య కశిపుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెపుతాడు. నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నడని అడిగిన తండ్రితో సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఎక్కడైనా, అంతటా తానై ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్థంభములో ఉంటాడా నీ శ్రీహరి చూపించు అని, స్థంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకశిపుడు. స్థంభమునుండి నృసింహావతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు సంద్యా సమయమున, ఇంటి బయటాలోనా కాని గడపపై, మానవ శరీరము, జంతువు కాని రూపములో ఆయుధము లేకుండా తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు.

చిత్రవిశేషాలు

అటు విష్ణుద్వేషంతో, తమ్ముడి మరణానికి పగ, ఇటు పుత్రప్రేమ మధ్య ఘర్షణనుఎస్. వి.రంగారావు అభినయించిన తీరు నభూతో నభవిష్యతి. త్రిలోకాలు హిరణ్యకశ్యపునికి జడిసి నీరాజానాలు పడుతూ ఉంటే, ఇటు కుమారుడు తన మాటను కాదని, అతడు విరోధిగా భావించే విష్ణు సంకీర్తన చేసి అతడే పరిరక్షనిగా భావించడం అది ఎంత హిరణ్యకశ్యపుడి వంటి తమోగుణ ప్రధానుడికి ఎంత దుర్భరమో కళ్లకు కట్టినట్లు చూపేరాయన. బాల్యంలో ఎంతో ప్రహ్లాధుడిగా ఎంతో చక్కగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం ఎనలేనికీర్తిని సంపాదించిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా ఈ చిత్రంలో చక్కగా నటించారు. హర్నాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల (గతంలో ఎ.వి.ఎం నిర్మించిన భూకైలాస్ సినిమా రచయిత) కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు. దర్శక నిర్మాతల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ చిత్రంలో చక్కటి నాటకీయత చూపేరు నరసరాజు.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
జీవము నీవేకదా దేవా బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా సముద్రాల సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరము నొసంగే సాధనం సముద్రాల సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, బృందం
రారా ప్రియా సుందరా
జననీ వరదాయనీ త్రిలోచనీ నీపదదాసిని కావుకదే
ఆది అనాదియు నీవే దేవా నారద సన్నుత నారాయణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
సిరిసిరి లాలీ చిన్నారి లాలీ - నోముల పంటకు నూరేళ్ళ లాలీ ఆరుద్ర
అందని సురసీమ నీదేనోయి అందరు ఆశించు
హిరణ్యకశిపుని దివ్య చరిత్రము - హరికథ
కనులకు వెలుగువు నీవే కాదా కనపడు చీకటి మాయే కాదా
ఆదుకోవయ్యా ఓ రమేషా ఆదుకోవయ్యా
పాములోల్లమయ్య మా బల్లె చూడవోయి బల్లె
శ్రీమానినీ మందిరా భక్త మందారా... నమో నారసింహా సముద్రాల పి.సుశీల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బృందం

పోతన భాగవతంలోని పద్యాలు

mandaara makaranda

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.