పి. బి. శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 437: పంక్తి 437:
# Tene Manasulu (1965)
# Tene Manasulu (1965)


==యివి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
* [[:en:P. B. Sreenivas|పి.బి.శ్రీనివాస్]] గూర్చి ఆంగ్ల వికీలో వ్యాసం.
* [[:en:P. B. Sreenivas|పి.బి.శ్రీనివాస్]] గురించి ఆంగ్ల వికీలో వ్యాసం.


==లింకులు==
==లింకులు==

10:57, 15 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

ప్రతివాది భయంకర శ్రీనివాస్
దస్త్రం:P.B.Srinivas.jpg
పి.బి.శ్రీనివాస్
జననంసెప్టంబరు 22,
1930
కాకినాడ,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
మరణంఏప్రిల్ 14 , 2013
చెన్నై . తమిళనాడు
నివాస ప్రాంతంచెన్నై,
తమిళనాడు
ఇతర పేర్లుపి.బి.ఎస్.
వృత్తినేపథ్యగాయకుడు
మతంహిందూ మతం
తండ్రిఫణీంద్రస్వామి
తల్లిశేషగిరమ్మ

పి.బి.శ్రీనివాస్ (పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్)[1] ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఈయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడాడు. ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం రాజ్‌కుమార్‌ కు ఈయన ఎన్నో గీతాలు ఆలపించాడు. ఈయన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయన గళం సువర్ణ గళం గా గుర్తింపు పొందింది. ఈయన మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.[2]

జీవితం

ఆయన ఆంధ్ర పదేశ్ నందు తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22 , 1930 న జన్మించాడు.[3] ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు పసలపూడి గ్రామానికి చెందినవారు.

ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి తెలుగు, కన్నడం , తమిళం , మళయాళం , హిందీ , ఉర్దూ , ఆంగ్లం , సంస్కృతం. ఆయన అనేక గజళ్ల ను తెలుగు లో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను గీతా దత్, షంషాద్ బేగమ్ మరియు జిక్కీ లతో కలిసి ఆలపించారు. ఆయన ఆర్.నాగేంద్ర రావు యొక్క జాతక ఫలం అనే చిత్రం ద్వారా తమిళం, కన్నడం, తెలుగు చిత్రాల లో పరిచయమైనాడు[4]. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు.

శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "మిస్టర్ సంపత్" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"[5] లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో పి.సుశీల తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో జెమిని గణేశన్ కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను ఎం.జి.రామచంద్రన్ మరియు శివాజీ గణేశన్ లకు పాడాడు. 1964 లో మై భీ లడకీ హూ అనే హిందీ చిత్రం లో లతా మంగేష్కర్ తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్.

"పావా మనిప్పు" అనే చిత్రంలో కన్నదాసన్ వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను ఎం.ఎస్.విశ్వనాథన్ మరియు టి.కె.రామమూర్తి గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి ఆడుతా వీట్టుప్పెన్ అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన పి.సుశీల , ఎస్.జానకి, పి.భానుమతి , కె.జమునా రాణి , ఎల్.ఆర్.ఈశ్వరి మరియు లతా మంగేష్కర్ ల సరసన పాడాడు.

ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్" , "ముకుంద మాల" , "శ్రీ మల్లిఖార్జున స్తోత్రం" , పురందరదాసు సంకీర్తనలు.

చైన్నై లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయము నందు ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు.[6]

పి.వి.శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013 లో తన 82 వయేట చెన్నై లోని ఆసుపత్రిల్ లో గుండె పోటుతో అస్తమించాడు.

వివిధ చిత్రాలలో పాడిన పాటలు

సంవత్సరం చిత్రం భాష పాట
1952 Mr. Sampat Hindi Aji hum Bharat ki naari (with Geeta Dutt)
1955 Harishchandra Malayalam
1955 Rani Ratnaprabha Telugu
1956 Bhale Ramudu Telugu
1959 Jayabheri Telugu
1960 Bhaktha Kanakadaasa Kannada Baagilanu Theredu
Eethaneega Vasudevano
Badukideno
Kula Kula
Singara Sheela
1960 Bhakta Shabari
1960 Runanubandham Telugu
1960 Sahasra Siracheda Apoorva Chinthamani Telugu
1960 Shantinivasam Telugu
1961 Vijayanagarada Veeraputhra Kannada Apaara Keerthi
1961 Iddaru Mitrulu Telugu
1961 Intiki Deepam Illalu Telugu
1961 Pasamalar Tamil Yaar Yaar Avar Yaaro
1961 Pava Mannippu Tamil Kalangalil Aval
1961 Thirudathe
1961 Sri Seetha Rama Kalyanam Telugu
1962 Atma Bandhuvu Tamil
1962 Swarna Gowri Kannada Baara Chandrama
Nudi Mana
Baare Nee Cheluve
Beeso Gaali
1962 Bhishma Telugu Manasuloni Korika Telusu Neeku Premika
1962 Dakshayagnam Telugu
1962 Kula Gothralu Telugu Rave Rave Bala Hello My Dear Leela
1962 Raktha Sambandham Telugu
1962 Veera Thirumagan Tamil Paadatha Paatellam
Roja Malarae
1963 Chaduvukunna Ammayilu Telugu
1963 Lava Kusha Telugu
1963 Paar Magale Paar Tamil Aval Paranthu Ponale
Madhurai Nagaril
Madura Nagaril
1964 Main Bhi Ladki Hoon Hindi Chanda Se Hoga Wo Pyaara (with Lata Mangeshkar)
1964 Bobbili Yudham Telugu
1964 Dr. Chakravarthy Telugu
1964 Server Sundaram Tamil Poga Poga Theriyum
1964 Kaadhalikka Neramillai Tamil Anubavam Puthumai
Viswanathan Velai Vendum
Unga Ponnana Kaigal
1965 Gudi Gantalu Telugu Neeli Kannula Needala Lona
1965 Preminchi Choodu Telugu Meda Meeda Meda Katti Kotlu Koodabettinatti Kamandu
Mee Andala Chetulu Kandenu Papam
1965 Sri Simhachala Kshetra Mahima Telugu Jayahe Mohana Roopa Gaana Kalaapa
1966 Manthralaya Mahatme Kannada Indu Enage Govinda
Kaliyirondu Paatavannu
Tunge Theera
Rasika Saalade
Neenu Baralilla
1966 Kappu Bilupu Kannada Ide Roopa
Indina Hindu Deshada
1966 Emme Thammanna Kannada Belli Hakki Aguva
Kanneradu Kareyuthide
Kolalanoodi Kuniva
Neenaarigaadeyo Ele Maanava [7]
1966 Shri Krishna Pandaviyam Telugu Yemitaya Nee Leela Krishna
1967 Bangaarada Hoovu Kannada Aaha Mogavu
Do Do Do Basavanna
Oduva Nadi
1967 Lagna Patrike Kannada Bramhachaari
Gandu Muthina Chandu
Illi Yaaru Illa
Kanneradu
Nijavo Sullo
1967 Belli Moda [8] Kannada Belli Modada
Ideega Nee
Ide Nanna Uthara
Odeyithu
1968 Bedi Bandavalu Kannada Neera Mele Aleya Ungura
1969 Mayor Muthanna Kannada Ayyayyayyo Halli Mukha
Haavige
Halliyadarenu Shiva
Onde Naadu
1970 Arishina Kunkuma Kannada Honnaase Ullavage
Thaavare Hoo Kere
Ilidu Baa Thaaye
1971 Sharapanjara Kannada Kodagina Kaveri
Uthara Drivadhim
1971 Jai Jawan Jai Kisan Hindi Nakhrewali Chaal
1971 Kasthuri Nivasa Kannada Aadisi Nodu Beelisi Nodu
1971 Seetha Kannada Ee Cheluvanu
Barede Neenu Ninna Hesara
1971 Sampoorna Ramayanam Telugu Vedalenu Kodandapani
1971 Paropakaari Kannada Hodare Hogu
Guttonda Heluve
Kaviya Madhura
1971 Sakshathkara Kannada Janma Janmada Anubandha
Olave Jeevana
1972 Sipayi Ramu Kannada Kathe Mugiyithe
Nidireyu Sadaa
1972 Naagarahaavu Kannada Kannada Naadina Veera
Baare Baare
Sangama Sangama
Kathe Heluve
1972 Bangaaradha Manushya Kannada Nagu Nagutha
Aagadu Endu
Aaha Mysooru Mallige
Baala Bangara
Hani Hani Goodidare
1973 Doorada Betta Kannada Preethine Aa Dyaavru Thanda
Kaamanna Kathige
1973 Sangama Kannada Sirivanthanaadaru
1973 Gandhada Gudi Kannada Ellu hogalla
Naavaaduva nudiye kannada
1974 Bhootayyana Maga Ayyu Kannada Malenaada Henna
Maariya Gathiyendu
1974 Bhakta Kumbara Kannada Naanu Neenu
Hari Naamave
Manava
Lakshmi Sthothram
Vitala Panduranga
Kande Hariya Kande
1974 Eradu Kanasu Kannada Baadi Hoda
Endendu Ninnanu Marethu
Endu Ninna Noduve
1974 Jai Jai Ram Hindi Lav Kush
1975 Shubha Mangala Kannada Shubha Mangala
Hema... Naakondla Naaku
1975 Bhakti Mein Bhagwan Hindi Dekha Hari Dekha
1976 Premada Kanike Kannada Chinna Endu Naguthiru
Putta Putta Hejje
1977 Sose Thanda Sowbhagyaa Kannada Ravi Varmana
Saaku Ennuvane
Eke Avasaravu
1977 Babruvahana Kannada Ninna Kanna Notadalli
Yaaru Thiliyaru
1977 Thabbali Neenade Magane Kannada Dharani Mandala Madhyadolage
1977 Devara Duddu Kannada Godhuli
Krishna..Gaaliya Patadanthe
1978 Swarna Bhoomi Kannada Kaanada Devaru
Siri Kannada Naadu
1978 Padvaaralli Pandavaru Kannada Haadomme Haadabeku
Thookadisi Thookadisi Beeladiru Thamma
2004 7G Rainbow Colony Tamil Idhu Enna Maatram
2010 Aayirathil Oruvan Tamil Pemmane
  1. Laxmi Pooja (1979)
  2. Gorantha Deepam (1978)
  3. Jeevana Jyothi (1976)
  4. Seeta Kalyanam (1976)
  5. Chelleli Kapuram (1971)
  6. Saptaswarulu (1969)
  7. Ooty Varai Uravu (1967)
  8. Sakshi (1967)
  9. Letha Manasulu (1966)
  10. Tene Manasulu (1965)

ఇవి కూడా చూడండి

లింకులు

సూచికలు