పి. బి. శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 131: | పంక్తి 131: | ||
|- |
|- |
||
| 1961 |
| 1961 |
||
| ''[[పావ |
| ''[[పావ మన్నిప్పు]]'' |
||
| తమిళం |
| తమిళం |
||
| ''Kalangalil Aval'' |
| ''Kalangalil Aval'' |
12:01, 17 ఏప్రిల్ 2013 నాటి కూర్పు
ప్రతివాది భయంకర శ్రీనివాస్ | |
---|---|
దస్త్రం:P.B.Srinivas.jpg | |
జననం | జూలై 22, 1930 గొల్లప్రోలు కాకినాడ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం |
మరణం | ఏప్రిల్ 14 , 2013 చెన్నై . తమిళనాడు |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | పి.బి.ఎస్. |
వృత్తి | నేపథ్యగాయకుడు |
మతం | హిందూ మతం |
తండ్రి | ఫణీంద్రస్వామి |
తల్లి | శేషగిరమ్మ |
పి.బి.శ్రీనివాస్ (పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్)[1] ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఈయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడాడు. ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం రాజ్‌కుమార్ కు ఈయన ఎన్నో గీతాలు ఆలపించాడు. ఈయన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయన గళం సువర్ణ గళం గా గుర్తింపు పొందింది. ఈయన మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.[2]
జీవితం
ఆయన ఆంధ్ర పదేశ్ నందు తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22 , 1930 న జన్మించాడు.[3] ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు పసలపూడి గ్రామానికి చెందినవారు.
ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి తెలుగు, కన్నడం , తమిళం , మళయాళం , హిందీ , ఉర్దూ , ఆంగ్లం , సంస్కృతం. ఆయన అనేక గజళ్ల ను తెలుగు లో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను గీతా దత్, షంషాద్ బేగమ్ మరియు జిక్కీ లతో కలిసి ఆలపించారు. ఆయన ఆర్.నాగేంద్ర రావు యొక్క జాతక ఫలం అనే చిత్రం ద్వారా తమిళం, కన్నడం, తెలుగు చిత్రాల లో పరిచయమైనాడు[4]. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు.
శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "మిస్టర్ సంపత్" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"[5] లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో పి.సుశీల తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో జెమిని గణేశన్ కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను ఎం.జి.రామచంద్రన్ మరియు శివాజీ గణేశన్ లకు పాడాడు. 1964 లో మై భీ లడకీ హూ అనే హిందీ చిత్రం లో లతా మంగేష్కర్ తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్.
"పావా మనిప్పు" అనే చిత్రంలో కన్నదాసన్ వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను ఎం.ఎస్.విశ్వనాథన్ మరియు టి.కె.రామమూర్తి గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి ఆడుతా వీట్టుప్పెన్ అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన పి.సుశీల , ఎస్.జానకి, పి.భానుమతి , కె.జమునా రాణి , ఎల్.ఆర్.ఈశ్వరి మరియు లతా మంగేష్కర్ ల సరసన పాడాడు.
ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్" , "ముకుంద మాల" , "శ్రీ మల్లిఖార్జున స్తోత్రం" , పురందరదాసు సంకీర్తనలు.
చైన్నై లోని ఆయన ఉంటున్న వుడ్లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయము నందు ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు.[6]
పి.వి.శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013 లో తన 82 వయేట చెన్నై లోని ఆసుపత్రిల్ లో గుండె పోటుతో అస్తమించాడు.
వివిధ చిత్రాలలో పాడిన పాటలు
సంవత్సరం | చిత్రం | భాష | పాట |
---|---|---|---|
1952 | మిష్టర్ సంపత్ | హింది | Aji hum Bharat ki naari (with Geeta Dutt) |
1955 | హరిశ్చంద్ర | మళయాళం | |
1955 | రాణీ రత్నప్రభ | తెలుగు | |
1956 | భలే రాముడు | తెలుగు | |
1959 | జయభేరి | తెలుగు | |
1960 | భక్త కనకదాస | కన్నడం | Baagilanu Theredu Eethaneega Vasudevano Badukideno Kula Kula Singara Sheela |
1960 | భక్త శబరి | తెలుగు | |
1960 | ఋణానుబంధం | తెలుగు | |
1960 | సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి | తెలుగు | |
1960 | శాంతినివాసం | తెలుగు | |
1961 | విజయనగరద వీరపుత్ర | కన్నడం | Apaara Keerthi |
1961 | ఇద్దరు మిత్రులు | తెలుగు | |
1961 | ఇంటికి దీపం ఇల్లాలే | తెలుగు | |
1961 | పాశమలర్ | తమిళం | Yaar Yaar Avar Yaaro |
1961 | పావ మన్నిప్పు | తమిళం | Kalangalil Aval |
1961 | తిరుడతే | ||
1961 | శ్రీ సీతారామ కల్యాణం | తెలుగు | |
1962 | ఆత్మ బంధువు | తమిళం | |
1962 | స్వర్ణ గౌరి | కన్నడం | Baara Chandrama Nudi Mana Baare Nee Cheluve Beeso Gaali |
1962 | భీష్మ | తెలుగు | మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమికా |
1962 | దక్ష యజ్ఞం | తెలుగు | |
1962 | కులగోత్రాలు | తెలుగు | Rave Rave Bala Hello My Dear Leela |
1962 | రక్త సంబంధం | తెలుగు | |
1962 | వీర తిరుమగన్ | తమిళం | Paadatha Paatellam Roja Malarae |
1963 | చదువుకున్న అమ్మాయిలు | తెలుగు | |
1963 | లవ కుశ | తలుగు | |
1963 | పార్ మగలె పార్ | తమిళం l | Aval Paranthu Ponale Madhurai Nagaril Madura Nagaril |
1964 | మై భీ లడకీ హూన్ | హిందీ | Chanda Se Hoga Wo Pyaara (with Lata Mangeshkar) |
1964 | బొబ్బిలి యుద్ధం | తెలుగు | |
1964 | డా. చక్రవర్తి | తెలుగు | |
1964 | సర్వర్ సుందరం | తమిళం | Poga Poga Theriyum |
1964 | కాదలిక్క నేరమిల్లై | తమిళం | Anubavam Puthumai Viswanathan Velai Vendum Unga Ponnana Kaigal |
1965 | గుడి గంటలు | తెలుగు | నీలి కన్నుల నీడల లోన |
1965 | ప్రేమించి చూడు | తెలుగు | Meda Meeda Meda Katti Kotlu Koodabettinatti Kamandu Mee Andala Chetulu Kandenu Papam |
1965 | శ్రీ సింహాచల క్షేత్ర మహిమ | తెలుగు | Jayahe Mohana Roopa Gaana Kalaapa |
1966 | మంత్రాలయ మహాత్మె | కన్నడం | Indu Enage Govinda Kaliyirondu Paatavannu Tunge Theera Rasika Saalade Neenu Baralilla |
1966 | కప్పు బిలుపు | కన్నడం | Ide Roopa Indina Hindu Deshada |
1966 | ఎమ్మె తమ్మన్న | కన్నడం | Belli Hakki Aguva Kanneradu Kareyuthide Kolalanoodi Kuniva Neenaarigaadeyo Ele Maanava [7] |
1966 | శ్రీకృష్ణ పాండవీయం | తెలుగు | Yemitaya Nee Leela Krishna |
1967 | Bangaarada Hoovu | Kannada | Aaha Mogavu Do Do Do Basavanna Oduva Nadi |
1967 | Lagna Patrike | Kannada | Bramhachaari Gandu Muthina Chandu Illi Yaaru Illa Kanneradu Nijavo Sullo |
1967 | Belli Moda [8] | Kannada | Belli Modada Ideega Nee Ide Nanna Uthara Odeyithu |
1968 | Bedi Bandavalu | Kannada | Neera Mele Aleya Ungura |
1969 | Mayor Muthanna | Kannada | Ayyayyayyo Halli Mukha Haavige Halliyadarenu Shiva Onde Naadu |
1970 | Arishina Kunkuma | Kannada | Honnaase Ullavage Thaavare Hoo Kere Ilidu Baa Thaaye |
1971 | Sharapanjara | Kannada | Kodagina Kaveri Uthara Drivadhim |
1971 | Jai Jawan Jai Kisan | Hindi | Nakhrewali Chaal |
1971 | Kasthuri Nivasa | Kannada | Aadisi Nodu Beelisi Nodu |
1971 | Seetha | Kannada | Ee Cheluvanu Barede Neenu Ninna Hesara |
1971 | Sampoorna Ramayanam | Telugu | Vedalenu Kodandapani |
1971 | Paropakaari | Kannada | Hodare Hogu Guttonda Heluve Kaviya Madhura |
1971 | Sakshathkara | Kannada | Janma Janmada Anubandha Olave Jeevana |
1972 | Sipayi Ramu | Kannada | Kathe Mugiyithe Nidireyu Sadaa |
1972 | Naagarahaavu | Kannada | Kannada Naadina Veera Baare Baare Sangama Sangama Kathe Heluve |
1972 | Bangaaradha Manushya | Kannada | Nagu Nagutha Aagadu Endu Aaha Mysooru Mallige Baala Bangara Hani Hani Goodidare |
1973 | Doorada Betta | Kannada | Preethine Aa Dyaavru Thanda Kaamanna Kathige |
1973 | Sangama | Kannada | Sirivanthanaadaru |
1973 | Gandhada Gudi | Kannada | Ellu hogalla Naavaaduva nudiye kannada |
1974 | Bhootayyana Maga Ayyu | Kannada | Malenaada Henna Maariya Gathiyendu |
1974 | Bhakta Kumbara | Kannada | Naanu Neenu Hari Naamave Manava Lakshmi Sthothram Vitala Panduranga Kande Hariya Kande |
1974 | Eradu Kanasu | Kannada | Baadi Hoda Endendu Ninnanu Marethu Endu Ninna Noduve |
1974 | Jai Jai Ram | Hindi | Lav Kush |
1975 | Shubha Mangala | Kannada | Shubha Mangala Hema... Naakondla Naaku |
1975 | Bhakti Mein Bhagwan | Hindi | Dekha Hari Dekha |
1976 | Premada Kanike | Kannada | Chinna Endu Naguthiru Putta Putta Hejje |
1977 | Sose Thanda Sowbhagyaa | Kannada | Ravi Varmana Saaku Ennuvane Eke Avasaravu |
1977 | Babruvahana | Kannada | Ninna Kanna Notadalli Yaaru Thiliyaru |
1977 | Thabbali Neenade Magane | Kannada | Dharani Mandala Madhyadolage |
1977 | Devara Duddu | Kannada | Godhuli Krishna..Gaaliya Patadanthe |
1978 | Swarna Bhoomi | Kannada | Kaanada Devaru Siri Kannada Naadu |
1978 | Padvaaralli Pandavaru | Kannada | Haadomme Haadabeku Thookadisi Thookadisi Beeladiru Thamma |
2004 | 7G Rainbow Colony | Tamil | Idhu Enna Maatram |
2010 | Aayirathil Oruvan | Tamil | Pemmane |
- Laxmi Pooja (1979)
- Gorantha Deepam (1978)
- Jeevana Jyothi (1976)
- Seeta Kalyanam (1976)
- Chelleli Kapuram (1971)
- Saptaswarulu (1969)
- Ooty Varai Uravu (1967)
- Sakshi (1967)
- Letha Manasulu (1966)
- Tene Manasulu (1965)
ఇవి కూడా చూడండి
- పి.బి.శ్రీనివాస్ గురించి ఆంగ్ల వికీలో వ్యాసం.