కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 114 interwiki links, now provided by Wikidata on d:q8436 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q8436 (translate me)
పంక్తి 61: పంక్తి 61:


[[వర్గం:మానవ సంబంధాలు]]
[[వర్గం:మానవ సంబంధాలు]]

[[fa:خانواده]]

10:39, 5 మే 2013 నాటి కూర్పు


పరిచయము

ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం - కుటుంబము (Family). వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతుసమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.

"కుటుంబం" లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము (consanguinity), సహచరత్వము (affinity), ఒకే నివాసం (household /co-residence). ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.

కుటుంబవ్యవస్థకు ఉన్న ఒక ప్రాధమిక గుణం - శారీరికంగా గాని, సామాజికంగా గాని వ్యక్తులను (లేదా జీవులను) పునరుత్పత్తి చేయడం.[1][2] కనుక కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు - పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం అనవచ్చును.(enculturation and socialization).[3] అదే పెద్దల దృష్టినుండి చూసినట్లయితే జాతి పునరుత్పత్తి కుటుంబలక్ష్యంగా కనిపిస్తుంది (family of procreation)[4]. అయితే పిల్లలను కనడం, పెంచడం మాత్రమే కుటుంబ వ్యవస్థ లక్ష్యాలుగా భావించనక్కరలేదు. ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగించే సమాజంలో ఆ ఇద్దరు (భార్యాభర్తల) సహజీవనం సమాజం ఆర్ధికవ్యవస్థకు చాలా అవుసరమౌతుంది. కనుక ఇది శ్రమ విభజనకు ఒక ఉపకరణంగా ఉంటుంది. [5][6][7]

జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం

కుటుంబ దౌర్జన్యం చట్టం 498-ఎను దుర్వినియోగం చేయ డం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేధాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబర్ 12ను జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవంగా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణావేదిక, భారతీయ కుటుంబ సంరక్షణా ప్రతిష్టానం సంయుక్తంగా నిర్ణయించాయి.(ఆంధ్రజ్యోతి11.11.2009)

రకాలు

కుటుంబసభ్యులు

కుటుంబ పెన్షన్

విశ్రాంత ఉద్యోగి సజీవంగా ఉంటూ పింఛను పొందుతుంటే సర్వీసు పింఛనుగాను, మృతి చెందాక కుటుంబ సభ్యులకు ఇచ్చే పింఛనును కుటుంబ పింఛనుగాను వ్యవహరిస్తారు.75-80 వయస్సు వారికి అదనంగా 15 శాతం, 80-85 వయస్సు వారికి 20 శాతం... ఇలా పెంచుకుంటూ, వందేళ్లు పైపడ్డవారికి 100 శాతం అదనంగా పింఛను ఇవ్వాలి.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Schneider, David 1984 A Critique of the Study of Kinship. Ann Arbor: University of Michigan Press. p. 182
  2. Deleuze-Guattari (1972). Part 2, ch. 3, p.80
  3. Russon, John, (2003) Human Experience: Philosophy, Neurosis, and the Elements of Everyday Life, Albany: State University of New York Press. pp 61-68.
  4. George Peter Murdoch Social Structure page 13
  5. Wolf, Eric 1982 Europe and the People Without History. Berkeley: University of California Press. 92
  6. Harner, Michael 1975 "Scarcity, the Factors of Production, and Social Evolution," in Population. Ecology, and Social Evolution, Steven Polgar, ed. Mouton Publishers: the Hague.
  7. Rivière, Peter 1987 “Of Women, Men, and Manioc,” Etnologiska Studien (38).

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కుటుంబం&oldid=840897" నుండి వెలికితీశారు