89,798
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
{{విస్తరణ}}
[[దస్త్రం:DSCN0111.JPG|thumb|300px|కోలాటం ఆడుతున్న పిల్లలు.]]
'''కోలాటం''' ఒక రకమైన సాంప్రదాయక సామూహిక [[ఆట]]. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.[[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు [[అబ్దుల్ రజాక్]] అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. గ్రామదేవతలైన [[ఊరడమ్మ]] , [[గడి మైశమ్మ]] , [[గంగాదేవి]] , [[కట్టమైసమ్మ]] , [[పోతలింగమ్మ]] , [[పోలేరమ్మ]] [[దనుకొండ గంగమ్మ]], మొదలగు గ్రామ దేవతల జాతర సందర్బంగా కోలాటం ఆడుతారు.
|