దాశరథీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:

<poem>
<poem>
అల్లన లింగ మంత్తి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం
అల్లన లింగ మంత్రి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం
చెర్లకులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా
చెర్లకులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా
నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ: నీకు దాసుడను దాశరధీ కరుణాపయోనిధీ.
ద్వల్లభ: నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ.
</poem>
</poem>
ఈ కవి ఈ శతకమే గాక మరికొన్ని గ్రంధములను కూడ వ్రాసినట్లు కానీ వాటిని ఇతరులు మోసముతో తస్కరించినట్లూ ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది.
ఈ కవి ఈ శతకమే గాక మరికొన్ని గ్రంధములను కూడ వ్రాసినట్లు కానీ వాటిని ఇతరులు మోసముతో తస్కరించినట్లూ ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది.
పంక్తి 47: పంక్తి 47:
</poem>
</poem>
==ముగింపు==
==ముగింపు==
ఈ చివరిపద్యంలో కవి తన గురించి వివరాలు తెలియజేశాడు. తాను అల్లన లింగమంత్రిగారి పుత్రుడిగా, అత్రిజ గోత్రం ఆదిశాఖలో కంచెర్ల వంశంలో జన్మించినట్లుగా వివరించాడు.
ఈ చివరిపద్యంలో కవి తనగురించి వివరాలు తెలియజేశాడు. తాను అల్లన లింగమంత్రిగారి పుత్రుడిగా, అత్రిజగోత్రం ఆదిశాఖలో కంచెర్ల వంశంలో జన్మించినట్లుగా వివరించాడు.
<poem>
<poem>
అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం

09:29, 8 జూన్ 2013 నాటి కూర్పు

దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. గోపన్న ఆత్రేయస గోత్రుడు . కాంమాంబ యాతని తల్లి, తండి... లింగన మంత్రి. ఈ విషయమును ఇతడు ఈ పద్యమున తెలెపెను.

 అల్లన లింగ మంత్రి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం
 చెర్లకులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా
 నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
 ద్వల్లభ: నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ.

ఈ కవి ఈ శతకమే గాక మరికొన్ని గ్రంధములను కూడ వ్రాసినట్లు కానీ వాటిని ఇతరులు మోసముతో తస్కరించినట్లూ ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది.

 మసగొని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలపోసినట్లు దు
 ర్వ్యసనము జెంది కావ్వము దురాత్ములకిచ్చితి మోసమయ్యెనా
 రసనకు బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్పుధా
 రసములు చిల్క పద్యముఖరంగము నందు నటింపవయ్య సం
 తపసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

ప్రారంభం

శ్రీ రఘురామ! చారుతుల - సీదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ ! త్రిజ - గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి - రామ ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ ! భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ

కొన్ని ఉదాహరణలు

 రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
 త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
 త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
 తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

 పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
 స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
 శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
 త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.

 రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
 రాముడుషడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
 ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
 దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.

 ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
 మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
 సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
 దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.

ముగింపు

ఈ చివరిపద్యంలో కవి తనగురించి వివరాలు తెలియజేశాడు. తాను అల్లన లింగమంత్రిగారి పుత్రుడిగా, అత్రిజగోత్రం ఆదిశాఖలో కంచెర్ల వంశంలో జన్మించినట్లుగా వివరించాడు.

 అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
 చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా
 నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
 ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ!

పూర్తి పాఠం